sudhakarదయ చేసి వినండి... దయచేసి వినండి... మంత్రాలకు చింతకాయలు రాలవు... అని ఎందరు చెబుతున్నా వింటారా? వినరు? దయ చేసి బురిడీ బాబాలను నమ్మొద్దని మేధావులు మొత్తు కుంటుంటారు... అయినా వింటారా? వినరు! మోసం చేసేవాడికి మోసపోయే వాడెప్పుడూ లోకువే. మీరు కట్టిన డబ్బుకు 28రోజుల్లో రెట్టింపు ఇస్తామని ఓ భోగస్‌ కంపెనీ వాళ్ళు బోర్డు పెడితే తీసుకెళ్ళి లక్షలు లక్షలు కట్టారు. గ్రీన్‌ గ్లోరి అంటూ చైన్‌లింక్‌ స్కీం ద్వారా మీరు ఒకసారి డబ్బులు కడితే ఇక మీ ఇంటికి డబ్బుల వరదేనంటే... దానికీ కోట్లు కట్టారు. కొన్ని క్రిస్టియన్‌ సంస్థలు మనీ సర్క్యులేషన్‌ స్కీం అంటూ వందల కోట్ల రూపాయలకు జనం నెత్తిన టోపీ పెట్టాయి.

తాజాగా నెల్లూరు కేంద్రంగా అమాయక భక్తుల నెత్తిన ఓ బురిడీ బాబా టోపీ పెట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు మైపాడుగేటు సెంటర్‌లోని ప్రశాంత్‌నగర్‌లో సుధాకర్‌ మహరాజ్‌ ఆశ్రమం ఉంది. ఇతని పేరు సుధాకర్‌రావు. ఒకప్పుడు జడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడు. ఆ తర్వాత జడ్పీ ఛైర్మెన్‌లుగా వున్న చెంచలబాబు వద్ద, కాకాణి గోవర్ధన్‌రెడ్డిల వద్ద సి.సి.గా కూడా పనిచేశాడు. ఇలా ప్రభుత్వ ఉద్యోగంలో వున్నప్పుడే జాతకాలు గట్రా చూసేవాడు. భవిష్యత్‌ వాణి అంటూ ఏదేదో చెప్పేవాడు. ఇలా అతను ఒక బాబాగా, మహిమలున్న ఆథ్యాత్మిక వేత్తగా పేరు తెచ్చుకున్నాడు. అతనికి అమాయక, పిచ్చి భక్తులు ఏర్పడ్డారు. ఈ కాలంలో బాబా అంటే కొందరు రాజకీయ నాయకులు, కొందరు ఉన్నతాధికారులు వచ్చి పోతుండడం ఫ్యాషన్‌. ఈ సుధాకర్‌మహరాజ్‌ కూడా అలాంటి బ్యాచ్‌ను మెయింటెన్‌ చేయసాగాడు. బాగా చదువుకున్నోళ్ళే ఇలాంటి బాబాలను నమ్ముతుంటే, ఇక అంతంత మాత్రం జ్ఞానం వున్న సామాన్య ప్రజల పరిస్థితేంటి? వాళ్ళు కూడా ఈయన దగ్గర ఏవో మహిమలున్నాయని చెప్పి నమ్మసాగారు. ఆయన వద్దకు పోసాగారు. ఇలా పెరిగిన పిచ్చి భక్తులతో సుధాకర్‌ భక్తి వ్యాపారం మొదలుపెట్టాడు. ఇక్కడ నిత్యం హోమాలు, పూజలు నిర్వహించేవాళ్ళు. వచ్చిన వాళ్ళకు టిఫిన్‌, తిండి దండిగా పెట్టేవాళ్ళు. భక్తులు ఇక్కడే కొంత బెండ్‌ అయ్యేవాళ్ళు. గత ఏడాది డిసెంబర్‌ నుండి ఆశ్రమంలో 'నవనాత సంప్రదాయ శ్రీ దత్తాత్రేయ మహామంత్ర ఇష్టకామ్య మహాయాగం' మొదలుపెట్టారు. ఈ ముసుగులోనే మంత్ర పీఠికల పేరుతో మోసానికి పాల్పడ్డారు. వెయ్యి రూపాయలు పెట్టి ఒక మంత్రపీఠికను తీసుకెళ్ళి 12రోజుల లోపల తిరిగి తెచ్చిస్తే ఆశ్రమం వాళ్ళు 1400 రూపాయలు ఇస్తారు. ఇలా నెలలో రెండుసార్లు తీసుకెళితే పెట్టుబడి రెరడింతలవుతుంది. ఇంకేముంది పిచ్చి జనం ఎగబడ్డారు. పది కాదు, పాతిక కాదు, 50వేలు... ఇలా పెట్టుబడులు పెట్టి మంత్ర పీఠికలు తీసుకెళ్లేవాళ్ళు. 12రోజులకు మళ్ళీ తెచ్చిచ్చే వాళ్ళు. పెరిగిన వాళ్ళ పెట్టుబడికి తగ్గట్లుగా మళ్ళీ మంత్రపీఠికలు తీసుకెళ్ళే వాళ్ళు. ఇలా మంత్ర పీఠికలు తీసుకెళ్ళడమే కాని ఎవరూ డబ్బులు తీసుకోలేదు. చైన్‌లింక్‌ స్కీంలాగా భక్తుల నమ్మకాన్ని డబ్బుల రూపంలో మూటగట్టుకున్నారు. ఇటీవల వాసవి అనే మహిళ పెద్దపెద్ద సంచుల్లో ఆశ్రమం నుండి డబ్బును తరలించే ప్రయత్నం చేస్తుండగా భక్తులు అడ్డుకోవడంతో మోసం బయటపడింది. తన బండారం బయటపడడంతో సుధాకర్‌ బాబా పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతనిని ఆసుపత్రిలో చేర్చారు. డబ్బును తరలించడానికి ప్రయత్నించిన వాసవి అనే మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 250మంది బాధితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం స్కాం ఎన్ని కోట్లో ఇంకా లెక్కలు తేలాల్సివుంది. రోజురోజుకూ బాధితులు పెరుగుతున్నారు. చాలారోజుల క్రితమే ఈ భాగోతానికి స్కెచ్‌ వేసినట్లు సమాచారం. సుధాకర్‌బాబాతో పాటు ఓ మీడియా ప్రతినిధి, వాసవి అలాగే ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ కూడా ఈ పాపానికి వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. తాను పారిపోవడం విఫలం కావడంతో సుధాకర్‌బాబు గతిలేక పురుగులు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నిం చాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలోనే ఉండి హైకోర్టు ద్వారా బెయిల్‌ సంపాదించు కునే పనుల్లో ఉన్నాడు. ఈ భాగోతంలో కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్న నెల్లూరురూరల్‌ సిఐ శ్రీనివాసులురెడ్డి లోతుగా దర్యాప్తు నిర్వహిస్తూ ఈ భాగోతాన్నంతా బయటపెట్టేందుకు కృషి చేస్తున్నాడు. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు బాధితులు మాత్రం పోలీసు స్టేషన్‌ల ముందు చేరి తమకు న్యాయం చేయాలంటూ మొరపెట్టుకుంటున్నారు. అక్షర జ్ఞానంలేని అమాయకులు కొంచెం ఆశకుపోయే పేదలు ఇలాంటి దొంగ సన్నాసులను నమ్మారంటే అర్ధముంది. ప్రజాప్రతినిధులు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఉన్నత చదువులు చదివిన అధికారులు కూడా ఇలాంటి దొంగ బాబాలను నమ్మి ఫోటోలకు ఫోజులివ్వడం చూస్తుంటే అసలు అజ్ఞానం ఎవరిలో ఉందా అనే అనుమానం వస్తుంది! మొత్తానికి భక్తి ముసుగులో జనం అమాయకత్వంతో వ్యాపారం చేయొచ్చని ఈ సంఘటన ద్వారా తేటతెల్లమైంది.

bjpజిల్లాలో దుగరాజపట్నం పోర్టును నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల బీజేపీ జిల్లా నాయకులు ధర్నాలు గట్రా చేస్తున్నారు. ఇదెలా వుందంటే అన్నం పెట్టాల్సినవాడే అడుక్కుతిన్నట్లుగా వుంది. దుగరాజపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలంటూ వీళ్ళు చేస్తున్న డిమాండ్‌ విచిత్రంగా ఉంది.

చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక ఊరిలో బస్సులను ముందుగా నడపాలా? బస్టాండ్‌ను ముందుగా కట్టాలా? ప్రయా ణీకుల సంఖ్యను బట్టి బస్సులు నడుపు తారు. బస్సుల సంఖ్యను బట్టి బస్టాండ్‌ కడతారు. నెల్లూరుజిల్లాలో వున్న ఒక్క పోర్టుకే వ్యాపారం లేదు. అనుకున్నన్ని పరి శ్రమలు రాలేదు. వై.యస్‌. హయాంలో ఐరన్‌ వోర్‌ ఎగుమతి, పవర్‌ ప్రాజెక్టులకు బొగ్గు దిగుమతి బాగా వుండింది. పరి శ్రమలు బాగా వచ్చాయి. వ్యాపారం ఊపందుకుంటున్న సమయంలో వై.యస్‌. చనిపోవడం, జిల్లాలో పారిశ్రామిక ప్రగతి ఆగిపోవడం జరిగింది. 41బెర్త్‌లు లక్ష్యంగా మొదలైన కృష్ణపట్నం పోర్టు 13బెర్త్‌ల వద్దే ఆగిపోయింది.

ఎక్కువుగా పోర్టులు కట్టగానే పనై పోదు. పోర్టులో ఎగుమతులు, దిగుమతు లకు తగ్గట్లుగా వ్యాపారం ఉండాలి. పరి శ్రమలు రావాలి, మౌలిక వసతులు పెర గాలి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పారిశ్రా మికంగా నెల్లూరుజిల్లాకు ఏం ఒరిగింది. కోస్టల్‌ కారిడార్‌ అన్నారు. బకింగ్‌హోమ్‌ కెనాల్‌ పునరుద్ధరణ ద్వారా జలరవాణాకు మహర్ధశ అన్నారు. సిఇజడ్‌ అని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఏ ఒక్కటీ కార్య రూపం దాల్చలేదు. ముందు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినవి అన్నీ వస్తే ఆ తర్వాత పోర్టు ఒకటి కాదు, రెండు కట్టుకున్నా ఉపయోగముంటుంది.

cineకేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను ఎత్తేస్తే తమ ఆస్తుల విలువ పడిపోతుందని వారి భయం. రాష్ట్ర విభజన అనంతర పరిస్థితుల్లో కొందరు సినిమావాళ్లు సినీ పరిశ్రమను హైదరాబాద్‌ నుండి ఏపికి తరలించాలని డిమాండ్‌ చేశారు. అయితే హైదరాబాద్‌లో వేల కోట్ల ఆస్తులు పోగేసిన ఇద్దరు సినీ ప్రముఖులు మాత్రం ఆరునూరైనా హైదరాబాద్‌ నుండి సినీ పరిశ్రమను తరలించేది లేదంటూ స్టేట్‌ మెంట్లిచ్చారు. కేసీఆర్‌ అమాయకుడేం కాదు. విభజన ఉద్యమాలప్పుడు అక్కడున్న ఏపి ఉద్యోగులను వెళ్లగొట్టాడు. వ్యాపారస్థులకు పొగపెట్టాడు. కాని సినీపరిశ్రమ జోలికెళ్లలేదు సరికదా, 2వేల ఎకరాలలో సినీనగర్‌ కట్టిస్తానని హామీ కూడా ఇచ్చాడు. అతనికి తెలుసు... సినిమా గ్లామర్‌ ఫీల్డ్‌. హైదరాబాద్‌ అభివృద్ధిలో దానిపాత్ర అపరి మితం. 99శాతం సినిమా ఫీల్డ్‌లో ఉండేవాళ్లు ఆంధ్రావాళ్లే! వీళ్లంతా అనుకుంటే సినీపరిశ్రమను హైదరాబాద్‌ నుండి లాక్కొచ్చేయడం పెద్ద సమస్య కాదు. కానీ వాళ్లే హైదరాబాద్‌ను వదిలిరారు.

సినిమా పరిశ్రమలో పెద్దోళ్లకు లేకపోయినా చిన్నస్థాయి నటులు, నిర్మాతలకు ఏపిపై గాలిమళ్లింది. సినిమా పరిశ్రమను అంచెలంచెలుగా ఏపికి అందులోనూ సినిమాల నిర్మాణానికి అన్ని అవకాశాలున్న నెల్లూరు జిల్లాకు తీసుకురావాలనే అభిప్రాయం ఏర్పడింది. నెల్లూరుజిల్లా సినిమా షూటింగ్‌లకు బాగా అనుకూలమంటూ పలువురు సినీ పరిశ్రమ వ్యక్తులు ఇటీవల ప్రకటించివున్నారు కూడా! రాష్ట్ర విభజన తర్వాత ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు నెల్లూరుజిల్లా సినిమా పరిశ్రమకు చాలా అనుకూలమని, పరిశ్రమను అక్కడకు తరలించడానికి కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. అంతేగాక నెల్లూరుజిల్లా సరిహద్దులోని తడ ప్రాంతంలో స్టూడియో నిర్మాణానికి కూడా ఆయన ఆలోచన చేశారు.

తెలుగు సినీ పరిశ్రమను ఈరోజు కాకున్నా రేపైనా హైదరాబాద్‌ నుండి తరలించక తప్పదు. ఏపి వాళ్ళు హైదరాబాద్‌లో వుండి సినిమాలు తీసినంత కాలం తెలంగాణను అభివృద్ధి చేయడం తప్ప ఏపికి ఏమీ ఒరగదు. ఇకముందు హైదరాబాద్‌లో సినిమాలు తీయాలన్నా భారీ బడ్జెట్‌ వుంటే తప్పితే చిన్న సినిమాలు తీయలేరు. నెల్లూరుజిల్లాలో తక్కువ బడ్జెట్‌తో సినిమాలు పూర్తి చేసే అవకాశాలున్నాయి. మనకు పక్కనే చెన్నై వుంది. సినిమా నిర్మాణానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్‌, స్టూడియోలు, థియేటర్లు అన్నీ వున్నాయి. కాబట్టి నెల్లూరుజిల్లాలో ఇప్పటికిప్పుడు వీటిని ప్రత్యేకంగా నిర్మించాల్సిన అవసరం లేదు. చెన్నైలోనే అవసరమైన సినీ సాంకేతిక సిబ్బంది వున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో షూటింగ్స్‌కు అవసరమైన సముద్ర తీరప్రాంతం, పోర్టులు, రైల్వేలైన్‌లు, కొండలు, లోయలు, ప్రకృతి సౌందర్యాలు, పల్లె సీమలు... ఇలా అన్నీ అందుబాటులో వున్నాయి. చెన్నై - నెల్లూరుల మధ్య తడను ప్రధాన కేంద్రంగా చేసుకుంటే నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడులోని లొకేషన్లను కూడా సినిమా షూటింగ్‌లకు వాడుకోవచ్చు. ఇలా సినీ పరిశ్రమకు ఎంతో అనువైన నెల్లూరుజిల్లాలో సినీ పరిశ్రమను నెలకొల్పాలన్న ఆలోచనకు ప్రభుత్వం కూడా సహకరిస్తే ఆ కల సాకారం కావచ్చు.

Page 1 of 20

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఉదయగిరిలో... పాత పోరా? కొత్త నీరా?
  జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో 9అసెంబ్లీలది ఒక దారి అయితే ఉదయగిరి అసెంబ్లీది మాత్రం ఇంకో దారి! మెట్టప్రాంతమైనప్పటికి ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. పార్టీ ప్రభంజనాలు, నాయకుల పట్ల సానుభూతి వంటి వాటికంటే కూడా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల…
 • సుధాకర్‌ బాబా(య్‌).. కొంప ముంచాడు బాబోయ్‌
  దయ చేసి వినండి... దయచేసి వినండి... మంత్రాలకు చింతకాయలు రాలవు... అని ఎందరు చెబుతున్నా వింటారా? వినరు? దయ చేసి బురిడీ బాబాలను నమ్మొద్దని మేధావులు మొత్తు కుంటుంటారు... అయినా వింటారా? వినరు! మోసం చేసేవాడికి మోసపోయే వాడెప్పుడూ లోకువే. మీరు…
 • చంద్రుడి డైరక్షన్ లో పవన్ యాక్షన్ థ్రిల్లర్ జె.ఏ.సి
  రాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ…

Newsletter