ratnamవిద్యారంగంలో 'రత్నం' విజయ కేతనం ఎగరేసింది. విద్యలో తమ సత్తాను చాటుతూ 'రత్నం' విద్యార్థులు సింహపురి సీమ కీర్తిని దశదిశలా చాటారు. ఎంతో కష్టసాధ్యమైన 'స్టేట్‌ ఫస్ట్‌' ర్యాంకును సాధించి రత్నం విద్యాసంస్థల ఖ్యాతిని మరింతగా జగద్విదితం చేశారు. ఒకవైపు నెల్లూరు సీమలోని షార్‌ నుంచి రాకెట్‌లు అద్వితీయమైన రీతిలో విజయవిహారం చేస్తుంటే, మరోవైపు విద్యారంగంలోనూ 'రత్నం' విద్యాసంస్థలు రాకెట్‌ వేగంతో దూసుకుపోతూ విద్యార్థుల భవితకు బంగరుబాటలు వేస్తూ అందరి ప్రశంసలూ అందుకుంటున్నాయి.

గురువారం వెల్లడైన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో 'రత్నం' విద్యాసంస్థల విద్యార్థులు విజయదుంధుభి మోగించారు. బైపిసి విభాగంలో స్టేట్‌ ఫస్ట్‌ సాధించి తమ సత్తా చాటుకున్నారు. బైపిసి విభాగంలో 'రత్నం' విద్యార్థిని ఎన్‌.లక్ష్మీకీర్తి (హాల్‌టికెట్‌ నం.1808212943) రాష్ట్రస్థాయిలో ప్రధమస్థానంలో నిలచి 'రత్నం' విద్యాసంస్థలకు, తమ తల్లి దండ్రులు, ఉపాధ్యాయులందరికీ కీర్తిని తెచ్చిపెట్టింది. 990 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇంకా పలువురు 'రత్నం' విద్యార్థులు ఈ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి 'రత్నం' విద్యాసంస్థలకే కాక, సింహపురి కీర్తి కేతనాన్ని రెపరెపలాడించార. వారు కేవలం విద్యార్థులు కాదు.. విద్యా రత్నాలు అనిపించుకున్నారు. విద్యలో ఆణిముత్యాలనిపించుకున్నారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో తామే ప్రధమస్థానమని నిరూ పించుకోవడమే కాక, ఇంటర్‌ బైపిసిలో 988, 985, 983, 982 మార్కులు కూడా సాధించారు. ఈ క్రమంలోనే ముగ్గురు విద్యార్థులు 981 మార్కులు సాధించగా, మరో ముగ్గురు విద్యార్థులు 980 మార్కులు సాధించారు. ఇలా 980 నుంచి అత్యుత్తమమైన 990 మార్కులు సాధించి స్టేట్‌ఫస్ట్‌ సాధించిన విద్యార్థులు రత్నం విద్యాసంస్థలవారు కావడం 'రత్నం' విద్యాసంస్థల బోధనా ప్రతిభకు నిదర్శనం. ప్రజ్ఞాపాటవాలతో విద్యలో రాణించాలను కునే విద్యార్థులకు నెల్లూరులోని 'రత్నం' విద్యాసంస్థలు పుట్టిళ్ళు లాంటివని వేరే చెప్పనక్కర లేదు. ఎంతోకాలంగా ఈ విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో పేరెన్నికగన్న విద్యాసంస్థలివి. 'రత్నం' విద్యా సంస్థలంటే.. చదువుల తల్లి నిలయమనే ప్రఖ్యాతి ఎంతోకాలం నుంచి ఉంది. శీలేన శోభతే విద్య!..అనే మంచి సూక్తితో ప్రారంభమైన ఈ విద్యాసంస్థలు అనతికాలంలోనే ఎంతో ఉన్నతస్థాయి ఫలితాలు సాధిస్తూ విద్యార్థులందరికీ మార్గదర్శకమయ్యాయి.

దేశీయ విద్యా విధానంలో వచ్చే మార్పులను అందిపుచ్చుకోవడంలో అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ రత్నందే పైచేయిగా వుంటుంది. ఎంసెట్‌లో ర్యాం కుల కింగ్‌ తొలినుంచి రత్నమే! 2016లో ఎంసెట్‌ శకం ముగిసి దేశ వ్యాప్తంగా నీట్‌ని ప్రవేశపెట్టినప్పుడు, మెడికల్‌ విభా గంలో ఫస్ట్‌ ర్యాంకు సాధించింది రత్నమే! ఆ యేడాది రత్నం విద్యార్థిని హేమలత మెడిసిన్‌లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధిం చింది. ఇప్పుడు ఇంటర్‌లో మార్కుల విధానానికి స్వస్తి పలికి గ్రేడ్‌లను అమలు చేయబోతున్నారు. ఈ మార్పును కూడా రత్నం ఒకటవ ర్యాంకుతోనే అందిపుచ్చు కుని తన సత్తాను చాటింది.

ఏదేమైనా, రత్నం విద్యాసంస్థలను విద్యలో అగ్రగామిగా తీర్చిదిద్దుతూ నెల్లూరుసీమలో విద్యా రత్నంగా.. అనర్ఘ రత్నంగా ప్రకాశిస్తున్న 'రత్నం' విద్యాసంస్థల అధినేత కె.వి రత్నం ఎంతైనా అభినంద నీయులు. తాజాగా సీనియర్‌ ఇంటర్‌ బైపిసి విభాగంలో స్టేట్‌ ఫస్ట్‌ సాధించిన విద్యార్థిని ఎన్‌.లక్ష్మీకీర్తికి, విద్యారంగంలో నెల్లూరు కీర్తిని చాటుతున్న రత్నం విద్యాసంస్థల అధినేత కె.వి రత్నం గారికీ ఈ సంద ర్భంగా.. 'లాయర్‌' శుభాభినందనలు.

ratnam governerవిజయం ఎంత నిశ్శబ్దంగా వస్తుందో ఆనందం అంత ఘనంగా ఉంటుంది. రంకెల్లో కాదు అంకెల్లో... అరుపుల్లో కాదు... చదువుల మెరుపుల్లో... అనితర విజయమిది. 'రత్నం' మాష్టారుకే సాధ్యమైన ఘనతర విద్యాపయనమిది.

ర్యాంకులు రావాలన్నా, రికార్డులను తిరగ రాయాలన్నా అది 'రత్నం'కే సాధ్యమని మరోసారి ఋజువయ్యింది. 2016 ఏపి ఎంసెట్‌ మెడికల్‌ ఫలితాల్లో నెల్లూరులోని రత్నం జూనియర్‌ కళాశాల విద్యార్థిని మాచాని హేమలత రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకును సాధించి, తాను చదివిన రత్నం విద్యా సంస్థలకు, తాను పుట్టిన రాయలసీమ(కర్నూలు) గడ్డకు కీర్తిప్రతిష్టలు తెచ్చింది. రాయలసీమ'రత్నం'గా వెలుగులోకి వచ్చింది.

ర్యాంకుల సృష్టికర్త రత్నం:

ఎంసెట్‌ కోచింగ్‌కు, ర్యాంకుల పరంపరకు ఆద్యుడు, అసాధ్యుడు కె.వి.రత్నం. ఒకనాడు ఎంసెట్‌ కోచింగ్‌కు నెల్లూరును ఒక హబ్‌గా మలచింది ఆయనే! 1973లోనే నెల్లూరులో రత్నం కోచింగ్‌ సెంటర్‌ను స్థాపించి, తన సంస్థను ఇంజనీర్లు, డాక్టర్ల ఉత్పత్తి కేంద్రంగా మలిచాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుండి కూడా ఎంసెట్‌ కోచింగ్‌ కోసం విద్యార్థులొచ్చి 'రత్నం'లో చేరేవాళ్ళు. ప్రతిఏటా ఎంసెట్‌ ర్యాంకులు 'రత్నం'వే. ర్యాంకుల అగ్రభాగం వారిదే! అయితే చదువును వ్యాపార వస్తువుగా చూడడం ఇష్టంలేని రత్నం మాష్టారు తన విద్యాసంస్థలను నెల్లూరుజిల్లాను దాటి విస్తరించలేదు. క్రమశిక్షణ, నిజాయితీతో కూడిన విద్యతోనే 'రత్నం' ఎన్నో విద్యా విజయాలను అందు కుంటూ వచ్చింది. కొన్నేళ్ల పాటు ఇంటర్‌, ఎంసెట్‌కు దూరంగా వున్న రత్నం విద్యా సంస్థలు గత ఏడాది నుండే తిరిగి ఇంటర్మీడియట్‌, ఎంసెట్‌లలోకి అడుగుపెట్టాయి. ఆరంభంలోనే స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకుతో అదరగొట్టింది.

పేదింటి రత్నం:

మెడికల్‌లో మొదటి ర్యాంకు సాధించిన హేమలతది కర్నూలు. తండ్రి వీరన్న, తల్లి కళావతి. వాళ్లకు ముగ్గురు కూతుళ్లు! వీరన్న బట్టల కొట్టులో చిరుద్యోగి. ఎంసెట్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకును సాధించాలనే పట్టుదలతో హేమలత తనకు తెలిసిన అధ్యాపకులను విచారించి తన లక్ష్యానికి 'రత్నం విద్యా సంస్థ' సరైనదిగా ఎంచుకుంది. హేమలతలోని చురుకు దనాన్ని, సబ్జెక్ట్‌ల మీద వున్న పట్టును గమనించిన రత్నం యాజ మాన్యం, అధ్యాపకులు ఆమెకు పూర్తి సహకారం అందించారు. ఆమెకు కావాల్సిన మెటీరియల్‌ను అందుబాటులో ఉంచారు. ఆమెకు అర్థమయ్యేరీతిలో సందేహాలను నివృత్తి చేసేవాళ్ళు!

టాప్‌ వన్‌ 'రత్నం' చలవే!

తాను టాప్‌-10 ర్యాంకుల్లో ఉంటానని భావించానని, టాప్‌-1 ర్యాంకు వచ్చిందంటే అది రత్నం అధ్యాపక సిబ్బంది తోడ్పాటు వల్లేనని ఈ సందర్భంగా హేమలత 'లాయర్‌'కు వివరించింది. ప్రతి ఒక్క అధ్యాపకుడు ఎంతో చక్కగా సబ్జెక్ట్‌లు చెప్పారు. అన్ని విధాలుగా గైడెన్స్‌ ఇచ్చారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుం టున్నాను. గత ఏడాదే ఎంసెట్‌లో 245వ ర్యాంకు వచ్చిందని, అయితే వయసు 28రోజులు తక్కువ కావడం వల్ల ప్రవేశం లభించలేదని, ఆ పట్టుదలతోనే ఇప్పుడు చదివి 1వ ర్యాంకు సాధించా నన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ ప్రవేశ పరీక్ష వ్రాసి అందులో చేరాలనుకుంటున్నట్లు హేమలత చెప్పింది. మెదడు, నరాలకు సంబంధించిన వైద్యవిద్యను పూర్తి చేసి, చేతనైనంత వరకు ఆ విభాగంలో పేదలకు వైద్యసహాయం చేయాలన్నది తన జీవిత లక్ష్యంగా ఆమె తెలియజేశారు.

మనసున్న మాష్టారు:

ఈనాటి కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో డబ్బు విష సంస్కృతి ఏ స్థాయిలో వుందో చూస్తూనే వున్నాం. కాని రత్నం మాష్టారు ఆ సంస్కృతికి చాలా దూరంగా వుంటారు. విద్యార్థులను ఫీజులు కట్టే యంత్రాలుగా కాకుండా విజ్ఞాన వేత్తలుగా చూడడం ఆయన నైజం. తన వద్ద చదువుకోవడానికి వచ్చే విద్యార్థుల ఆర్ధిక పరిస్థితిని సైతం ఆయన నిశితంగా గమనిస్తుంటాడు. ఎంతోమందికి చదువుల పరంగా సాయం చేస్తుంటాడు. హేమలత విషయంలోనూ ఆయన ఎంతో

ఉదారంగా వ్యవహరించాడు. వాళ్ల కుటుంబ ఆర్ధిక పరిస్థితిని తెలుసుకున్న ఆయన ఆమెకు ఎంసెట్‌ కోచింగ్‌ను ఉచితంగా ఇవ్వడమే కాదు, ఆమె భవిష్యత్‌ చదువుల కోసం 5లక్షలను ఆమె పేరుతో బ్యాంకులో డిపాజిట్‌ చేయించాడు. దీనికి సంబంధించిన పత్రాలను ఫలితాల విడుదల రోజున ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా హేమలతకు అందజేశారు. ఇక హేమలత చెల్లెలిని కూడా ఉచితంగా చదివించేందుకు 'రత్నం' మాష్టారు ముందుకు రావడం ఎంతైనా అభినందనీయం.

అభినందనల వెల్లువ:

మెడికల్‌లో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకు సాధించిన హేమలతను ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా అభినందించారు. ఇక గవర్నర్‌ నరసింహన్‌ అయితే ఈ నెల 24వ తేదీన ప్రత్యేకంగా హైదరాబాద్‌ పిలి పించుకుని ప్రశంసించారు. ఆమెతో పాటు రత్నం విద్యాసంస్థల అధినేత కె.వి.రత్నం, అధ్యాపకులు కూడా గవర్నర్‌ను కలిసారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే ఎంసెట్‌ మెడికల్‌లో నెంబర్‌ వన్‌ ర్యాంకు మొదలయ్యింది 'రత్నం'తోనే! బహుశా ఆ నెంబర్‌ వన్‌ బ్రాండ్‌ ముగింపు కూడా ఆయన చేతులమీదుగానే జరిగినట్లుంది. ఎందుకంటే వచ్చే ఏడాది నుండి ఇక 'నీట్‌' కదా! 'నీట్‌'లోనూ మనం నెంబర్‌వన్‌ రత్నాలను చూడొచ్చు. హ్యాట్సాఫ్‌ రత్నం... వెల్‌డన్‌ హేమలత.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter