vnk dhonభారత క్రికెట్‌ దిగ్గజం, ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ను విజయాలకు చిరునామాగా మార్చిన సారధి మహేంద్రసింగ్‌ ధోనీ ఈ నెల 12వ తేదీన నెల్లూరుజిల్లాకు వస్తున్నారు. ఆరోజు వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో జరిగే సంక్రాంతి సంబరాలలో ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడుతో కలిసి పాల్గొనబోతున్నారు. ఆరోజు మధ్యాహ్నానికి ఆయన వెంకటాచలంలోని అక్షర విద్యాలయంకు చేరుకుంటారు. భోజనానంతరం స్వర్ణభారత్‌ ట్రస్ట్‌కు వచ్చి, సంక్రాంతి వేడుకలలో పాల్గొంటారు. ధోని వస్తుండడంతో నెల్లూరుజిల్లాలో క్రికెట్‌ అభిమానులకు పెద్ద పండుగ వచ్చినట్లయ్యింది. ఆయన రాక కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు 11వ తేదీ నెల్లూరొచ్చి 15వ తేదీ దాకా ఇక్కడే వుంటారు. పాతమిత్రులతో విందు సమా వేశంలో పాల్గొంటారు. పండుగరోజుల్లో సొంత ఊరిలో బంధువులు, మిత్రులతో గడపనున్నారని, ఎటువంటి అధికారిక కార్యక్రమాలు పెట్టుకోవడం లేదని తెలుస్తోంది. కాగా, స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో జరిగే సంక్రాంతి సంబరాలకు ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ సి.హెచ్‌.విద్యాసాగర్‌రావు, తమిళనాడు గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌లు కూడా హాజరయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.

venkaiahరాజకీయాలలో ఉంటే పక్కా రాజకీయ నాయకుడిలా వ్యవహరిం చాలి. రాజ్యాంగ పదవుల్లో వుంటే రాజ్యాంగ పరిరక్షకుడిగా నడుచు కోవాలి. నాలుగు నెలల క్రితం రాజ కీయ నాయకుడి నుండి రాజ్యాంగ పరి రక్షకుడిగా మారిన భారత ఉపరాష్ట్ర పతి యం.వెంకయ్యనాయుడు అదేపని చేశాడు.

రాజ్యసభ ఛైర్మెన్‌ హోదాలో రాజ్యాంగ విలువలను కాపాడేలా ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేస్తూ దళ్‌(యు) సభ్యులైన శరద్‌యాదవ్‌, ఆలీ అన్వర్‌ అన్సారీల రాజ్యసభ సభ్యత్వాలను రద్దు చేశారు. బీహార్‌లో దళ్‌(యు) ఆర్జేడీల మధ్య పొత్తు విచ్ఛినమై, దళ్‌(యు) బీజేపీతో జత కట్టడం తెలిసిందే! అయితే శరద్‌యాదవ్‌, ఆలీఅన్వర్‌ అన్సారీలు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి వేరుగా ఉండిపోయారు. దీంతో దళ్‌(యు) నాయకత్వం వీరిద్దరి మీద చర్య తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మెన్‌ను కోరింది. ఈ నేపథ్యంలోనే వారిద్దరిపై వేటు వేస్తూ వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఆయన ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రా, తెలంగాణ శాసనసభాధిపతులకు చెంపపెట్టు వంటివనే చెప్పవచ్చు. చట్టసభల సభ్యుల పార్టీ ఫిరాయింపు కేసుల్లో సభాపతులు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ క్రింద సభ్యుల అనర్హతపై దాఖలు చేసిన పిటిషన్లపై సకాలంలో నిర్ణయం తీసుకోవాలి. అలా కొందరు సభాపతులు నిర్ణయం తీసుకోకపోతుండడం వల్లే వారి తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పిటిషన్లపై నిర్ణయం తీసుకునే విషయంలో సభాపతులు అనవసర కాలయాపన చేస్తున్నారని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. సభాపతులు ఇలాంటి పిటిషన్‌లను ఎంతోకాలం నానబెట్టడం మంచిది కాదు. పార్టీ ఫిరాయించిన సభ్యులకు చట్టప్రకారం వాదన చెప్పుకునే అవకాశం కల్పించి మూడు నెలల్లో సభాపతులు నిర్ణయం తీసుకోవాలి. ఇవీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పిన ఆణిముత్యాలు... నిన్నటిదాకా ఆయనా రాజకీయనాయకుడే! తెలుగుదేశంకు మిత్రపక్ష సభ్యుడే... ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడే! ఆయన నుండి తెలుగుదేశం వాళ్ళు ఏం నేర్చుకున్నారు? మూడున్నరేళ్ళుగా రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల పర్వం జరుగుతోంది. వైకాపాకు చెందిన ముగ్గురు ఎంపీలను, 22మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశంలో చేర్చుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం క్రింద వారిపై చర్యలు తీసుకోవాలని వైసిపి పిటిషన్‌లు వేసింది. ఏపి శాసనసభాపతి నుండి ఉలుకు పలుకు లేదు. అంతెందుకు లోక్‌సభలో కూడా పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎంపీలపై ఇంతవరకు చర్యలు లేవు. పార్టీ ఫిరాయింపుల విషయంలో రాజ్యసభలో ఒక నీతి

ఉంటే ఆయా రాష్ట్రాలలో ఇంకో నీతి ఉంటుందా?

దళ్‌(యు) సభ్యులన్నా పార్టీని వీడిపోలేదు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారంతే! కాని ముగ్గురు ఎంపీలు, 22మంది ఎమ్మెల్యేలు వైసిపి గుర్తు మీద గెలిచి, పార్టీ ఫిరాయించారు. అలాంటి ఫిరాయింపుదారుల మీద చర్యలు తీసుకోకపోతే రాజ్యాంగానికి విలువలేదు. ఫిరాయింపుల నిరోధక చట్టానికి గౌరవం లేదు. మన సభాపతులు వెంకయ్యనాయుడును చూసైనా మారితే రాజకీయాలలో కొంతవరకన్నా విలువలను కాపాడినవారవుతారు.

venkaiఅక్టోబర్‌ 19వ తేదీ దీపావళి పండుగను దేశ సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడే వీరజవానులతో జరుపుకుని తన ప్రత్యేకతను, దేశభక్తిని చాటారు మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తన శ్రీమతి ఉషమ్మతో కలసి ఇండోటిబెటన్‌ సరిహద్దు సైనికులకు మిఠాయిలు పంచిపెట్టారు. వారందరినీ పేరుపేరునా పలుకరించి పులకరింపజేశారు.

Page 1 of 8

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…
  • టీడీపీ నుండి... లోక్‌సభకెవరో?
    1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…

Newsletter