vpr jaganజిల్లాలో జైత్రయాత్రగా సాగుతున్న వై.యస్‌.జగన్‌ పాదయాత్రలో ప్రముఖ సేవాతత్పరుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడుగులు కలిపాడు. జగన్‌తో కలిసి నడిచాడు. జిల్లాలో వైకాపాకు మరింత బలాన్ని జోడించాడు.

గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా వుంటున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తిరిగి రాజకీయ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. తన ఆలోచనలు, ఆశయాల ఆచరణకు వైకాపానే వేదికగా ఎంచుకున్నాడు. అందుకే తానుంటున్న పార్టీ సేవకే అంకితం కావాలనుకున్నాడు. పార్టీలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలను కున్నాడు. ఇందులో భాగంగానే జనవరి 28వ తేదీ ఉదయం 6.30గంటలకే ఆయన ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. దాదాపు 150కార్లతో వందలాదిమంది అభిమానులు విపిఆర్‌కు తోడుగా జగన్మోహన్‌రెడ్డితో కలసి నడవడానికి బయలు దేరారు. సుమారు 8.30గంటల ప్రాంతంలో గూడూరు నియోజకవర్గంలోని తిమ్మసముద్రం గ్రామంలో రాత్రి బసచేసిన వసతి ప్రాంగణానికి చేరుకున్నారు. వందలాది మంది అభిమానుల సమక్షంలో జగన్‌ చిరునవ్వుతో ప్రభాకర్‌రెడ్డిని సాదరంగా ఆహ్వానించి ఆలింగనం చేసుకున్నారు. అక్కడ నుంచి దాదాపు 4గంటలసేపు మధ్యాహ్నం భోజన విరామం వరకు విపిఆర్‌ తన వెంట వచ్చిన అభిమానుల తోడుగా జగన్‌తో కలసి నడిచారు.

2014 ఎన్నికలకు ముందే విపిఆర్‌ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం తెలిసిందే! అయితే ఎన్నికల తర్వాత ఆయన కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా వున్నాడు. వైకాపా కార్యక్రమాలకు కూడా వెళ్ళేవాడు కాదు. ఈ దశలో ఆయనను తమ పార్టీలోకి తీసుకోవాలని తెలుగుదేశం అధిష్టానం చేయని ప్రయత్న మంటూ లేదు. కాని ఎవరి ప్రయత్నాలు ఎలా వున్నా ఆయన మనస్సాక్షి మాత్రం వైకాపా వైపే నిలిచింది. వైకాపాలో ఆయన తిరిగి

ఉత్సాహంగా పని చేస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది.

vpr ttdనిత్యకళ్యాణం పచ్చతోరణంగా వెలసిల్లే కలియుగ దేవదేవుడు కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రానికి ప్రతిరోజూ లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఏడుకొండలవాడి మీద భక్తితో ఎండను, వానను లెక్క చేయక వచ్చే భక్తుల కోసం టీటీడీ ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది. భగవంతుడిని సేవించడమే కాదు, ఆ భగవంతుడి ఆరాధనలో తరించే భక్తులను సేవించుకోవడం ఓ గొప్ప పుణ్య కార్యక్రమమని భావించిన నెల్లూరీయుడు, విపిఆర్‌ ఫౌండేషన్‌ అధినేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తిరుమల ఆలయంలో కదిలే పైకప్పు(రీట్రాక్టబుల్‌ రూఫ్‌) నిర్మాణం కోసం కోటి9లక్షల రూపా యలు విరాళం ప్రకటించారు. ఇందులో మొదటి విడతగా 22వ తేదీ తన సతీమణి శ్రీమతి ప్రశాంతితో కలిసి 55లక్షల డి.డిని టిటిడి జె.ఇ.ఓ శ్రీనివాసరాజుకు అందజేశారు.

భక్తులకు ఎండ, వానల నుండి రక్షణ కల్పించేందుకు ఈ రూఫ్‌ ఉపయోగపడుతుంది. వేమిరెడ్డి దానగుణాన్ని జె.ఇ.ఓ శ్రీనివాసరాజు అభినందించారు.

vprవేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఏ పార్టీలో చేరతాడు...? ఆ అదృష్టం ఆ శుభ యోగం ఏ పార్టీకి లభిస్తుంది..? ఇది ఈరోజు వరకు ఆయనను తెలిసిన వారందరూ వేసుకుంటున్న ప్రశ్న. ఆయనను దగ్గరగా గమనించే వారందరూ చేసుకుంటున్న చర్చ. విపిఆర్‌ అంటే జిల్లాలో సేవకు మారుపేరు. మంచి తనానికి పెట్టిన పేరు.

ఓ వైపు వ్యాపారరంగంలో తలమునకలై వుంటూనే మరో వైపు ఈ సమాజానికి మనమేం చేయగలమనే తపనతో ఇటు సేవారంగంలోనూ అటు ఆథ్యాత్మిక రంగంలోనూ తనకు చేతనైన కార్యక్రమాలను చేస్తూ ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తనదైన ముద్రవేసుకున్నాడు.

కొంతమంది వ్యక్తులకు పార్టీల వల్ల మేలు జరుగుతుంది. మరికొంతమంది వ్యక్తుల వల్ల పార్టీకి మంచి జరుగుతుంది. విపిఆర్‌ ఈ రెండవ కోవకు చెందినవాడు. ఆయనకు నటించడం చేతకాదు, చెడు అంటే తెలియదు, నమ్మిన సిద్ధాంతాన్ని, నమ్ముకున్న వ్యక్తులను కాపాడుకుంటూ తన పని తాను చేసుకుపోయే వ్యక్తిత్వం. తన సేవా కార్యక్రమాలకు ఒక వేదికగా రాజకీయ రంగాన్ని ఆయన ఎంచుకున్నప్పుడు ఆయనకు ముందుగా గుర్తొచ్చింది దివంగత నేత డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి. వై.యస్‌. అంటే ఆయనకు ఇష్టం. వై.యస్‌. వ్యక్తిత్వమంటే ఆయనకి ఇష్టం. వై.యస్‌. చేసిన ప్రజోపయోగ కార్యక్రమాలంటే ఆయనకు ఇష్టం. ఆడిన మాట తప్పని వై.యస్‌. నిజాయితీ అంటే ఆయనకు ఇష్టం. అందుకే వై.యస్‌. కుమారుడికి అండగా వుండాలనుకున్నాడు, జగన్‌రెడ్డి వైపు అడుగులు వేశాడు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలు, వ్యాపార వ్యవహారాలు రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించడానికి ఆయనకి ఇబ్బంది కలిగిస్తుండడంతో ఆయన పార్టీ నుండి దూరంగా వచ్చేశాడు. రాజకీయాలకు కొద్దిరోజులు విరామం ఇద్దామనుకున్నాడు. అయితే చిక్కిందే అదనుగా తెలుగుదేశం పార్టీ ఆయనకు వలవేసింది. తమ పార్టీలోకి రావాలంటూ రాయబారాలు నడిపింది. విపిఆర్‌ సేవలకు తగిన గుర్తింపు వచ్చేలా ఆయనకు హోదా కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పింది. ప్రభాకర్‌రెడ్డి స్వతహాగా మెతక. వ్యాపార వ్యవహారాలలో ఆయన ఎంత గట్టిగా వుంటాడో, వ్యక్తిగత విషయాలలో అంత సున్నిత మనస్కుడు. మొహమాటం ఎక్కువ. ఇలాంటి లక్షణాలే ఆయన తెలుగుదేశంపార్టీలో చేరడానికి ఆయన చేత 'యస్‌' అనిపించాయి.

అయితే తానొకటి తలిస్తే విధి మరొకటి తలచింది. తాను పార్టీలోకి రావడానికి సముచితంగా వున్నానని విపిఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినప్పటి నుండి తెలుగు నేతల పోకడ మారిపోయింది. పార్టీ అధినేత సమక్షంలో పార్టీలో చేరాలని వాళ్ళే తేదీ ఖరారు చేయడం, వాళ్ళే మళ్ళీ రద్దు చేయడం. బాస్‌ మిమ్మల్ని రమ్మంటున్నాడని హడావుడి చేయడం, మళ్ళీ ఇప్పుడు కాదులే అని వాయిదా వేయడం. ఎప్పుడూ చెప్పిన మాటపై నిలబడకపోవడం, ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ని వారికై వారే రద్దు చేయడం వంటి వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభాకర్‌రెడ్డికి ఆ పార్టీ నేతల చిత్తశుద్ధి, అంకితభావం ఏపాటిదో అర్ధమైపోయింది. వీరిదంతా ఉత్తుత్తి ప్రగల్భాలే అన్న నిర్ణయానికొచ్చేశాడు. ఇదే సమయంలో ఆయనకు మళ్ళీ జగన్‌మోహన్‌రెడ్డి దగ్గర నుండి పిలుపొచ్చింది. మీకిచ్చిన మాటకి మేం కట్టుబడి వున్నాం. మీరు చూపిన ప్రేమ మేమెన్నటికీ మరువలేకున్నాం అంటూ వై.యస్‌.ఆర్‌ పార్టీ నేతలు ఆయన ముందు వాలిపోయారు. మార్చిలో రానున్న రాజ్యసభ ఎన్నికల్లో మా అభ్యర్థి మీరే అంటూ ఆయనకు హారతులు పడుతూ పార్టీలోకి రావలసిందిగా ఆహ్వానించారు. దివంగత మహానాయకుడు డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి గారి ఆశయ సాధన కోసం స్థాపించబడి, మాట తప్పని మడమ తిప్పని ఆయన వారసుడు వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ వేదికగా మీ సేవలు కొనసాగించాలని విపిఆర్‌ని అభ్యర్థించారు. మనిషెక్క డున్నా మనసు అక్కడే వుండడంతో వెంటనే విపిఆర్‌ తన ఆమోదాన్ని తెలిపాడు. పార్టీలో చేరడానికి సిద్ధమైపోయాడు.

విషయం తెలుసుకున్న తెలుగుతమ్ముళ్ళు ఆయన వెంటపడ్డారు. బ్రతిమలాడారు. అన్ని మార్గాలూ అన్వేషించారు. ఎలాగైనా వొప్పించాలని చూశారు. కానీ ఆయన మారలేదు. వై.యస్‌. అభిమానిగా, మాటతప్పని మంచి మనిషిగా మరోసారి తనను తాను రుజువు చేసుకున్నాడు. త్వరలో వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో అధికారికంగా చేరనున్నాడు. ఇది శుభపరిణామం. వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ మ్రోగించనున్న విజయభేరికి ఇది ఆరంభం. మంచితనం మానవత్వం మూర్తీభవించిన విపిఆర్‌ లాంటి వాళ్ళు వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరడం డా|| వై.యస్‌.రాజశేఖరరెడ్డికి ఇచ్చే నిజమైన నివాళికి నిదర్శనం. వై.యస్‌. వారసుడిపైనా ఆయన ఇస్తున్న వాగ్ధానాలపైనా, ఆయన చేస్తున్న ప్రమాణాలపైనా ప్రజలకు నాయకులకు, మేధావులకు కలుగుతున్న నమ్మకానికి విపిఆర్‌ లాంటి వ్యక్తులు ఆ పార్టీలో చేరడమే తార్కాణం.

నెల్లూరులో ఆరంభం కానున్న ఈ శుభఘడియలు ఇలాగే కొనసాగి రాష్ట్రమంతా వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి, ఆ పార్టీ అధినేత వై.యస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి నీరాజనాలు పలకాలని వై.యస్‌. అభిమానుల ఆకాంక్ష.

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…
  • టీడీపీ నుండి... లోక్‌సభకెవరో?
    1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…

Newsletter