vprఈ నెల 19, 20 తేదీలలో నెల్లూరు, కనుపర్తిపాడులోని విపిఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వ ర్యంలో వికలాంగులకు ఉచిత వైద్య శిబి రాన్ని నిర్వహిస్తున్నారు. 19వ తేదీ రాజ్య సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జన్మ దినోత్సవం సందర్భంగా వికలాంగులకు ఆయన జన్మదిన కానుకగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. 19వ తేదీ ఉదయం 9గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్ర మానికి ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగాను, నెల్లూరు గ్రామీణ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ విశిష్ఠ అతిథులుగాను విచ్చేయనున్నారు. వికలాంగులు, కాళ్ళు లేని వారిని నిపుణులచే పరీక్షించి వారికి ఉచితంగా జైపూర్‌ ఫుట్స్‌ను అమరుస్తారు. శ్రీ భగవాన్‌ మహావీర్‌ వికలాంగుల సహాయ సమితి హైదరాబాద్‌ వారి సహకా రంతో విపిఆర్‌ ఫౌండేషన్‌ ఈ కార్యక్ర మాన్ని నిర్వహిస్తుంది. వికలాంగులు ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు జెరాక్స్‌ కాపీలతో పాటు రెండు పాస్‌పోర్టు సైజ్‌ఫోటోలు తీసుకుని శిబిరానికి హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. వివరాలకు 7680944389, 8885831414 నెంబర్లలో సంప్రదించవచ్చు.

vprవిపిఆర్‌... అంటే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. జిల్లాలోనే కాదు, అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలోనూ ప్రస్తుతం ఆయన టాక్‌ ఆఫ్‌ ది పాలిటిక్స్‌. ఆయన రాజకీయవేత్త కాదు, ఆయనది రాజకీయ కుటుం బమూ కాదు, అసలు ఆలోచిస్తే నేటి రాజకీయాలకు సరిపడే మనస్తత్వమూ కాదు. కాని, ఇప్పుడు అన్ని పార్టీల చూపు ఆయన వైపే వుంది. అందుకు కారణం... ఆయన సేవా ప్రభాకరుడు. ఆపదలో వున్న వారిని ఆదుకోవ డమే ఆయనకు తెలిసింది. కష్టాలలో వున్న వారి కన్నీళ్ళు తుడవడమే ఆయన నేర్చుకుంది. అనాధలకు ఆయన ఆపద్భందువు, పేదోళ్ళకు ఆయన కనిపించే దైవం. ఆథ్యాత్మిక రంగంలో ఆయన ఓ మణిదీపం. ఆయన లక్ష్యాలను, లక్షణాలను గమనిస్తే ఆయన ఓ అరుదైన వ్యక్తిత్వం కూడిన మానవతావాది. సున్నిత మనస్తత్వం కలిగిన మహామనీషి.

అందుకే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఆయన వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఇటు అధికారపక్షం తెలుగుదేశం, అటు ప్రతిపక్షం వై.సి.పి లు రాజ్యసభ కిరీటంతో ఆయనను సత్కరించాలనుకుంటుంటే... పిల్లి పిల్లి తగవు కోతి తీర్చినట్లుగా బీజేపీ కూడా ఏ మాత్రం అవకాశం వచ్చినా ఆయనను ఎగరేసుకుపోవాలని చూస్తోంది.

రాష్ట్రం నుండి త్వరలో ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాల్సి వుంటుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్య బట్టి తెలుగుదేశంకు రెండు, వైసిపికి ఒకటి రాజ్యసభ స్థానాలు దక్కుతాయి. వైసిపి నుండి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గోడదూకితే మూడో స్థానం కూడా టీడీపీకే పోవచ్చు. కాకపోతే గుజరాత్‌లో ఇటీవల నిర్వహించిన రాజ్యసభ ఎలక్షన్‌లో అది సాధ్యం కాలేదు. ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడితే దానిపై తక్షణ చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్‌ నిర్ధిష్ట ప్రణాళికను రూపొందించింది. కాబట్టే మొన్న గుజరాత్‌లో కాంగ్రెస్‌ నేత అహ్మద్‌పటేల్‌ను రాజ్యసభకు పోకుండా అడ్డుకోవాలని చూసిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రయత్నాలు ఫలించలేదు. కాబట్టి ఇదే పద్ధతి ఏ.పిలోనూ ఉంటుంది. వైసిపికి ఒక రాజ్యసభ సీటుకు వచ్చే ఢోకా ఏమీ లేదు. తమ కొచ్చే ఒక్క రాజ్యసభ సీటును వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఇవ్వడానికి వైసిపి నాయకత్వం సిద్ధంగా ఉంది. ఈమేరకు పార్టీలో చేరమని ఆహ్వానించినట్లు కూడా తెలుస్తోంది. ఒకవేళ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ లాంటిది జరిగి ఊహించని పరిణామాలు ఏవైనా జరిగినా 2019 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ ఇస్తామని హామీ కూడా ఇచ్చారని తెలుస్తోంది. విపిఆర్‌ వైసిపిలో చేరితే జిల్లాలో తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని ఊహించిన తెలుగుదేశం నాయత్వం ఆయనను తమ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తోంది. తెలుగుదేశంకు గ్యారంటీగా రెండు రాజ్యసభ స్థానాలు వస్తాయి. మూడోదానికి పోటీ పెట్టి వైసిపి ఎమ్మెల్యేలను కొనాల్సి వుంటుంది. రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయే పరిస్థితిని వేమిరెడ్డి కోరుకోడు. వేమిరెడ్డి అంగీకారం తెలిపితే మొదటి ఇద్దరు అభ్యర్థులలోనే ఆయనను పెట్టడానికి చంద్రబాబు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. తమ తమ పార్టీలలో చేరమని రెండు పార్టీలు కూడా ఆయనపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో విపిఆర్‌ లాంటి సేవా తపస్వి తమ పార్టీలో వుంటే జాతీయ స్థాయిలో సైతం తమ పార్టీకి కూడా ఓ ఇమేజ్‌ వుంటుందన్న ఆలోచనలో భారతీయ జనతాపార్టీ వున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ పెద్దలనుకుంటే దేశంలో ఎక్కడినుండైనా విపిఆర్‌ని రాజ్యసభకు పంపొచ్చు. ఆ దిశగా కూడా బీజేపీ శ్రేణులు రంగంలో దిగినట్లు సమాచారం.

కాని, నిర్ణయం తీసుకోవాల్సింది, తన ఆశయాల సాధనకు సరైన రాజకీయ మార్గాన్ని ఎంచుకోవాల్సింది ఆయనే! ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రజలకు మంచి చేస్తున్న పార్టీ ఏది, అవినీతి, అక్రమాలు చేస్తున్న పార్టీ ఏది అన్నది కూడా చూడాలి. ఏ పార్టీ పట్ల, ఏ నాయకుడి పట్ల జనం అభిమానంతో వున్నారు, లేదా వ్యతిరేకతతో వున్నారు అన్నది కూడా చూడాలి. మరీ ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లాంటి నిస్వార్ధ సేవకులను రాజ్యసభకు పంపాలని ప్రజలు కోరుకోవడం లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేయాలని, తమ మధ్యే వుండాలని, తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు. పార్టీ ఏదైనా ప్రత్యక్ష ఎన్నికల్లోకి ఆయన రావాలన్నది జన వాక్కు. మరి ఆయన ఎవరి నిర్ణయాన్ని గౌరవిస్తాడో, ఏ పార్టీ ఆహ్వానాన్ని ఆదరిస్తాడో... ఇక రోజులు లేదా నెలల్లోనే తేలిపోతుంది.

vprనెల్లూరుజిల్లా అంతటా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, సొంతడబ్బుతోనే విద్య, వైద్యం, సాంస్కృతిక, ఆథ్యాత్మిక రంగా లలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ, గొంతెండిన పల్లెలకు గుక్కెడు నీళ్లందిస్తున్న విపిఆర్‌ ఫౌండేషన్‌ అధినేత వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ది పాలిటిక్స్‌గా ఉన్నాడు. ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి చేసిన మంచి పనులను గుర్తు తెచ్చేలా నెల్లూరుజిల్లాలో గత కొన్నేళ్లుగా కోట్ల రూపాయల ఖర్చుతో సేవాకార్యక్రమాలు చేపడుతున్న విపిఆర్‌ రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.

ఆయన ఏ పార్టీలో చేరతాడు? రాజ్యసభకు వెళతాడా? లేక లోక్‌సభకు పోటీ చేస్తాడా? ఇటీవలకాలంలో జిల్లా అంతటా ఎక్కువుగా నడుస్తున్న రాజకీయ చర్చ కూడా ఇదే! విపిఆర్‌ ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేడు. అలాగని కొత్తగా రాజకీయ రంగప్రవేశం చేయాల్సింది కూడా లేదు. దివంగత నేత డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర రెడ్డి మీదవున్న అభిమానం కొద్ది 2014లో ఆయన తనయుడు వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డి స్థాపించిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. 2014 ఎన్నికల్లో జిల్లాలోని వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి పూర్తిస్థాయిలో కృషి చేసాడు. ఆ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాలేదు. అయినా కూడా విపిఆర్‌ కొంతకాలం వైకాపాలోనే కొనసాగాడు. ఆ తరువాత కొన్ని వ్యక్తిగత కారణా లతో ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చాడు.

ఆ తర్వాత జిల్లాలోని తెలుగుదేశం ముఖ్య నాయకులు కొందరు ఆయనను తెలుగుదేశంలో చేరేలా ఒప్పించారు. చంద్రబాబు మీదున్న గౌరవం కొద్ది ఆయన కూడా ఆ పార్టీలో చేరడానికి అంగీకరించాడు. అయితే ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరాలని ప్రయత్నించినా రెండుసార్లు సీఎం పర్యటన రద్దు కావడంతో ఆయన దేవుడే ఇదంతా చేస్తున్నాడు, ఆయన ఎలా చెబితే అలా నడుచుకుందామనే ఉద్దేశ్యంతో అప్పటి నుండి ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉంటున్నాడు.

కాని వచ్చే ఎన్నికలనాటికైతే ఆయన ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయం. కాకపోతే ఆ పార్టీ ఏది? ఆయన ఏ పార్టీవైపు మొగ్గు చూపుతాడన్నది పెద్దప్రశ్నగా మారింది. వివాదరహితుడు, సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి, పార్టీకి అన్ని విధాలా అండదండగా నిలిచే మనిషి, ఎటువంటి మచ్చలేదు, పార్టీలో చేర్చుకుంటే ఆయన ఇమేజ్‌తోనూ ఓట్లు పెరుగుతాయి. విపిఆర్‌తో ఇన్ని సానుకూల అవకాశాలున్నాయి.

కాబట్టే, అటు అధికార తెలుగుదేశం అధిష్టానంతో పాటు ఇటు ప్రతిపక్ష వైకాపా కూడా ఆయనను తమ వద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఆయననకు రాజ్యసభకు పంపడానికైనా లేదంటే నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా నిలబెట్టడానికైనా ఇరు పార్టీలవైపు నుండి కూడా సంసిద్ధత వ్యక్తమవుతుంది.

సేవ ఆయన యావ

జిల్లా సేవా సామ్రాజ్యంలో నక్షత్రంలా ప్రకాశిస్తున్న సేవాసూరీడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. విపిఆర్‌ విద్య పేరుతో ఆయన అందించే ఉచిత కార్పొరేట్‌ స్థాయి విద్య, విపిఆర్‌ వైద్యం పేరుతో అందిస్తున్న వైద్యం, అంతేకాకుండా ఆథ్యాత్మిక రంగంలో వందలాది ఆలయాల నిర్మాణానికి చేయూత, తిరుపతి తిరుమల దేవస్థానాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీవారి వైభవోత్స వాలు, అనాధపిల్లలను ఆదుకోవడం కోసం వాత్సల్య లాంటి సంస్థలకు భూరి విరాళం, వృద్ధులకు ఆసరాగా నిలవడానికి వృద్ధాశ్రమాలకు సహకారం, మానసిక వికలాంగుల వికాసానికి ప్రగతి ఛారిటీస్‌ వంటి సంస్థలకు ఆపన్నహస్తం... ఇలాంటివి ఇంకా ఎన్నో విపిఆర్‌ దానగుణానికి తార్కాణాలు.

రా... రమ్మంటున్న అధినేతలు

భయపడుతున్న స్థానిక నేతలు

అయితే ఇటీవల ''విపిఆర్‌వికాస్‌'' పేరుతో గ్రామీణ ప్రాంత వికాసం కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలు స్థానికంగా రెండు పార్టీల నాయకులకూ చెమటలు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా పల్లెవాసుల దాహార్తిని తీర్చడానికి ఆయన మొదలుపెట్టిన వాటర్‌ ప్లాంట్‌ ఉద్యమం గ్రామీణ ప్రజల గుండెల్లో దీపాలు వెలిగిస్తుం డగా, స్థానిక నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.

ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలలో ప్రస్తుతం ఆయన అందిస్తున్న 'విపిఆర్‌ అమృతధార' పేదప్రజల దాహం తీరుస్తుంటే, కాంట్రాక్టుల ద్వారా ప్రజల సొమ్మును దోచుకుని కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచే ప్రతిపక్ష పార్టీ నాయకులకు, అటు బ్యాంకులకు ఇటు ప్రైవేట్‌ వ్యక్తులకు పంగనామాలు పెట్టి పబ్బంగడుపుకుంటూ తానేదో ప్రజలను ఉద్దరిస్తానని రాజకీయ నాయకుడి అవతార మెత్తిన మరో అధికార పార్టీ నాయకుడికీ విపిఆర్‌ సేవలు నచ్చడం లేదు. మా నియోజకవర్గంలో మీకేం పని అంటూ విపిఆర్‌ ప్రతినిధులను ప్రశ్నించడం చూస్తుంటే విపిఆర్‌ సేవా కార్యక్రమాలు వీరి గుండెల్లో ఏ స్థాయిలో గుబులు పుట్టిస్తున్నాయో అర్ధమౌతుంది. అమ్మ పెట్టాపెట్టదూ, అడుక్క తినా తిననీయదు... అన్న చందంగా వీరెలాగూ చేయకపోగా చేసేవారిని కూడా చేయనీకపోవడం విడ్డూరంగా వుంది. స్థానిక నాయకులు ఎంత వ్యతిరేకించినా ప్రజలు మాత్రం విపిఆర్‌కే మద్దతు ఇస్తున్నారు. సేవా దృక్ఫధంతో, సేవే లక్ష్యంగా, సేవే పరమావధిగా ప్రజల ముందుకొచ్చిన సేవా ప్రభారుడికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ తరుణంలో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి విపిఆర్‌ విజయ ప్రస్థానం అండగా వుండబోతోందోనన్నది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. ఆయన కోసం అన్ని పార్టీలూ ద్వారాలు తెరిచే వున్నాయి. మరి ఆయన ఏ పార్టీకి ఓటేస్తాడో వేచిచూడాలి. సాధారణంగా పార్టీ అభ్యర్థిత్వం కోసం వ్యక్తులు పడిగాపులు కాస్తారు, కానీ ఇక్కడ ఓ మంచి వ్యక్తి కోసం పార్టీలు గాలం వేస్తున్నాయి. నూటికో కోటికో ఒక్కరూ అని ఓ కవి వ్రాసినట్లుగా ఇలాంటి అరుదైన వ్యక్తిత్వానికి అగ్రపీఠం వేసే భాగ్యం ఏ పార్టీకి కలుగుతుందో వేచి చూడాల్సిందే!

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter