anam brosవందేళ్ళకు పైగా చరిత్ర... లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత... ఒకే ప్రాంగణంలో ఆరో తరగతి నుండి న్యాయవాద విద్య, పీజీ కోర్సుల వరకు... అతి తక్కువ ఖర్చుతో చదువు పూర్తి చేసుకునే వేదిక... నెల్లూరులోని వి.ఆర్‌. విద్యాసంస్థలు... వాస్తవానికి వెంకటగిరి రాజా కళాశాల అని పేరు. కాని ఇప్పుడు జనాల దృష్టిలో మాత్రం వి.ఆర్‌ అంటే వివేకానందరెడ్డి విద్యాసంస్థలు అని.

వి.ఆర్‌ విద్యాసంస్థలను తామే నెలకొల్పినట్లు, ఆ విద్యా సంస్థల నిర్మాణానికి తమ స్థలాన్ని దానం చేసినట్లుగా... ఆ విద్యాసంస్థలపై దాదాపు 3 దశాబ్దాలుగా పెత్తనం చేస్తున్న ఆనం సోదరులకు హైకోర్టు షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చింది. వి.ఆర్‌ విద్యాసంస్థల కమిటీని రద్దు చేస్తూ ఈ నెల 6న హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే కమిటీ తీసుకున్న నిర్ణయాలు కూడా

చెల్లవని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే... 1875లో విఆర్‌ విద్యా సంస్థలను ప్రారం భించారు. బ్రిటీష్‌ వారి హయాంలో క్రైస్తవ మిషనరీ విద్యాసంస్థలను ఎక్కువగా నెల కొల్పుతున్నప్పుడు హిందూ విద్యార్థుల కోసం వెంకటగిరి రాజాలు ప్రత్యేకంగా ఈ విద్యాసంస్థను నెలకొల్పి, వీటి నిర్వ హణకు వాళ్లే ధనం సమకూరుస్తూ వచ్చారు. 1940 ప్రాంతంలో రాజా యాచేంద్ర ఈ విద్యాసంస్థల పాలక వర్గంలో తమకు అధికారం ఉండేలా ఒక ఒప్పందం చేసుకున్నారు. విద్యాసంస్థల పాలకవర్గ కమిటీకి ప్రతి ఐదేళ్ళకోసారి ఎన్నికలు జరిగేలా బైలాను రూపొందిం చారు. ఈ కమిటీలో నలుగురు సభ్యులు వెంకటగిరి రాజా కుటుంబం నుండి వుంటే మరో నలుగురు సభ్యులను పూర్వ విద్యార్థులు ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన 8మంది కలిసి ఐదుగురిని కో-ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకుంటారు. కళాశాల ప్రిన్సి పాల్‌ ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా కొనసాగు తారు. బైలాలో వ్రాసుకున్న నిబంధనల ప్రకారం 1950, 1960, 1970లలో కమిటీలకు ఎన్నికలు జరిగాయి. 1970 వరకు విద్యాసంస్థల కమిటీపై వెంకటగిరి రాజాల పెత్తనమే కొనసాగింది. 1970లో పెద్దరాజా యాచేంద్ర మరణించారు. ఆ ఏడాది జరిగిన కమిటీ ఎన్నికల ద్వారా ఆనం వెంకటరెడ్డి విద్యా సంస్థల అధ్యక్షు డయ్యాడు. అక్కడ నుండి విఆర్‌ విద్యా సంస్థల్లో ఆనం ఆధిపత్యం మొదలై క్రమంగా వెంకటగిరి రాజాలు తెరమరు గయ్యారు. ఆనం వెంకటరెడ్డి, ఆనం భక్త వత్సలరెడ్డిలు విద్యాసంస్థలను పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. 1970 తర్వాత 1985 వరకు కమిటీకి ఎన్నికలు జర క్కుండా లాక్కొచ్చారు. అప్పట్లో ఏబివిపి విద్యార్థి సంఘం నాయకులైన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆమంచర్ల శంకరనారాయణ, చంద్రశేఖర్‌రాజులు కమిటీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ నెల్లూరులో ఆరురోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. ఎన్నికలు నిర్వహిస్తామని అప్పటి ముఖ్య మంత్రి ఎన్టీఆర్‌ ఇచ్చిన హామీతో వాళ్ళు దీక్ష విరమించారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారమే విఆర్‌ విద్యాసంస్థల కమిటీకి ఎన్నికలు నిర్వహించారు. అయితే పూర్వ విద్యార్థుల ఓట్లతో ఎన్నికలు నిర్వహిస్తే తమకు వ్యతిరేక ఫలితాలు వస్తాయని భావించిన ఆనం కుటుంబీకులు బైలాను సవరించి పూర్వవిద్యార్థుల ఓట్లను రద్దు చేశారు. ఆ తర్వాత ఎన్నికలు పెట్టారు. ఈ ఎన్నికల్లో ఆనం వివేకానందరెడ్డి పోటీ చేశారు. అయితే తమ ఓట్లను తొలగించ డాన్ని సవాల్‌ చేస్తూ నెల్లూరు సివిల్‌ కోర్టులో పిటిషన్‌ వేయడంతో కమిటీ ఎన్నికల ఫలితాలను నిలిపివేశారు. 1993దాకా ఈ కేసు నడిచింది. ఆ ఏడాది కోర్టు తీర్పు వెలువరిస్తూ పూర్వవిద్యార్థులు వేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో 1986లో జరిగిన కమిటీ ఎన్నికల ఓట్లను లెక్కబెట్టగా ఆనం వివేకానందరెడ్డి భారీ మెజార్టీతో గెలిచాడు. పూర్వవిద్యార్థుల ఓట్లు లేకుండా చేయబట్టి ఆయన గెలవగలిగాడు. ఇక అప్పటి నుండి ఆనం వివేకానందరెడ్డి కరస్పాండెంట్‌ కమ్‌ సెక్రటరీగా, ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షుడిగా.. అంతా తామే అయ్యి ఈ విద్యాసంస్థలను నడి పిస్తున్నారు. ఈ రెండున్నర దశాబ్దాల వారి హయాంలో విఆర్‌ విద్యాసంస్థల ప్రతిష్ట మసకబారుతూ వచ్చింది. దీనికితోడు కార్పొరేట్‌ విద్య విజృంభించడంతో విఆర్‌ విద్యాసంస్థలు విద్యార్థులు లేక బోసిపోతూ వచ్చాయి. విఆర్‌ హైస్కూల్‌, విఆర్‌ జూని యర్‌ కాలేజీ, విఆర్‌ ఐపిఎస్‌, విఆర్‌ ఐఏఎస్‌, విఆర్‌ లాకాలేజీ, వి.ఆర్‌. పి.జి కాలేజీ... వీటిలో ఒక్క హైస్కూల్‌, లా కాలేజీలు మాత్రమే ఇప్పుడు కొంతవరకు సక్రమంగా నడుస్తున్నాయి. మిగతా కాలేజీలన్నీ కూడా విద్యార్థులు లేక బోసి పోతున్నాయి. ఇదంతా చాలదన్నట్లు వివేకా ఈ విద్యాసంస్థల డబ్బుతోనే క్రైస్తవ మిషన రీలకు చెందిన వైఎంసిఏ గ్రౌండ్‌ స్థలాన్ని కొనుగోలు చేసారు. విఆర్‌ బిఇడి కళాశాల పెట్టాలని చెప్పి, పెద్దపెద్ద చర్చీలను తల పించే రీతిలో ఇక్కడ పెద్ద భవనం కట్టిం చారు. దానిలో ఇప్పుడు బి.ఇడి కాలేజీ లేకపోగా నిరుపయోగంగా వుంది. అలాగే హిందూ విద్యార్థుల కోసం ఉద్దేశించి స్థాపించిన విద్యాసంస్థల ముందు తన రాజకీయపిచ్చితో అన్యమతాల విగ్రహాలు, ప్రార్థనా మందిరం పెట్టించాడు. గతంలో దీనిపై బీజేపీ, హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం తెలిసిందే!

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కాని, ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం కాని విఆర్‌ విద్యాసంస్థల జోలికి రాలేదు. అయితే విఆర్‌ విద్యాసంస్థలు కేంద్రంగా ఎన్నో వివాదాలు, ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో వుంది. తెలుగుదేశం నాయ కులు విఆర్‌ విద్యాసంస్థలపై కన్నేసి తమ ఆధిపత్యానికి గండి కొడతారేమోనని అను మానించిన ఆనం సోదరులు... ఆ పరిస్థితి ఎదురుకాకముందే తెలుగుదేశంలో చేరి పోయారు. రాజకీయంగా తమకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు.

అయినా కూడా పూర్వవిద్యార్థుల కేసు వారిని వదల్లేదు. 1993లో క్రింది కోర్టు పూర్వవిద్యార్థుల కేసును కొట్టేసినా, విఆర్‌ పూర్వవిద్యార్థులైన ఆమంచర్ల శంకరనారా యణ, గూడూరు విజయరామిరెడ్డి, పోతూరు రమణయ్యలు హైకోర్టును ఆశ్ర యించారు. 1996లో 126/96 నెంబర్‌ క్రింద హైకోర్టులో కేసు నమోదైంది. 2015లో ఈ కేసు కోర్టు ముందు విచారణ కొచ్చింది. రెండేళ్లుగా దీనిపై వాదనలు జరుగుతున్నాయి. వాదనలు ముగిసి ఈ నెల 6న హైకోర్టు తుది తీర్పును వెలువ రిస్తూ ప్రస్తుతమున్న కమిటీని రద్దుచేసింది. ఏ విఆర్‌ విద్యాసంస్థల మీద ఆధిపత్యానికై ఆనం సోదరులు తెలుగుదేశంలో చేరారో ఆ లక్ష్యం నెరవేరకుండా పోయింది. వారి ఆధిపత్యానికి పూర్వవిద్యార్థులే గండి కొట్టారు. ఆనం సోదరులు ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచాడు. ఎట్టకేలకు విఆర్‌ విద్యాసంస్థలకు పట్టిన రాజకీయ గ్రహణం వీడినట్లయ్యింది.

ఇవేం నోర్లు... ఇవేం మాటలు

mlas vivమొన్నటి దాకా నెల్లూరు రాజకీయాలు బాగా చప్పగా వుండినాయి. నేతల మాటల్లో పదునుండేది కాదు. వాడి వేడి విమర్శలుండేవి కావు. దానికి కారణం అంతా అడ్జస్ట్‌మెంట్‌ రాజకీయం. జిల్లా మంత్రి నారాయణ రాజకీయ నాయకుడు కాదు. అతనికి రాజకీయంగా ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు. అప్పటికీ అతనిని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ బాగానే కలబెట్టాడు. ఆయనకు రాజకీయంగా లోతు తెలియక ''నన్ను ఒక వైపే చూడండి... రెండోవైపు చూడాలనుకోవద్దు, మాడి మసైపోతారు' అంటూ సినిమా డైలాగ్‌లు వదిలాడు. నారాయణ భలే చిక్కాడురా అనుకుని అనిల్‌ కుమార్‌యాదవ్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు తమ విమర్శలతో మంత్రి బట్టలు విప్పదీసి రోడ్లో నిలబెట్టారు. రాజకీయ విమర్శలు ఎంత రోతగా ఉంటాయో అర్ధం చేసుకున్న నారాయణ ఆ తర్వాత వాళ్ల జోలికి పోవడం మానుకున్నాడు.

ఆనం వివేకానందరెడ్డి ఎప్పుడైతే తెలుగుదేశంలో చేరాడో, అప్పటినుండే నెల్లూరు నగరంలో రాజకీయ సెగలు మొదలయ్యాయి. వివేకా పక్కా రాజకీయ నాయకుడు. ఈయనకు కొత్తగా ఎవరూ గుడ్డలూడదీయాల్సిన పని లేదు. ఎందుకంటే గుడ్డలిప్పుకుని ముందుగానే ఆయన రోడ్డు మీద నిలబడి ఉంటాడు. అవతల వాళ్లను కూడా గెలికి గొడవ పెట్టుకోవడం ఈయన స్కూల్‌ రోజుల్లోనే నేర్చుకున్న విద్య. వివేకా తెలుగుదేశంలోకి వచ్చాక నగర రాజకీయం ఏ స్థాయిలో వేడిపుట్టిస్తుందో చూడండి... మిస్టర్‌ 420... లత్‌కోర్‌... కుర్రకుంక... ముసలి నక్క... డాల్‌ డకార్‌... అలబరోళ్ల సంఘం అధ్యక్షుడు... రాజకీయ సంకరజాతి వ్యక్తి... పిచ్చికుక్కను తిరిమినట్లు... రాజకీయ అఘోరా... ఉన్మాది... నరమాంసం మరిగిన పులులు... ఫేస్‌ టు ఫేస్‌ తేల్చుకుందాం... వెధవకూతలు... కారుకూతలు... ముదురుకుంక... వినడానికి ఎంత వినసొంపుగా ఉన్నాయి ఈ మాటలు, విని కూడా ఎంత కాలమైందో... అప్పు డెప్పుడో ఆనమోళ్లకు సోమిరెడ్డికి మధ్య, ఆదాలకు సోమిరెడ్డికి మధ్య విమర్శల యుద్ధం జరిగినప్పుడు ఈ స్థాయి కాకున్నా, ఒక రకమైన మాటలు విన్నాం. ఇప్పుడు ఆనం వివేకా - కోటంరెడ్డి, అనిల్‌ల మధ్య జరుగుతున్న వార్‌లో ఈ మాటలను విన్నాం. ఒకరు మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తయితే మిగిలిన ఇద్దరూ ప్రస్తుత ఎమ్మెల్యేలు. ఒకరినొకరు ఏ మాత్రం తగ్గకుండా భాషాప్రయోగం జరుపుతున్నారు. తిట్ల పురాణంలో తమ టాలెంట్‌ను చూపించుకున్నారు. తెలుగుదేశంలోకి వచ్చాక తానేంటో తన నోటి పవరేంటో చూపించాలి కాబట్టి ఆనం వివేకా ప్రెస్‌మీట్‌ పెట్టి జగన్‌ను 420అని తిట్టాడు. జగన్‌ను తిడితే కోటంరెడ్డి, అనిల్‌లు స్పందిస్తారని వివేకాకు తెలుసు. ఆయనకు కావాల్సింది కూడా అదే! ఎందుకంటే వైకాపాలో యాక్టివ్‌గా వుండేది, చంద్రబాబు మీద గాని, జిల్లా మంత్రి నారాయణ మీద గాని విమర్శలతో చెలరేగేది వీళ్లిద్దరే! వీళ్లిద్దరి మీద ప్రతి దాడి చేస్తే జిల్లా తెలుగుదేశం పార్టీలో వివేకానే లీడ్‌ తీసుకున్నట్లవుతుంది. జిల్లాలో వైకాపా నేతలను గట్టిగా ఎదుర్కొనేది వివేకా ఒక్కడేనన్న పేరొస్తుంది. అందుకే వివేకా ముందు జగన్‌ను తిట్టాడు. దాంతో కోటంరెడ్డి, అనిల్‌లు తీవ్రంగా స్పందించడంతో తన వ్యూహం ఫలించిందనుకుని వారి మీద పడ్డాడు వివేకా. వీళ్లు కూడా వివేకాను గతంలో ఏ నాయకుడూ విమర్శించని... దీనికంటే తిట్టని రీతిలో తిట్టారు. కోటంరెడ్డి, అనిల్‌లు అనే మాటలను వివేకా గాని, వివేకా అనే మాటలను వీళ్లు గాని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్లు పక్కా రాజకీయనాయకులు. అబ్బా... ఏందిరా

వీళ్లు ఇలా తిట్టుకుంటున్నారని నోరెళ్లబెట్టి చూసే జనమే అమాయకులు.

పొలిటికల్‌గా జిల్లాలో ఎవరి లీడ్‌ వాళ్లు తీసుకున్నారు. జిల్లా తెలుగుదేశంలో చంద్రబాబు, నారాయణల మీద మాట పడనివ్వని నాయకుడిగా వివేకా పొజిషన్‌ తీసేసుకుంటే, జగన్‌ మీద ఈగ వాలినా ఒప్పుకోమనే లీడర్లుగా కోటంరెడ్డి, అనిల్‌లు గుర్తించబడ్డారు ఓన్లీ ఈ ఎపిసోడ్‌ ద్వారా!

rajaneethiరాజకీయాలు నీచంగా ఉంటాయని తెలుసు. దుర్మార్గంగా ఉంటాయనీ తెలుసు. అవకాశవాదంతో ఉంటాయని, బరితెగించాయని, విలువలు కోల్పోయాయని కూడా తెలుసు. ఇప్పుడు అంతకంటే ఇంకా దిగజారా యేమోననిపిస్తుంది విజయవాడలో జరిగిన ఆనం బ్రదర్స్‌ షోను చూస్తుంటే! రాజకీయాలలో విమర్శలు, ప్రశంసలు సాధారణం. నాయకులు పార్టీలు మారడమూ మామూలే! అయితే దేనికైనా ఒక కొలమానం ఉం టుంది. నిన్న మనం విమర్శించిన వ్యక్తిని ఈరోజు ప్రశంసించాలంటే నోరు అంత సామాన్యంగా తెరవలేము. అంతరాత్మ అసలు ఒప్పుకోదు.

విజయవాడలో జరిగిన 'షో'లో మాత్రం అంతరాత్మను కూడా లక్ష్య పెట్టక ఆనం సోదరులు చంద్రబాబును పొగడ్తలతో ఆకాశానికెత్తేసారని చెప్పొచ్చు. 2014 ఎన్నికలప్పుడుగాని ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక గాని కాంగ్రెస్‌ పార్టీ నుండి చాలామంది నాయకులు తెలుగుదేశంలో చేరారు. వాళ్లెవరు కూడా పొగడనంత స్థాయిలో ఆనం బ్రదర్స్‌ చంద్రబాబును కీర్తించడం ప్రజలనే కాదు తెలుగుదేశం కార్యకర్తలను సైతం నివ్వెరపరిచింది. ఆనం రామనారాయణరెడ్డన్నా ఓ మోస్త రుగా వెళ్ళాడు. తెలుగుదేశం పార్టీలో క్రమ శిక్షణ, చంద్రబాబునాయుడు నాయకత్వ సామర్ధ్యం, జిల్లా నాయకులతో సమన్వయం వంటివాటిపైనే ఆయన మాట్లాడాడు. అయితే వివేకా వినడానికే వికారంగా మాట్లాడాడు. రాజకీయ నాయకులు నాలుక మడతపెట్టడం చూసాంగాని... వివేకా స్పీచ్‌ విన్నాక... నాలికను మెలికలు తిప్పడం చూసామని జనం అనుకుం టున్నారు. వివేకా ప్రసంగం జనానికి అంత రోతగా అనిపించింది. దాదాపు 20ఏళ్ల పాటు చంద్రబాబును వివేకా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. కాంగ్రెస్‌పార్టీలో చంద్రబాబును ఎక్కువుగా తిట్టిన నాయకు లకు వరుసగా ర్యాంకులు ఇచ్చుకుంటూ పోతే ఖచ్చితంగా వివేకాకే మొదటి ర్యాంకు వస్తుంది. వై.యస్‌.రాజశేఖరరెడ్డికైనా, విహెచ్‌ హనుమంతురావుకైనా వివేకా తర్వాతే ఆ ర్యాంకులు వస్తాయి. చంద్ర బాబును అంతగా తిట్టిన నోటితోనే విజయ వాడ సభలో విపరీతంగా పొగిడాడు. భూమిని ఆయనే దున్నాలి, విత్తనం ఆయనే నాటాలి, నీళ్లు ఆయనే పోయాలి, మడవ ఆయనే కట్టాలి, పంట ఆయనే కోయాలి, ధాన్యం నూర్పిడి ఆయనే చేయాలి, పొయ్యి ఆయనే వెలిగించాలి, వంట ఆయనే వండాలి, చివరకు ముద్ద కూడా ఆయనే కలిపి నోట్లో పెట్టాలి... విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఇదని, చంద్రబాబే అన్నీ చేసి పెట్టాలని వివేకా భజన చేసిన తీరిది. టీవీలలో చూస్తున్న వారికే ఎబ్బెట్టుగా అనిపించింది. ఇక దగ్గరుండి విన్నవాళ్ల పరిస్థితి ఎలా ఉండిందో ఊహించడం కష్టమే! ఈ నెల 17వ తేదీన విజయవాడ లోని ఏ-1 కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన ఆనం సోదరుల షోను అవకాశవాదనేతల అపూర్వ సంగమంగా పేర్కొనవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆనం సోదరులకు తప్ప జిల్లాలో ఇంకెవరూ ఈ కలయికను హర్షించడం లేదు. ముఖ్యంగా జిల్లాలోని తెలుగుదేశం నాయకులకైతే ఏడుపొక్కటే తక్కువ. పార్టీలోకి ఆనం బ్రదర్స్‌ వస్తే అంతా ఆక్రమించేస్తారని వారికి తెలుసు. వారి టాలెంట్‌ మీద వున్న నమ్మకం అలాంటిది. కాని జిల్లాలో ఆనం వాళ్ల అవసరం చంద్రబాబుకు వుంది. కాబట్టి జిల్లా నాయకులకు ఇష్టం ఉన్నా లేకున్నా వారిని చేర్చేసుకున్నాడు. వాళ్లకు కూడా అధికారం అవసరం వుంది. కాబట్టి ఒకప్పుడు చంద్రబాబుతో సరిసమానమైన నాయకులై వుండి కూడా ఇప్పుడు ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధ పడిపోయారు. ఆనం వాళ్ళన్నాక బల ప్రదర్శన బాగానే వుంటుంది. విజయ వాడ షోకు ఒక రైలు, కొన్ని వందల వాహ నాలలో నెల్లూరు, కడప జిల్లా బద్వేలు నుండి అనుచరులను విజయవాడకు తరలించి చంద్రబాబు ముందు తమ సత్తా చూపారు. చంద్రబాబు వాళ్లను చేర్చుకు న్నది వారి వెనుక వున్న బలం, బంధు గణంపై అంచనా ఉండబట్టే. మొత్తానికి అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా విజయవాడ షో మిగిలింది.

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
  కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
 • తీరంకు సిఇజడ్‌ హారం
  డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
 • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
  నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
 • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
  ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
 • జిల్లాలో వైకాపా... బలముంది... బలమైన నాయకత్వమే కావాల్సివుంది
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. కడప, కర్నూలు తర్వాత నెల్లూరుజిల్లానే వైసిపికి కంచుకోట! ఇంకోరకంగా చెప్పాలంటే ఆ రెండు జిల్లాల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్‌ అయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే…

Newsletter