వార్త – రాష్ట్రం మధ్యలోనే రాజధాని.       - చంద్రబాబు

వ్యాఖ్య – కొలతలేసి పెడతారా.

వార్త – పన్నులు స్థానికంగానే చెల్లించాలి.- ఎన్జీఓ నేత అశోక్ బాబు.

వ్యాఖ్య – ప్రభుత్వం స్థానికంగా ఉంటే ఆటోమేటిక్ గా అదే జరుగుతుంది.

వార్త – వైద్యుడు కాబోయి ఆర్థికవేత్త అయిన మన్మోహన్.  - మన్మోహన్ కుమార్తె పుస్తకంలో వెల్లడి.

వ్యాఖ్య – అలా జరిగుంటే సోనియా ఓ మంచి రిమోట్ కంట్రోల్ ను కోల్పోయి ఉండేదేమో.

వార్త – ఆరెస్సెస్ హిందూ దేశం.  - ఆరెస్సెస్ అధినేత భగవత్.

వ్యాఖ్య – అది చెప్పుకోబల్లేదు. ఈ దేశ పునాదులు అవే.

వార్త – ఏకాభిప్రాయంతోనే రాజధాని ఏర్పాటు చేయాలి.    - పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.

వ్యాఖ్య – ఏకాభిప్రాయంతోనే మీ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందా.

వ్యార్త – చంద్రబాబు ప్రతిపక్షనేతగానే వ్యవహరిస్తున్నారు.            - మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ.

వ్యాఖ్య – పదేళ్లు అలవాటు... ఒక్రటెండు నెలల్లోనే పోతుందా.

వార్త – భాజపా విజయంలో ప్రతిపక్షానిదే పాత్ర.    -అద్వానీ.

వ్యాఖ్య – కీలకపాత్ర వారిదే...

వార్త – మంత్రులకు బాబు మార్కులు. అత్యధికులు పరీక్ష తప్పారు.

వ్యాఖ్య – ప్రజలేసిన మార్కుల్లో చంద్రబాబుకు కూడా సున్నాలే.

వార్త – రుణమాఫీకి నిధుల వేట.- తెలంగాణ సర్కార్ కసర్తుతు.

వ్యాఖ్య – దీని కోసం హైదరాబాద్ లో వున్న ఆంధ్రావాళ్ల ఆస్తులను లాగేసుకోరుగా.

వార్త – 20 ఏళ్ల పాటు విపక్షం ఉండదు.     -చంద్రబాబు.

వ్యాఖ్య – కేంద్రంలోనా... ఇంకేదన్నా రాష్ట్రంలోనా

వార్త – జిల్లాకో వ్యవసాయ విశ్వవిద్యాలయం.          -మంత్రి పుల్లారావు.

వ్యాఖ్య – ముందు రాష్ట్రం మొత్తానికి ఒకటి ఏడవండి చాలు.

వార్త – కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు.       - మంత్రి పల్లె రఘనాథరెడ్డి.

వ్యాఖ్య – నిజాంలాగా వ్యవహరిస్తున్నాడంటే ఒక్క మాటతో పోలా...

వార్త – జగన్ అక్రమాస్తులు 43 వేల కోట్లు.  - సోమిరెడ్డి.

వ్యాఖ్య – ఆడిటింగ్ మీరే చూస్తున్నట్లు చెప్పారే.

వార్త – అండగా నిలిస్తే పార్టీ నుండి వెలివేశారు.        - వైకాపాకు జూపూడి రాజీనామా.

వ్యాఖ్య – తెలుగుదేశంలోకి పోవాలంటే జగన్ ను తిట్టాల్సిందే.

వార్త – చర్చించుకుంటేనే సమస్యల పరిష్కారం.        -ఇద్దరు సీఎంలకు రాఘవులు సూచన.

వ్యాఖ్య – సమస్యలు పరిష్కారమైతే వారికి పనేముంటుంది.

వార్త – బాబు మాటలు మయసభను మించిపోయాయి.        - ఏపిసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి.

వ్యాఖ్య – మాటలు ఆకాశంలో... చేతలు పాతాళంలో అంటారా.

వార్త – ఋణమాఫీ ఆటంకాలను అధిగమిస్తాం.        - ఎంపీ కంభంపాటి.

వ్యాఖ్య – ప్రభుత్వకాలం పూర్తయ్యేనాటికా.

వార్త – భాజపా దేశాన్ని ముంచుతుంది.     - ప్రకాశ్ కారత్ ధ్వజం.

వ్యాఖ్య – మీకున్న దేశభక్తి వాళ్లకు లేదంటారా.

వార్త – గవర్నర్ కు అధికారాల అప్పగింత సరికాదు.  - తెలంగాణ మంత్రి మండలి నిరసన.

వ్యాఖ్య – మరి మీకు అధికారమిస్తే కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లుగా అయ్యిందే.

వార్త – రైతు ఋణాలు మాఫీ చేసి తీరుతాం. – మంత్రి పల్లె రఘునాథరెడ్డి.

వ్యాఖ్య – మళ్ళీ వచ్చే ఎన్నికల దాకా ఇదే చెప్పేటట్లున్నారు.

వార్త – చంద్రబాబు మారాడు. – ఎన్జీఓ నేత అశోక్ బాబు.

వ్యాఖ్య – ఫేస్ కు ప్లాస్టిక్ సర్జరీ ఏమన్నా చేయించాడేమో.

వార్త – కరెంట్ ఆదాకు ప్రాధాన్యం. – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు.

వ్యాఖ్య – ఫ్యాన్ లకు బదులు విసనకర్రలు, లైట్లకు బదులు కిరోసిన్ దీపాలు, కొవ్వొత్తులు వాడమంటే సరి.

వార్త – విద్వేషాలు రెచ్చగొట్టడం కేసీఆర్ కు తగదు. – చంద్రబాబు.

వ్యాఖ్య – ఆయన్ను సీఎం చేసిందే అది... ఎందుకు వదులుకుంటాడు.

వార్త – పీవీకి భారతరత్న ఇవ్వాలి. – కేసీఆర్.

వ్యాఖ్య – ఇప్పుడు కాంగ్రెస్ లేదు కాబట్టి ఇవ్వొచ్చులే.

వార్త – సభలో హూందాగా మెలగండి. – ఎంపీలకు స్వీకర్ హితవు.

వ్యాఖ్య – ముందు హూందాతనమంటే ఏంటో వివరించండి.

వార్త – రాహుల్ కు ప్రధాని సరకు లేదు. – బీజేపీ.

వ్యాఖ్య – ప్రతిపక్ష నేత సరకే లేదని ఆయనే ఒప్పుకున్నాడు కదా.

వార్త – అమరావతి కేంద్రంగా రాజధాని.

వ్యాఖ్య – ఒక్కోనెల ఒక్కో ఊరి పేరు ప్రచారంలోకి తెస్తే అన్ని చోట్లా భూముల రేట్లు పెరుగుతాయి.

వార్త – జైసమైక్యాంధ్ర పార్టీ కార్యాలయం మూత.

వ్యాఖ్య – ఇక ఒకరోజు పెట్టుకున్నా అద్దె దండగ కదా.

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…

Newsletter