mp fearనెల్లూరు లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని వెదకడం తెలుగుదేశం అధిష్టానానికి పెద్ద పనిగా మారింది. 1985 నుండి ఈ లోక్‌సభ ట్రాక్‌ రికార్డు చూస్తే ఏ నాయకుడికైనా టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ నుండి పోటీ చేయాలంటే భయమే! ఇప్పటివరకు 9సార్లు నెల్లూరు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే టీడీపీ అభ్యర్థులు గెలిచింది రెండంటే రెండు సార్లే! ఆ రికార్డును చూసే లోక్‌సభ పోటీకి నాయకులు వెనక్కుతగ్గుతున్నారు.

2014 ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్‌రెడ్డి రూపంలో తెలుగుదేశంకు మంచి అభ్యర్థే దొరికాడు. ఆయన గెలుపు అంచులదాకా వచ్చి ఓడిపోయాడు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఆయన లోక్‌సభ నుండి పోటీ చేయడానికి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ కంటే ఏదో ఒక అసెంబ్లీ నుండి పోటీ చేయడానికే ఆయన ఇష్టపడుతున్నట్లు సమాచారం. ఆదాల అసెంబ్లీ వైపు మొగ్గుచూపితే ఇక లోక్‌సభ అభ్యర్థి ఎవరు? 2012 ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీద మస్తాన్‌రావు కూడా లోక్‌సభ వైపు చూడడం లేదు. ఆయన మనసు రాజ్యసభ వైపు లాగుతోంది. ఇక తప్పదనుకుంటే కావలి అసెంబ్లీ నుండి పోటీచేసే అవకాశముంది. వున్నవారిలో నెల్లూరు లోక్‌సభకు సరైన అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి. కాని ఆయన లోక్‌సభకు వెళతాడా? అసలు టీడీపీలోనే వుంటాడా? అన్నది అనుమానం. ఉండే గట్టినాయకులలో సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి కూడా అసెంబ్లీకే పోవాలనుకుంటాడు గాని లోక్‌సభకు మొగ్గుచూపడు. పార్టీలో వుండే ఇంకో ప్రతిపాదన ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావును ఒంగోలు లోక్‌సభకు పంపించి నెల్లూరు లోక్‌సభలో మాగుంట శ్రీనివాసులురెడ్డిని దించడం. ఇదే జరిగితే నెల్లూరు పార్లమెంటులో ఎప్పుడూ చూడని ఉత్కంఠ సమరాన్ని చూడగలం. మంత్రి పి.నారాయణ వుంటే నెల్లూరు లోక్‌సభకు పోటీ చేయడం పార్టీకి కలిసిరాక పోవచ్చు. నెల్లూరు లోక్‌సభకు అందుబాటులో వున్న వీళ్ళలో ఒకరిని దించడమా... లేక ఇతర జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తలను దిగుమతి చేయడమా? ఈ రెండు మార్గాలు టీడీపీ అధిష్టానం ముందున్నాయి. వాళ్ళు ఏ మార్గం ఎంచుకుంటారో చూడాలి.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter