cineకేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను ఎత్తేస్తే తమ ఆస్తుల విలువ పడిపోతుందని వారి భయం. రాష్ట్ర విభజన అనంతర పరిస్థితుల్లో కొందరు సినిమావాళ్లు సినీ పరిశ్రమను హైదరాబాద్‌ నుండి ఏపికి తరలించాలని డిమాండ్‌ చేశారు. అయితే హైదరాబాద్‌లో వేల కోట్ల ఆస్తులు పోగేసిన ఇద్దరు సినీ ప్రముఖులు మాత్రం ఆరునూరైనా హైదరాబాద్‌ నుండి సినీ పరిశ్రమను తరలించేది లేదంటూ స్టేట్‌ మెంట్లిచ్చారు. కేసీఆర్‌ అమాయకుడేం కాదు. విభజన ఉద్యమాలప్పుడు అక్కడున్న ఏపి ఉద్యోగులను వెళ్లగొట్టాడు. వ్యాపారస్థులకు పొగపెట్టాడు. కాని సినీపరిశ్రమ జోలికెళ్లలేదు సరికదా, 2వేల ఎకరాలలో సినీనగర్‌ కట్టిస్తానని హామీ కూడా ఇచ్చాడు. అతనికి తెలుసు... సినిమా గ్లామర్‌ ఫీల్డ్‌. హైదరాబాద్‌ అభివృద్ధిలో దానిపాత్ర అపరి మితం. 99శాతం సినిమా ఫీల్డ్‌లో ఉండేవాళ్లు ఆంధ్రావాళ్లే! వీళ్లంతా అనుకుంటే సినీపరిశ్రమను హైదరాబాద్‌ నుండి లాక్కొచ్చేయడం పెద్ద సమస్య కాదు. కానీ వాళ్లే హైదరాబాద్‌ను వదిలిరారు.

సినిమా పరిశ్రమలో పెద్దోళ్లకు లేకపోయినా చిన్నస్థాయి నటులు, నిర్మాతలకు ఏపిపై గాలిమళ్లింది. సినిమా పరిశ్రమను అంచెలంచెలుగా ఏపికి అందులోనూ సినిమాల నిర్మాణానికి అన్ని అవకాశాలున్న నెల్లూరు జిల్లాకు తీసుకురావాలనే అభిప్రాయం ఏర్పడింది. నెల్లూరుజిల్లా సినిమా షూటింగ్‌లకు బాగా అనుకూలమంటూ పలువురు సినీ పరిశ్రమ వ్యక్తులు ఇటీవల ప్రకటించివున్నారు కూడా! రాష్ట్ర విభజన తర్వాత ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు నెల్లూరుజిల్లా సినిమా పరిశ్రమకు చాలా అనుకూలమని, పరిశ్రమను అక్కడకు తరలించడానికి కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. అంతేగాక నెల్లూరుజిల్లా సరిహద్దులోని తడ ప్రాంతంలో స్టూడియో నిర్మాణానికి కూడా ఆయన ఆలోచన చేశారు.

తెలుగు సినీ పరిశ్రమను ఈరోజు కాకున్నా రేపైనా హైదరాబాద్‌ నుండి తరలించక తప్పదు. ఏపి వాళ్ళు హైదరాబాద్‌లో వుండి సినిమాలు తీసినంత కాలం తెలంగాణను అభివృద్ధి చేయడం తప్ప ఏపికి ఏమీ ఒరగదు. ఇకముందు హైదరాబాద్‌లో సినిమాలు తీయాలన్నా భారీ బడ్జెట్‌ వుంటే తప్పితే చిన్న సినిమాలు తీయలేరు. నెల్లూరుజిల్లాలో తక్కువ బడ్జెట్‌తో సినిమాలు పూర్తి చేసే అవకాశాలున్నాయి. మనకు పక్కనే చెన్నై వుంది. సినిమా నిర్మాణానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్‌, స్టూడియోలు, థియేటర్లు అన్నీ వున్నాయి. కాబట్టి నెల్లూరుజిల్లాలో ఇప్పటికిప్పుడు వీటిని ప్రత్యేకంగా నిర్మించాల్సిన అవసరం లేదు. చెన్నైలోనే అవసరమైన సినీ సాంకేతిక సిబ్బంది వున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో షూటింగ్స్‌కు అవసరమైన సముద్ర తీరప్రాంతం, పోర్టులు, రైల్వేలైన్‌లు, కొండలు, లోయలు, ప్రకృతి సౌందర్యాలు, పల్లె సీమలు... ఇలా అన్నీ అందుబాటులో వున్నాయి. చెన్నై - నెల్లూరుల మధ్య తడను ప్రధాన కేంద్రంగా చేసుకుంటే నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడులోని లొకేషన్లను కూడా సినిమా షూటింగ్‌లకు వాడుకోవచ్చు. ఇలా సినీ పరిశ్రమకు ఎంతో అనువైన నెల్లూరుజిల్లాలో సినీ పరిశ్రమను నెలకొల్పాలన్న ఆలోచనకు ప్రభుత్వం కూడా సహకరిస్తే ఆ కల సాకారం కావచ్చు.

beedaతెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మూడోసారి కూడా బీద రవిచంద్రనే ఎన్ని కయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నుండి ప్రకటన రావడమే మిగిలివుంది. పార్టీ అధ్యక్షుడిగా బీద రవిచంద్రను పక్కన పెట్టాల్సిన పరిస్థితి గాని, కొత్తవాళ్లకు అధ్యక్ష స్థానం అప్పగించాల్సిన అవసరం గాని లేకపోవడంతో మరోసారి బీదకు జిల్లా దేశం బాధ్యతలు తప్పకపోవచ్చు. ఒకవేళ బీద రవిచంద్ర నాకు వద్దని మొండికేస్తే మాత్రం కొత్తవారికి ఛాన్సుంటుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అధ్యక్ష పదవిని ఆయన ఎందుకు వదులుకుంటాడు.

జిల్లాలో చంద్రబాబు కులసమీకరణలను బాగానే పాటించాడు. ఓట్ల పరంగా మెజార్టీ సంఖ్యాకులైన కాపుల నుండి మంత్రిగా నారాయణ వున్నాడు. అయితే ఇది రాజకీయంగా రెడ్ల ప్రాబల్యం వున్న జిల్లా! మొదట మంత్రివర్గంలో ఈ జిల్లా నుండి రెడ్లకు స్థానం దక్కలేదు. దీంతో పార్టీలో రెడ్లను అణగదొక్కుతున్నారనే ఒక ప్రచారం హల్‌చల్‌ చేసింది. అయితే చంద్రబాబు రాజకీయ మేధావి. ఏ టైంలో ఏం చేయాలో ఆయనకు తెలుసు. కరెక్ట్‌ సమయంలో జిల్లా నుండి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా రెడ్లకు ప్రాధాన్యతనివ్వడం లేదన్న ప్రచారానికి తెరదించారు. సోమిరెడ్డికి మంత్రి పదవిచ్చి పార్టీలోని రెడ్లలో వున్న అసంతృప్తిని తొలగించారు. అదే సమయంలో పార్టీలో బీసీలూ కీలకమే! ఈ వర్గానికి చెందిన బీద రవిచంద్రకు మంత్రిపదవి కాలింగ్‌ బెల్‌ కొట్టి, ఆయన లేచి వచ్చే లోపే సోమిరెడ్డి ఇంట్లో దూరినట్లయ్యింది. మంత్రి పదవి ఆశ ఆయనకు బాగానే అంటించి తీరా నీరు గార్చారు. ఇక మంత్రి స్థాయి పదవి జిల్లాలో ఇంకేముంటుంది. జిల్లా పార్టీ పెత్తనం ఇవ్వడమే బీసీలను గౌరవించడమవుతుంది. కాబట్టి అధ్యక్ష పోస్ట్‌లో రవిచంద్రనే కొనసాగిస్తారనడంలో సందేహం లేదు.

sunసూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక మే నెలలో ఎలా వుంటాయోననే ఆందోళన జనంలో మొదలైంది. ఉదయం 10గంటలుపైన రోడ్ల మీదకు రావాలంటే జనం భయపడుతున్నారు. నిన్న మొన్నటిదాకా ఉదయం, సాయంత్రం వేళల్లో వాతావరణం కొంచెం చల్లబడేది. ఇప్పుడు అది కూడా లేదు. ఉక్కపోత భరించలేనంతగా మారింది. వడదెబ్బకు వృద్ధులు, పిల్లలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ, వ్యవసాయ, రోడ్లు నిర్మాణ కార్మికులు ఎండల్లో మగ్గుతూ పనులు చేస్తున్నారు. ఇప్పుడు కాస్తున్న ఎండలను చూస్తూ మేలో కాయబోయే ఎండలను తలచుకుంటే జనంకు దడ మొదలవుతుంది.

Page 1 of 19

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter