fire accident2016 పోతూ పోతూ నెల్లూరుజిల్లాలో ఓ 17 కుటుంబాలలో చీకటి నింపి పోయింది. ఇక కొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుండగా, కొందరికి కొత్త సంవత్సరాన్ని చూసే ఆశ, అవకాశం లేకుండా చేసింది. అనునిత్యం ప్రజల సంతోషాలలో భాగమైన బాణాసంచాను తయారుచేసే కార్మికుల బ్రతుకుల్లో చీకటిని చిమ్మింది.

పోలీసుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం, కొందరు వ్యాపారుల దురాశ... వెరసి ఒక పెను ప్రమాదానికి దారి తీసాయి. 2016 డిసెంబర్‌ 31వ తేదీన నెల్లూరుజిల్లా చరిత్రపుటలో పెద్దప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు సమీపంలోని పెన్నా పొర్లుకట్ట వద్ద వున్న బాణాసంచా గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, గురువారానికి ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ మరో 8మంది మరణించారు. మిగిలినవారు 80శాతం గాయాలతో నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నారు. మొదట బాధితులను పెద్దాసు పత్రికే తీసుకెళ్లారు. కాని అక్కడ వైద్య సదుపాయాలు ఎంత ఘోరంగా అఘో రిస్తున్నాయో తెలిసిందే కదా! అక్కడ వారికి సరైన వైద్యసదుపాయం అందించే అవకాశం లేకపోవడంతో జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు చొరవ తీసుకుని వారిని వెంటనే నారాయణ ఆసుపత్రికి తర లించారు. ప్రమాదం సంభవించింది అనుమతి లేని బాణాసంచా గోడౌన్‌లో! 50గజాల గోడౌన్‌లో 17మంది కార్మికులు పని చేస్తుండడమే ఇక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది. యం.వి.రమణయ్యశెట్టి అనే అతను ఈ బాణాసంచా గోడౌన్‌ నిర్వ హిస్తుండగా భాస్కర్‌ అనే గుమస్తా దీని వ్యవహారాలు చూస్తుంటాడు. నూతన సంవత్సర వేడుకలతో పాటు, సంక్రాంతి సంబరాలకు బాణాసంచా అమ్మకాలు ఎక్కువుగా వుంటాయనే ఉద్దేశ్యంతో కూలీ లను పెట్టి బాణాసంచా తయారు చేయిస్తు న్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నిర్వాహకుడు భాస్కర్‌ అక్కడే వున్నాడు. ప్రమాదం తీవ్రత ఎక్కువుగా ఉండడంతో అతను పరారుకాగా తర్వాత పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఎక్కువమంది యువకులే...

ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఎక్కువమంది పాతికేళ్ళలోపు యువకులే ఉండడం విచారకరం. నూనూగు మీసాల వయస్సులోనే వారికి నూరేళ్ళు నిండాయి. అందరూ గిరిజన యువకులే! ఇతర పనులకు పోవడంకంటే ఇక్కడైతే నీడపట్టున కూర్చుని పనిచేయవచ్చనే బాణాసంచా గోడౌన్‌లకు వస్తుంటారు. రోజు కూలీ కూడా రూ.500లు ఇస్తుండడంతో ఇక్కడ పనిచేయడానికి ఆసక్తితో వస్తారు. కడుపు నింపుకోవ డానికి ఏదో ఒక పని అని వస్తే... ఆ పనే వీరి పాలిట మృత్యువుగా మారింది.

ఎస్‌బి హెచ్చరికలు బేఖాతరు...

దీపావళి సమయంలో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు నెల్లూరు సమీపంలోని అన్ని బాణాసంచా గోడౌన్‌లలో తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని బాణాసంచా గోడౌన్‌లను గుర్తించి, వాటిని తొలగించాల్సిందిగా ఆయా పోలీస్‌స్టేషన్‌లకు సమాచార మిచ్చారు. ఆ గోడౌన్‌లలో ప్రమాదం జరిగిన భాస్కర్‌ గోడౌన్‌ కూడా వుంది. అయితే మూడో నగర పోలీసులు దీనిపై పెద్దగా స్పందించలేదు. వూరికే హెచ్చరించి వదిలేసారని తెలిసింది. ఇప్పుడు అదే గోడౌన్‌లో ప్రమాదం సంభవించడంతో మూడోనగర పోలీసుల మెడకు చుట్టుకుంది. జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అప్పటి త్రీటౌన్‌ ఎస్‌ఐ రామకృష్ణను సస్పెండ్‌ చేయడంతో పాటు ప్రస్తుత సిఐ రామారావు సస్పెండ్‌కు సిఫారసు చేస్తూ ఐజికి లేఖ వ్రాసారు.

మొత్తానికి అధికారులు, పోలీసుల వైఫల్యం వల్ల, విధి నిర్వహణలో ఉదాసీనత వల్ల ప్రజలు ఎంతగా మూల్యం చెల్లిస్తున్నారనడానికి చితికి చిధ్రమైన ఈ బడుగుజీవుల బ్రతుకులే ఓ ఉదాహరణ.

commiనెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ వెంకటేశ్వర్లు బదిలీ వ్యవహారం అధికార పార్టీలోనే విభేదాల చిచ్చును రాజేసింది. నెల్లూరు నగరంలో ఏం జరిగినా నాకు తెలియాలి అన్నది మేయర్‌ అజీజ్‌ వ్యవ హారశైలి. నెల్లూరుకు నేను కింగ్‌ను అను కుంటున్నాడాయన! కాగా మంత్రి నారాయణ ఈ రాష్ట్రానికి చంద్రబాబు తర్వాత నేనే కింగ్‌ను అనుకుంటున్నాడు. కాబట్టే మేయర్‌తో పని లేకుండానే అతనికి తెలియకుండానే కమిషనర్‌ వెంకటేశ్వర్లును బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ బదిలీ తనకు తెలియకుండానే జరిగిపోవడం అజీజ్‌కు పెద్ద అవమానంగా అనిపించింది. ఇటీవల రోడ్లు ఊడ్చే మిషన్‌ను కూడా తాను లేకుండానే మంత్రి ప్రారంభించినప్పుడు కూడా అజీజ్‌ అవమానంగా ఫీలయ్యాడు. తన గొప్పను చాటుకోవడానికి అదే మిషన్‌కు రెండోసారి ఓపెనింగ్‌ నిర్వహిం చాడు. ఇప్పుడు కమిషనర్‌ బదిలీ కూడా ఆయనకు మనస్థాపం, మంత్రి మీద కోపం కలిగించింది. వెంటనే చినబాబు లోకేష్‌ను సంప్రదించి కమిషనర్‌ బదిలీకి తాత్కాలిక బ్రేక్‌ వేయించారు. ఇది తెలిసి మంత్రికి మండింది. నా ఉత్తర్వులకే అడ్డం చెబు తావా అంటూ మళ్లీ బదిలీ చేయించి తన సత్తా చూపాడు నారాయణ!

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter