rasi 17

1Ariesమేషం

ప్రలోభాలకు లొంగకుండా ఉద్యోగులు పని చేయాలి. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. కొన్ని ముఖ్య విషయాలు ఎవరితోను అనవద్దు. అనుకోని ప్రయా ణాలు, శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. ఆర్ధిక వ్యవహారాల నిర్వహణలో జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపా రాలు లాభదాయకంగా సాగుతాయి.

 

2Taurusవృషభం

ఉద్యోగులకు కార్యసామర్ధ్యంతో పాటు, పనివత్తిడి వుంటుంది. విలువైన వస్తువులను పదిలపరచుకొనండి. పెట్టుబడులకు కొత్త అవకాశాలుంటాయి. ఆరోగ్యం ఫరవాలేదు. ఒక ముఖ్య కార్యం మీద శ్రద్ధ చూపుతారు. కోర్టు వ్యవహారములందు అనుకూలత కలదు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో వ్యాప్తి బాగుండి ఆదాయం పెరుగుతుంది.

 

3Geminiమిధునం

విలువైన వస్తువులు సమకూరడం, దూరప్రయాణా లుంటాయి. బిడ్డల వివాహ విద్యా విషయములపై శ్రద్ధ పెడతారు. అధికారులకు మంచి గుర్తింపు గౌరవాలుం టాయి. ఆరోగ్యం, విద్యా ప్రగతి బాగుంటుంది. ఆర్ధిక ఇబ్బందుల, వ్యవహారంలో ఇబ్బందులు సర్దుకుంటాయి. వృత్తి వ్యాపారాలు విస్తృతి మరియు ఆదాయ వృద్ధి కలదు. స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరుగవచ్చును.

 

4Cancerకర్కాటకం

ఒక మంచి పనికి సంసిద్ధులై కృషి చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. క్రొత్త ఆర్ధికావకాశాలు త్వరలో లభించగలవు. ఆరోగ్యం ఫరవాలేదు. వ్యవహారాలలో తొందరపాటు ప్రదర్శించకండి. ఇబ్బందికరమగు పరిస్థి తులు క్రమంగా చక్కబడగలవు. శుభవార్తలు వింటారు. ఉద్యోగప్రయత్నాలు అనుకూలిస్తాయి.

 

5Leoసింహం

వస్తు, వాహన, ఇంటి రిపేర్లు ఖర్చులు అదనం. విద్యాప్రగతి బాగుంటుంది. అనుకున్న పనులు టెన్షన్‌తో సాగుతాయి. నష్టాలను అటంకాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. సభలు సమావేశాలలో మీదే కీలకపాత్ర వుంటుంది. ముఖ్య నోటీసులు అందుకుంటారు. పను లందు టెన్షన్‌ ఎక్కువగా వుంటుంది. ఆర్ధిక పరిస్థితి క్రమంగా బాగుంటుంది. ఖర్చులు అదుపుచేయాలి.

 

6Virgoకన్య

వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రభుత్వ అనుమతులందు ఆలస్యం. కోర్టుకేసులు వాయిదా పడడం, బంధు ముఖ్యులలో ఒకరికి అనారోగ్య బాధలుంటాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగులు తమ అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగండి. చేయదలచిన పనులందు ఆర్ధిక వ్యవహారా లందు పొరపాట్లు రాకుండా చూచుకొనాలి.

 

7Libraతుల

బిడ్డల విద్యా ఉద్యోగ శుభకార్యాల విషయాలు ఆందోళన కలిగిస్తాయి. అనుకున్న పనులు జరుపుకొన డానికి శ్రమపడాల్సి వుంటుంది. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదాపతాయి. ఉద్యోగులు ప్రలోభాలకు లొంగవద్దు. ఆరోగ్యం జాగ్రత్త, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఆదాయం బాగుంటుంది. అనుకోని ఖర్చులుంటాయి. ఇంట్లో అనారోగ్య బాధితులుంటారు.

 

8Scorpioవృశ్చికం

శుభకార్యాలు నిర్ణయం కాగలవు. దూరప్రయా ణాలుంటాయి. సన్నిహితులే ఇబ్బందులు పెట్టే అవకాశం కలదు. కొత్త వస్తువులు ఇంటికి సమకూరతాయి. విద్యా ప్రగతి, ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులకు సహాయ పడతారు. బంధుత్వ స్నేహాలు బలపడతాయి. వ్యాపార విస్తరణకు పెట్టుబడులకు అవకాశాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరిగి అభివృద్ధి వుంటుంది.

 

9Sagittariusధనుస్సు

ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత, బంధుమిత్ర వర్గంతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త పెట్టు బడులు, స్థిరాస్తుల లావాదేవీలు జరుపుతారు. కుటుంబ సౌఖ్యం, ప్రముఖులతో పరిచయాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో రాబడి పెరుగుట, మంచి ఆర్ధికాభివృద్ధి అవకాశాలు లభించడం జరుగుతుంది. తొరదరపాటు మాటలు, ప్రవర్తన లేకుండా జాగ్రత్తపడండి.

 

10Capricornమకరం

వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా వుంటాయి. వ్యవహారాలలో మీకు మంచి విలువ వుంటుంది. కొద్దిపాటి అనారోగ్య బాధలుంటాయి. ఉద్యోగులు, ఇతరు లతో జాగ్రత్తగా మెలగండి. వ్యాపారులకు, ఉద్యోగులకు అధికారుల వత్తిడి వుంటుంది. విద్యాప్రగతి బాగుం టుంది. కుటుంబంలో కొంత అనుకూలత లేకున్నా సర్దుబాటు చేసుకుంటారు. ఖర్చులు అధికంగా వుంటాయి.

 

11Aquariusకుంభం

శుభకార్య నిర్ణయాలు జరుగుతాయి. ఇతరుల పనుల మీద ప్రయాణాలుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలుంటాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. కాంట్రాక్టు పనులు, గృహనిర్మాణ పనులు నిదానంగా సాగుతాయి. అనవసర ఖర్చులు తప్పవు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు జరుగవచ్చును.

 

12Piscesమీనం

ఉద్యోగులు తమ అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగాలి. శుభకార్యాలలో పాల్గొంటారు. అదనపు ఖర్చులు తప్పనిసరిగా వుంటాయి. ఆహ్వానాలు, నోటీసులు అందుకుంటారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. విద్యాప్రగతి బాగుంటుంది. కుటుంబసౌఖ్యం కలదు. పనులు సక్రమంగా సానుకూలంగా జరుగు తాయి. కుటుంబ సభ్యులకు అనారోగ్య బాధలుంటాయి.

rasi 10

1Ariesమేషం

ఖర్చుల భారం పెరుగుతుంది. అయినా అవసరాలలో డబ్బు అందుతుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగవు. ఆదాయం తగ్గుతుంది. తొందరపాటు ప్రవర్తన, మాటలు తగ్గించుకొనండి. ముఖ్య అవసరాలను కొన్నింటిని వాయిదా వేసికొనక తప్పదు. పనులందు టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం కూడా స్వల్ప ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబసౌఖ్యం బాగుంటుంది.

 

2Taurusవృషభం

ఆర్ధిక పరిస్థితి బాగుండి ఆదాయం సంతృప్తి కరము. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు. చేపట్టిన పనులు నిదానంగా జరుగు తాయి. కొత్త పథకాలు ఆలోచనలతో వృత్తి వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్య తలు, శ్రమ ఉంటుంది. పెద్దమొత్తాలలో లావాదేవీలను వాయిదా వేయండి. శ్రమ ఉంటుంది.

 

3Geminiమిధునం

బంధుమిత్రులకు సహాయపడతారు. అదనపు ఆదాయ ముంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. విలువైనవి నూతనమైనవి వస్తు సామాగ్రిని సమకూర్చుకొంటారు. ఉద్యోగావకాశాలు లభించగలవు. సభలు సమావేశాలలో ప్రముఖబాధ్యతలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగి ఆదాయం పెరుగుతుంది. కొత్త పెట్టు బడులకు అవకాశాలు బాగుంటాయి.

 

4Cancerకర్కాటకం

అనుకున్న పనులు సులువుగా జరుగుతాయి. వృత్తి వ్యాపారాలు వృద్ధి చెంది ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ పరంగా స్వల్ప ఇబ్బందులుండవచ్చును. సోదరుల కుటుంబాలకు మేలు జరుగుతుంది. శుభ కార్యాలు నిర్ణయం కాగలవు. ఆర్ధిక లావాదేవీలు, డబ్బు వ్యవహారాలలో విశ్రాంతి లేకుండా ఉంటారు. కుటుంబ సభ్యులతో కొద్ది విభేదాలు చోటు చేసికొంటాయి.

 

5Leoసింహం

పనుల వత్తిడి, అనుకున్న పనులు సవ్యంగా జరుగక టెన్షన్‌ పడుతుంటారు. వ్యాపారవృద్ధి సరిగా ఉండదు. ఆర్ధికావకాశాలు చేజారిపోయే పరిస్థితులుంటాయి. ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి. వస్తువాహన గృహ రిపేర్ల ఖర్చులు పైనబడతాయి. నిర్మాణాలు జరుపు తున్న వారికి, కాంట్రాక్టర్లకు పనులు మందగించగలవు. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత తక్కువ.

 

6Virgoకన్య

ఆర్ధికస్థితి బాగుండి వ్యాపారవృద్ధి అవకాశాలు లభించి ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు, షేర్లపై లాభాలుంటాయి. అనుకున్న పనులు బాగా శ్రమపెట్టి నెరవేరగలవు. వాహనాలు నడిపేవారు, కరెంటు యంత్రాలతో పనులు చేసేవారు గాయాలు తగలకుండా జాగ్రత్తపడాలి. నూతన వస్తువులను సమకూర్చు కొంటారు. శుభకార్యాలు నిర్ణయం కాగలవు.

 

7Libraతుల

ఆర్ధిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగక, ఆదాయము తగ్గు తుంది. స్తిరాస్తుల లావాదేవీలు, కొత్త పెట్టుబడుల విష యంలో తొందరపడవద్దు. గృహ వస్తు వాహన రిపేర్ల ఖర్చులుంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. బంధువర్గంతో విభేదాలు చోటు చేసికొంటాయి. తొందర పాటు నిర్ణయాలు చేయవద్దు. మొగమాటాలకు పోవద్దు.

 

8Scorpioవృశ్చికం

అనుకున్న పనులు నిదానంగా జరిగి సానుకూలం కాగలవు. వ్యాపారవర్గాలకు మంచి అభివృద్ధి ఉండి ఆదాయం పెరుగుతుంది. వృత్తిపరంగా నిలద్రొక్కు కుంటారు. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు. ముఖ్యమైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త పరుచుకొనండి. బిడ్డల విద్యా, వివాహ విషయాలలో శ్రద్ధ చూపుతారు. శుభకార్యాలు నిర్ణయం కాగలవు.

 

9Sagittariusధనుస్సు

వృత్తి వ్యాపారాలు నిర్వహించేవారికి, కాంట్రాక్టర్లకు ఆర్ధిక అవకాశాలు బాగుండి, ఆదాయం పెరుగుతుంది. అయితే వర్కర్లతో సమస్యలు రావచ్చును. చేసే పనులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభకార్యాలు నిర్ణయం కావడం, దూరప్రయాణాలుంటాయి. స్థిరాస్తుల మీద, పెట్టుబడుల మీద రాబడి ఉంటుంది. రావలసిన బాకీలు కొంతవరకు అందుతాయి.

 

10Capricornమకరం

వృత్తి ఉపాధి పథకాలలో నిలద్రొక్కుకొని, ఆదాయం పెంచుకొంటారు. వ్యాపారవృద్ది అవకాశాలు లభిస్తాయి. అనుకొన్న పనులకు ఆటంకాలు కలుగుతుంటాయి. అయినా ఏదో విధంగా సానుకూలం చేసికొంటారు. ఉద్యోగులకు కార్యసామర్ధ్యం బాగుంటుంది. స్థిరాస్తులు, విలువైన వస్తువులు ఏర్పరచుకునే అవకాశాలుంటాయి. శుభకార్యాలు నిర్ణయం కాగలవు.

 

11Aquariusకుంభం

చేపట్టిన పనులను పట్టుదలతో సానుకూలం చేసికొన గలరు. ఋణ బాధలు సర్దుబాటు కాగలవు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి బాగుండి ఆదాయం పెరుగుతుంది. అయితే పనులందు అప్పుడప్పుడు టెన్షన్‌ ఉంటుంది. కుటుంబ, ఆర్ధిక విషయాలను తొందరపడి ఇతరులకు వెల్లడించవద్దు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది.

 

12Piscesమీనం

వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు. తొందరపాటు మాటలు, ప్రవర్తన లేకుండా వ్యవహరిం చండి. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. నిర్మాణాలు, కాంట్రాక్టు పనులు చురుకుగా సాగగలవు. అదనపు ఖర్చులుండినను ఇబ్బంది ఉండదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగి ఆదాయం పెరుగుతుంది.

rasi 3

1Ariesమేషం

ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. స్థిరాస్తుల లావాదేవీలందు తొందరపాటు వద్దు. ఉద్యోగు లకు, యజమానులకు వర్కర్లతో సమస్యలుండగలవు. దూర ప్రయాణాల వల్ల శ్రమ ఉంటుంది. ఉన్నత విద్యావ కాశాలు లభించగలవు. వారాంతంలో అనవసర ఖర్చు లుండగలవు. ఆర్ధికంగా బలపడడానికి క్రొత్త ప్రయ త్నాలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు.

 

2Taurusవృషభం

శాస్త్ర సాంకేతిక వైద్య రంగాల వారికి మంచి అవకాశాలు దొరకగలవు. ఉద్యోగ ప్రయత్నాలు దొరికే పరిస్థితి ఉన్నది. సమావేశాలు, చర్చలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు దొరకగలవు. కోర్టు కేసులందు అనుకూలత కలదు. షేర్ల యందు కొద్ది లాభాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి అభివృద్ధి, ఒక మోస్తరుగా ఆదాయముంటుంది.

 

3Geminiమిధునం

ఆస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలలో అను కూలత ఉంటుంది. షేర్లు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. వస్తు వాహన గృహ రిపేర్లు ఉంటాయి. బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు ఆర్ధిక ఒడిదుడుకులుంటాయి. ఉద్యోగులు అధికారులతో పబ్లిక్‌తో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం ఫరవాలేదు. ఉన్నత విద్యావకాశాలకు ప్రయ త్నాలు చేస్తారు. అనుకున్న పనులు జరుపుకుంటారు.

 

4Cancerకర్కాటకం

శుభకార్య ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఇతరులతో చర్చలు సంప్రదింపులు జరుపుతారు. సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం, ఉన్నత విద్యావ కాశాలు పొందడం జరుగుతుంది. బిడ్డలతో కొద్దిపాటి సమస్యలు, ఇతరుల పరామర్శనలు చేయడం, దూర ప్రయాణాలు హఠాత్తుగా నిర్ణయం కావడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి వైపు సాగుతారు.

 

5Leoసింహం

ఇబ్బంది పరిస్థితుల్లో సర్దుకొనిపోవడం, బాకీ వసూళ్ళందు సంయమనం పాటించడం మంచిది. ఉద్యోగులందు పని సామర్ధ్యం బాగుండి అధికారుల అనుకూలత బాగుంటుంది. స్థాన చలనము ఉండ వచ్చును. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చును. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు లభించగలవు. స్థిరాస్తుల విషయంలో తొందరవద్దు.

 

6Virgoకన్య

ఉద్యోగులకు స్థానమార్పులు, అధికారుల ఆదరణ ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. షేర్లు పెట్టుబడి రంగాల వారికి కొద్దిపాటి లాభాలుం టాయి. దూరప్రయాణాలు నిర్ణయం కావడం, శుభకార్య పనులందు పాల్గొనడం ఉంటుంది. ఉన్నత విద్యావకా శాలు దొరుకుతాయి. బంధువర్గాలతో సంప్రదింపులు ఫలిస్తాయి. సోదరులతో కొద్దిపాటి విభేదాలుంటాయి.

 

7Libraతుల

ఉద్యోగ వర్గాలు ఇటు పబ్లిక్‌తోను అటు అధికారుల తోను జాగ్రత్తగా మెలగాలి. ఖర్చులు ఒకదాని తరువాత ఒకటి ఏదో ఒక రూపంలో పైనబడుతుంటాయి. కుటుంబ సభ్యులకు అనారోగ్య బాధలుంటాయి. క్రయవిక్రయాల లావాదేవీలు వాయిదా పడటం మంచిది. చిన్న ఉద్యోగా వకాశాలు దొరకవచ్చును. ఉన్నత విద్యావకాశాలు విద్యార్థులకు లభిస్తాయి.

 

8Scorpioవృశ్చికం

అనవసరంగా ఇతరులచేత మాటలు పడవలసి రావచ్చును. శుభకార్య ప్రయత్నాలలో అనుకూల సంకే తాలుంటాయి. షేర్ల మీద లాభాలుండగలవు. ఉద్యో గులు, వ్యాపారులపై అధికారుల వత్తిడి ఎక్కువగా ఉం టుంది. ఉన్నత విద్యావకాశాలు లభించగలవు. ఋణ సమస్య కొంత వరకు పరిష్కారం కావచ్చును. నిరుద్యో గులకు అవకాశాలు సరిగా ఉండవు.

 

9Sagittariusధనుస్సు

మంచి ఉన్నత విద్యావకాశాలు దొరుకుతాయి. స్థిరాస్తుల కొనుగోలు అవకాశాలు దొరకగలవు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలు, ప్రతిభ బాగుంటుంది. కోర్టు వ్యవహారాల వల్ల ఇబ్బందులుండే అవకాశాలున్నవి. ఉద్యోగులకు బాధ్యతలు పెరగడం, హోదా పెరగడం ఉంటుంది. వ్యాపార పరంగా ఒడిదుడుకులు, ఇబ్బందు లుండవచ్చును. సామాన్య ఆదాయం ఉంటుంది.

 

10Capricornమకరం

రాజకీయ వర్గాల వారికి సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో చిన్న అవకాశాలు లభించగలవు. ఉద్యోగులు అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది. అనవసర వ్యవహారాలలోకి లాగడానికి ప్రయత్నాలుండవచ్చును. అనుకున్న పనులు సక్రమంగా జరుగుతున్నా టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. ఆర్ధిక స్థితి బాగుంటుంది.

 

11Aquariusకుంభం

స్థిరాస్తుల లావాదేవీలందు జాగ్రత్తపడండి, లేకుంటే పేచీలు రావచ్చును. అవసరాలు, చెల్లింపులను వాయిదా వేసికొనడం మంచిది. అవసరాలకు ఋణాలు చేయ వలసి వస్తుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగి వత్తిడి ఎక్కువుగా ఉంటుంది. ఉద్యోగార్ధులు కొంత వేచి ఉండవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలలో కొంత ప్రతి కూలత ఉంటుంది. గాయాలు తగలవచ్చును.

 

12Piscesమీనం

ఉద్యోగులకు మంచి కార్యసామర్ధ్యం, అధికారుల సహకారం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం బాగుం టుంది. ఇతరులకు మాట, ధన రూపంలో సహాయ పడతారు. స్వల్పంగా అనారోగ్య బాధలుంటాయి. ముఖ్య మైన సమాచారం, పత్రాలు అందుకుంటారు. మంచి ఆలోచనలు, చక్కని ఆర్ధిక ప్రణాళికలతో ముందుకు సాగుతారు. అనుకున్న పనులు సవ్యంగా సాగుతాయి.

Page 1 of 44

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • రాజకీయమా? రక్త సంబంధమా?
    నెల్లూరుజిల్లాలో బెజవాడ, మేకపాటి, సోమిరెడ్డి, నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి రాజకీయ కుటుంబాలున్నాయి. అన్ని కుటుంబాలలో కూడా పదవుల వద్దో, ఆస్తుల దగ్గరో మనస్పర్ధలు, విభేదాలు వచ్చాయి. సొంత అన్నదమ్ములే విరోధులుగా మారారు. అయితే ఈ కుటుంబాలన్నింటితో పోలిస్తే ఆనం సోదరుల మధ్యే…
  • పంచాయితీలకు ప్రమోషన్‌!
    జిల్లాలో ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్‌గా ఉండగా గూడూరు, కావలి, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేటలు మున్సిపాల్టీలుగా ఉన్నాయి. వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేట మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్చడం జరిగింది. కాగా, జిల్లాలో మరో 9 మేజర్‌ పంచాయితీలను…
  • చుక్కలు చూపించిన జగన్‌
    ఉత్తరాన నదీ ప్రవాహం, ఈశాన్యంలో నీళ్ళు వంటి పక్కా వాస్తు చూసి చంద్రబాబు అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. ఆయన వాస్తు పిచ్చికి పాత రాజధాని హైదరాబాద్‌లోనే కాదు, అమరావతిలోనూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి…
  • ఆనంకు 'హై'షాక్‌
    వందేళ్ళకు పైగా చరిత్ర... లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత... ఒకే ప్రాంగణంలో ఆరో తరగతి నుండి న్యాయవాద విద్య, పీజీ కోర్సుల వరకు... అతి తక్కువ ఖర్చుతో చదువు పూర్తి చేసుకునే వేదిక... నెల్లూరులోని వి.ఆర్‌. విద్యాసంస్థలు... వాస్తవానికి వెంకటగిరి…
  • నెంబర్‌ గేమ్‌లో నెగ్గేదెవరు?
    బేరాలు... రాయబారాలు... క్యాంపులో మందు కంపు... పెరుగుతున్న ఓటు రేటు... ఎత్తులు... పైఎత్తులు... పార్టీ అధినేతల స్వీయ పర్యవేక్షణ... వ్యూహాలు... ప్రతివ్యూహాలతో 'స్థానిక' ఓటర్లకు గాలాలు... మాకు రెండు చేపలు పడ్డాయంటే, మా వలలో మీవి నాలుగు చేపలు పడ్డాయంటూ పోటాపోటీగా…

Newsletter