isukaనెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసి వున్నారు. అయితే పొట్టేపాలెం దాటాక కొంత దూరాన్ని విస్తరించలేదు. ఇక్కడే చెరువు అలుగు వస్తుంది. ఈ అలుగు మీదుగానే వాహనాలు పోతుంటాయి. ఇక్కడే పొట్టేపాలెం ఇసుకరీచ్‌కు వెళ్లే దారి వుంది. ఇసుక రీచ్‌ నుండి వచ్చే వాహనాలు ఇక్కడ మలుపు తిరుగుతుంటాయి. దీంతో వాహనాలలో ఇసుక కొంత జారి ఇక్కడ రోడ్డుపై పడి వుంటుంది. ఇది గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ద్విచక్రవాహనాలలో వేగంగా వచ్చే వాళ్ళయితే ఇక్కడ అదుపు తప్పి పడిపోతుంటారు. రోడ్డుపై గుట్టగా పేరుకుపోయిన ఇసుకను వెంటనే తొలగించాల్సివుంది.

sandరాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితం చేసిందన్న మాటేమోగాని, దాని ఫలాలు సామాన్య ప్రజలకు అందే అవకాశాలు కనిపించడం లేదు. ఇసుక కావాలంటే ఇంతకుముందు ఏ రేటయితే పెట్టి కొంటున్నారో ఇప్పుడు కూడా అదే రేటును పెట్టాల్సి వస్తోంది. ఫ్రీ ఇసుక ప్రభుత్వ ప్రచారానికి, పత్రికలలో వార్తలకు తప్ప ఇంకెక్కడా ఉపయోగపడడం లేదు. ఈ తొక్కలో పంచాయితీకి ఆ ఇసుక రీచ్‌లకు టెండర్లే పెట్టివుంటే ప్రభుత్వానికి ఆదాయమన్నా వచ్చుండేదని చాలామంది అభిప్రాయం.

ఇసుక రీచ్‌ల వద్ద ఇంతకు ముందు కాంట్రాక్టర్లు ఉండేవాళ్లు. ఇప్పుడు స్థానిక అధికారపార్టీ నాయకులు తయారయ్యారు. రీచ్‌లలో నుండి ఇసుక లోడ్‌తో ఒక ట్రాక్టర్‌ను కూడా బయటకు పోనీయడం లేదు. డబ్బులు కట్టనిదే బండ్లను కదలనీయడం లేదు. జిల్లాలో 25రీచ్‌లకు గాను పర్యావరణ అనుమతులున్న 9రీచ్‌లలో

ఉచిత ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చినా ఫ్రీ ఇసుక మాత్రం అందడం లేదు. ప్రతి రీచ్‌ వద్ద అధికారపార్టీ నేతల దందా సాగుతోంది. పర్యావరణ అనుమతులు లేని రీచ్‌లలో సైతం అధికారపార్టీ నేతల కనుసన్నలలో ఇసుక తవ్వకాలు జరిపి, తమిళనాడుకు తరలిస్తున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయకుంటే మాత్రం ప్రజలకు ఉపయోగముండదు. ప్రభుత్వానికి కూడా మహా చెడ్డపేరు వస్తుంది.

sandఇసుకను ఉచితంగా ప్రక టించేసి చంద్రబాబు ప్రజలను ఆశ్చర్యంలో ముంచేశాడు. ఇది వూహించని పరిణామమే. ఓ పక్క ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచేసి, డిడిలు కూడా తీసు కుని ఇక కాంట్రాక్టర్లకు ఇసుక రీచ్‌లను కేటాయించాల్సిన తరుణంలో చంద్రబాబు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఉచిత ఇసుక పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఊరడింపు వంటిదే! అయితే ఉచిత ఇసుకలో చంద్రబాబు ఆలోచన వెనుక ఎంతో లోతైన విషయాలున్నాయి. ఉచిత ఇసుక వల్ల రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకంటే కూడా నిర్మాణ కంపెనీలకే అధికలాభం చేకూరనుంది. తమ అవసరాల నిమిత్తం పేద ప్రజలు వాడుకునే ఇసుక చాలాతక్కువ పరిణామంలో ఉంటుంది. కాని పెద్దోళ్లు వాడుకునే ఇసుక వందల కోట్ల విలువ చేస్తుంది. ముఖ్యంగా అమరావతి రాజధాని కోసమే ఇసుకను ఉచితం చేసారనేది సమాచారం. ఇసుక పాటల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రెండొందల నుండి మూడొందల కోట్లు. చంద్రబాబు గోదావరి పుష్కరాలకు పెట్టిన ఖర్చే 2వేల కోట్లు. కాబట్టి చంద్రబాబు పెట్టే ఖర్చుకు ఇసుక డబ్బులు ఓ పక్కకు కూడా చాలవు. పైగా ఇసుక దోపిడీతో ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం గ్యారంటీ! అధికార పార్టీ నేతల అండతో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని మీడియాలో రోజూ వార్తలు... దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వల్ల ఇప్పటికే ప్రభుత్వం గబ్బుపట్టింది. ఇసుకరీచ్‌లను వేలం వేసి అప్పగిస్తే రాష్ట్రం నిండా చాలామంది చింతమనేని ప్రభాకర్‌లు తయారయ్యే అవకాశముంది. ఇక అమరావతి రాజధానిలో శరవేగంగా నిర్మాణాలు జరగాలన్నా, చంద్రబాబు అనుచరులు తీసుకున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు కదలాలన్నా ఇసుక అవసరం ఎంతో వుంది. రాజధాని నిర్మాణాలకైనా, ప్రాజెక్ట్‌లకైనా కొన్ని వందలకోట్ల విలువచేసే ఇసుక అవసరమవుతుంది. ఇప్పుడు ఆ ఇసుక అంతా కూడా వీరికి ఫ్రీ. దీనివల్ల రాజధానిలో నిర్మాణాలు కూడా వేగమందు కుంటాయని చంద్రబాబు ఆలోచన చేశాడు. ఇసుకను వేలం వేయడంకంటే ఫ్రీ చేస్తే ప్రయోజనాలు అధికంగా వున్నాయి కాబట్టే చంద్రబాబు ఇసుకను ఉచితం చేశాడు.

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter