azizనెల్లూరు మేయర్‌ అజీజ్‌ వైఖరిపై తెలుగుదేశం నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక అజీజ్‌ను కొనసాగిస్తే నగరంలో తెలుగుదేశం మనుగడ సాగించడం కష్టమనే భావం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అజీజ్‌ ఒంటెత్తు పోకడల మూలంగా నెల్లూరు నగరం, రూరల్‌ నియోజకవర్గాల్లో కొన్ని వర్గాల ప్రజలు పార్టీకి దూరమవుతున్నారని నాయకులు వాపోతున్నారు.

ముఖ్యంగా మేయర్‌ అజీజ్‌ వైఖరితో నగరంలో పార్టీ నష్టపోతుందని ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌ను అవినీతికి నమూనాగా మార్చారు. సామాన్య ప్రజలకు పైసలివ్వందే పనులు కావడం లేదు. టౌన్‌ప్లానింగ్‌లో పనులు చేయించుకోవాలంటే తలప్రాణం తోకలోకి వస్తోంది. కార్పొరేషన్‌లో ప్రతిపనికి ఒక రేటు కట్టేసారు. మేయర్‌ అజీజ్‌ సోదరుడు జలీల్‌ కేంద్రంగా అవినీతి సామ్రాజ్యం నడుస్తోందనే ఆరోపణలున్నాయి. అలాగే ప్రతి విభాగానికి నెలకు ఇంత అని అవినీతి సొమ్ము టార్గెట్‌ పెట్టారని తెలుస్తోంది. ఇక పింఛన్‌లు, ఋణాలు వంటివాటి మంజూరు విషయంలో అజీజ్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు, ఋణాల పంపిణీ విషయంలో నగర, రూరల్‌ ఇన్‌ఛార్జ్‌లు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి నారాయణ చేసిన సూచనలను కూడా అజీజ్‌ లెక్కపెట్టలేదు. నగరంలో కార్పొరేషన్‌ పరంగా పెద్దగా అభివృద్ధి పనులు కూడా జరగడం లేదు. కనీసం చెత్తా, చెదారం పనులు కూడా సక్రమంగా చేయడం లేదు. ఇప్పుడు అజీజ్‌ తెలుగుదేశం మేయర్‌ క్రింద లెఖ్ఖ! కార్పొరేషన్‌ జమానాలో జరిగే అవినీతి అక్రమాలన్నీ కూడా తెలుగుదేశం ఖాతాలోనే పడుతున్నాయి. ఇదంతా తెలుగుదేశంకు నష్టం కలిగించే ప్రక్రియే! అజీజ్‌ వైకాపా మేయర్‌గానే ఉండుంటే తెలుగుదేశంపై ఈ ప్రభావం ఉండేది కాదు.

నెల్లూరు మేయర్‌ పనితీరు వల్ల నగరం, రూరల్‌ నియోజకవర్గాలలో పార్టీకి కొంచెమన్నా ఉపయోగం ఉండాలి. కాని, అజీజ్‌ చర్యలతో పార్టీ నష్టపోతోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలుండొచ్చు. అసెంబ్లీ ఎన్నికల దాకా అజీజ్‌నే మేయర్‌గా కొనసాగిస్తే ఈ రెండు నియోజకవర్గాలలోనూ పార్టీ దెబ్బతింటుంది. పార్టీకి కార్పొరేషన్‌లు, మున్సిపాల్టీలు, జడ్పీలకన్నా కూడా అసెంబ్లీలు ముఖ్యం. నగరం, రూరల్‌లో తెలుగుదేశం బలహీనంగా వుంది. గత ఎన్నికల్లో ఈ రెండు సీట్లు కోల్పోయింది కూడా! ఈసారి రెండింటిలో ఒక్కటన్నా గెలుచుకోవాలి. ఈసారి కూడా ఎన్నికలు గట్టిపోటీ మధ్యే వుంటాయి. కాబట్టి ప్రతి అసెంబ్లీ మీద పెద్ద కసరత్తే చేయాల్సి వుంటుంది. కాని ఇక్కడ అజీజ్‌ వైఖరి వల్ల ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో కొన్ని వర్గాలవారు పార్టీకి దూరమవుతున్నారు. అట్లాగని అజీజ్‌ మూలంగా పార్టీకి ముస్లింలు దగ్గరయ్యారా అంటే అదీ లేదు. ఈసారి తెలుగుదేశం ఎమ్మెల్యే టిక్కెట్‌ అజీజ్‌కు ఇచ్చినా కూడా ముస్లింలు వైకాపా వైపే నిలుస్తారు. ఆయా ప్రాంతానికి మిగిలిన వర్గాలను దూరం చేసుకోవడమెందుకనే ఆలోచనలో తెలుగుదేశం అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించే విధంగా ఆయన వైఖరి ఉంది. ఇదే విధంగా కొనసాగిస్తే, ఆయనను మేయర్‌ కుర్చీ నుండి పంపించే ప్రయత్నం కూడా జరగొచ్చు.

tdp leadersబండికి ముందు గడ్డి మోపును కడితే... ఎద్దులు ఆ గడ్డిని తినాలన్న ఆత్రుతతో పరుగెడుతుంటాయి. బండి స్పీడ్‌గా ముందుకు పోతుంటుందేగాని ఎద్దులకు మాత్రం ఆ గడ్డి అందదు. బండిని వేగంగా పోనివ్వడానికి, ఎద్దులను పరుగెత్తించడానికి ఇదొక లాజిక్‌ అన్నమాట! చంద్రబాబునాయుడు నామినేటెడ్‌ పదవుల విషయంలో ఈ లాజిక్‌ను బాగానే ఫాలో అవుతున్నట్లుగా వుంది.

2014లో చంద్రబాబు సిఎం అయినప్పటి నుండి ఇప్పటి వరకు రెండు సంక్రాంతులు, రెండు ఉగాదులు, మూడు వినాయక చవితులు, రెండు దీపావళి, రెండు దసరా పండుగలు వచ్చాయి. మూడో దసరా పండుగ కూడా రాబోతోంది. ప్రతి పండక్కి మంత్రి పదవులు ఇస్తారనో, నామినేటెడ్‌ పదవులను ఇస్తారనో వార్తలు వస్తున్నాయి. ఆ టైంలో తెలుగుతమ్ముళ్లు కోటి ఆశలతో ఎదురుచూస్తుంటారు. యధాఫలంగా పదవుల పందేరం వాయిదా పడుతుంటుంది.

ఈసారి దసరాకు కూడా నామినేటెడ్‌ పందేరం అన్న ప్రచారం వచ్చింది. జిల్లాలోని తెలుగుతమ్ముళ్లంతా మళ్ళీ ఒకసారి నోర్లు తెరచి ఎదురుచూసారు. కిలారి వెంకటస్వామినాయుడు అన్న ఆశాజీవికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ పదవిని ఇచ్చారు. ఇక పదవులను ఆశిస్తున్న తమ్ముళ్ల లిస్టు బాగానే వుంది. పార్టీ కోసం చొక్కాలు చించుకుని, సొంత డబ్బులు పోగొట్టుకున్న వారిలో డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, దేశాయిశెట్టి హనుమంతరావు వంటి వారున్నారు. అలాగే పార్టీని నమ్ముకుని కిందా మీదా పడుతున్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అనూరాధ, వేనాటి రామచంద్రారెడ్డి వంటి వారు కూడా నామి నేటెడ్‌ పదవులు ఆశిస్తున్నారు. దసరా తర్వాతే నామినేటెడ్‌ పదవుల పంపకం ఉంటుందని మళ్ళీ వార్త ఒకటి వదిలారు. ఇక నామినేటెడ్‌ పదవు లిచ్చినా వెలగబెట్టేది గట్టిగా రెండేళ్లే! ఆ తర్వాత ఎలక్షన్‌లు! రాజెవరో...? రైతెవరో...? ఇంకోసారి నామి నేటెడ్‌ పదవుల పంపకం వాయిదా పడితే తమ్ముళ్లు వాటిపై ఆశలని పూర్తిగా వదులుకునే అవకాశముంది.

anam brosసూది దూరే సందిస్తే చాలు... దబ్బళాన్ని కాదు పెద్ద దూలాన్నే దూర్చేసే టాలెంట్‌ వున్న పొలిటికల్‌ ప్రొఫెసర్లు ఆనం సోదరులు. కాంగ్రెస్‌లో వున్నప్పుడు నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిలాంటి కొమ్ములు తిరిగిన రాజకీయ యోధుడినే మడతపెట్టిన ముదుర్లు ఆనం బ్రదర్లు.

ఇప్పుడు తెలుగుదేశంలోనూ చాపక్రింద నీరులా చల్లగా పాకే ప్రయత్నం మొదలైంది. ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను ఆనం రామనారాయణ రెడ్డికి అప్పగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే! అయితే వాళ్లు ఆత్మకూరు వరకే ఆగిపోతారా? అన్నది ప్రశ్న! అక్కడితో ఆగిపోతే వాళ్ల పెత్తనం ఏముంది. జిల్లాలోని పది ఎమ్మెల్యే లింగాలలో ఆయనా ఓ లింగం. కాని అక్కడితో వాళ్లు ఆగే ప్రసక్తే లేదు. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన నెల్లూరునగరంలో రాజకీయంగా పట్టు లేకపోతే ఆనం ప్రాబల్యం దెబ్బతింటుంది. గత 20ఏళ్లుగా వాళ్లు నెల్లూరుపై ఆ విధమైన పెత్తనం సాగించారు. ఈ రెండున్నరేళ్ల పాటు అధికారం లేక, నెల్లూరుపై పట్టు లేక ఆ బాధను అనుభవించారు. రాజకీయంగా గాని, అధికారికంగా గాని జిల్లాపై పట్టు సాధించాలంటే నెల్లూరు నగరంలో రాజకీయంగా బేస్‌ వుండాలి. అందుకే నెల్లూరు సిటీ, రూరల్‌లో ఒక సీటును వాళ్లు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక దశలో నెల్లూరు సిటీకి ఆనం వివేకాను ఇన్‌ఛార్జ్‌గా పెట్టి రూరల్‌కు మంత్రి పి.నారాయణను ఇన్‌ఛార్జిగా పెట్టాలని ప్లాన్‌ వేసుకున్నారు. అయితే అది సక్సెస్‌ కాలేదు. ఇప్పుడు ఆత్మకూరుతో పాటు నెల్లూరు సిటీని కూడా

వాళ్లు గట్టిగా కోరుతున్నారు. అయితే చంద్రబాబు ఇంకా హామీ ఇవ్వలేదు. ముందు ఆత్మకూరు చూడండి, నెల్లూరుసిటీపై అందరితో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. కాని భవిష్యత్‌లో నెల్లూరు సిటీని కూడా ఆనంకే అప్పగించే అవకాశాలు లేకపోలేదు. సిటీ అభ్యర్థిగా వివేకా తనయుడు ఏ.సి.సుబ్బారెడ్డిని రంగంలోకి దించాలన్నది ప్లాన్‌. ఇప్పుడే నెల్లూరు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తే పార్టీలో అసంతృప్తి వస్తుందని, నిదానంగా నెల్లూరును ఆనంకు సెట్‌ చేయొచ్చని చంద్రబాబు ఆలోచన. 20ఏళ్ల పాటు జిల్లాలో ఆనం రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టింది నెల్లూరు నగరంలో వివేకా మున్సిపల్‌ ఛైర్మెన్‌గానో, ఎమ్మెల్యేగానో

ఉంటుండబట్టే! అలాంటి నెల్లూరు నగరాన్ని వాళ్లు వదులుకుంటారా!?

Page 1 of 5

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • న(వ)మో భారత్‌
  భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter