resorvioersగత రెండేళ్ళుగా జిల్లాలో రెండో పంట అన్నదే లేకుండా గడిచిపోయింది. సకాలంలో వర్షాలు పడక, జిల్లాలో వున్న సోమశిల, కండ్లేరు రిజర్వాయర్‌లు నిండక రైతులు రెండో పంటపై ఆశలు వదులుకున్నారు. మొదటి పంటయినా, రెండో పంటయినా అధికారికంగా దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో సాగవుతుంది. అనధికారికంగా అయితే ఇంకో రెండు లక్షల ఎకరాల దాకా చెప్పుకోవచ్చు.

నెల్లూరుజిల్లా రైతాంగానికి సోమశిల, కండ్లేరు రిజర్వాయర్‌లే ప్రాణాధారం. రెండు రిజర్వాయర్‌లలోనూ 140 టిఎంసీల నిల్వ సామర్ధ్యం వుంది. తెలుగు గంగ ప్రాజెక్ట్‌లో ఈ రెండు రిజర్వాయర్‌లు భాగమైనప్పటి నుండి శ్రీశైలం నుండి కృష్ణ నీటినే మళ్లిస్తూ చెన్నై తాగునీటి అవసరా లకు తరలించడంతో పాటు ఈ జిల్లా రైతుల అవసరాలకు వాడుకుంటున్నార. దివంగత నేత వై.యస్‌. హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్ధ్యం పెంచడం ద్వారా త్వరగా సోమశిల, కండ్లేరులను నింపే అవకాశం కల్పించారు. ఆరోజు ఆయన చూపించిన మార్గం జిల్లా రైతాంగానికి ఈరోజు ఎంతగానో ఉపయోగపడుతోంది.

గత ఏడాది రాష్ట్రంలో వర్షాలు లేవు. ఎగువ జిల్లాలు, ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షాలు లేక శ్రీశైలం ఎండిపోయింది. ఈ స్థితిలో సోమశిల, కండ్లేరులలో నీటి మట్టాలు అడుగంటిపోయాయి. ఈ ఏడాది మొదటి పంటకే అరకొరగా నీళ్ళిచ్చారు. రెండో పంట అసలు వేయలేదు. బోర్లు, బావుల క్రింద సాగు చేసుకోగలిగిన వాళ్ళు సాగు చేసుకున్నారు. ఖరీఫ్‌ సీజన్‌కు దాదాపు 6లక్షల ఎకరాల పొలాలను బీళ్ళుగా పెట్టేసారు.

అదృష్టం కలిసొచ్చి ఈసారి శ్రీశైలంకు నీళ్లొచ్చాయి. శ్రీశైలం ద్వారా సోమశిలకు 45 టిఎంసీలకు పైగానే చేరాయి. శ్రీశైలం నుండి ఇంకా నీటిని వదిలే అవకాశ ముంది. సోమశిల నిండుతుండడంతో రైతులు ఆనందంతో వున్నారు. నారు మళ్ళకు సిద్ధమవుతున్నారు. ఈసారైనా పూర్తిస్థాయిలో సాగుకు నీళ్లివ్వాలని కోరు తున్నారు. రేపు ఐఏబి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

jaganవిభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 13జిల్లాలే మిగిలాయి. కోస్తాలో 9, రాయలసీమలో 4 జిల్లాలున్నాయి. మెజార్టీ జిల్లాల్లో ఏ పార్టీకైతే రాజకీ యంగా బలమైన పునాదులు ఉన్నాయో ఆ పార్టీకే విజయావకాశాలు మెరుగ్గా వుంటాయి. కోస్తా, రాయలసీమ అన్నవి పక్కన పెడితే కృష్ణానదికి ఇవతల 7 జిల్లాలు, అవతల ఆరు జిల్లాలున్నాయి. కృష్ణా నదికి అవతలి వైపు వున్న జిల్లాల్లోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అగ్ని పరీక్ష ఎదురవుతోంది.

కృష్ణానదికి ఇవతల జిల్లాలైన కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో వైసిపి బలంగానే వుంది. ఒక్క అనంతపురం జిల్లాలో బలం పుంజుకోవాల్సి వుంది. 2014 ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి వచ్చిన సీట్లలో సింహభాగం ఇక్కడివే! ఈ జిల్లాల్లో వున్నంత బలంగా కృష్ణానదికి అవతల వైపు వున్న కృష్ణ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో లేకుండా పోయింది. విశాఖపట్నం లోక్‌సభలో వై.యస్‌. సతీమణి, జగన్‌ అమ్మగారైన వై.యస్‌.విజయమ్మే ఓడిపోయారు. కృష్ణానదికి ఇవతల వైపు రాజకీయ వాతావరణం వేరు, అవతలి వైపు వాతావరణం వేరు. ఈ ఆరు జిల్లాల్లోనూ కుల సమీకరణలు బాగా పని చేస్తాయి. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాల్లో బలమైన కమ్మ, కాపు, క్షత్రియ సామాజిక వర్గాలన్నీ ఒక్కటయ్యాయి. పవన్‌ కళ్యాణ్‌ మద్దతు తెలపడం వల్ల తెలుగుదేశంకు కాపుల ఓట్లు బాగానే కలిసొచ్చాయి. సాంప్రదాయ బద్ధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా జిల్లాల్లో 1983 నుండి కూడా తెలుగుదేశం బలంగానే వుంది. 2014లో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఈ ఆరు జిల్లాలే!

ఈ ఆరు జిల్లాల్లో పార్టీని పటిష్ట పరిస్తేనే అధికారంపై ఆశలు నిలబడతాయి. దివంగత నేత వై.యస్‌. వున్నప్పుడు ఈ ఆరు జిల్లాల్లో తన సొంతంగా బలమైన కేడర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మరణించాక ఆయన ఏర్పాటు చేసిన కేడర్‌ చెల్లాచెదురైంది. ఈ ఆరు జిల్లాల్లో కుల సమీకరణలు, నాయకుల సమీకరణపై జగన్‌ దృష్టి సారించాల్సి వుంది. గతంలో వై.యస్‌. వెన్నంటి నడిచిన వాళ్లను, ప్రస్తుతం కాంగ్రెస్‌లో వున్న సీనియర్లను తన పార్టీ వైపు తీసుకురావాలి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఋణమాఫీ కూడా ఈ జిల్లాల్లోనే బలంగా పని చేసింది. ఋణమాఫీ వైఫల్యాలను కూడా జగన్‌ ఇక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ ఆరు జిల్లాల్లో తెలుగుదేశం సాంప్రదాయ ఓటు బ్యాంకుకు గండి కొట్ట గలిగితేనే వైకాపాకు అవకాశాలుంటాయి.

stu suiర్యాంకులు... మార్కులు... ఉరుకులు... పరుగులు... 10గంటల పాటు క్లాసులు.. 8గంటల పాటు స్టడీ అవర్స్‌. ఫ్యాక్టరీలో యంత్రానికి... కాలేజీలో విద్యార్థికి తేడానే లేదు. యంత్రానికన్నా కరెంట్‌ పోయినప్పుడు విశ్రాంతి దొరుకు తుందేమో! విద్యార్థికి విశ్రాంతి అన్నదే లేదు. తెల్లారుజాము 5గంటలకే మొదలవుతుంది చదువుల పరుగు. కాలకృత్యాలు, ఆహారం అంతా హడావిడిగానే... ఉదయం ఆరు గంటలకల్లా మార్కుల వేట మొదలవుతుంది. రాత్రి 10గంటల దాకా విరామం లేకుండా ఆ చదువుల ఆట సాగుతుంది. ఈ చదువుల ఆటలు... మార్కుల వేటలో వెనుకబడ్డారా? కాలేజీ యాజ మాన్యం నుండి వేధింపులు... తల్లిదండ్రుల నుండి నిట్టూర్పులు... వారికి జీవితంలో ఏదో కోల్పోయామన్న ఫీలింగ్‌. ఇలాంటి మందలింపులు, వేధింపులను గట్టి గుండె వున్న విద్యార్థులైతే తట్టుకోగలరు. సున్నిత హృదయులైన విద్యార్థులు భరించగలరా? అలా భరించలేక పోతుండబట్టే కాలేజీ హాస్టళ్లలో ఫ్యాన్‌లకు నిర్జీవంగా వేలాడుతున్నారు. బహుళ అంతస్తుల పైనుండి దూకేస్తు న్నారు. నూరేళ్ల భవిష్యత్‌కు టీనేజ్‌లోనే సమాధి కడుతున్నారు. తల్లిదండ్రులకు శాశ్వత శోకం మిగిలిస్తున్నారు. కార్పొరేట్‌ కాలేజీ లలో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. మానసికంగా నలిగి పోతూ ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. ఈ పాపం ఎవరిది?

చదువులా..చావులా!..అనేది అర్ధం కాని అయోమయ పరిస్థితులిప్పుడు అంతటా నెలకొంటున్నాయి. కార్పొరేట్‌ కళా శాలలు మరణవేదికలుగా మారుతుండడం చూసి అటు విద్యార్థి లోకం, తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఫీజలు, డబ్బులు, డొనేషన్లుగా విద్యావ్యాపారం మూడు పువ్వులారుకాయలుగా మారుతుండడం, మరోవైపు మార్కులు, ర్యాంకులే పరమార్ధంగా విద్యార్థుల్లో మానసిక వత్తిడి బలంగా పెరిగి, అవి బలవన్మర ణాలుగా మారుతుండడం ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. దీంతో ఎంతోమంది సరస్వతీపుత్రులు నేలరాలిపోతున్నారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చి తిరిగిరాని లోకాలకు వారు తరిలి పోతూనేవున్నారు. చదువులు జ్ఞానానికి దీపాలుగా ఉండాల్సిన చోట..అవి గుదిబండలుగా మారుతుండడం వల్లనే ఈ దుస్థితి దాపురిస్తోందంటూ అనేకమంది ఆందోళన చెందుతున్నారు. అనేక విద్యాసంస్థలు, ముఖ్యంగా కార్పొరేట్‌ కాలేజీల్లో ఇలాంటి వత్తిళ్ళతో ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతున్నాయని, చదువు కోవడానికి వెళ్లిన పిల్లలు శవాలై తిరిగివస్తుంటే కడుపు తరుక్కు పోతుందని తల్లిదండ్రులు హృదయవిదారకంగా రోదిస్తున్నారు. అయినా, ఎవరి గుండెలూ కరగవు. విద్యే వ్యాపారంగా మారిన చోట ఇలాంటివన్నీ సర్వసాధారణాలే. ప్రభుత్వాలూ రకరకాల కారణాలతో ఈ విద్యావ్యాపారాల వ్యవహారాలపై ఉదాసీనతనే ప్రకటిస్తాయి. తమ కాలేజీకి ర్యాంకులు వస్తే చాలు..కాలేజీ ప్రతిష్ట పెరుగుతుందని, తద్వారా విద్యావ్యాపారం మరింతగా పెరుగుతుందన్న కార్పొరేట్‌ కళాశాలల యావ అందరికీ తెలి సిందే. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలకు మంచి ర్యాంకులు వస్తే వారి భవిష్యత్తు బావుంటుందనే ఆశతో అనేక కష్టనష్టాలకోర్చి కార్పొరేట్‌ చదువులకు పంపుతున్నారే తప్ప మరోమార్గం ఆలోచిం చడం లేదు. మార్కులు-ర్యాంకులే ప్రాతిపదికగా నిత్యం పెరుగు తున్న ఆయా కళాశాలల వత్తిడి తట్టుకోలేక, మరోవైపు తల్లి దండ్రుల ఆశలను నెరవేర్చలేకపోతున్నామన్న బాధతో..పిల్లలు చివరికి ఆత్మహత్యలే శరణమనుకుంటున్నారు. పోటీ పరీక్షలు ఎంతో ఆనందంతో జరగాల్సింది పోయి అవి విద్యార్థులకు జీవితానికే అగ్నిపరీక్షలుగా మారుతుండడం ఎంత దయనీయం!..

విపరీతమైన వత్తిడే కారణం :

మొన్నటికి మొన్న కడపలోని ఓ కార్పొరేట్‌ కాలేజ్‌లో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అదే క్యాంపస్‌లో ఇటీవలి కాలంలో ఇది మూడవ ఆత్మహత్య. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఇంటర్‌ చదువుతున్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ శివారుల్లోని మరో కార్పొరేట్‌ కాలేజీలో ఇటీవలే ఇంకో విద్యార్థి ఆత్మహత్య. ఇలా ఆత్మహత్యల సంఖ్య పెరిగిపో తూనే ఉంది. విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచాల్సిన కార్పొరేట్‌ కాలేజీలు బలవన్మరణాలను పెంచుతున్నాయి. మార్కుల పేరుతో, ర్యాంకుల పేరుతో వారిలో విపరీతమైన వత్తిడి తీసుకువస్తుం డడంతో ఎంత కష్టపడి చదివినా మంచి మార్కులు రానప్పుడు అటు కాలేజీలో ఉండలేక, ఇటు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళలేక.. మానసికంగా నలిగిపోతూ తామిక ఎందుకూ పనికిరామనే భావనతో, లోలోపలే కుంగుబాటుకు గురవుతున్నారని, వాటి పర్యవసానంగా వారు ఆత్మహత్యల దారి వెతుక్కుంటున్నారంటూ అనేకమంది తల్లిదండ్రులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. చదువుతో పాటు టీనేజీ వయస్సులో మానసిక పరిపక్వత లేక అనేకానేక కోణాలు, కారణాలు కూడా ఈ బలవంతపు చావులకు ఉరితాళ్లు పేనుతున్నాయి. కార్పొరేట్‌ కాలేజీల్లో చదువులు ఇలా విపరీతమైన వత్తిడితో ఉంటే, హాస్టళ్ళలో ఆ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటోంది. స్టడీ అవర్స్‌ మినహాయిస్తే వారికున్న సమయం చాలా తక్కువ. విశ్రాంతి అనేదే ఉండదు. ఎప్పుడూ చదువే. ర్యాంకులు-మార్కులు ఇవే వారికళ్ళ ముందు ఎప్పుడూ కనిపిస్తుం టాయి. ఈ వత్తిడితోనే అనేకమంది ఆత్మహత్యలకు గురవుతున్నారు. ఇటీవల రెండు తెలుగురాష్ట్రాల్లో కనీసం 30 మంది విద్యార్థులు ఆయా విద్యాసంస్థల్లో బలవన్మరణాలకు పాల్పడ్డారని గణాంకాలు చెప్తున్నాయి. ఇంత దయనీయమైన స్థితి గతంలో ఎప్పుడూ లేదు.

తల్లిదండ్రులూ.. ఆలోచించండి!

అనేకమంది తల్లిదండ్రులు కూడా కార్పొరేట్‌ చదువులు మాత్రమే చదువులనే భ్రమలో పడిపోతున్నారు. అనేక ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునేందుకు ఎన్నో మంచి అవకాశాలున్నా వాటిపై అపనమ్మకంతో పిల్లలను కార్పొ'రేట్‌'లకే పంపుతున్నారు. కార్పొరేట్‌ కళాశాలల వారు చెప్పే మాయమాటలు నమ్మి, ఎంతెంతో డబ్బును చదువు కోసం వెచ్చిస్తున్నా సరైన మార్కులు రావడం లేదేమని అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలపై కూడా తమవంతు వత్తిడిపెంచుతున్నారు. ఇదెంతవరకు సమం జసమో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. ఇళ్ళకు వచ్చినా విద్యార్థులకు తల్లిదండ్రుల నుంచి కూడా ఇలాంటి వత్తిడులు తప్పడం లేదు. చివరికి నూటికి ఒక్క మార్కు తగ్గినా కాలేజీ వాళ్ళు, తల్లిదండ్రులు ఏమంటారోనని భయపడుతూ పిల్లలు భోరుమని ఏడ్చేస్తున్నారు. కళాశాల చదువే జీవితాన్ని శాసిస్తుందని, ఒక్కమార్కు తగ్గినా జీవితమే లేదని అన్నట్లుగా ఉండే మాటలతో పిల్లలు మరింతగా మానసికంగా నలిగిపోతున్నారు. గతంలో 60శాతం మార్కులు వస్తేనే ఫస్ట్‌క్లాస్‌ అంటూ ఎంతో సంబరపడి పోయే రోజులు పోయాయి. 35శాతం వస్తే చాలు.. పాస్‌'. ఇంతకన్నా ఆనందం ఇంకేమి కావాలీ?.. ఇలాంటి చదువులు చదివినవారే ఎంతో ఉన్నతమైనస్థానాలను చేరుకున్నారనే విషయం గుర్తుంచుకోవాలి. వత్తిడి లేకపోతే పిల్లలు చదవరు అన్నట్లుగా కఠినమైనమాటలతో చదివించడం మంచిపద్ధతి కాదు. పిల్లలు ఇష్టపడి కాక, నిజంగానే 'కష్టపడి' చదవాల్సిరావడం దయనీయం. ఇకనైనా కళాశాలలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు అందరూ కలసి ఈ పరిస్థితులను చక్కదిద్దుకోవాలి. విద్యార్థులకు మానసిక వత్తిడిని తగ్గించి వారు హాయిగా, సంతోషంగా చదువుకునే పరిస్థితులను కల్పించాలి. అందుకు ప్రభుత్వాలే తగు విధానా లను రూపొందించాలి. పోటీతత్వంతో కార్పొరేట్‌ విద్యాసంస్థలు అవలంబిస్తున్న విపరీత ధోరణులకు ప్రభుత్వమే చెక్‌ పెట్టాలి.

Page 1 of 51

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
  నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
 • ఆనంకు చుక్కెదురు?
  నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
 • కావలి నాకే కావాలి
  వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో సిటింగ్‌ ఎమ్మె ల్యేలలో ఎక్కువ మందికి తిరిగి టిక్కెట్లిచ్చే అవ కాశాలున్నాయి. అయితే ఒక్క కావలిలో మాత్రం సీటు విషయంలో బలమైన పోటీ నెలకొని వుంది. అది కూడా మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి నుండే కావడంతో కావలి వైకాపా…
 • ఆనంకు చుక్కెదురు?
  నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
 • అవును... వాళ్ళిద్దరూ ఫోన్లు ఎత్తరు!
  మునిసిపల్‌ మంత్రి నారాయణ, కమిషనర్‌ ఢిల్లీరావులపై సర్వత్రా అసంతృప్తి ఒకాయన మునిసిపల్‌ శాఖకు రాష్ట్రాధినేత. సాక్షాత్తూ ఆ శాఖకి మంత్రి. మరొకాయన నెల్లూరు మునిసిపల్‌ శాఖలో అత్యున్నత అధికారి. ఆశ్చర్యం కలిగే విధంగా వీళ్ళిద్దరిలో కామన్‌గా ఒకే గుణం వుండడంతో అది…

Newsletter