naluguకన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను చెవికెక్కించుకునే చాలామంది ప్రవాసభారతీయులు గాని, స్వదేశంలో వున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు గాని తమ పుట్టిన గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలలో ఎన్నో సేవా కార్యక్రమాలను, అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నారు.

ఈ కోణంలో చూస్తే నెల్లూరు నగరానికి అధికార కోణంలోగాని, రాజకీయ కోణంలోగాని ఇప్పుడు నలుగురు దత్తపుత్రులున్నారు. ఈ నలుగురు కూడా నెల్లూరుతో అనుబంధం ముడిపడి వున్నోళ్లే! కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వున్న వెంకయ్యనాయుడు నెల్లూరీయుడే! రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి నారాయణ నెల్లూరోడే! ఇక మేయర్‌ పోస్ట్‌లో ఎవరున్నా నెల్లూరు బ్రాండే! వీరికి కొత్తగా నాలుగో వ్యక్తి జత చేరాడు. ఆయనే 'నుడా' ఛైర్మెన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి. నెల్లూరు నగరాభివృద్ధికి నాలుగు స్థంభాలు. ఇక్కడ నిధులిచ్చే వాళ్లిద్దరు అయితే నెల్లూరు నగరాభివృద్ధికి ప్రణాళికలు అమలు పరచాల్సిన వాళ్ళు మిగతా ఇద్దరు. నెల్లూరు మేయర్‌కు కార్పొరేషన్‌ పరిధిలో వచ్చే ఆదాయం జీతాలకు, ఖర్చులకు చాలదు. ఇక నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆస్కారం ఎక్కడుంటుంది. కొత్తగా నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి ఏర్పాటయ్యింది. తొలి ఛైర్మెన్‌గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నియమించ బడ్డాడు. నెల్లూరు నగరం మీద బాగా అవగాహన వున్న నాయకుడు. నెల్లూరు కోసం ఏదన్నా చేయాలన్న తపన ఉన్నోడు. కాకపోతే వీళ్లకు నిధుల లభ్యత చాలా తక్కువ.

అందుకని 'నుడా' ఛైర్మెన్‌ అయినా, నెల్లూరు మేయర్‌ అయినా కేంద్రమంత్రి వెంకయ్య, రాష్ట్రమంత్రి నారాయణలతో సమన్వయం కావాలి. నెల్లూరుకు ఏం కావాలి, ఏం చేయాలి, నెల్లూరులో రోడ్లను ఎలా వెడల్పు చేయాలి, నెల్లూరురోడ్ల మీద ట్రాఫిక్‌ తగ్గించాలంటే ఇంకేం చేయాలి, నెల్లూరును క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా మార్చడానికి ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలి. ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడానికి ఏ స్కీంలు అమలు చేయాలి, మురికి వాడలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏఏ అభివృద్ధి పనుల కోసం ఎవరెవరిని సంప్రదించాలి, ఎవరెవరిని అందులో భాగస్వాము లను చేయాలనే అంశాలపై ఒక రిపోర్ట్‌ను తయారుచేసుకోవాలి. అందులో ముందు వెంకయ్య ద్వారా సాధించుకోవాల్సినవి, మంత్రి నారాయణ ద్వారా తెచ్చుకోవాల్సినవి విభజించుకోవాలి. వారిని ఎప్పటి కప్పుడు సంప్రదించుకుంటూ అభివృద్ధికి డిజైన్‌లను ఏర్పరచుకుంటూ ముందుకు పోతే నెల్లూరు రూపురేఖలను కొంతవరకన్నా మార్చగలరు!

kota srinivasనెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా) తొలి ఛైర్మెన్‌గా తెలుగుదేశం నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మెన్‌గా శీనయ్యతో పాటు డైరెక్టర్‌లుగా మరో ముగ్గురిని నియమించారు. కావలి నియోజకవర్గం నుండి బీద మస్తాన్‌రావు అనుచరుడు పాలడుగు రంగారావును, నెల్లూరు నగరానికి చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు షేక్‌ ఖాజావలి, సూళ్ళూరుపేట నియోజకవర్గం నుండి బీజేపీకి చెందిన సన్నారెడ్డి దయాకర్‌రెడ్డిలను డైరెక్టర్‌లుగా నియమించారు. అలాగే వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు 'నుడా'లో సభ్యులుగా వ్యవహరించనున్నారు.

సగం నెల్లూరుజిల్లాతో పాటు చిత్తూరుజిల్లాలోనూ రెండు మండలాలలో విస్తరించిన 'నుడా' ఛైర్మెన్‌ పదవి కోసం జిల్లా తెలుగుదేశం పార్టీ నుండి పలువురు నాయకులు పోటీ పడ్డారు. తమవంతు ప్రయత్నాలు చేశారు. కాని, యువరత్న నందమూరి బాలకృష్ణ మాత్రం తన పట్ల అత్యంత భక్తివిశ్వాసంతో ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి ఈ పదవి ఇవ్వాలని చంద్రబాబు వద్ద పంతం పట్టాడు. చంద్రబాబు సొంత నిర్ణయమై వుంటే ఈ పదవి వచ్చేది కాదు. ఆ సంగతి శీనయ్యకు కూడా తెలుసు. బాలకృష్ణ పట్టుబట్టాడు. 2014 ఎన్నికల్లో నెల్లూరు నగరం సీటు శీనయ్యకే అనుకున్నారు. అప్పుడు కూడా బాలకృష్ణ సిఫార్సు చేసాడు. అయితే చంద్రబాబు, బాలయ్యను ఒప్పించి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డికి సీటిచ్చాడు. కాని 'నుడా' ఛైర్మెన్‌ విషయంలో మాత్రం బాలకృష్ణ పట్టు వీడలేదు. చంద్రబాబుకు ఇక తప్పలేదు.

కోటంరెడ్డి శీనయ్య రాజకీయ ప్రస్థానం మొదలైంది కాంగ్రెస్‌లో. ఎన్‌ఎస్‌యుఐ నాయకుడి స్థాయి నుండి కాంగ్రెస్‌లో ఎదిగాడు. కాంగ్రెస్‌లో వున్నంతకాలం కూడా సొంతపార్టీ వాళ్ళతో ఎప్పుడూ పోరాటమే! అటు నేదురుమల్లితోనూ, ఇటు ఆనంతోనూ పడేది కాదు. కాంగ్రెస్‌లో ఆనం ఆధిపత్య పోకడలను నిరసిస్తూ ఆయన 2000 సంవత్సరంలో తెలుగుదేశంలో చేరాడు. అప్పటి నుండి ఇప్పటి దాకా కూడా పార్టీ అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా పార్టీ కార్యక్రమాలను మాత్రం చురుగ్గా నిర్వహించేవాడు. పార్టీ ప్రతిపక్షంలో వున్న పదేళ్లు కూడా నగరంలో పార్టీ కార్యక్ర మాలను అంతా తానే అయ్యి నిర్వహించాడు. పార్టీని నమ్ముకుని పనిచేసినందుకు ఆయనకు తగిన న్యాయమే జరిగింది.

ఇక నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన పోస్ట్‌ ఇది. కేంద్రంలో పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు గాని, రాష్ట్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన నారాయణ గాని ఇద్దరూ నెల్లూరోళ్ళే! వాళ్ళిద్దరి సహకారంతో కోటంరెడ్డి శీనయ్య 'నుడా' పరిధిలోని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాల్సివుంది.

summerఅసలే ఎండా కాలం..మే నెల అంటేనే మండే నెల. ఈ నెలలో ఎండలు కాదు.. నిప్పులు కురుస్తుంటాయి. అందులోనూ రోహిణి కార్తె, రోహిణిలో రోళ్ళు పగిలి పోతాయని సామెత. అంటే, ఎండదెబ్బ ఎంత తీవ్రంగా వుంటుందో అర్ధమవు తుంది. మే ప్రారంభం నుంచి జిల్లాలో రోజురోజుకు ఎండలు మరింతగా పెరిగి పోతూనే వున్నాయి. ఒకప్పట్లో 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతకే హడలిపోయే నెల్లూరు జనం, ఇప్పుడు 45 నుంచి 48 దాకా ఎండ తీవ్రత పెరిగిపోతుండడం చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 7.30 నుంచి సాయంత్రం దాకా ఎండల భగభగ..రాత్రి 8 గంటల దాకా ఒకటే సెగ. పగలంతా మండే ఎండ..రాత్రయితే ఉక్కపోత.. జనం అల్లాడి చస్తున్నారు. వేడి గాలుల ధాటికి వడలిపోయి.. ఎంతో మంది ముసలీముతకా జనం వడదెబ్బతో హరీమంటున్నారు. బతుకు తెరువు కోసం తప్పనిసరై ఇంత ఎండల్లోనూ ఇళ్ళలోంచి బయటకు వచ్చి పనులు చేసుకునే కూలీలు, శ్రమజీవుల పరిస్థితి మరింత దయనీ యంగా వుంటోంది. నీడ పట్టున వున్నప్ప టికీ ముసలిప్రాణులు ఎండ దెబ్బకు తట్టు కోలేక ప్రాణాలు విడుస్తున్నారు. మరీ ఇంత ఎండలు నెల్లూరులో ఇటీవలి కాలంలో ఎప్పుడూ చూడలేదు. రోడ్లపక్కల చెట్లన్నీ ఇష్టమొచ్చినట్లు నరికిపారేయడం, అడవుల్ని నరికేయడం, సామాజిక వనాల్ని విస్తరిం చుకోలేకపోవడం..వంటివన్నీ మనం చేసుకుంటున్న తప్పిదాలే. అంతెందుకు, ఇంత పెద్ద నగరంలో ప్రధాన రోడ్ల పక్కన కనీసం నిల్చోడానికి నీడ కూడా లేకుండా చెట్లన్నిటినీ నాశనం చేసేయడం.. అసలు పచ్చదనమన్నది కనిపించకుండా పోవడం.. ఇదంతా మనం చేజేతులా తెచ్చుకుంటున్న అవస్తే అన్నది అందరికీ తెలిసిందే. దీంతో పర్యావరణం పరిస్థితి అంతా తారుమారైపోతోంది. పర్యావరణం కాపాడుకుందాం.. మొక్కలు పెంచు కుందాం అంటూ చేసే నినాదాలు కేవలం కంటి తుడుపు కోసమేనా?.. వందల సంవత్సరాల నాటి వృక్షాలను కూలగొట్టేసి చిన్ని చిన్ని మొక్కలు నాటుకున్నందువల్ల ప్రయోజనం ఎప్పటికి చేకూరుతుంది?.. మొక్కలు నాటుకోవడం అన్నది పర్యా వరణానికి ప్రాణప్రదమైన విషయమన్నది ఎవరూ కాదనలేని సత్యం. అది అందరి కర్తవ్యం కూడా. అయితే, మొక్కలు నాటడం పేరుతో అందినకాడికి నిధులను స్వాహా చేసేసి, నాటిన మొక్కలకి కనీసం దోసెడు నీళ్ళు కూడా పోయకుండా వాటిని ఎండబెట్టేయడం మనం చూస్తూనే వున్నాం. జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఇదే దుస్థితి. కేవలం నామమాత్రపు పథకాలు..ఊకదంపుడు ఉపన్యాసాలు పర్యావరణాన్ని మార్చగలవా?..మానవుడి ఈ అరాచక ప్రవృత్తికి పర్యావరణమే తారుమారైపోతోంది. ఇంక ప్రకృతిని నిందించి ఏం ప్రయోజనం?..

ఒకప్పుడు ముక్కారు పండే నేల.. ఇప్పుడు ఎడారి?..

గతంలో నెల్లూరుసీమలో ప్రతి ఏటా పుష్కలంగా వానలు కురిసి ముక్కారు (ఏడాదికి మూరు కార్లు) పంటలు పండేవి. రాష్ట్రంలోనే మంచి పంటభూములున్న ప్రాంతంగా నెల్లూరు ప్రసిద్ధి. ముక్కారు పంటలకు, రుచికరమైన ధాన్యానికి కోశాగారం వంటి సింహపురి సీమ ఇప్పుడు రానురాను ఎడారిగా మారుతోంది. పచ్చగా కళకళలాడే పంటపొలాలన్నీ ఇటీవలి కాలంలో రూపుమారిపోతు న్నాయి. మరోవైపు వేలాది ఎకరాలు పంట భూములు వానలు లేక బీడుభూములుగానే మిగిలిపోతున్నాయి. జిల్లాలోనే అనేక గ్రామాల్లో, మారుమూల పల్లెల్లో తాగేం దుకు చుక్క మంచినీరు దొరక్క జనం విలవిలలాడిపోతున్నారు. మూగజీవాలకు పిడికెడు గడ్డి, గుక్కెడు నీరు దొరక్క అవి పడే బాధలకు అంతే లేదు. చివరికి అడవు ల్లోనూ నీళ్ళు లేక, ఊర్లమీదకు వస్తున్న మూగజీవాలను కుక్కలు వెంటాడి చంపే పరిస్థితి. జిల్లాలో అనేక మండలాలు కరువుతో వున్నా పట్టించుకునే దిక్కు లేదు. ఎంత దయనీయమైన స్థితి వున్నా ప్రభుత్వం నిర్లిప్త ధోరణితో వుండబట్టే వడదెబ్బకు పోయేవాళ్ళు పోతూనే వున్నారు. మండే ఎండల్లో జనం అవస్తలు పడుతూనే వున్నారు.

వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం

జిల్లాలో గత పదిరోజులుగా ఎండలు మరీ విపరీతమైపోయాయి. మండే సూర్యుడి భగభగలతో ప్రాణాలు అవిసి పోతున్నాయి. ఎండల తీవ్రత 44 డిగ్రీలు దాటుతుంటే ముసలి ప్రాణాలు బతికి బట్టకట్టడమంటే మాటలా?..గత వారం పదిరోజుల్లోనే ఈ వడదెబ్బకు దాదాపు వందమందికి పైగానే ప్రాణాలు కోల్పోయి వుంటారని ఒక అంచనా. అయితే, వీటిని నిర్ధారించి బాధిత కుటుంబాలకు తగు సాయం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న దేమీ లేదు. ప్రకృతి విపత్తులకు మృతి చెందినవారి కుటుంబాలను ఆదుకో పోవడం ఎంత దారుణం?...కాకి అరు స్తూనే వుంటుంది..కరవాడ ఎండుతూనే వుంటుందన్న సామెతగా ఎవరెంతగా మొత్తుకుంటున్నా తమ బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజల ఆవేదన. ఇకనైనా ప్రభుత్వం, జిల్లా అధికారగణం మానవతా హృదయంతోనైనా స్పందించి, వడదెబ్బ మృతుల కుటుంబాలను ఆదు కోవాల్సి వుంది. గ్రామాల్లో ప్రజల దాహార్తి తీర్చేందుకు చర్యలు చేపట్టాల్సి వుంది.

Page 1 of 37

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
  కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
 • తీరంకు సిఇజడ్‌ హారం
  డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
 • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
  నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
 • నేలటూరువాసులకు సివిఆర్‌ జ్యోతులు
  ఈ నెల 20వ తేదీన కృష్ణపట్నం పోర్టు సివిఆర్‌ జ్యోతి పథకంలో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులోని 150మంది మత్స్యకార కుటుంబాల వారికి ఉచితంగా గ్యాస్‌స్టౌలను అందించారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, వాతావరణ మార్పు శాఖ అధికారులు దీపక్‌ శ్యామ్యూల్‌, భూమత్‌…
 • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
  ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…

Newsletter