tyagarajఈ నెల 6వ తేది నుంచి 13వ తేది వరకు 53వ శ్రీ త్యాగరాజ స్మరణోత్స వాలను స్థానిక రేబాల లక్ష్మీనరసారెడ్డి పురమందిరంలో ఎంతో వైభవంగా నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడు రోజులు ప్రసిద్ధులైనవారిచే సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందుకోసం గత కొద్దిరోజులుగా త్యాగరాజస్వామి ఆరాధకులు నెల్లూరులో వీధివీధినా తిరుగుతూ, శ్రీ త్యాగరాజస్వామి కీర్తనలను గానం చేస్తూ, జోలెకట్టి భిక్ష పట్టారు. ఈ ఉత్సవాల సందర్భంగా శ్రీ త్యాగరాజ స్వామి సంకీర్తనలతో, భక్తిగీతాలతో పుర మందిర ప్రాంగణం పరవశించిపోతుంది. శ్రీ త్యాగరాజస్వామి ఆరాధకులైన దివం గత శ్రీపతి పండితారాధ్యుల సాంబ మూర్తి, దివంగత యనమండ్ర వేంకటేశ్వర శాస్త్రిలు అప్పట్లో నెల్లూరు నలుమూలలా త్యాగరాజ కీర్తనలను ఆలపిస్తూ, జోలెకట్టి భిక్షపట్టి సంగీతసేవ నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. శ్రీ త్యాగరాజ ఆరా ధనలతో నెల్లూరును మరో తిరువ య్యార్‌లా తలపింపజేసిన మహానుభావులు వారు. ఆ మహనీయులు చేపట్టిన శ్రీ త్యాగరాజ స్మరణోత్సవాలను త్యాగరాజ స్వామి భక్తులు, సింహపురి ప్రజలందరి సహకారంతో శ్రీ త్యాగరాజ స్మరణోత్సవ సభవారు నేటికీ కొనసాగిస్తూనే ఉండడం ఎంతైనా విశేషం. ఎంతో మహనీయమైన ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ఏర్పడిన భిక్షాటనాపూర్వక శ్రీ త్యాగరాజ స్మరణోత్సవ సభ కమిటీకి శ్రీపతి పండితా రాధ్యుల సాంబమూర్తి తనయుడైన విఖ్యాత గాయకుడు డా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శాశ్వత అధ్యక్షులుగా, యనమండ్ర వేంకటేశ్వరశాస్త్రి కుమారుడైన నాగదేవి ప్రసాద్‌ శాశ్వత కార్యదర్శిగా, మాచవోలు రాజశేఖరశాస్త్రి గౌరవాధ్యక్షులుగా, చతు ర్వేదుల శ్రీరామమూర్తి అధ్యక్షులుగా

ఉంటూ, ఆ కమిటీ ఆధ్వర్యంలో త్యాగరాజ స్మరణోత్సవాలను ప్రతిఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరానికి ఆ సంగీత భక్తి పరిమళాలను ప్రతి ఏటా పంచుతూనే ఉన్నారు. ఈ ఏడాది మార్చి 6వ తేది నుంచి 12వతేది వరకు జరిగే ఈ స్మరణోత్సవాల్లో భాగంగా తొలిరోజైన 6వ తేది ఉదయం 7 గంట లకు నెల్లూరు వేదాయపాళెంలోని త్యాగ రాజ మందిరం నుంచి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్సమేత శ్రీ త్యాగరాజ విగ్రహాలను, శ్రీ త్యాగరాజస్వామి చిత్ర పటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి టౌన్‌ హాలులో ప్రతిష్టించి, పూజలు నిర్వహిస్తా మని కార్యదర్శి యనమండ్ర నాగదేవి ప్రసాద్‌ తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రతి రోజూ ప్రముఖులైన వారెందరో పాల్గొని ఎంతో భక్తిశ్రద్ధలతో సంగీత కచ్చేరీలు, హరికథా గానాలు, గాత్రకచ్చేరీలు, నాద స్వర కచ్చేరీలు వంటి భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తారని, ప్రజలు..భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.

13న 'జీవన దర్శనం' పుస్తకావిష్కరణ

హరికథా భిక్షువు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి అయ్యవారి 'జీవన దర్శనం' పుస్తకాన్ని ఈ ఉత్సవాల్లో 13వతేదీన ఆవిష్కరిస్తారు. ఎమ్మెస్‌ సూర్యనారాయణ రచించిన ఈ పుస్తకాన్ని సాంబమూర్తిగారి సతీమణి, విశ్వవిఖ్యాత గాయకుడు ఎస్‌పి బాలసుబ్ర హ్మణ్యం తల్లిగారైన శ్రీపతి పండితారాధ్యుల శకుంతలమ్మ ఆవిష్కరిస్తారు. ఈ సభను డా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా సినీప్రముఖులు సిరివెన్నెల సీతారామశాస్త్రి, తనికెళ్ళ భరణి, వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్‌లతో పాటు, ప్రముఖ పారిశ్రామికవేత్త కె.ఇ వరప్రసాద్‌రెడ్డి, లాయర్‌ వారపత్రిక అధినేత తుంగా శివప్రభాత్‌రెడ్డి, మురళీకృష్ణ హోటల్స్‌ అధినేత గ్రోసు గోపాలయ్య, మురళీకృష్ణ హోటల్స్‌ సారధి వీరిశెట్టి హజరత్‌బాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే ప్రవచనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నారాయణను వదలని అనిల్‌
    మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
  • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
    వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • వైసిపి వైపు నేతల చూపు
    నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter