police officeమనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా పంజాగుట్ట పోలీసుస్టేషన్‌ను ప్రకటించడం తెలిసిందే! పోలీసుస్టేషన్‌లను పాడుబడిపోయిన బంగ్లాలు, భవనాలలో చూసిన మనకు కొత్తగా కట్టిన ఇవి అద్భుతంగా కనిపిస్తాయి. ఇలాంటి అద్భుతాలే ఇప్పుడు నెల్లూరు నగరంలోనూ వెలిసాయి.

నెల్లూరుజిల్లా పోలీసు శాఖ హైటెక్‌ సొగసులద్దుకోనుంది. ఇప్పటివరకు జిల్లా పోలీసు కార్యాలయం బ్రిటీష్‌ హయాంలో కట్టిన భవనంలో కొనసాగింది. కాని ఇప్పుడు జిల్లా పోలీసు కార్యాలయం సరికొత్త భవనంలోకి మారబోతోంది. డికెడబ్ల్యూ కాలేజీ పక్కనే, గతంలో పోలీసు క్వార్టర్స్‌ వున్న ప్రాంతంలో నూతన పోలీసు కార్యాలయాన్ని ఎంతో అందంగా, హైటెక్‌ కంపెనీ తరహాలో నిర్మించారు. దీనిని ఈ నెలలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. అలాగే పోలీస్‌గ్రౌండ్‌ పక్కనే నెల్లూరు రూరల్‌ పోలీసు కార్యాలయాన్ని ఎంతో అధునాతనంగా నిర్మించారు. నెల్లూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద నాలుగో నగర పోలీసుస్టేషన్‌ను కూడా కార్పొరేట్‌ ఆఫీసులాగా కట్టిపెట్టారు. ఇవన్నీ ఒకేరోజు ప్రారంభించబోతున్నారు.

ramakrishnaజిల్లా ఎస్పీగా పిహెచ్‌డి రామకృష్ణ బాధ్యతలు చేపట్టి ఈ నెల 26వ తేదీకి ఏడాదైంది. అప్పట్లో జిల్లా ఎస్పీగా వున్న విశాల్‌గున్నీని తూర్పుగోదావరి జిల్లాకి బదిలీ చేసి కడపజిల్లా ఎస్పీగా వున్న రామకృష్ణను నెల్లూరుజిల్లాకు బదిలీ చేశారు. రామకృష్ణ డైరెక్ట్‌ ఐపిఎస్‌ కాదు... కన్‌ఫర్ట్‌ ఐపిఎస్‌. కాని డైరెక్ట్‌ ఐపిఎస్‌ల కంటే కూడా పవర్‌ఫుల్‌ అధికారి!

ఉన్నతమైన వ్యక్తిత్వం, సంప్రదాయం, విలువలు పాటించే కుటుంబం నుండి వచ్చాడు. పోలీసు అధికారిగా ఆ విలువలు, ఆ వ్యక్తిత్వాన్ని కొనసాగించాడు. కడప జిల్లాలో నాయకులు బాగా నాటు రకం. అధికారపార్టీ నాయకులైతే అధికారుల మీద బాగానే పెత్తనం చెలాయిస్తుంటారు. అలాంటి కడపనాయకులకే చుక్కలు చూపిం చొచ్చాడు. మంత్రులు, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ళు రామకృష్ణపై అక్కడ పని చేయలేదు. ఆయన అక్కడ నుండి బదిలీ అయ్యి వచ్చాకే కడప నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.

ఎస్పీగా ఈ ఏడాదిలో రామకృష్ణ ఏం చేసాడు? ఏం సాధించాడు? దీనిని లోతుగా విశ్లేషిస్తే ముందుగా తనకు తాను నిజాయితీగా వుండే ఐపిఎస్‌ అధికారిని ఈ జిల్లా ప్రజలు చూడగలిగారు. తనకొచ్చే జీతం, అలవెన్సులు తప్ప పరుల సొమ్ము పైసా ముట్టని అధికారి రామకృష్ణ. ఇది మనం చూడకపోవచ్చు. 24గంటలూ ఆయనను చూసే ఆయన సిబ్బందే చెప్తున్న పచ్చినిజం. పోలీసు శాఖలో నూరుశాతం నిజాయితీ పనితీరును తేలేకపోయినా ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం గట్టిగా చేసాడు. వచ్చీ రాగానే తన శాఖనే సంస్కరించుకున్నాడు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులను విఆర్‌లో వుంచడం, ఛార్జి మెమోలు ఇవ్వడంతో దడ పుట్టించాడు. ఆయా స్టేషన్‌లలో ఏళ్ళ తరబడి పాతుకుపోయిన సిబ్బందికి స్థానచలనం కలిగించాడు. సిబ్బంది బదిలీలలోనూ పారదర్శకత పాటించి ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా చేసాడు.

ఇక డ్యూటీ పరంగా చూస్తే జిల్లాలో ఎన్నో కుటుంబాలలో చిచ్చుపెట్టిన బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపాడు. బెట్టింగ్‌లకు పాల్పడ్డ వాళ్ళను వెదికి వెదికి బొక్కలో తోయిం చాడు. జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసాడు. దీని కోసం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌నే రంగంలోకి దించి ఎర్ర స్మగ్లర్లపై కేసులు తిరగతోడాడు. నెల్లూరుజిల్లా నుండి యధేచ్ఛగా జరుగుతున్న సిలికా, ఇసుక అక్రమ రవాణాపై కఠిన వైఖరి అవలంబించాడు. ఈ విషయంలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్ళను సైతం లెక్క చేయలేదాయన! చైన్‌ స్నాచింగ్‌, సైబర్‌ నేరాలను అరికట్టేందుకు పోలీసు గస్తీని ముమ్మరం చేసారు. నెల్లూరు నగరంలో ఏళ్ళతరబడి విసిగిస్తున్న ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం ఐల్యాండ్‌లను కుదించడమే కాకుండా 'యూటర్న్‌' లను అమలులోకి తెచ్చారు. ఇళ్ళ దోపిడీలను అరికట్టడానికి హౌస్‌ లాకింగ్‌ మానిటరింగ్‌ సిస్టంను ప్రవేశపెట్టారు. సి.సి. కెమెరాల ఏర్పాటు ద్వారా నేర నియంత్రణ, ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పోలీసులపై ఒత్తిడి తగ్గించేందుకు వారికీ వారాంతపు సెలవును అమలులోకి తెచ్చారు. రాజకీయంగా ఒకటి అరా వివాదాలు తప్పితే జిల్లా ఎస్పీగా రామకృష్ణ ఏడాదిలోనే సమర్ధుడిగా గుర్తింపు పొం దారు. చాలాకాలం తర్వాత జిల్లా ప్రజలు ఒక మంచి ఎస్పీని చూస్తున్నారు. ఆయనను బదిలీ చేయాలంటూ ఇటు అధికారపార్టీ అటు ప్రతిపక్ష పార్టీ రెండూ గగ్గోలు పెడుతున్నాయంటే ఆయన నిజాయితీకి ఇదే ప్రత్యక్ష తార్కాణం.

anam jayaజిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే పార్టీలో వున్నవారిని పారిపోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అనే పదవి ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నగర కన్వీనర్‌ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చాడు. తన పరిధిలో ఆయన పార్టీ కార్యక్రమాలను హుషారు గానే నిర్వహించాడు. పార్టీ తరపున ఆయన చేసిన ఉద్యమాలు, మోటార్‌బైక్‌ల ర్యాలీలు గుర్తించి ఇటీవల నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మెన్‌ పదవిని కట్టబెట్టారు. పార్టీలో జోడు పదవులు వుండకూడదనే నిబంధనతో ఆయనను నగర కన్వీనర్‌ పదవి నుండి తప్పుకోమనే అవకాశా లున్నాయి. ఈ పదవిని పార్టీలో ఇంకొకరికి ఇవ్వడం ద్వారా ఒక నాయకుడినైనా సంతృప్తి పరచవచ్చనే ఉద్దేశ్యం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ పదవికి ఆనం జయకుమార్‌ రెడ్డి పేరు వినిపిస్తోంది.

ఆనం బ్రదర్స్‌లో మూడో వాడైన ఆనం జయకుమార్‌రెడ్డి 2014లో ఎన్నికల అనం తరం తెలుగుదేశంలో చేరాడు. తన తర్వాత తన అన్నలైన ఆనం వివేకా, ఆనం రామనారాయణరెడ్డిలు తెలుగుదేశంలో చేరిన్పటికీ ఆయన వారితో కలవలేదు. టీడీపీలో చేరినప్పటినుండి ఆదాల ప్రభాకర్‌రెడ్డినే అనుసరిస్తున్నాడు. రేపు కూడా ఆదాల ఎటుంటే ఆయనా అటే వుంటాడు. ఆదాలను పార్టీ వదలకుండా కాపాడుకోవాలనుకుంటున్న టీడీపీ అధిష్టానం పార్టీలో ఆయనకు ప్రాధాన్యత పెంచుతోంది. ఈ క్రమంలోనే ఆదాలకు అత్యంత సన్నిహితుడైన ఆనం జయకు నగర కన్వీనర్‌ బాధ్యతలను అప్పగించే అవకాశాలు లేకపోలేదు.

Page 1 of 53

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter