ramayapatnamవిభజన హామీలు అమలు చేయాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు తీవ్రతరమవుతున్న తరుణంలో రామాయపట్నం పోర్టు అంశం మళ్ళీ తెరమీదకొచ్చింది. విభజన హామీలలో నెల్లూరు జిల్లా వాకాడు మండలంలోని దుగరాజపట్నం పోర్టు ఒకటి. యూపిఏ ప్రభుత్వం చివరి ఘడియల్లో ఈ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయించాలని అప్పటి తిరుపతి ఎంపీ చింతా మోహన్‌ తీవ్రంగా ప్రయత్నించాడు. అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత రక్షణ పరంగా 'ఇస్రో' అభ్యంతరాలు, పులికాట్‌ సరస్సు పర్యావరణానికి ముప్పు రావచ్చనే నివేదికలతో ఈ పోర్టు నిర్మాణంపై అనుమానాలు కమ్ముకున్నాయి. ఒక దశలో భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టి కూడా నిలిపేసారు.

మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో విభజన హామీలను నెరవేర్చలేదన్న అంశం రగులుకొంది. వీటిలో దుగరాజపట్నం పోర్టు కూడా వుంది. అయితే దుగరాజపట్నం వద్ద పోర్టు నిర్మాణంపై అభ్యంతరాలున్నాయని, ప్రత్యామ్నాయ పోర్టును పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పడంతో ఇప్పుడు రామాయపట్నం మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. ప్రకాశం, నెల్లూరుజిల్లాల సరిహద్దులో వున్న రామాయపట్నం వద్ద పోర్టు నిర్మించాలని కావలి ప్రాంత నాయకులు, అలాగే, ఒంగోలు ఎంపి వై.వి.సుబ్బారెడ్డి గతంలోనూ ఆందోళనలు చేసి వున్నారు. కావలి నుండి రామాయపట్నం వరకు పాదయాత్రలు కూడా చేశారు. అప్పటి కేంద్రమంత్రి, ఇప్పటి ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు దృష్టికి కూడా రామాయ పట్నం అంశాన్ని తీసుకెళ్లారు. దుగరాజపట్నం పోర్టుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని కేంద్రమే ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు రామాయపట్నంపై ఆశలు మొలకెత్తుతున్నాయి.

రామాయపట్నం పోర్టు వస్తే జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన కావలి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పారిశ్రామికాభివృద్ధి అంతా కూడా నెల్లూరుకు దక్షిణం వైపునే కేంద్రీకృతమైంది. నెల్లూరుకు ఉత్తరాన ఇఫ్కో సెజ్‌ పెట్టినా అది సక్సెస్‌ కాలేదు. ఇప్పుడిప్పుడే అక్కడి సెజ్‌లో పరిశ్రమలు వస్తున్నాయి. ఇక దగదర్తి వద్ద ఎయిర్‌పోర్టు మంజూరు కావడం తెలిసిందే! దీనికి తగ్గట్లుగా రామాయపట్నం పోర్టు కూడా వస్తే నెల్లూరు - కావలిల మధ్య వడివడిగా అభివృద్ధి అడుగులు పడతాయని ఈ ప్రాంతవాసుల ఆశ!

babuఆయన వేగంగా నడుస్తాడు... ఆయన వేగంగా పని చేస్తాడు... ఆయన కదలికలు వేగంగా వుంటాయి. ఆయన ఆలోచనలు వేగంగా వుంటాయి. ఏపిని అన్ని రంగాలలో నెంబర్‌వన్‌లో వుంచాలన్నది ఆయన తాపత్రయం. ఏపిని ఆయన ఎక్కడికో తీసుకుపోవా లనుకుంటాడు... కాని ఈ రాష్ట్రం అక్కడిదాకా పోదు... ఇక్కడే వుంటుంది. కాబట్టే ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనుక బడిపోయింది. ఆయన వేగంగా ముందుకెళ్ళబట్టే దేశంలోనే ధనిక సీఎంల జాబితాలో నెంబర్‌ వన్‌ ర్యాంకును సాధించాడు. ఆ విధంగా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను మొదటి స్థానంలో నిలపలేకపోయినా అత్యధిక సంపన్నుల సీఎంల జాబితాలో తాను మాత్రం మొదటి స్థానంలో నిలిచాడు.

ఇటీవల ఏడిఆర్‌ అనే సంస్థ నిర్వ హించిన సర్వేలో 177కోట్ల ఆస్తులతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు దేశం లోని 31మంది సీఎంలలో టాపర్‌గా నిలిచాడు. త్రిపుర సీఎం మాణిక్‌సర్కార్‌ చివరి స్థానాన్ని దక్కించు కున్నాడు. రాష్ట్ర విభజనతో ఏపి ఆర్ధికంగా దెబ్బతింది. ప్రజల ఆదాయ ప్రమాణాలు పడిపోయాయి. ఈ సమయంలో చంద్రబాబు సంపద మాత్రం పెరిగింది. ఈ కిటుకేదో ప్రజలకు చెబితే వాళ్ళు ఆయన మార్గాన్నే అనుసరిస్తారు కదా! ఆస్తులపరంగా సీఎం నెంబర్‌వన్‌లో వుండి, అభివృద్ధిపరంగా రాష్ట్రం వెనుకబడిపోతే అది చంద్రబాబుకే నామోషీ అవుతుంది కదా!

pkరాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ జేఏసీ నాయకుడు కోదండరామ్‌ రాష్ట్రసాధన లక్ష్యంగా పోరాడితే సమై క్యాంధ్ర జేఏసీ నాయకుడు అశోక్‌బాబు ఉద్యమాన్నే తాకట్టుపెట్టడం చూసాం.

ప్రత్యేకహోదా కోసం, విభజన హామీల అమలు కోసం జేఏసీని ఏర్పాటు చేసినట్లు పవన్‌ కళ్యాణ్‌ చెబుతున్నారు. జేఏసీ కోసం పార్టీనిపెట్టి ఇక రాజకీయా లలో పోరాడలేనని చేతులెత్తేసిన జయ ప్రకాశ్‌ నారాయణను, మాజీఎంపీ, రాష్ట్రంలోని అన్ని సమస్యలపై మంచి అవగాహన వున్న నాయకుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌లను సంప్రదించాడు. ఇద్దరూ మేధావులే! ప్రజాసమస్యల పట్ల అవగాహన, వాటిని పరిష్కరించాలన్న తపన ఉన్నవాళ్లే! అయితే రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడడానికంటూ పవన్‌కళ్యాణ్‌ ఏర్పాటు చేసిన జేఏసీలో వీరు భాగస్వాములు కావడమే ఆశ్చర్యం కలిగించే విషయం.

పవన్‌కళ్యాణ్‌కు సినిమాలలో వేర్వేరు డైరక్టర్లు వుంటారు. కాని, రాజకీయాల వద్దకొచ్చేసరికి ఆయనకున్న ఏకైక డైరక్టర్‌ చంద్రబాబే! 2014 ఎన్నికల నుండి ఇప్పటిదాకా కూడా చంద్రబాబు చెప్పినట్లే ఆయన వింటూ వచ్చాడు. చంద్రబాబు రమ్మన్నప్పుడల్లా పవన్‌ బయటకొచ్చాడు. ఆయన చెప్పిన చోటల్లా సభలు, రాజకీయ యాత్రలు చేశాడు.

పవన్‌ జేఏసీని పెట్టి ఇప్పుడు చించేస్తాను, ఆరేస్తాను అంటున్నాడు. నాలుగేళ్ళుగా రాష్ట్ర ప్రజలకు అటు కేంద్రం, ఇటు తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయాల మీద అన్యాయాలు చేస్తుంటే ఈ పవన్‌ ఏం పీకాడు. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుంటుంటే, దళితులపై దాడులు జరుగుతుంటే, ప్రభుత్వ ఉద్యోగులనే అధికార పార్టీ నాయకులు జుట్టుపట్టి ఊడ్చి కొడుతుంటే ఈ పవన్‌కళ్యాణ్‌ ఎక్కడికి పోయాడు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక్కసారైనా ప్రశ్నించాడా? పోనీ ప్రత్యేకహోదా కోసం కేంద్రంతో నైనా గట్టిగా పోరాడాడా?

ఇతను చంద్రబాబు స్క్రిప్ట్‌ తయారుచేస్తే స్క్రీన్‌ మీదకొస్తాడు. ఆయన డైరక్షన్‌లోనే యాక్షన్‌ చేస్తాడు. ఇక నీ యాక్షన్‌ చాలు అనగానే వెళ్ళిపోతాడు. ఇంతవరకు కామన్‌మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అని పెట్టి ఏం పీకాడు... ఆ తర్వాత జనసేనను స్థాపించి ఏం వెలగబెట్టాడు. రేపు జేఏసీ కూడా అంతే! జేఏసీ అతని బుర్రలో నుండి వచ్చిన ఆలోచనకాదు. ప్రత్యేకహోదా విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే వారందరినీ పవన్‌ వైపు డైవర్ట్‌ చేయడం కోసం చంద్రబాబు వ్రాసిన నాటకమే జేఏసీ. పవన్‌ను నమ్ముకుని జేఏసీ పేరుతో రోడ్ల మీదకు రావడమంటే దేనినో పట్టుకుని గోదారిని ఈదడమే. మేధావులు కూడా ఆలోచించుకోవాలి.

Page 1 of 125

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter