surabhiఢిల్లీ భామ అయినా.. సౌత్‌ లోనే తన లక్కు పరీక్షించుకుంటోంది సురభి. తమిళ్‌, తెలుగు సినిమాల్లో వరుసగా ఆఫర్స్‌ వస్తున్నాయ్‌ కానీ.. ఈ భామకు బ్రేక్‌ మాత్రం రావడం లేదు. ఇప్పటికే కోలీవుడ్‌ లో 4 టాలీవుడ్‌ లో 4 సినిమాలను రిలీజ్‌ చేసేసింది. వీటిలో హిట్స్‌ కూడా ఉన్నా అమ్మడికి ఉపయోగమేవిూ లేదు. తెలుగులో ఎక్స్‌ ప్రెస్‌ రాజా.. జెంటిల్మన్‌ లాంటి హిట్స్‌ పడ్డా.. అవి కెరీర్‌ కి మాత్రం ఉపయోగపడలేదు.రీసెంట్‌ గా హైద్రా బాద్‌ లో సందడి చేసింది సురభి. ఓ మొబైల్‌ తయారీ కంపెనీకి చెందిన ఫోన్లను లాంఛ్‌ చేయడానికి వచ్చింది. ఈవెంట్‌ బాగానే ఉంది కానీ.. సురభి కూడా బాగానే మెరిసింది. మరి ఛాన్సు ల సంగతేంటి అంటే మాత్రం.. ఆఫర్స్‌ ఉన్నాయిలే అంటూ కవర్‌ చేసేసింది. ఈ ఈవెంట్‌ లో అమ్మడి గెటప్‌ చూస్తే. . గ్లామర్‌ యాంగిల్‌ కి ఈ భామ ఎంత దూరమో అర్ధమవుతుంది. అయితే.. కాసింత భారీ పర్సనాలిటీ కావడంతో.. అలాంటి రోల్స్‌ కుదరవు కానీ.. మరీ నిండుగా కప్పేసుకునే హీరోయిన్లకు తెలు గు మూవీ మేకర్స్‌ అంతగా ఆఫర్స్‌ ఇవ్వ రనే సంగతి జగద్విదితమే. ఈ విషయా న్ని అర్ధం చేసుకున్న బొద్దు భామలు కా సింత సైజులు తగ్గించుకుని మరీ ఆఫర్స్‌ పట్టుకుపోతున్నారు. మరి ఈ విషయం సురభికి ఎప్పుడు అర్ధమవు తుందో!

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
  • జిల్లాలో వైకాపా... బలముంది... బలమైన నాయకత్వమే కావాల్సివుంది
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. కడప, కర్నూలు తర్వాత నెల్లూరుజిల్లానే వైసిపికి కంచుకోట! ఇంకోరకంగా చెప్పాలంటే ఆ రెండు జిల్లాల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్‌ అయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే…

Newsletter