sahoప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రానికి కొత్త కష్టాలు వచ్చాయి. ముందు నుండి కూడా ఈ మూవీ ని సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసారు. దాని తగట్టే షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నారు. అయితే జనవరి లో రావాల్సి పెద్ద సినిమాలన్నీ సమ్మర్ కు పోస్ట్ పోన్ చేయడం తో సాహో రిలీజ్ కు కష్టాలు వచ్చేలా ఉన్నాయి. మహేష్ – కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భరత్ అను నేను ముందుగా సంక్రాంతి కి వస్తుందని అనుకున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 27న మూవీని విడుదల చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేశారు. సంక్రాంతికి వస్తామని ప్రకటించిన మరో సినిమా రంగస్థలం కూడా వాయిదాపడింది. ఏప్రిల్ రెండో వారంలో (కుదిరితే ఏప్రిల్ 13) మూవీని థియేటర్లలోకి తీసుకురావాలనేది చిత్ర యూనిట్ ప్లాన్ చేసారు. మరో హీరో అల్లు అర్జున్ ఎప్పటిలాగానే ఈ సమ్మర్ లో కూడా తన సినిమా ను తీసుకరాబోతున్నాడు. వంశీ దర్శకత్వం లో చేస్తున్న నా పేరు శివ ను మే నెలలో రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యాడు. ఇలా ఏప్రిల్ , మే నెలలు పెద్ద సినిమాలతో ఫుల్ చేసుకోవడం తో సాహో రిలీజ్ డేట్ కు కష్టం వచ్చింది. ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సాహో సినిమాను సమ్మర్ నుంచి తప్పించాలని చూస్తున్నారట. దీనికి ప్రధానంగా సమ్మర్ బాక్సాఫీస్ రద్దీ ఓ కారణమైతే.. సాహో సినిమా షూటింగ్ లో జాప్యం కూడా మరో కారణం అని తెలుస్తుంది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter