rasi 23

1Ariesమేషం

ఇతరుల నుండి అనుకున్న సహాయాన్ని పొందలేక పోవచ్చును. దూర ప్రయాణాలు వాయిదా పడటం, శుభకార్య ప్రయత్నాలకు ఆటంకాలుండటం జరుగు తుంది. చిన్న వ్యాపారాలకు ఆదాయం ఫరవాలేదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదవ వలసి వుంటుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉండవు. ఖర్చులు పెరుగుతాయి.

 

2Taurusవృషభం

గృహ నిర్మాణదారులకు, కాంట్రాక్టర్లకు బాగుం టుంది. భూ లావాదేవీలు ఫలించగలవు. సభలు సమా వేశాలలో గుర్తింపు గౌరవం బాగుంటుంది. కోర్టు కేసులందు అనుకూలత, విద్యార్థులకు మంచి ప్రగతి, జాతకులకు ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి పరంగా జీవనం కలవారికి ఆర్ధికస్థితి కొంత బాగుంటుంది. వ్యాపార వర్గాలకు మంచి అభివృద్ధి ఆదాయముంటుంది.

 

3Geminiమిధునం

వ్యవహారాలలో సరైన నిర్ణయాలు తీసికొంటారు. ఉద్యోగార్ధులకు మేలైన అవకాశాలుండకపోవచ్చును. కుటుంబసౌఖ్యం బంధు సఖ్యత బాగుంటుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. కొత్త పెట్టుబడులు, వ్యాపార భాగ స్వామ్యాలకు అవకాశాలు లభించగలవు. అవసరాలకు మాట రూపేణ, డబ్బు రూపేణ సహాయం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని ప్రయాణాలుంటాయి.

 

4Cancerకర్కాటకం

ఉద్యోగులకు రావలసిన బాకీలు లభించడం, పని భారం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు జరపకుండా జాగ్రత్తపడాలి. బిడ్డల విద్యా శుభకార్య విషయాలందు శ్రద్ధ చూపుతారు. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొనండి. రావలసిన బాకీలు కొంత అందుతాయి. ఆర్ధికంగా బాగుండి, వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి.

 

5Leoసింహం

పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు ప్రోత్సాహ కరంగా ఉంటుంది. బంధుమిత్రులకు సహాయపడతారు. ప్రముఖులతో పరిచయాలుంటాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. విద్యావృద్ధి కలదు. ఆదాయం పెరిగి వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. బ్యాంకు ఋణాలు లభించగలవు.

 

6Virgoకన్య

కోర్టు వ్యవహారాలలో అనుకూలత తక్కువ. పట్టు దలతో అనుకున్న పనులు సాధించుకొంటారు. అనుకోని ఖర్చులు పైనబడగలవు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. విద్యాప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. స్థిరాస్తుల లావాదేవీలు, కొత్త పెట్టుబడులు జరుపుతారు. చిన్న వ్యాపారాలు, వృత్తి జీవనం కలవారికి ఆర్ధికంగా బాగుంటుంది.

 

7Libraతుల

ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసి కొనండి. గృహ వస్తు వాహన రిపేర్లు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల సమయం. ఉద్యోగులకు విధి నిర్వహణ బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్య పనులు వాయిదా వేసుకొంటారు. వృత్తి వ్యాపారాలలో సామాన్య అవకాశాలు, ఆదాయం ఉంటుంది.

 

8Scorpioవృశ్చికం

ఉద్యోగ సౌఖ్యం, కొత్త ఉద్యోగావకాశాలు దొరకడం జరుగవచ్చును. కొత్త పరిచయాలు, దైవ కార్యాలలో పాల్గొనడం, దూరప్రయాణాలు వాయిదా పడటం జరుగు తుంది. పరుష ప్రవర్తన, తొందరపాటు మాటలు తగ్గించు కొనాలి. విద్యా ప్రగతి బాగుంటుంది. స్థిరాస్తుల లావా దేవీలు జరుపుతారు. సమస్యాత్మక విషయాలలో సంప్ర దింపులు, చర్చలు జరిపి పరిష్కారం కాగలవు.

 

9Sagittariusధనుస్సు

ఉద్యోగులకు స్థాన మార్పులు, పని భారం బాగుం టుంది. యజమానులు వర్కర్లతో జాగ్రత్తగా మెలగండి. శరీరానికి గాయాలు తగలవచ్చును. కొంతమంది మిమ్మల్ని పరోక్షంగా కించపరచవచ్చును. విద్యా ప్రగతి బాగుంటుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులను అధిగ మించి, రాబడి పెరుగుతుంది. వృత్తి జీవనంలో సామాన్య అవకాశాలుంటాయి. బిడ్డలకు అభివృద్ధి బాగుంది.

 

10Capricornమకరం

సమస్యలు సక్రమంగా సర్దుబాటు కాగలవు. పారి శ్రామిక వర్గాలకు ప్రోత్సాహం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత కలదు. ఆస్థుల లావాదేవీలు వాయిదా పడతాయి. విద్యాప్రగతి, ఆరోగ్యం బాగుం టుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. ఆశించినంత ఎక్కువ ఆదాయముండదు. బ్యాంకు ఋణాలు లభించడంలో కాలయాపన జరుగవచ్చును.

 

11Aquariusకుంభం

ఉద్యోగులు తమ విధి నిర్వహణ సమర్ధవంతంగా జరుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలు దొరుకు తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధికంగా బాగుంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలుండి సర్ధుబాటు కాగలవు. గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి.

 

12Piscesమీనం

అనుకున్న పనులను జాగ్రత్తగా నెరవేర్చుకుంటారు. విద్యాప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. ఉమ్మడి వ్యాపారాలకు లీజులకు అవకాశాలు దొరుకు తాయి. కళాక్రీడా సాంకేతిక రంగాల వారికి ఆదరణ ఉంటుంది. బంధువర్గాన్ని కలుసుకొంటారు. ప్రయాణా లుంటాయి. పైకి తీవ్రత లేకపోయినా ఆర్ధికంగా ఇబ్బందు లుంటాయి. ఉద్యోగార్ధులకు అవకాశాలు లభిస్తాయి.

rasi 09

1Ariesమేషం

బిడ్డల విద్యా వివాహ విషయాలలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొనాలి. వస్తువులు, డబ్బు భద్రపరచుకొనడం చేయండి. ఆర్ధికంగా బాగుండినా స్థిమితంగా ఉండలేరు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగి ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అధికం కాగలవు. కుటుంబ విషయాలపై దృష్టిపెడతారు.

 

2Taurusవృషభం

ఆర్ధిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. బంధుమిత్రులను కలుసుకొంటారు. గిట్టనివారి వల్ల మాటలు పడవలసి ఉంటుంది. ఇంట బయట పను లందు శ్రమ ఉంటుంది. కాని చేపట్టిన పనులను సమర్ధ వంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి కరంగా ఉండి ఆదాయం పెరుగుతుంది. పబ్లిక్‌లో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు.

 

3Geminiమిధునం

యజమానులకు వర్కర్ల వల్ల ఇబ్బందులుండును. ఉద్యోగులకు అధికారుల అనుకూలత ఉంటుంది. రావల సిన బాకీలు కొంత అందుతాయి. దైవ, శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పెట్టు బడులు, కొత్త వ్యాపారాల ప్రయత్నాలు జరుగుతాయి. ఆర్ధిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయినా అవసరాలకు కొద్ది ఋణాలు చేయక తప్పదు.

 

4Cancerకర్కాటకం

ఆరోగ్యం ఫరవాలేదు. శుభకార్యాలలోను, దైవ కార్యాలలోను పాల్గొంటారు. సోదర వర్గానికి మంచి జరుగుతుంది. ఉద్యోగులకు గుర్తింపు గౌరవాలు బాగుం టాయి. ప్రయాణాలుంటాయి. కమిటి సమావేశాలలో ప్రముఖ పాత్ర వహిస్తారు. ఉన్నత విద్యావకాశాలుం టాయి. ఇతరులకు ధన వస్తు మాట రూపంలో సహాయం చేస్తారు. పట్టుదలతో అనుకున్న పనులు జరుపుకొంటారు.

 

5Leoసింహం

సాంకేతిక, న్యాయ, వైద్య రంగాల వారికి ఆర్ధికావ కాశాలు బాగుంటాయి. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు పొందుతారు. ఒకటి రెండు పెద్ద అనవసర ఖర్చులుంటాయి. ఆరోగ్యం ఫరవాలేదు. ముఖ్య విషయా లపై నిర్ణయాలు తీసుకొనలేక టెన్షన్‌ పడతారు. పెండింగ్‌ సమస్యలు పరిష్కారం కాగలవు. గృహ వస్తు వాహన రిపేర్ల ఖర్చులుంటాయి. ఆదాయం పెరుగుతుంది.

 

6Virgoకన్య

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. దైవ, సామాజిక సేవా కార్యక్రమాలకు సహాయపడతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. వ్యాపారులు, అధికారులకు ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులు కలుగ వచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగములలో గాని, ఇతర కార్యక్రమములలోగాని నిర్వహణ సామర్ధ్యము బాగుంటుంది. ఆత్మీయులను కలుస్తారు.

 

7Libraతుల

గృహ మార్పులు, స్థానమార్పులుండగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. హామీలు, మధ్య వర్తిత్వాలకు పోవద్దు. పిల్లల వల్ల ఖర్చులు ఉంటాయి. ఇబ్బందులుండినా ధైర్యంగానే ఉంటారు. ఉద్యోగులకు విధినిర్వహణ సాఫీగా సాగిపోతుంది. దైవకార్యాలలో పాల్గొంటారు. ఆర్ధిక ఇబ్బందులుండవచ్చును. ఖర్చులు అధికంగా ఉంటాయి.

 

8Scorpioవృశ్చికం

శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, దూర ప్రయాణాలుంటాయి. ఆరోగ్యం సంతృప్తికరం. అధికారు లకు స్థానమార్పు, పెండింగ్‌ పనులు పరిష్కారం కాక పోవుట, ప్రభుత్వ అనుమతులలో ఆలస్యం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. అవసరాలకు డబ్బు సమకూర్చుకొంటారు. వృత్తి వ్యాపారాలలో విస్తరణ ప్రయ త్నాలు జరగకపోయినా ఆదాయ లోపం కలగదు.

 

9Sagittariusధనుస్సు

ఉన్నత విద్యపై అనిశ్చితి ఉంటుంది. నిరుద్యోగు లకు అవకాశాలు దొరకడం, దైవ సేవా కార్యములలో పాల్గొనడం, సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. విలువైన వస్తువులను సమకూర్చు కొంటారు. ఆర్ధిక ఒప్పందాలు జరుగును. వృత్తి జీవనం కలవారికి మంచి అవకాశాలు దొరుకుతాయి., వ్యాపార వర్గాలకు ఆదాయం బాగుంటుంది.

 

10Capricornమకరం

విలువైన వస్తువులు సమకూర్చుకొనడం, శుభకార్య ములను నిర్వహించడం జరుగుతుంది. దూరప్రయాణా లుండును. రాజకీయ వర్గాలు సామరస్యంగా పోవడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగావకాశాలు లభించగలవు. వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. కొత్త పెట్టుబడులకు కొత్త వ్యాపారాలకు అవకాశాలుం టాయి. ఆస్థి క్రయవిక్రయాల అగ్రిమెంట్లు జరుగుతాయి.

 

11Aquariusకుంభం

వృత్తి వ్యాపార రంగాలు అభివృద్ధికరంగా ఉండి ఆదాయం పెరుగుతుంది. కుటుంబసభ్యులకు కొద్దిపాటి అనారోగ్య బాధలుంటాయి. విలువైన వస్తువులు సమ కూరుతాయి. దైవ సేవా సామాజిక రంగాలకు సహాయం చేయడం చేస్తారు. స్థిరాస్తులు, షేర్ల మీద లాభాలుం టాయి. పనులు సానుకూలంగా జరిగినా టెన్షన్‌ ఉం టుంది. మీ ఆరోగ్యం ఫరవాలేదు.

 

12Piscesమీనం

ఆర్ధికంగా బలపడి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెంది ఆదాయం పెరుగుతుంది. తొందరపాటు ప్రవర్తన, మాటలు అదుపులో పెట్టుకొనాలి. బిడ్డలకు స్వల్ప అనా రోగ్య బాధలుంటాయి. బంధు మిత్రులను, ప్రముఖులను కలుసుకొంటారు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. శుభకార్యముల తేదీలను నిర్ణయం చేస్తారు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది.

rasi 2

1Ariesమేషం

స్థిరాస్తుల లావాదేవీలు జరుపవద్దు. ప్రముఖులను కలుసుకొంటారు. ఉద్యోగులకు శ్రమభారం పెరుగు తుంది. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న పనులు విజయవంతంగా జరుపుతారు. వృత్తి జీవనం కలవారికి ఆదాయం, అభివృద్ధి బాగుంటుంది. వ్యాపార రంగాలలో ఆశించిన ఫలితాలుండవు, ఆదాయం సామాన్యం. దూరప్రయాణాలుంటాయి.

 

2Taurusవృషభం

చిన్న వ్యాపారులకు ఫరవాలేదు. ప్రభుత్వ అనుమ తులు ఆలస్యం కాగలవు. ప్రముఖులను కలుసుకొం టారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగులు విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక స్థితి సంతృప్తికరంగా ఉం డదు. సామాన్య ఆదాయముంటుంది. ఇతరులకు సేవ క్రింద పనులు జరుపవలసి ఉంటుంది.

 

3Geminiమిధునం

ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత బాగుంది. కొత్త విలువైన వస్తువులు, గృహోపకరణాలు సమకూర్చు కొంటారు. విద్యార్థులకు మంచి ప్రగతి ఉంది. స్థిరాస్తుల పెరుగుదలకు కృషి చేస్తారు. కుటుంబసౌఖ్యం బాగుం టుంది. వృత్తి వ్యాపారాలు బాగా జరిగి ఆదాయం పెరుగుతుంది. బంధువర్గంతో విభేదాలు రావచ్చును. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.

 

4Cancerకర్కాటకం

కాంట్రాక్టులు నిర్వహించేవారు, మార్కెటింగ్‌ వృత్తిలో గలవారికి ఆదాయం ఫరవాలేదు. పనులందు టెన్షన్‌ ఎక్కువుగా వుంటుంది. వస్తు, వాహన గృహ రిపేర్లుం టాయి. స్థిరాస్తుల లావాదేవీలు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంది. ప్రభుత్వ అనుమ తులు మాత్రం లభించగలవు. చేపట్టిన పనులకు ఆటంకాలు కలుగవచ్చును.

 

5Leoసింహం

శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. కుటుంబసౌఖ్యం, ప్రముఖులతో పరిచయాలుంటాయి. సోదర వర్గానికి అభివృద్ధి మేలు జరుగుతుంది. కొత్త నిర్మాణాలు జరిపే ప్రయత్నాలుంటాయి. విద్యా ప్రగతి బాగుంది. నూతన వస్తువులను సమకూర్చుకొంటారు. హామీల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధికాభివృద్ధి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించగలవు.

 

6Virgoకన్య

అనుకోని ప్రయాణాలుంటాయి. ప్రముఖులతో పరిచయాలుంటాయి. ఉద్యోగులకు అధికారుల సహకారం బాగుంటుంది. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు పొందుతారు. విద్యావృద్ధి ఆరోగ్యం బాగుం టుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాలలో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపార ప్రారంభాలకు నిర్ణయాలు జరుగుతాయి.

 

7Libraతుల

ఉద్యోగావకాశాలు లభించగలవు. దైవ కార్యాలు వేడుకలలో పాల్గొంటారు. కొత్త వస్తువులు సమకూర్చు కొంటారు. సోదర వర్గానికి మేలు జరుగుతుంది. అనుకోని ప్రయాణాలుంటాయి. విద్యావృద్ధికి కృషి బాగుంటుంది. శుభకార్యాలు నిర్ణయం కావచ్చును. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. మీ ప్రయత్నాలకు పరిస్థితులు అనుకూ లిస్తాయి. బ్యాంకు ఋణాలు మంజూరు కాగలవు.

 

8Scorpioవృశ్చికం

ఉద్యోగార్ధులకు ఉద్యోగకృషి అనుకూలించగలదు. సమస్యల నుండి కొంత ఉపశమనం ఉంటుంది. అనవసర విషయాలలోకి మిమ్మల్ని ఇతరులు లాగ కుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం ఫరవాలేదు. అనుకోని అదనపు ఖర్చులుంటాయి. అవసరాలకు ఋణాలు చేయవలసి రావచ్చును. కోర్టు వ్యవహారాలలో అనుకూ లత ఉన్నది. పెట్టుబడులకు అవకాశాలుంటాయి.

 

9Sagittariusధనుస్సు

ఉపయోగపడే ఖర్చులు అదనంగా ఉంటాయి. విద్యా ప్రగతి బాగుంటుంది. విందులు వేడుకలందు పాల్గొంటారు. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు పొందుతారు. పట్టుదలగా చేస్తే తప్ప పనులు జరగవు. ఉద్యోగ నిర్వహణ యందు గాని, వ్యవహారములందు గాని పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తపడాలి. ఆర్ధిక ఇబ్బందులు అంతగా ఉండవు.

 

10Capricornమకరం

ఉద్యోగులకు సామాన్యంగా జరిగిపోతుంది. అధి కారులకు స్థానమార్పులు, నిరుద్యోగులకు అవకాశాలుం టాయి. శుభవార్త వింటారు. విద్యాప్రగతి బాగుంటుంది. పలుకుబడితో వ్యవహారాలను అనుకూలంగా నిర్వహి స్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహకరంగా సాగి ఆదాయం పెరుగుతుంది. అయితే ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి.

 

11Aquariusకుంభం

శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత బాగుం టుంది. రావలసిన బాకీలు కొంతవరకు అందుతాయి. ముఖ్యవస్తువులు, డబ్బును జాగ్రత్తగా పదిలపరచుకొనాలి. సాంకేతిక వైద్య, న్యాయ, క్రీడా రంగాల వారికి పురోగతి ఉంటుంది. కుటుంబసౌఖ్యం, ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు పనిభారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ధనప్రాప్తి, వస్తు లాభము ఉంటుంది.

 

12Piscesమీనం

శుభకార్య నిర్ణయాలు జరుగవచ్చును. నిరుద్యోగు లకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. అధికారులకు స్థానమార్పులుంటాయి. అనవసర విషయాలలో జోక్యం చేసికొనవద్దు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఇంకా కృషి చేయాలి. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా వేయండి. ఆర్ధిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించాలి. వృత్తి వ్యాపారాలలో సంతృప్తి, షుమారైన ఆదాయముంటుంది.

Page 1 of 55

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…
 • ఆదాయం వచ్చే పనులపై ఉన్న శ్రద్ధ ఆస్థి పన్నులపై ఏదీ?
  నెల్లూరుజిల్లాలోని మునిసిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌ పన్నుల వసూళ్ళలో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 కార్పొరేషన్లు ఉండగా పన్నుల వసూళ్ళలో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ 11వ స్థానంలో వుంది. నెల్లూరు నగరపాలక సంస్థలో మొత్తం 1,17,456 అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఇందులో రెసిడెన్షియల్‌…
 • అన్ని సీట్లూ ఇక తమ్ముళ్ళకే!
  ఎన్డీఏ కూటమి నుండి తెలుగుదేశం వైదొలిగింది. దీనిపై నెల్లూరుజిల్లా తెలుగు తమ్ముళ్ళు రెండు విధాలుగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మతోన్మాద పార్టీ అని, అందుకే దూరంగా వచ్చేసామని ముస్లింలు, క్రిస్టియన్‌ల దగ్గరకుపోయి ఓట్లు అడగొచ్చు. నోట్ల రద్దు, జిఎస్టీ వంటి…
 • వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, యం.పి., రాజ్యసభ
  నేను నేనుగా బ్రత కడం కాదు, నేను నలుగురి కోసం బ్రత కడం, నలుగురికి బ్రతుకు నివ్వడం, బ్రతికే మార్గాన్ని చూపించడం... భవిష్యత్‌ పై ఆశలు కల్పించడం, పది మందికి నేనున్నాననే భరోసా ఇవ్వడం... ఈ మార్గాన్ని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తే…
 • పవన్‌కు తోడైన 'సింహపురి పవర్‌'
  పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో హీరో అత్త పాత్రధారి నదియాతో... ''నీ వెనుక తెలియని అదృశ్యశక్తి ఏదో ఉందమ్మా, అది వున్నంత వరకు నిన్నెవరూ ఏమీ చేయలేరు''అని పోసాని కృష్ణమురళి అంటాడు. ఆ తరహాలోనే ఇప్పుడు పవర్‌ స్టార్‌…

Newsletter