chandra talapotuకాంగ్రెస్‌కు సోనియాగాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ, డిఎంకెకు కరుణానిధి, ఎంఐఎంకు అసదుద్దీన్‌ ఓవైసీ... అధినేతలు. ఆ పార్టీలకు నియంతలు. వీళ్లను విమర్శించిగాని, ఎదిరించి మాట్లాడిగాని ఆ పార్టీల్లో ఎవరూ నిలబడలేరు. ఈ పార్టీల మాదిరిగానే, ఈ పార్టీల అధినేతల మాదిరిగానే తెలుగు దేశం పార్టీకి చంద్రబాబునాయుడు నియంత. పార్టీలో ఆయనకు భజన, అభినందన తప్ప ఆయనపై విమర్శలు, ఆరోపణలు ఉండవు. అలా చేసిన వాళ్ళు పార్టీలో కూడా ఉండరు.

అయితే పార్టీలో ఈ క్రమశిక్షణ అంతా కూడా పార్టీలోని నాయకులకు అధినేత నాయకత్వ సమర్ధతపై నమ్మకం ఉన్నంత వరకే! చంద్రబాబు ఎప్పుడైతే తన ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి తనపై తన పార్టీపై నమ్మకం లేక వైసిపి నుండి 21మంది ఎమ్మెల్యేలను వివిధ మార్గాలలో తెచ్చుకున్నాడో, అప్పుడే ఆయన నాయకత్వంపై తెలుగుదేశం నాయకుల్లో నమ్మకాలు సడలిపోయాయి. ఎప్పుడైతే సొంత ఎమ్మెల్యేలను పక్కనపెట్టి అవతల పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చాడో అప్పుడే తెలుగుదేశంలో వున్న నాయకులకు ఆయనపై వ్యతిరేక భావం ఏర్పడింది.

మంత్రివర్గ విస్తరణ జరిగిన వెంటనే ఒక్క నెల్లూరు జిల్లాలో తప్పితే అన్ని జిల్లాల్లోనూ తెలుగుతమ్ముళ్లు చంద్రబాబు నిర్ణయంపై బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కడం చూసాం. మంత్రి పదవి వూడిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని మొదలుకొని మంత్రి పదవి రాని గోరంట్ల బుచ్చయ్యచౌదరి దాకా చాలామంది తెలుగుతమ్ముళ్ళు చంద్రబాబుపై బహి రంగంగానే కారాలు మిరియాలు నూరారు. హఠాత్తుగా జరిగిన తమ్ముళ్ల తిరుగుబాటు తోనే చంద్రబాబు దిమ్మ తిరిగింది. వాట న్నింటిని సర్దుకుని తేరుకునే లోపే సొంత నియోజకవర్గం ఎంపీ ఎన్‌.శివప్రసాద్‌ రూపంలో మరో షాక్‌ తగిలింది. అంబే ద్కర్‌ జయంతి సాక్షిగా చంద్రబాబు విధా నాలను ఆయన బహిరంగంగానే ఎండ గట్టడం సంచలనం రేపింది. శివప్రసాద్‌ చిత్తూరు ఎంపీ! దళితుడు. ఆయన ఎంపీ కావడంలో చంద్రబాబు సహకారముంది. అయినా కూడా చంద్రబాబుపై తిరుగు బాటు బావుటా ఎగురవేశాడు.

సొంత ఎంపీయే తనపై విమర్శలు ఎక్కుపెట్టడంతో చంద్రబాబు కక్కలేక మింగలేక సతమతమవుతున్నాడు. క్రమ శిక్షణా చర్యల క్రింద వేటు వేద్దామంటే మరి బొజ్జల, గోరంట్ల బుచ్చయ్య, బోండా ఉమలపై ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్న వస్తుంది. దళితులంటే అలుసై పోయారా అనే విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే అవినీతి ఆరోపణలున్న పత్తిపాటి పుల్లారావు జోలికి పోకుండా దళితవర్గాలకు చెందిన పీతల సుజాత, రావెల కిషోర్‌బాబులను మంత్రి పదవుల నుండి తొలగించి చంద్రబాబు విమర్శల పాలయ్యారు. పార్టీలో ఇతర నాయకుల జోలికిపోకుండా ఎంపీ శివప్రసాద్‌ మీద చర్యలు తీసుకోలేరు. అలాగని చర్యలు తీసుకోకపోతే చంద్రబాబును రేపు ఇంకో నాయకుడు విమర్శించడానికి లైసెన్స్‌ ఇచ్చినట్లవుతుంది.

మొత్తంమీద తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అన్నది నేతిబీరకాయగా మారింది. పార్టీ గీసిన గీత దాటి ప్రవర్తిస్తున్న నాయకులపై ధైర్యంగా చర్యలు తీసుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. ఇదంతా కూడా పార్టీ సిద్ధాంత మనే లక్ష్మణరేఖను ఆయన ఎప్పుడో దాటేసి ఉండడం వల్లే!

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…
  • మేకపాటిని తప్పిస్తేనే మేలు?
    నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా మేకపాటి రాజ మోహన్‌రెడ్డి మూడుసార్లు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాడు. నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో ఆయన పేరిట ఇదో రికార్డు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎస్సీ రిజర్వుడ్‌లో ఉన్నటువంటి నెల్లూరు లోక్‌సభ జనరల్‌లోకి…
  • ఈ మలుపులు... ప్రమాదాలకు పిలుపులు
    కోవూరు నుండి విజయవాడ దాకా జాతీయ రహదారిని ఆరులైన్లుగా మార్చారు. ప్రతి క్రాసింగ్‌ వద్ద అండర్‌పాస్‌ ఏర్పాటు చేసారు. చిన్న పల్లెటూరుకు కూడా ఇవి ఏర్పడడంతో హైవేను దాటి పోవడం అన్న ప్రశ్నేలేదు. కాబట్టి ప్రమాదాలను చాలావరకు తగ్గించవచ్చు. దరిద్రం ఏంటంటే…
  • పేద గుండెల ధ్వని... 'జై ఆంధ్రా' ఉద్యమ సేనాని... మెట్టలో పుట్టిన మేటి నేత మాదాల జానకిరామ్‌
    ఉదయగిరి అంటే గుర్తొచ్చేది అలనాడు శ్రీకృష్ణ దేవరాయలు అయితే.. ఆధునిక రాజకీయ కాలంలో గుర్తొచ్చేది స్వర్గీయ బెజవాడ గోపాలరెడ్డి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడులు. వారి రాజ కీయ ప్రస్తానం మొదలైంది ఇక్కడే! అలాగే వారితో పాటు గుర్తొచ్చే నాయకుడు మాజీ మంత్రి…

Newsletter