nelloreఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా గెలిచిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణలు తప్పితే జిల్లాలో ఎన్నికైన మిగతా 8మంది ఎమ్మెల్యేలు శాసనసభలోకి కొత్తగా అడుగుపెట్టినవాళ్ళే! 2014 అసెంబ్లీకి నెల్లూరుజిల్లా నుండి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్‌, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డిలు కొత్తగా అడుగుపెట్టారు.

మరి 2019 అసెంబ్లీకి ఎంతమంది పాతవాళ్ళు పోబోతున్నారు, ఎంతమంది కొత్త

వాళ్ళు రంగంలోకి దిగబోతున్నారన్నది ప్రశ్న? ముఖ్యంగా ఒకప్పుడు ఎన్నికలు వరల్డ్‌కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల మాదిరిగా వుండేవి. ఏ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థి అన్నది ముందుగానే ఫిక్స్‌ అయ్యుండేది. ప్రధానంగా పోటీ చేసే అభ్యర్థులు కూడా పార్టీ మీద అభిమానముండే పోటీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు ఐపిఎల్‌ మ్యాచ్‌లు మాదిరిగా తయారయ్యాయి. ఎలక్షన్‌ ముందే గెలుపు గుర్రాలను కొనుక్కోవడమన్న మాట. ఇక్కడ పార్టీ ఫీలింగ్‌, సిద్ధాంతం, అభిమానం అన్నవి చివరి స్థానంలో వుంటాయి. గెలవగలిగే సామర్ధ్యమే ప్రధానంగా వుంటుంది. ఐపిఎల్‌లాగానే ఎలక్షన్‌ ముందు ఈపిఎల్‌(ఎలక్షన్‌ ప్రీమియర్‌ లీగ్‌) వుంటుంది. ఈ కోణంలో చూస్తే కొందరు నాయకులను తెరమీదకు తీసుకురావచ్చు.

వైసిపి నుండి చూస్తే... సిటింగ్‌ ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్‌, మేకపాటి గౌతంరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలు ఎలాగూ రంగంలో వుంటారు. వీళ్ళు కాకుండా ఆయా స్థానాలకు సంబంధించి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మేరిగ మురళీధర్‌, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, బత్తిని విజయ్‌కుమార్‌ వంటి నాయకులు టిక్కెట్ల రేస్‌లో వున్నారు.

తెలుగుదేశం నుండి చూస్తే... సిటింగ్‌ ఎమ్మెల్యేలుగా బొల్లినేని రామారావు, కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్‌, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు ఎలాగూ రేస్‌లో వున్నారు. వీళ్ళు కాకుండా టీడీపీ తరఫునే ఆయా స్థానాల నుండి బీద మస్తాన్‌రావు, పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, బొల్లినేని హజరత్తయ్యనాయుడు, గూటూరు కన్నబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్‌రావు, జ్యోత్స్నలత, పరసారత్నం, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, పి.నారాయణ, అబ్దుల్‌ అజీజ్‌, తాళ్ళపాక అనూరాధ వంటివారి పేర్లు రేస్‌లో వున్నాయి.

ఇక ప్రస్తుతానికి తెలుగుదేశం, కాంగ్రెస్‌, బీజేపీ వంటి పార్టీలలో వున్నప్పటికీ టీడీపీ లేదా వైసిపి టిక్కెట్ల రేసులో ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మెట్టుకూరు ధనుంజయరెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, పనబాక కృష్ణయ్యలు ఉండడం విశేషం!

tdp congressఈమధ్య చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌కు మరీ దగ్గర కావాలని చూస్తు న్నాడు. దగ్గరవుతున్నాడు కూడా! కాం గ్రెస్‌తో ఆయనకు సైద్ధాంతిక వైరం లేదు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీఆర్‌. కాంగ్రెస్‌తో పోరాడింది, ఈ రాష్ట్రంలో ఆ పార్టీని తుడిచిపెట్టింది ఎన్టీఆర్‌. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌లోనే వున్నాడు. 1983 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి చేతిలోనే పరా జయం పాలయ్యాడు. కాంగ్రెస్‌ అన్నది చంద్రబాబుకు రాజకీయ జన్మనిచ్చిన తల్లిలాంటిది. కాబట్టి కాంగ్రెస్‌ పార్టీపై ఆయన ప్రేమ, అభిమానం, వాత్సల్యాన్ని తప్పు పట్టలేం. 1995లో తెలుగుదేశం పార్టీ తన చేతుల్లోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రత్యర్ధి కాబట్టి చంద్రబాబు ఆ పార్టీతో పోరా డాడు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పతనమై పోయింది. కాబట్టి ఆ పార్టీతో స్నేహం చేసినా చంద్రబాబుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఎన్డీఏ నుండి బయటకొచ్చాక చంద్రబాబు కాంగ్రెస్‌కు దగ్గర కాసాగాడు. ఇటీవల కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో రాహుల్‌, చంద్రబాబుల మధ్య బంధం కొంత బలపడింది. తాజాగా చంద్రబాబు చేసిన ప్రకటన చూస్తుంటే కాంగ్రెస్‌ వైపు ఆయన ఎంత ప్రేమగా చూస్తున్నాడో అర్ధ మవుతుంది. పోలవరం ప్రాజెక్ట్‌ కాంగ్రెస్‌ పుణ్యమేనని ఆయన ప్రకటించి బీజేపీ నాయకులకు మరింత మంట పుట్టించాడు. చంద్రబాబు చెప్పినా చెప్పకపోయినా పోలవరం గత కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటే దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి పుణ్యమే. ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిందే ఆయన. హఠాత్తుగా ఆయన ఈ లోకాన్ని వీడిపోకుంటే ఈవరకే పోలవరం పూర్తై వుండేది.

రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యూపిఏ ప్రభుత్వం విభజన బిల్లులో పోలవరంను చేర్చింది. ఎన్డీఏ అధికారం లోకి వచ్చాక పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముంపు గ్రామాలను తెలంగాణలో నుండి ఏపి పరిధిలోకి తెచ్చారు. తద్వారా పోలవరం ప్రాజెక్ట్‌ ముందడుగు వేసింది. కేంద్రం చేపట్టాల్సిన ఈ ప్రాజెక్ట్‌ను నేను చేస్తానంటూ చంద్రబాబు చేతుల్లోకి తీసుకుని గబ్బు పట్టిస్తున్నాడు.

పోలవరం విషయంలో వై.యస్‌. కృషి వుంది. యూపిఏ ప్రభుత్వం కేవలం విభజన బిల్లులో మాత్రమే చేర్చింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అవసర మైన అనుమతులు, నిధులు, ఇతరత్రా సమస్యలను క్లియర్‌ చేసింది. చంద్రబాబు మాత్రం పోలవరం క్రెడిట్‌ను కాంగ్రెస్‌కే అంకితం చేస్తున్నాడు.

కాంగ్రెస్‌ పట్ల చంద్రబాబు ఇంత అభిమానం చూపించడం వెనుక కారణా లేంటి? కేవలం ఆంధ్రప్రదేశ్‌లో రాజ కీయ అవసరాల కోసమైతే ఇంత భజన చేయాలా? ఎందుకంటే చంద్రబాబును గట్టెక్కించేంత పటిష్ట స్థితిలో ఏపి కాంగ్రెస్‌ లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎంత నష్టం జరుగుతుందని భావిస్తున్నారో, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా అదే నష్టం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో కాం గ్రెస్‌తో పొత్తు కోసం కాదు చంద్రబాబు తపనంతా! జాతీయ స్థాయిలో ఆ పార్టీ మద్దతు కోసం.

ఎన్డీఏ అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీయో ఇంకో బీజేపీ నాయకుడో ప్రధాని అవుతాడు. మిగతా పార్టీల నాయకులకు ఛాన్స్‌ వుండదు. అలా కాకుండా రేపు హంగ్‌ ఫలితాలు వచ్చి కేంద్రంలో కాంగ్రెస్‌ మద్దతుతో తృతీయ ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడిందనుకుందాం, ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీదే ప్రధానపాత్ర అవుతుంది. అంటే 1996లాగా అన్నమాట! అప్పుడు దేవే గౌడకు ప్రధానిగా ఛాన్స్‌ వచ్చినట్లే ఈసారి తనకూ ఛాన్స్‌ తగలొచ్చని ఆయన నమ్మకం. మూడో ఫ్రంట్‌ అంటే ఈసారి ప్రధాని రేస్‌లో చాలామంది నాయకులే వున్నారు. కాంపిటీషన్‌ ఎక్కువుగా వుంటుంది. ఈ సమయంలో కాంగ్రెస్‌ నాయకత్వం ప్రధాన పాత్ర పోషిస్తుంది. భవిష్యత్‌ పరిణామా లను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు కాంగ్రెస్‌తో మరీ ఎక్కువుగా క్లోజ్‌ అవు తున్నట్లు సమాచారం.

tdpనెల్లూరుజిల్లాలో తెలుగుదేశం పరిస్థితి ఏమంత బాగాలేదు. గతంకంటే మెరుగు పడిందీ లేదు. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీకి వచ్చింది 3 సీట్లే! ఇవి కూడా కొద్దిపాటి మెజార్టీతో గెలుచుకున్నవే! వీటిలో వైసిపి సంస్థాగత లోపాల కారణంగా 2 సీట్లు పోయాయి. ఇక నెల్లూరు లోక్‌సభతో పాటూ నెల్లూరుజిల్లాలోని నాలుగు అసెంబ్లీలు కలిసి వున్న తిరుపతి లోక్‌సభ స్థానాన్ని కూడా వైసిపి గెలుచుకోవడం జరిగింది.

ఈ సీన్‌ను బట్టి జిల్లాలో తెలుగుదేశం ఎంత బలహీనంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళయ్యింది. ఈ నాలుగేళ్ళ కాలంలో తెలుగుదేశం ఏమన్నా బలం పుంజుకుందా? ఈ నాలుగేళ్ళలో ఆనం సోదరులతో పాటు మెట్టు కూరు ధనుంజయరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి వంటి నాయకులు టీడీపీలో చేరారు. వైసిపిలో గెలిచిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌ కూడా టీడీపీలో చేరాడు. ఏమన్నా ఒరిగిందా? పార్టీకి ఓటింగ్‌ శాతం పెరిగిందా? గతంలోకన్నా ఎక్కువ సీట్లు గెలిచే అవ కాశాలు ఏర్పడ్డాయా? తెలుగుదేశం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందా? జిల్లాలో అలాంటి వాతావరణమేదీ కనిపించడం లేదు సరికదా, 2014 కన్నా జిల్లాలో పార్టీ బలహీనపడ్డ వాతావరణం కనిపిస్తోంది.

చంద్రబాబు చిన్నచూపు

మొదట అధికారంలోకి వచ్చాక ఈ జిల్లా అభి వృద్ధిపై చంద్రబాబు చిన్నచూపు చూసాడు. ఈ జిల్లా అంటే గిట్టనట్లు వ్యవహరించాడు. ఐదేళ్ళ వై.యస్‌. పాలనతో పోల్చి చూసినప్పుడు ఈ జిల్లాకు ఆయన చేసిందేమీ కనిపించలేదు. దాంతో స్వతహాగానే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. ఇక నియోజక వర్గాల వారీగా కూడా పార్టీ బలహీనంగానే ఉంది. టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలుంటే(జంపింగ్‌ ఎమ్మెల్యేతో కలిపి) ఆ నాలుగు నియోజకవర్గాలలోనూ వారి పట్ల వ్యతిరేకత వుంది. నెల్లూరు నగరం, రూరల్‌ నియోజక వర్గాలలో తెలుగుదేశాన్ని చంద్రబాబే పడుకోబెట్టాడు. ఏ జిల్లా కేంద్రంలోనూ తెలుగుదేశం నెల్లూరులో వున్నంత బలహీనంగా వుండదేమో! సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యక్తిగతంగా గట్టిగా పోరాడుతున్నాడు. ఇది రైతాంగం ఎక్కువ వుండే నియోజకవర్గం. ప్రభుత్వంపైన అన్నిచోట్లా వుండే వ్యతిరేకత ఇక్కడా వుంది. కాకపోతే సోమిరెడ్డి సొంతంగా గట్టిగా నిలబడుతున్నాడు. కావలిలో బీద సోదరుల నాయకత్వం వల్ల అక్కడ పార్టీ కనిపిస్తోంది. జిల్లాలో టీడీపీ వీక్‌ అనే సంకేతాలు అధిష్టానాన్ని తాకాయి. చంద్రబాబు నెల్లూరు జిల్లా రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

నిలబెట్టుకోవడంలో విఫలం

ముఖ్యంగా మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీని వదిలిపోతున్నాడన్న విషయం టీడీపీలో ఆందోళన కలిగిస్తోంది. పార్టీలోకి వచ్చిన వాళ్ళను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యామనే భావన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఆనం సోదరులకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వివేకా చివరి రోజుల్లో వున్నప్పుడైనా ఆయనకు గౌరవప్రదమైన స్థానం కల్పించి వుంటే వాళ్ళు పార్టీని వదిలిపోకుండా వుండేందుకు ఆస్కార ముండేది. ఆనంను పార్టీలో నిలబెట్టుకోలేక పోవడ మన్నది పూర్తిగా చంద్రబాబు వైఫల్యమే! ఆనం పార్టీని వదిలి వైసిపిలోకి పోతే ఆ ఎఫెక్ట్‌ ఆత్మకూరు నియోజక వర్గంతో పాటు మరో నాలుగు నియోజకవర్గాల మీద కూడా పడుతుంది.

తిరుగుబాటులో పెళ్ళకూరు

ఆనం అలా వుండగా కోవూరుకు చెందిన మరో నాయకుడు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి కూడా తిరుగుబాటు బాటలో వున్నాడు. ఆయన ఎదురు తిరిగినా కూడా కోవూరులో పార్టీకి నష్టం తప్పదు. వీరితో పాటు మరికొందరు నాయకులు కూడా టీడీపీని వీడే ఆలోచనలో వున్నట్లు సమాచారం.

నిలబెట్టుకొనే ప్రయత్నాలు

చేతులు కాలాక ఆకులు పట్టుకోవాల్సిన దశలో తెలుగుదేశం అధిష్టానం అలర్ట్‌ అయ్యింది. ఆనం రామనారాయణరెడ్డి చేజారినట్లేనని ఖరారు చేసు కున్నారు. కాకపోతే వారి కుటుంబంలో వున్న మరో ఇద్దరిని నిలబెట్టుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డిని బుజ్జగించే పనిలో కొందరున్నారు. ఎన్నికలనాటికి పార్టీ మారుతాడనే ప్రచారం వున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డిని జాగ్రత్తగా పట్టుకురావాలని నిర్ణయించి ఆయనకు అదనపు బాధ్యతలంటూ కొత్త పదవులు అప్పగిస్తున్నారు.

ఉదయగిరిలో కంభం విజయరామిరెడ్డి చేజారిపో కుండా ఆయనకు రాష్ట్ర స్థాయి పార్టీ పదవిని గాలంగా విసురుతున్నట్లు తెలుస్తోంది. అలాగే డీసీసీబీ ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.

ఇటీవలే నవనిర్మాణ దీక్షల ముగింపు సభను నెల్లూరుజిల్లాలోనే నిర్వహించిన చంద్రబాబు, ఈ నెల 30న దళిత తేజం ముగింపు సభకు కూడా నెల్లూరునే వేదికగా ఎంచుకున్నారు. దీనికి కారణం నెల్లూరు జిల్లాలో పార్టీపై ప్రత్యేక దృష్టి పెట్టి దిద్దుబాటు చర్యలకు పూనుకోవడమే!

Page 1 of 36

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter