inlu gadapaరాష్ట్రంలో దాదాపు ఎలక్షన్‌ ట్రెండ్‌ మొదలైందనే చెప్పొచ్చు. గట్టిగా పోరాడితేగాని వచ్చే ఎన్నికల్లో గెలవలేమనే పరిస్థితి అటు తెలుగుదేశం నాయకులకు, ఇటు వైకాపా నాయకులకు అర్ధమైపోయింది. నంద్యాలలో ఓటమితో ప్రభంజనం, ప్రభుత్వ వ్యతిరేకత భ్రమల నుండి వైకాపా నాయకులు బయటకొచ్చారు. ఈ రెండింటిని మాత్రమే నమ్ముకుంటే అధికారం దక్కదనే విషయాన్ని గ్రహించారు. అదే సమయంలో నంద్యాలలో 27 వేలఓట్ల తేడాతో గెలిచామనే ఆనందం కన్నా ఇంతగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఇన్ని వందలకోట్లు ఖర్చు చేసినా వైకాపాకు 70వేల ఓట్లు రావడం కూడా తెలుగుదేశం శ్రేణులకు మింగుడుపడడం లేదు. ఎందుకంటే ఉపఎన్నికల్లో పని చేసినట్లుగా సాధారణ ఎన్నికల్లో ప్రలోభాలు పనిచేయవనే విషయం వారికి తెలుసు.

అందుకే ఇరు పార్టీల వాళ్ళు కూడా అప్రమత్తమై నాయకులను కార్యకర్తలను జనం మీదకు, ఇళ్ల మీదకు తరిమే కార్యక్రమాలు పెట్టుకున్నారు. అధికార తెలుగుదేశం ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి శ్రీకారం చుడితే, ప్రతిపక్ష వైకాపా ఇంతకుముందు నుండే గడపగడపకు వైసిపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

నెల్లూరుజిల్లాలో ఈ రెండు కార్యక్రమాలను తెలుగుదేశం, వైయస్సార్సీపీ నాయకులు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పది నియోజకవర్గాలలో ఇరుపార్టీల కార్యక్ర మాలలో నాయకులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు టిక్కెట్ల రేసులో నిలవాలంటే ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి మార్కులు తెచ్చుకోవాల్సి వుంది. కాబట్టే నాయకులు ఈ కార్యక్రమాలలో లీనమైపోయి పని చేస్తున్నారు.

haribabuకేంద్ర మంత్రివర్గ విస్తరణలో విశాఖపట్నం ఎంపి, ఏపి బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు ఎందుకు స్థానం దక్కలేదు? ఒక మిత్రుడు వేసిన ఈ ప్రశ్నకు ఒక రాజకీయ విశ్లేషకుడు ఇచ్చిన సమాధానం... విస్తరణలో మిత్రపక్షాలను తీసుకోలేదు కదా? ప్రశ్న వేసిన మిత్రుడు ఆశ్చర్యపోయాడు. అదేంటి హరిబాబు బీజేపీ ఎంపీయే కదా! అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దానికి ఆ రాజకీయ పండితుడు చెప్పిన వివరణ... కంభంపాటి హరిబాబు పేరుకు బీజేపీ ఎంపీయే! ఆయన గెలిచింది ఆ పార్టీ కమలం గుర్తు మీదే! కాకపోతే ఆ తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయాడు. ఈ మూడేళ్ల నుండి వంటికి పసుపు పూసుకుని తిరుగుతున్నాడు. 2014లో టీడీపీతో బీజేపీ పొత్తు మాత్రమే పెట్టుకుంది. కాని, హరిబాబు మాత్రం బీజేపీని టీడీపీలో విలీనం చేసామన్నట్లుగా బాబు సేవలో లీనమైపోయాడు. ఏపిలో బీజేపీని గాలికొదిలేసి, తెలుగుదేశం సేవలో తరిస్తున్నాడు. చంద్రబాబు ఎన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, చ్కెభజన చేస్తూన్నాడే గాని ఇదేమని ప్రశ్నించడం లేదు. ఇలాంటి నాయకుడికి కేంద్రమంత్రి పదవి ఇచ్చినా అది తెలుగుదేశంకు కేంద్ర కేబినెట్‌లో మూడో మంత్రి పదవి అవుతుందేగాని, ఏపిలో బీజేపీకి ఒరిగేదేమీ వుండదు. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇచ్చి వుండరు. ఇందులో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల కోసం హరిబాబు చేసిందేమీ లేదు. తెలుగుదేశం బాగుంటే చాలనుకున్నాడుగాని, తనను ఈ స్థాయిలో నిలబెట్టిన తన పార్టీ బాగుపడాలనుకోలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వుండి కూడా పార్టీ అభివృద్ధి గురించి ఆలోచించలేదు. ఆయన కంటే కూడా విష్ణుకుమార్‌రాజు, సోము వీర్రాజు వంటి నాయకులే ఎంతో నయం. తెలుగుదేశం ప్రజావ్యతిరేక విధానాలపై వాళ్ళు గళం విప్పారు. మిత్రపక్షం కాబట్టి అధికారపక్షం ఏ తప్పులు చేసినా మేం తాళం వేయాలనుకోలేదు. తమకు చేతనైనంతలో సభలోనూ, బయట ప్రభుత్వాన్ని నిలదీసారు. ప్రజల పక్షాన నిలిచే ప్రయత్నం చేశారు. కాని, హరిబాబు పార్టీ పరంగా ఎటువంటి ప్రయత్నం చేయలేదు. పార్టీ వాయిస్‌ వినిపించలేదు. కేవలం తెలుగుదేశం ఏజెంట్‌గానే మిగిలిపోయాడు. ఈయనకు మంత్రి పదవి ఇచ్చినా అది తెలుగుదేశంకు ఇచ్చినట్లే అవుతుందన్న భావనతోనే చివరి నిముషంలో ఆయనకు మొండి చేయి చూపినట్లుగా తెలుస్తోంది.

tdp leadersనంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి ఆర్ధికంగా శక్తిమంతుడు. పార్టీ నుండి ఆర్ధిక సహకారం ఆశించకుండా ఆయన ఖర్చుపెట్టుకుపోతున్నాడు. తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి మాత్రం ఫైనాన్స్‌ అంతా పార్టీయే చూసుకుంటోంది. ఖర్చు విషయంలో మంత్రి అఖిలప్రియ కూడా చేతులెత్తేసింది. ఆర్ధికంగా శిల్పాను మోటుకోవాలంటే భూమా కుటుంబం వల్ల కాదు. ఈ దశలో పార్టీ అధిష్టానమే ఆర్ధిక భారం నెత్తినేసుకుంది. నంద్యాల ఖర్చు బాధ్యతను నెల్లూరుజిల్లాకు చెందిన నాయకులకే అప్పగించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం తరఫున ఎన్నికల నిర్వహణ అంటే ఖర్చు వ్యవహారాలన్నీ ప్రధానంగా జిల్లాకు చెందిన మంత్రి పి.నారాయణ చూస్తున్నాడు. నంద్యాల ఎన్నికల్లో ఖర్చుకు కావాల్సిన కరెన్సీ నోట్ల బాధ్యతను కూడా నారాయణకే అప్పగించారని తెలుస్తోంది. అలాగే జిల్లాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్‌ బొల్లినేని శీనయ్యతో పాటు ఇంతకుముందు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా వ్యవహరించిన శిద్ధా రాఘవరావు కూడా ఆర్ధిక వనరులు సమకూర్చడంలో బిజీగా వున్నారని సమాచారం. ఇలా నెల్లూరు నాయకులు అటు ఎన్నికల ప్రచారంలోను, ఇటు ఫైనాన్స్‌ పనుల్లో కూడా తమ ప్రతిభ చూపిస్తున్నారు.

Page 1 of 31

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
  గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
 • తప్పెవరిది?
  నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
 • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
  చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
 • ఓటమి నేర్పిన పాఠమేంటి?
  గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
 • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter