jumppersనేను పార్టీ మారేది లేదు... పార్టీ మార్చాల్సిన అవసరమే ముంది... మమ్మల్ని ప్రజలు ఒక పార్టీ తరపున ఓట్లేసి గెలిపిం చారు, ఇప్పుడు అధికారంలో లేమని చెప్పి ఇంకో పార్టీలోకి వెళితే... మేం ప్రజలకు ఏం మెసేజ్‌ ఇచ్చినట్లు... పార్టీ మారకముందు ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు ఇవి.

మరి పార్టీ మారాక... మా నియోజకవర్గం అభివృద్ధి మాకు ముఖ్యం. అధికారపార్టీలో వుంటేనే ప్రజలకు నాలుగు పనులు చేయ గలం. ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు మెచ్చే మా కార్యకర్త లతో చర్చించి ఈ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం. కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారాం.

మొన్నటి భూమా అఖిలప్రియ నుండి నేటి బుట్టా రేణుక వరకు ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ మారిన ప్రతి వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే చెప్పిన మాటలే ఇవి. పార్టీ మారక ముందు ఓ మాట... పార్టీ మార్చాక ఇంకో మాట. అసలు వీళ్లకు అలా మాట్లాడడానికి మనసు ఎలా వస్తుందో కూడా అర్ధం కాదు. రాజకీయ నాయకులకు రెండు నాల్కలు ఉంటాయ న్నది వీళ్లను చూసేనేమో! ప్రతిపక్షంలో వుంటే అభివృద్ధి చేయలేం... అధికార పార్టీలో వుంటేనే అభివృద్ధి చేయగలం అన్న నాయకులకు ఒకటే ప్రశ్న! పుచ్చలపల్లి సుందరయ్య ఎప్పుడు అధికార పార్టీలో వున్నాడు? వాజ్‌పేయి, అద్వానీ వంటి అగ్రనేతలు దాదాపు నాలుగు దశాబ్దాలు ప్రతిపక్ష నేతలుగానే వున్నారు. అంతెందుకు దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి 2004లో సీఎం అవడానికి ముందువరకు కూడా ఏ పార్టీ అధికారంలో వున్నా ప్రతిపక్ష నేత పాత్రనే పోషించాడు. అభివృద్ధి కోసం పార్టీలు మారుతున్నామని చెప్పుకుంటున్న నాయకులెవరు కూడా నియోజకవర్గ ప్రజల మీద ప్రేమతో పార్టీ మారడం లేదన్నది ప్రజలకు తెలిసిన నగ్నసత్యం. వాళ్ళు పార్టీ మారడానికి ప్రధాన కారణం ప్యాకేజీలే అన్నది అందరికీ తెలిసిన నిజం. మన కళ్ళ ముందు ఒక నేరం జరిగింది. నేరం చేసిన వాడే కాదు, చూస్తూ దానిని అడ్డుకోని వాళ్ళు, కోర్టులో చూసింది చూసినట్లు చెప్పని వాళ్ళు కూడా దోషులే! భారత రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌, న్యాయమూర్తులు... మరి ఇంతమంది ముందు ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతూనే వుంది. ఒక పార్టీ నుండి గెలిచిన వాళ్ళను ప్రలోభాలతో ఇంకో పార్టీలో చేర్చుకునే కార్యక్రమం నిరాటంకంగా జరుగుతోంది. దీనిని అత్యాచారమనాలో... వ్యభిచారమనాలో... పేరు ఏదైనా ఇదొక రాజకీయ నేరమే. అది ఏ పార్టీ వాళ్ళు చేసినా నేరమే! మరి ఈ నేరాన్ని చూస్తూ కూడా అడ్డుకోలేని ఈ పెద్దలంతా దోషులే కదా!

ఒక పార్టీ టిక్కెట్‌ తెచ్చుకుని, ఆ పార్టీ గుర్తు మీద గెలిచి, ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే అధికార పార్టీలోకి దూకే ప్రజాప్రతినిధులను గతంలో ఆయారామ్‌, గయా రామ్‌లు అంటుండేవాళ్ళు. ఇప్పుడు పార్టీలు మార్చే వాళ్ళకు ఆ పేర్లు కూడా తక్కువేమో ననిపిస్తోంది. రాజకీయాలలో ఏ మాత్రం విలువలు, వ్యక్తిగతంగా మనస్సాక్షి అన్నవి వుంటే ఇంకో పార్టీలోకి మారాలనుకున్నప్పుడు ఏ పార్టీ అభ్యర్థిగా అయితే పోటీ చేసి ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారో ఆ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలి. రాజకీయాలలో అది విలువలకు నిదర్శనం. 2014 ఎన్నికల తర్వాత ప్రతిపక్ష వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నుండి 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు తెలుగుదేశంలో చేరారు. వీరిలో ఏ ఒక్కరు కూడా విలువలకు కట్టుబడి తమ పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరలేదు. పదవులతో పాటే పార్టీ మారారు. ఇక వీళ్ళు ఎందుకు పార్టీ మారారు అనేం దుకు చాలా కారణాలుంటాయి. ఒక్కరోజు కూడా అధికారం లేకుంటే ప్రజాప్రతినిధులు నిలబడలేని పరిస్థితులొచ్చాయంటే ఇక ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున పోరాడే నాయకులే వుండరు. ప్రజాస్వామ్యానికి ఈ పోకడలు చాలా ప్రమాదకరం. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ఆలోచనలు ఇంకా ప్రమాదకరం.

ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షాన్ని పనిగట్టుకుని నిర్వీర్యం చేయాల్సిన పని లేదు. ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తుంటే ప్రజలే ప్రభుత్వం వైపు నిలబడతారు. ఆటో మేటిగ్గా ఆ రాష్ట్రంలో ప్రతిపక్షం బలహీనపడుతుంది. పశ్చిమబెంగాల్‌లో కమ్యూనిష్టులు పాతికేళ్లు పాలించారు. గుజరాత్‌లో బీజేపీ వరుసగా 4సార్లు అధికారంలోకి వచ్చింది. ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, చత్తీష్‌గఢ్‌ సీఎంలు విజయాలలో హ్యాట్రిక్‌ సాధించారు. వీళ్లెవరూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్యాకేజీల ఆశ పెట్టి తమ పార్టీలోకి లాక్కోలేదు. కేవలం మంచి పరిపాలన ద్వారా ప్రజలను తమ వైపుకు తిప్పుకునే విజయాలు సాధించారు.

కాని, దేశ చరిత్రలోనే చంద్రబాబు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన పోకడలకు బాటలు వేసాడు. ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో వార్‌ను వన్‌సైడ్‌ చేయాలనుకుంటున్నాడు. ఈ దేశ చరిత్రలోనే ప్రతిపక్షం నిర్వీర్యం కావడం అన్నది ఎక్కడా జరగలేదు. ఏ పార్టీ అయినా చరిత్ర గర్భంలో కలిసిపోవడం అన్నది ప్రజల చేతుల్లో పని. ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పంథాలో నడుస్తున్నప్పుడు ప్రజలే ప్రతిపక్షమయ్యి పిడికిలి బిగిస్తారు. అవతల చచ్చు, పుచ్చు పార్టీలున్నా అధికారంలో కూర్చోబెడతారు. మూడేళ్ల క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్ని కలనే చూడండి... ఒక ప్రధాని, 20మంది కేంద్రమంత్రులు... పెద్ద ఎత్తున ప్రచారం... ఇన్ని చేసినా ఆమ్‌ ఆద్మీ చీపురు తుఫాన్‌లో బీజేపీ తుడిచిపెట్టుకు పోయింది. కాబట్టి నాయకులు పార్టీ మారి వచ్చినంత మాత్రాన ప్రతిపక్షం నిర్వీర్యం కాదు. ప్రజల అభిమానం పొందగలిగితే ప్రతిపక్షం దానంతట అదే బలహీన పడుతుంది.

potthuluఅధికారం వేటలో పొత్తులు ప్రధాన భాగమయ్యాయి. ఇంకో పార్టీని కలుపుకుని ఎన్నికలకు పోతే మనకున్న ఓట్లకు మరికొన్ని ఓట్లు జతవుతాయని వందలు, రెండు మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయే అవకాశమున్న సీట్లను కూడా భాగస్వామ్య పక్షాల మద్దతు ఓట్లతో గెలిచే అవకాశముంటుం దన్నది పార్టీల ప్రధాన ఉద్దేశ్యంగా మారిపోయింది. అందుకనే జాతీయ రాజకీయాలలోనైనా, రాష్ట్ర రాజకీయాలలోనైనా ప్రధానపార్టీలు పొత్తులు లేకుండా ముందుకు వెళ్లడం లేదు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు అటు బీజేపీతోనూ, ఇటు పవన్‌ కళ్యాణ్‌ పార్టీ జనసేనతోనూ పొత్తు కుదుర్చు కోవడం తెలిసిందే! జనసేన ఎక్కడా పోటీ చేయకపోయినప్పటికీ అన్ని నియోజకవర్గాలలోనూ పవన్‌ అభిమానుల ఓట్లు తెలుగుదేశానికి కలిసొచ్చాయి. తెలుగుదేశం అభ్యర్థులు చాలా తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానాలు 30 దాకా వున్నాయి. పొత్తు ఓట్లు కలిసిరాకుంటే ఇవన్నీ ఓడిపోయేవే! పొత్తుతో ఓట్లు కలిసిరావడం, సీట్లు పెరగడం, దాంతో అధికారం దక్కడం జరిగిపోయింది. ఎన్నికలకు ఇంకో ఏడాదిన్నర కాలం వుంది. అయితే అప్పుడే పొత్తు మాటలు నడుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగిన వైకాపా దెబ్బతింది. 5లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని మిస్‌ చేసుకుంది. ఈసారి మాత్రం ఒంటరి పోరుకంటే పొత్తు పోరుకే ఆ పార్టీ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ బీజేపీతోనే మళ్ళీ కలిసి నడిచే అవకాశాలున్నాయి. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మాత్రం ఈసారి చంద్రబాబుతో కలవకుండా ఒంటరిగా పోటీ చేయాలనే ఆలోచనలో వున్నాడు. అయితే ఎన్నికలొస్తే ఏదో ఒక ప్రధానపార్టీతో పొత్తుకు ప్రయత్నించే సిపిఐ కూడా ఈసారి జనసేనతో స్నేహానికి సిద్ధంగా వున్నట్లు సమాచారం. టీడీపీ, వైకాపాలకు సమదూరం పాటించాలని, బీజేపీకి విరోధిగా మారిన పవన్‌తో చేతులు కలపాలని సిపిఐ నాయకత్వం భావిస్తోంది. తెలంగాణలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించడం తెలిసిందే! పవన్‌తో కలిస్తే తెలంగాణ, ఏపిలలో ఎక్కువ స్థానాలలో తమ అభ్యర్థులను నిల బెట్టుకోవచ్చన్నది ఆ పార్టీ నేతల అంచనా!

ఇక సీపీఎం మాత్రం వైకాపాతో జత కట్టాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. జనసేన అధికారంలోకి వచ్చేదీ లేదు, బీజేపీ తెలుగుదేశంతో వుంది కాబట్టి చంద్రబాబుతో వీళ్లు కలవలేరు. ఇక మిగిలిన మార్గం ఒంటరిగా పోటీ చేయడమా లేక వైకాపాతో పొత్తు పెట్టుకోవడమా? ఒంటరిగా పోటీ చేసి సాధించేదేమీ లేదు. ఒక్క సీటులో కూడా గెలుపుకు అవకాశముండదు. వైకాపాతో కలిసి పోటీ చేస్తే ఎక్కడన్నా గెలిచే అవకాశంతో పాటు అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో భాగస్వామి కావచ్చు. ఈ దృష్ట్యా సీపీఎం వైకాపా వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

2014 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో వామపక్షాల పాత్ర నామమాత్రంగా మిగిలింది. కాని, వచ్చే ఎన్నికల ద్వారానైనా అవి తమ ఉనికిని నిలబెట్టుకోవడానికి పొత్తులతోనే ప్రయాణించే అవకాశముంది.

inlu gadapaరాష్ట్రంలో దాదాపు ఎలక్షన్‌ ట్రెండ్‌ మొదలైందనే చెప్పొచ్చు. గట్టిగా పోరాడితేగాని వచ్చే ఎన్నికల్లో గెలవలేమనే పరిస్థితి అటు తెలుగుదేశం నాయకులకు, ఇటు వైకాపా నాయకులకు అర్ధమైపోయింది. నంద్యాలలో ఓటమితో ప్రభంజనం, ప్రభుత్వ వ్యతిరేకత భ్రమల నుండి వైకాపా నాయకులు బయటకొచ్చారు. ఈ రెండింటిని మాత్రమే నమ్ముకుంటే అధికారం దక్కదనే విషయాన్ని గ్రహించారు. అదే సమయంలో నంద్యాలలో 27 వేలఓట్ల తేడాతో గెలిచామనే ఆనందం కన్నా ఇంతగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఇన్ని వందలకోట్లు ఖర్చు చేసినా వైకాపాకు 70వేల ఓట్లు రావడం కూడా తెలుగుదేశం శ్రేణులకు మింగుడుపడడం లేదు. ఎందుకంటే ఉపఎన్నికల్లో పని చేసినట్లుగా సాధారణ ఎన్నికల్లో ప్రలోభాలు పనిచేయవనే విషయం వారికి తెలుసు.

అందుకే ఇరు పార్టీల వాళ్ళు కూడా అప్రమత్తమై నాయకులను కార్యకర్తలను జనం మీదకు, ఇళ్ల మీదకు తరిమే కార్యక్రమాలు పెట్టుకున్నారు. అధికార తెలుగుదేశం ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి శ్రీకారం చుడితే, ప్రతిపక్ష వైకాపా ఇంతకుముందు నుండే గడపగడపకు వైసిపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

నెల్లూరుజిల్లాలో ఈ రెండు కార్యక్రమాలను తెలుగుదేశం, వైయస్సార్సీపీ నాయకులు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పది నియోజకవర్గాలలో ఇరుపార్టీల కార్యక్ర మాలలో నాయకులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు టిక్కెట్ల రేసులో నిలవాలంటే ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి మార్కులు తెచ్చుకోవాల్సి వుంది. కాబట్టే నాయకులు ఈ కార్యక్రమాలలో లీనమైపోయి పని చేస్తున్నారు.

Page 1 of 31

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
  నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
 • ఆనంకు చుక్కెదురు?
  నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
 • కావలి నాకే కావాలి
  వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో సిటింగ్‌ ఎమ్మె ల్యేలలో ఎక్కువ మందికి తిరిగి టిక్కెట్లిచ్చే అవ కాశాలున్నాయి. అయితే ఒక్క కావలిలో మాత్రం సీటు విషయంలో బలమైన పోటీ నెలకొని వుంది. అది కూడా మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి నుండే కావడంతో కావలి వైకాపా…
 • ఆనంకు చుక్కెదురు?
  నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
 • అవును... వాళ్ళిద్దరూ ఫోన్లు ఎత్తరు!
  మునిసిపల్‌ మంత్రి నారాయణ, కమిషనర్‌ ఢిల్లీరావులపై సర్వత్రా అసంతృప్తి ఒకాయన మునిసిపల్‌ శాఖకు రాష్ట్రాధినేత. సాక్షాత్తూ ఆ శాఖకి మంత్రి. మరొకాయన నెల్లూరు మునిసిపల్‌ శాఖలో అత్యున్నత అధికారి. ఆశ్చర్యం కలిగే విధంగా వీళ్ళిద్దరిలో కామన్‌గా ఒకే గుణం వుండడంతో అది…

Newsletter