buildinవిక్రమ సింహపురి విశ్వవిద్యాలయం... వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ప్రతిరోజూ ఏదో ఒక వివాదమే... యూనివర్శిటీని మొదలుపెట్టినప్పటి నుండి ఆందోళనలతో ప్రయాణమే! సిబ్బంది నియామకాలు, హాస్టల్‌ మూత, బోధనా తరగతులు, భవనాల కాంట్రాక్ట్‌ పనులు... ఒకటేమిటి ప్రతి అంశంలోనూ వివాదమే!

దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో వి.ఆర్‌. విద్యాసంస్థలలో మొదలైన విశ్వవిద్యాలయంకు వెంకటాచలం మండలంలోని కాకుటూరు వద్ద ఆయనే 60ఎకరాల భూమి కేటాయించడం తెలిసిందే! ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ యూనివర్శిటీ కొత్త భవనాలకు నిధులు మంజూరు చేయబడి శంకుస్థాపన కూడా జరిగింది. యూనివర్శిటీ భవనాల నిర్మాణం పూర్తయ్యింది. విఆర్‌ విద్యాసంస్థలలో నడుస్తున్న యూనివర్శిటీని కొత్త భవనాలలోకి మార్చాలని విద్యార్థి సంఘాలు ఎప్పటి నుండో డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే దానికి ముహూర్తమే కుదరడం లేదు. ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచ్చి ఇఫ్కో సెజ్‌లో నిర్మించబడ్డ 'గమేషా' ఫ్యాక్టరీని ప్రారంభించి వెళ్లారు. వాస్తవానికి ఆరోజు విశ్వవిద్యాలయం భవనాల ప్రారంభోత్సవం సీఎం పర్యటనలో ప్రధాన కార్యక్రమం. చివరికి చూస్తే ఆ ప్రోగ్రామే లేకుండా పోయింది! అసలు విశ్వవిద్యాలయం భవనాలకు చంద్ర బాబు చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుపుకునే అదృష్టం ఉందా? అన్నది ప్రశ్న! ఆ ముహూర్తం ఇంకెప్పుడొస్తుందో?

vsu buildiఅక్రమాలకు అడ్డాగా వివాదాలకు వేదికగా మారిన నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పాలకవర్గంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ప్రభుత్వ చట్టాలు, నిబంధనలకు లోబడే అధికారులు వ్యవహరించాలని, రిజర్వేషన్లను పాటించకుండా వైస్‌ఛాన్స్‌లర్‌, రిజిస్ట్రార్‌లు యూనివర్శిటీ తమ జాగీర్‌ అన్నట్లు ఇష్టం వచ్చినట్లు నియామకాలు చేపడితే చూస్తూ వూరుకునేది లేదని హైకోర్టు హెచ్చరించింది. ఇప్పటిదాకా జరిపిన నియామకాలపై తమకు వారంలోగా పూర్తి వివరాలను అందజేయాలంటూ ఈ నెల 12వ తేదీన ఆదేశించింది.

విక్రమ సింహపురి యూనివర్శిటీలో అక్రమాలు, వివాదాలు పరాకాష్టకు చేరాయి. ఆచార్య జయరామిరెడ్డి విసిగా వున్నవరకు ఎంతో పద్ధతిగా నడిచిన యూనివర్శిటీ ఆయన వెళ్లిపోయాక దారితప్పింది. వచ్చిన పాలకులూ దారితప్పారు. పాలకులకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగసాగాయి. యూనివర్శిటీలో ప్రతిదీ సమస్యే! ఇటీవల వృత్తివిద్యాకోర్సు పరీక్షలు, హాస్టళ్ల మూత వంటివాటిపై కూడా ఆందోళనలు జరగడం చూసాం. ముఖ్యంగా యూనివర్శిటీలో 84మంది గెస్ట్‌ ఫ్యాకల్టీల నియామకాలు వివాదాస్పదంగా మారాయి. 2009లో 84మంది గెస్ట్‌ ఫ్యాకల్టీలను నియమించారు. ఆరేడు వేల జీతా లతో మొదలైన వాళ్లు ఇప్పుడు 15వేలు దాకా తీసుకుంటున్నారు. ఓ పక్క వాళ్లు తమను పర్మినెంట్‌ చేయాలని ప్రాధేయపడు తుండగా, పాలకవర్గం ఉన్నఫళంగా వారిని తొలగించి కొత్త నియామకాలు జరిపింది. ఈ నియామకాలు కూడా అన్నీ సిఫార్సులు, కమిషన్ల మీదే జరిగాయి. ఇప్పుడు జిల్లాకొక యూనివర్శిటీ వుంది. ఉద్యోగాలకు సంబంధించి ఆయా జిల్లాల వారికే ప్రాధాన్యతనివ్వాలి. కాని రిజిస్ట్రార్‌ అలా చేయకుండా స్టేట్‌వైడ్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి, గెస్ట్‌ఫ్యాకల్టీ నియామకాలలో తన సొంత జిల్లా చిత్తూరు వారికి పెద్దపీట వేసాడు. దీనిపై టిఎన్‌ఎస్‌ఎఫ్‌ వంటి విద్యార్థి సంఘాలు గట్టిగానే పోరాడాయి. నోటిఫికేషన్‌లో రిజర్వేషన్‌ రోస్టర్‌ను తెలపలేదని, గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాలను నిలిపివేయాలని టి.ఎస్‌.వెంకటేష్‌ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు నియామకాలను నిలిపే యాలంటూ స్టే ఇచ్చింది. అయితే రిజిష్ట్రార్‌ శివశంకర్‌ హైకోర్టు స్టేను వెకేట్‌ చేయించకుండా, హైకోర్టుకు సమాచారం కూడా ఇవ్వకుండా 84మంది గెస్ట్‌ ఫ్యాకట్లీల నియామకాలను పూర్తి చేశాడు. దీంతో మరోసారి పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించ డంతో ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు పాలకవర్గాన్ని వాయించేశారు. వర్శిటీ అధికారులు రిజర్వేషన్‌ నిబంధనలు పాటిస్తున్నాం అని చెప్తే సరిపోతుందా, 84పోస్టులతో నియామక ప్రక్రియకు తెరతీసి నోటిఫికేషన్‌లో రోస్టర్‌ను ఎందుకు వివరించలేదని, ఎక్కడ కావాలంటే అక్కడ రిజర్వేషన్‌ పాటిస్తాం అని చెప్పడంలో వర్శిటీ అధికారుల ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. తాత్కాలిక ఉద్యోగ మైనా శాశ్వత ఉద్యోగం స్థానంలో భర్తీ కానున్నది కనుక ఖచ్చితంగా రిజర్వేషన్‌ పాటించాల్సిందేనని అలాకాకుండా తమకిష్టం వచ్చిన వారిని నియమించుకుంటాం అంటే చూస్తూ ఊరుకోం అని హెచ్చ రించారు. గెస్ట్‌ ఫ్యాకల్టీల నియామకం అంటూ తమకిష్టం వచ్చిన వారిని ఓ నియామక పద్ధతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్శిటీలలో విసి, రిజిస్ట్రార్‌లు అంతా తమ ఇష్టం అంటే కుదరదని, వారు ప్రభుత్వ నిబంధనలకు, చట్టాలకు లోబడే వ్యవహరించుకోవాలని మండిపడ్డారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఇస్తుంటే నిబంధనలకు, చట్టాలకు లోబడి వ్యవహరించకుండా అంతా తమ ఇష్టమంటూ విసి, రిజిస్ట్రార్‌లు వర్శిటీలను భ్రష్టు పట్టిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని, ఈ విధానం వర్శిటీల మనుగడకు, అస్తిత్వానికి ప్రమాదకరంగా మారుతుందని, ఇలాంటివి కొనసాగితే వర్శిటీని మూసేయాల్సిం దిగా ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సి వస్తుందని ఘాటైన విమర్శలు చేశారు. రిజర్వేషన్‌ నిబంధనలపై నోటిఫికేషన్‌లో ఖచ్చితమైన సమాచారం లేకుండా స్టేని ఎలా ఎత్తేయాలని తెలుపుతూ విఎస్‌యులో ఇప్పటివరకు జరిగిన నియామకాలు, పెండింగ్‌ నియామకాలు, పలు జీవోలతో పూర్తిస్థాయి సమాచా రాన్ని వారంలో తమ ముందుంచాలని వర్శిటీ న్యాయవాదులకు తెలియజేస్తూ తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా ఉన్న ఉద్యోగాలను కోల్పోయి గత మూడు నెలలుగా జీతాలు లేక విలపిస్తున్న పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు తమని కొనసాగించాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌ కూడా వచ్చే సోమవారమే విచారణకు రానుంది.

vsu buildఏ ముహూర్తాన నెల్లూరులో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని మొదలు పెట్టారోగాని మొదటి నుండి వివాదాలు, ఆందోళనలే! యూనివర్శిటీ పాలకవర్గాల వైఖరి మూలంగా ఈ చదువుల క్షేత్రం వివాదాల కురుక్షేత్రంగా మారుతోంది. పుస్తకాలు పట్టి చదువులు బట్టీ పట్టాల్సిన చోట ''డౌన్‌ డౌన్‌'లు, ''వర్ధిల్లాలి' వంటి నినాదాలను వినాల్సి వస్తోంది.

నెల్లూరులో విశ్వవిద్యాలయం అంటే అభివృద్ధికి అదొక ల్యాండ్‌మార్క్‌ అను కున్నాం గాని, ఇలా మున్సిపాల్టీ మురికి నీళ్ల ట్యాంక్‌లాగా మారుతుందనుకోలేదు. రాష్ట్రంలోని ప్రతిజిల్లాను చదువుల పరంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో దివం గత నేత డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి సీఎంగా వున్నప్పుడు జిల్లాకొక యూని వర్శిటీని మంజూరు చేశారు. 2008లో నెల్లూరు విఆర్‌ హైస్కూల్‌లో యూనివర్శిటీ తరగతులను మొదలు పెట్టడం తెలిసిందే! కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా వున్నప్పుడు కాకుటూరు వద్ద యూనివర్శిటీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దాదాపు ఇప్పుడు భవనాలు పూర్తి కావస్తున్నాయి.

ఇది ఒకెత్తయితే యూనివర్శిటి పాలక వర్గ నిర్ణయాలు వివాదాలకు ఆజ్యం పోస్తూ విద్యార్థి సంఘాల ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఇటీవల యూనివర్శిటీలో కాంట్రాక్ట్‌ విధానం మీద పని చేస్తున్న 84మంది అకడమిక్‌ కన్స ల్టెంట్స్‌ను ఉన్నఫళంగా తొలగించాలని పాలకవర్గం తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారమే రేపింది. ఇంతమంది బ్రతుకుల మీద ఎలా దెబ్బకొడతారంటూ టిఎన్‌ ఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం పెద్ద ఎత్తునే ఆందోళన చేసింది. ఈ విద్యార్థి సంఘం ఆందోళనతోనే ప్రభుత్వం దిగొచ్చి యూని వర్శిటీలో ఈ తాత్కాలిక ఉద్యోగుల తొల గింపును అడ్డుకుంది. 2009లో 84 మంది అకడమిక్‌ కన్సల్టెంట్స్‌ను కాంట్రాక్ట్‌పై తీసుకున్నారు. ఆరేడువేలతో వారి జీతాలు మొదలై ఇప్పుడు 12 నుండి 15వేలు దాకా ఇస్తున్నారు. తమని పర్మినెంట్‌ చేయాలని వాళ్లు మొత్తుకుంటున్నా ఎవరూ వారి మొర ఆలకించలేదు. కాగా, ఇప్పు డున్న ఉప కులపతి, రిజిష్ట్రార్‌లు ఏకంగా వారి ఉద్యోగాలకే ఎసరుపెట్టారు. ఉన్న ఫళంగా వారిని తొలగిస్తూ నిర్ణయం తీసు కున్నారు. అకడమిక్‌ కన్సల్టెంట్‌గా కొత్త వారిని తీసుకోవాలని ప్రతిపాదన తెచ్చారు. ఈ విషయంలో రిజిష్ట్రార్‌ చక్రం తిప్పా డని, ఒక్కో ఉద్యోగానికి లక్షల రూపాయలు వసూలు చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడున్న కాంట్రాక్ట్‌

ఉద్యోగులకు 15వేల జీతం ఇవ్వడానికే నిధులు లేవన్న పాలకవర్గం, కొత్తగా చేర్చుకునే ఉద్యోగులకు మాత్రం పాతిక వేలదాకా జీతాలు ఇస్తామని చెప్పిందని, ఇదెలా సాధ్యమవుతుందని విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తున్నారు. అదీగాక కొత్త ఉద్యోగాల విషయంలో రిజిష్ట్రార్‌ తన సొంత జిల్లా అయిన చిత్తూరుజిల్లా అభ్యర్థులకు పెద్దపీట వేసాడని ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ యూనివర్శిటీలున్నాయి. ఏ యూనివర్శి టీలో ఉద్యోగాలకైనా స్థానిక నిరుద్యోగులకే మొదటి ప్రాధాన్యత ఉండాలి. కాని రిజిష్ట్రార్‌ తన సొంత జిల్లా అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలకు సంబం ధించి రాష్ట్ర వ్యాప్త నోటిఫి కేషన్‌ జారీ చేసాడని విద్యార్థి సంఘాలు ఆరోపి స్తున్నాయి. గతంలోనే రిజిష్ట్రార్‌ మీద పలు ఆరోపణలు వచ్చాయి. అధికారపార్టీ నాయకులు కూడా దీనిని వైస్‌ఛాన్సలర్‌ దృష్టికి తీసు కెళ్లారు. ఈ ఆరోపణల మీద ఎంక్వయిరీ చేయిస్తానని వి.సి వారికి చెప్పాడు. ఇంతవరకు అది ఆచరణ రూపం దాల్చలేదు. ఇక యూనివర్శిటీ భవనాల నిర్మాణంలో సైతం లొసుగులు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణ. బిల్డింగ్‌ల నాణ్యత పరిశీలన కోసం ఎక్స్‌ పర్ట్‌ కమిటీ సూచించిన మేరకే కాంట్రాక్ట్‌ను నిర్ణయించాలి. కానీ అలాంటివేవీ లేకుండా పైరవీలకు స్థానం కల్పిస్తూ పాలకవర్గం తమ ఇష్టం వచ్చిన రీతిలో భవనాల కాంట్రాక్టులను నిర్ణయిస్తున్నారన్న ఆరోపణ లున్నాయి. విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం వివాదాలతో గబ్బు పడు తోంది. యూనివర్శిటీలో వస్తున్న ఆరో పణలపై విచారణ జరిపించి, సరైన పాలక వర్గాన్ని నియమించి, ఈ యూనివర్శిటీని వివాదాలకు కాకుండా విద్యకు కేంద్రంగా మార్చేందుకు జిల్లా ప్రజాప్రతినిధులే చొరవ చూపాల్సి వుంది.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter