mantaluఒకప్పుడు సి.వి.శేషారెడ్డి... ఆ తర్వాత ఆదాల ప్రభాకర్‌రెడ్డి... ఇప్పుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి... గత పాతికేళ్ళ కాలంలో తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి ప్రత్యర్థులు మారారంతే... సర్వేపల్లి నియోజకవర్గం కేంద్రంగా సాగే రాజకీయ యుద్ధం మాత్రం ఆగడం లేదు. సోమిరెడ్డి ఎవరితోనూ యుద్ధం ఆపడం లేదు. సరికదా ప్రత్యర్థి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై తన యుద్ధాన్ని మరింత ముమ్మరం చేసాడాయన.

2014 ఎన్నికల్లో సర్వేపల్లి నుండి వైసిపి అభ్యర్థిగా కాకాణి, టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డిలు పోటీ చేయడం, కాకాణి కొద్దిమెజార్టీతో గెలవడం తెలిసిందే! ఈ ఎన్నికలకు ముందు సోమిరెడ్డి, కాకాణిలు వేర్వేరు పార్టీలలో వున్నప్పటికీ ఎలాంటి రాజకీయ శత్రుత్వం ఉండేది కాదు. కాని 2014 ఎన్నికల్లో ప్రత్యర్థులు కాబట్టి ఎన్నికల తర్వాత కూడా ఆ రాజకీయ వైరం కొనసాగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సర్వేపల్లి రాజకీయాలను హీటెక్కిస్తూ వచ్చారు. ఇలా వేడెక్కిన రాజకీయాలు 2016 సంవత్స రాంతంలో కీలక మలుపుతిరిగాయి. రాజకీయ పోరాటం వ్యక్తిగత పోరాటంగా మారింది. వ్యక్తిగత విమర్శలకు దిగారు. భూకబ్జాలు, ఆస్తుల గురించి ఆరోపణలు చేసుకున్నారు. ఈ పరంపరలోనే 2016 డిసెంబర్‌లో కాకాణి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ... సోమిరెడ్డికి సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌ దేశాలలో వేలకోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. అంతే కాదు, విదేశాలలో వున్న బ్యాంకు అకౌంట్లు అంటూ కొన్ని బ్యాంకుల పాస్‌పుస్తకాలను, లావాదేవీలు జరిపారంటూ కొన్ని పత్రాలను చూపించారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేరుతో ఇంకో పాస్‌పోర్టు వుందంటూ పాస్‌పోర్టును, ఆయన ఆయా దేశాలకు వెళ్లాడంటూ అందులో పొందుపరచిన వివరాలను వెల్లడించారు. మీడియాలో ఇది చూసి సోమిరెడ్డికే మైండ్‌ బ్లాకయ్యింది. నాకు తెలియకుండా విదేశాలలో నాకు వందలకోట్ల ఆస్తులు ఎక్కడనుండి వచ్చాయబ్బా అనుకుని డైలమాలోపడ్డారు. ఏదేమైనా కాకాణి తనపై చేసిన ఆరోపణల విషయంలో నిజాలు నిగ్గుతేల్చాలని ఆయన నెల్లూరురూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, పోలీసులు తీగ లాగితే డొంకంతా కదలడం తెలిసిందే!

చిత్తూరుజిల్లాకు చెందిన చిరంజీవి అలియాస్‌ మణిమోహన్‌ అనే వ్యక్తి సృష్టించి ఇచ్చిన నకిలీ పాస్‌పోర్టు, బ్యాంకుల పాస్‌బుక్‌లు, ఇమిగ్రేషన్‌ పత్రాలను నమ్మి కాకాణి అప్పుడు తన గోతిలో తానే పడ్డాడు. నెల్లూరురూరల్‌ పోలీసులు 2017 జనవరిలోనే చిరంజీవి అలియాస్‌ మణిమోహన్‌ను అరెస్ట్‌ చేయడంతోనే సోమిరెడ్డి విదేశీ ఆస్తుల స్టోరీ అంతా తుస్‌ అని తేలిపోయింది. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను కాకాణిపై నెల్లూరురూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును విచారించిన పోలీసులు కాకాణిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయడం తెలిసిందే! గత ఏడాది 36వారాలపాటు ఆయన పోలీసుస్టేషన్‌కు వెళ్ళి సంతకం చేసొచ్చిన దాఖలాలు కూడా వున్నాయి.

అయితే ఇక్కడితో కూడా వీళ్ళ మధ్య పోరు ఆగలేదు. ఇటీవలకాలంలో కూడా సోమిరెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని, సిబిఐ ద్వారా విచారణ జరిపించి వాటి బండారం బయటపెట్టాలంటూ కాకాణి డిమాండ్‌ చేశాడు. ఈ దశలో సోమిరెడ్డి వెనక్కి తగ్గలేదు. తనకు విదేశాలలో వేలకోట్ల ఆస్తులున్నాయని అబద్దపు ప్రచారం చేసి, తన పరువుకు నష్టం కలిగించినందుకు 5కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ కాకాణిపై నెల్లూరుజిల్లా సివిల్‌ కోర్టులో సెక్షన్‌ 26 ఆర్డర్‌-7 రూల్‌ క్రింద పరువునష్టం దావా వేసారు. అంటే వీరి మధ్య రాజకీయ పోరాటం ఇక నుండి న్యాయపోరాటంగా మారిందన్నమాట. ఎలాగూ ఈ ఏడాదిలోనే ఎలక్షన్స్‌ వచ్చే అవకాశాలున్నాయి. ఇక సెగ తగ్గే అవకాశం లేదు. ఎలక్షన్‌ దాకా వీరిమధ్య ఈ మంటలు పెరగడమే కాని, ఆరడం అంటూ ఉండదు.

somi kandlకండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 13వ తేదీన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ వచ్చే సంవత్సరం ఆఖరుకల్లా జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్ట్‌ లన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. సంగం, నెల్లూరు బ్యారేజీలను గడువులోగానే పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కృష్ణా నీటిని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ గుండా సోమశిలకు తీసుకొచ్చి కండలేరుకు తర లిస్తున్నామని, కృష్ణా నుండి తరలించే నీటిని మరో 5 టీఎంసీలకు పెంచుతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో నదుల అనుసంధానం వేగంగా జరుగు తోందని, వృధాగా పోతున్న గోదావరి జలాలను ఒడిసి పట్టి పెన్నాకు తరలించే భగీరథ ప్రయత్నం జరుగుతుందని, ఈ ప్రయత్నం పూర్తయితే ఈ జిల్లాలో సాగు నీటికి, తాగునీటికి కొరత వుండదని మంత్రి చెప్పారు.

ఆశయం నెరవేరింది

కండలేరు ఎడమకాలువ గట్టు ఎత్తిపోతల పథకం పూర్తిగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కృషి ఫలితమేనని చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా 30వేల ఎకరాలకు సాగునీళ్ళు అందించ వచ్చని గుర్తించిన ఆయన 2015లో ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించి ఈ పనికి శంకుస్థాపన చేయించారు. అంతేకాదు, వేగంగా పనులు పూర్త య్యేలా పర్యవేక్షించారు. ఇచ్చిన మాట ప్రకారం దానిని రైతులకు నిర్ణీత గడువులోపే అందించగలిగారు. ఆయన కృషితో సర్వేపల్లి, వెంకటగిరి నియోజక వర్గాల్లోని వేలాది ఎకరాలకు నీళ్ళందాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, తిరుపతి ఎంపి వి.వరప్రసాద్‌, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్‌కుమార్‌, మాజీమంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పరసా రత్నం, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ కిలారి వెంకటస్వామి నాయుడు పాల్గొన్నారు.

som rajఏ పదవీ లేనప్పుడే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బిజీగా వుండేవాడు. అల్లీపురంలోని ఆయన ఇల్లు గాని, ఆదిత్యనగర్‌లోని క్యాంప్‌ ఆఫీసు గాని సందర్శకులతో కిటకిటలాడుతుండేది. సోమిరెడ్డి బావిలాంటోడు. అక్కడకు వెళితే నీళ్ళు తాగొచ్చనే ఆశ వుంటుంది. అదే సముద్రం నిండా నీళ్ళున్నా తాగడానికి పనికిరావు. కొందరు నాయకులు సముద్రం లాగా కనిపిస్తున్నా ఎందుకూ పనికిరారు. కాబట్టే జనం అక్కడికి పోరు. అల్లీపురంలో ఇంటికిపోయినా, ఆదిత్యనగర్‌లో ఆఫీసుకు వెళ్లినా ఖచ్చితంగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పలుకరిస్తాడని, సమస్య వింటాడని, వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడుతాడనే గ్యారంటీ వుంది. ఆ నమ్మకమే ప్రజలను ఆయన ఆఫీసువైపు నడిపిస్తుంటుంది. 2014 ఎన్నికల తర్వాత ఏ పదవీ లేనప్పుడే ప్రజల మధ్య బిజీగా వున్న లీడర్‌ అతడు. ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఆపై మంత్రి అయ్యాడు. అతనిపై ప్రజల ఆశలు, ఆకాంక్షలు పెరిగాయి. ఆయన వద్దకు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజలూ పెరిగారు. దీనికితోడు రాష్ట్రంలో ఎక్కడ ఎలక్షన్‌లు వచ్చినా, పార్టీ పరంగా ఏదన్నా సమస్య వచ్చినా, ప్రతిపక్ష వైకాపా మీద విమర్శల దాడి చేయాలన్నా తెలుగుదేశంకు వున్న బుల్లెట్‌లలో ఈయన ఒకడు. ఈమధ్య పార్టీ పనులకు కూడా బాగానే వాడుతున్నారు. దీంతో తాను ఇన్‌ఛార్జ్‌గా వున్న సర్వేపల్లి నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నాడు. అయినా కూడా జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు కంటే కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వుండడంలో ఆయన చాలా బెటర్‌. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు తాను అందుబాటులో లేకున్నా వారి పనులు ఆగకూడదని, 24I7 వారి సేవలో వుండాలని చెప్పి తన రాజకీయ వారసుడిగా కొడుకు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని రంగంలోకి దించాడు. 2014 ఎన్నికలప్పుడే సర్వేపల్లిలో తన తండ్రి కోసం రాజగోపాల్‌రెడ్డి పూర్తిస్థాయిలో కష్టపడ్డాడు. ఆ తర్వాత కూడా సర్వేపల్లి రాజకీయాలలో అనుక్షణం వుంటున్నాడు. పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. కార్యకర్తలకు అందుబాటులో వుంటున్నాడు. పార్టీ చేపట్టిన 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో చురుకుగా కొనసాగిస్తున్నారు. ప్రతిరోజూ నాలుగైదు వందల గడపలు తొక్కుతూ, ప్రజలను అభిమానంగా పలుకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నాడు ఈ సోమిరెడ్డి వారసుడు.

Page 1 of 11

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
    ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
  • అమ్మో... దొంగల ముఠా
    కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter