money studyవేసవి సెలవులు అయిపోవచ్చాయి. ఈ నెల 11 నుండే జిల్లాలోని పాఠశాలలన్నీ పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 1వ తేదీ నుండే జూనియర్‌ కళాశాలలు తెరచు కున్నాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పూర్తయ్యి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక స్కూల్స్‌ ప్రారంభమైతే తల్లిదండ్రులకు వచ్చే సమస్యలు ఎలాగూ రాకమానవు. స్కూల్‌ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్‌, బూట్లు... వీటికి డబ్బులను ఎత్తిపెట్టాలి. ప్రతి ఏటా మధ్యతరగతి ప్రజలకు ఇదో సమస్య. ప్రైవేట్‌ పాఠశాలల్లో పోటాపోటీగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. పాఠశాలలు తెరచుకుంటే ఒకటిన్నర నెలలుగా విశ్రాంతిలో వున్న స్కూలు బస్సులు మళ్ళీ రోడ్లపై విహరిస్తాయి.

playక్రీడలు... ఒకప్పుడు చదువుల్లో ఇదొక భాగం. సైన్స్‌ క్లాస్‌, సోషల్‌ క్లాస్‌, తెలుగు క్లాస్‌ వున్నట్లుగానే ఆటలకు కూడా ఒక పిరియడ్‌ వుండేది. టైం టేబుల్‌ చివర్లో పిఇటి పిరియడ్‌ను విద్యార్థుల వ్యాయామానికి, వారి మధ్య ఆటల పోటీలు నిర్వహించడానికి ఉపయోగించేవాళ్ళు. విద్యార్థులు కూడా పాఠశాల టైం దాటినా మైదానంలోనే వుండి పొద్దుపోయే వరకు ఆటల్లో నిమగ్నమయ్యే వాళ్ళు. ఒకప్పుడు విద్యార్థులు చదువులకు ఎంతటి ప్రాధాన్యతనిచ్చేవాళ్ళో ఆటలకు కూడా అంతే ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు. చాలామంది స్పోర్ట్స్‌ కోటాలోనే సీట్లు, ఉద్యోగాలు సాధించేవాళ్ళు. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు కూడా విశాలమైన క్రీడా మైదానాలుండడంతో విద్యార్థులు సరదాగా ఆటలాడుకునేవాళ్ళు.

కాని, ఈ కాలంలో విద్యార్థులకు స్పోర్ట్స్‌ అంటే తెలిసేది కంప్యూటర్‌ గేమ్స్‌, సెల్‌ఫోన్‌ గేమ్స్‌! వాటినే ఆటలనుకునే స్థాయిలో విద్యార్థులున్నారు. దానికి కారణం తెల్లారింది మొదలు విద్యార్థుల బ్రతుకంతా చదువులు, మార్కులు, ర్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడమే.

ఇప్పటి చదువులు ఎంత నికృష్టంగా వున్నాయో చూస్తున్నాం. 70శాతం చదువులు ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థల్లోనే నడు స్తున్నాయి. ప్రభుత్వ జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ స్కూళ్లలో అన్ని వసతులు, విశాలమైన మైదానాలు, పిఇటి మాష్టార్లు వున్నా... ఇక్కడ విద్యార్థులకు కరువు. ఇప్పుడు సర్కార్‌ బళ్లలో చదివే వాళ్లు కూడా మార్కుల్లో ఎక్కడ వెనుకబడుతామోనని ఆటలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయ్యవార్లు కూడా పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం తగ్గితే అధికారులు తమ మీద విరుచుకు పడతారోననే భయంతో ఆడించడం కంటే చదివించడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్రీడా ప్రోత్సాహం అంతంతమాత్రంగానే వుంది.

ఇక ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థల సంగతి చెప్పాలా? ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆటలపాటల సంగతి దేము డెరుగు... వారి బ్రతుకులతోనే విద్యాసంస్థలు ఫుట్‌బాల్‌ ఆడుకుం టున్నాయి. ప్రైవేట్‌ బళ్లల్లో విద్యార్థి బ్రతుకు ఎలా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఉదయం 8గంటలకు చదువు అనే రుబ్బురోలులో వేసారంటే రాత్రి 8గంటలయితే గాని ఆ రోలు నుండి బయటకు తీయరు. రాత్రి స్కూల్‌ వదిలాక బయట కొస్తున్న పిల్లలను చూస్తుంటే యావజ్జీవ శిక్ష ముగించుకుని జైలు నుండి బయటకొస్తున్న ఖైదీల మాదిరే కనిపిస్తుంటారు. ఇలాంటి చదువుల రోబోలకు ఇక ఆటలు కూడానా? అసలు ఆడించడానికి ప్రైవేట్‌ స్కూళ్లలో క్రీడామైదానాలు ఎక్కడ వున్నాయి? 50 అంకణాలు, వంద అంకణాల స్థలాల్లో కూడా ఐదంతస్థుల కార్పొరేట్‌ బిల్డింగ్‌లు... వెలుతురు గాలి దూరని తరగతి గదుల్లో చదు వులు... ఒక వాలీబాల్‌ కోర్టునో, బ్యాడ్మింటన్‌ కోర్టునో ఏర్పాటు చేయాలంటేనే కనీసం 30అంకణాల స్థలం కావాలి... అంత స్థలమే వుంటే మనవాళ్ళు ఇంకో స్కూల్‌ బిల్డింగ్‌ కడతారు. చదువులు పూర్తిగా యాంత్రికమై, విద్యార్థులే రోబోలుగా మారిన ఈరోజుల్లో వారి జీవితాలలో ఇక క్రీడా వినోదాలన్నవి కాగితాలకే పరిమితం. కేవలం ఆగస్టు 29వతేదీ నాడు మొక్కుబడిగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter