sunమే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ తేదీ ఏకంగా 45డిగ్రీలు నమోదైంది. 16వ తేదీ 44.5డిగ్రీలు నమోదైంది. ఇంత తీవ్రంగా కాస్తున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల దాకా జనం ఇంటి నుండి బయటకొచ్చే పరిస్థితులు లేవు. 5గంటల తర్వాత బయట కొచ్చినా నిప్పుల కుంపటిలో అడుగుపెట్టినట్లుగానే వుంటోంది. ఎండల దెబ్బకు మిట్టమధ్యాహ్నం వేళ నెల్లూరు రోడ్లు కర్ఫ్యూ విధించా రన్నట్లుగా నిర్మానుష్యంగా మారుతున్నాయి.

sunసూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక మే నెలలో ఎలా వుంటాయోననే ఆందోళన జనంలో మొదలైంది. ఉదయం 10గంటలుపైన రోడ్ల మీదకు రావాలంటే జనం భయపడుతున్నారు. నిన్న మొన్నటిదాకా ఉదయం, సాయంత్రం వేళల్లో వాతావరణం కొంచెం చల్లబడేది. ఇప్పుడు అది కూడా లేదు. ఉక్కపోత భరించలేనంతగా మారింది. వడదెబ్బకు వృద్ధులు, పిల్లలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ, వ్యవసాయ, రోడ్లు నిర్మాణ కార్మికులు ఎండల్లో మగ్గుతూ పనులు చేస్తున్నారు. ఇప్పుడు కాస్తున్న ఎండలను చూస్తూ మేలో కాయబోయే ఎండలను తలచుకుంటే జనంకు దడ మొదలవుతుంది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • 'తండ్రి'ని వీడి... 'తల్లి' వద్దకు సత్యకుమార్‌
    గత 24 సంవత్సరాలుగా వెంకయ్యకు తోడుగా ఆయన నీడగా నిత్యం ఆయనను వెన్నంటి వుండిన ఆయన వ్యక్తిగత కార్యదర్శి సత్యకుమార్‌ భారత ఉపరాష్ట్రపతి ప్రత్యేక అధికారిగా తన పదవికి రాజీనామా చేశాడు. తండ్రి లాంటి పెద్దాయనను వదిలి ఆయనిప్పుడు తల్లి లాంటి…
  • 'లోక్‌సభ'లో సైకిల్‌ వీక్‌
    ఏపిలో ఎక్కడైనా తెలుగుదేశంపార్టీకి తిరుగుండదేమో... ఒకసారి ఓడిన చోట మరోసారైనా గెలుస్తుందేమో... కాని రాష్ట్రంలో కడప తర్వాత తెలుగుదేశంకు మింగుడుపడని నియో జకవర్గం నెల్లూరే! అది లోక్‌సభ అయినా శాసనసభ అయినా? తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 7సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే…

Newsletter