vprనేను నేనుగా బ్రత కడం కాదు, నేను నలుగురి కోసం బ్రత కడం, నలుగురికి బ్రతుకు నివ్వడం, బ్రతికే మార్గాన్ని చూపించడం... భవిష్యత్‌ పై ఆశలు కల్పించడం, పది మందికి నేనున్నాననే భరోసా ఇవ్వడం... ఈ మార్గాన్ని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. కొందరికి గ్లోబల్‌ కాంట్రాక్టర్‌గా, ఇంకొందరికి ఆథ్యాత్మికవేత్తగా, మరికొందరికి పారిశ్రామికవేత్తగా పరిచయం. కాని నెల్లూరీయులందరికీ మాత్రం ఒక మానవతావాదిగా, సేవాభి లాషిగా సుపరిచయం.

ఇంతకాలం ఆయనకు ఏ రాజకీయ పదవులు లేవు, రాజ్యాంగ పదవులు లేవు. అయినా తన సొంత నిధులతోనే జిల్లా ప్రజలకు సేవాసువాసనలు చూపించాడు. జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని మండలాలలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు నెలకొల్పడం, విపిఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా విద్య, వైద్య సంస్థలను నెలకొల్పడం, ప్రగతి ఛారిటీస్‌కు ప్రతి ఏటా ఆర్ధిక సాయం, వృద్ధాశ్రమాలకు చేయూత నివ్వడం, ఇస్కాన్‌ సంస్థకు అందిస్తున్న సహకారం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఇస్తున్న విరాళాలు, రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రతిఏటా పేద విద్యార్థులకు కిట్‌ల పంపిణీ, శ్రీవారి ఆలయానికి రూఫ్‌, శ్రీ కాళహస్తీశ్వరునికి స్వర్ణ వాహనాలు... ఇలా ఒకటేమిటి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు రాసు కుంటూ పోతే పేజీలు చాలవు. ఎటువంటి అధికారం లేకుండా, ఎలాంటి రాజకీయ పలుకుబడి లేకుండా కేవలం ఒక సామాన్య వ్యక్తిగా ఆయన ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మరిప్పుడు ఆయన రాజకీయ శక్తిగా కూడా రూపుదాల్చారు. ఈ నెల 15వ తేదీ గురువారం రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి జరిగిన నియామకాలలో వైసిపి నుండి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ నెల 23న ఎన్నికలు జరగవలసి వుండగా ఆ అవసరం లేకుండానే ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కాబడి మార్చి 15వ తేదీ ఉదయం ఎన్నికల అధికారి నుండి రాజ్యసభ సభ్యుడిగా ధృవీకరణ పత్రం అందుకున్నారు.

2014లోనే ఆయన వైసిపిలో చేరి రాజకీయ ఆరంగేట్రం చేసినా, రాజ్యసభసభ్యుడిగా ఎన్నిక కావడం ఆయన జీవితంలో పెద్ద మలుపు. రాజ్యసభకు వెళ్లాలన్న ఆయన ఆలోచన వెనుక అధికార యావ, పదవిని అడ్డం పెట్టుకుని సంపాదించాలన్న ఆశ లేదు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు అధికారం తోడైతే ఇంకా ఎక్కువ చేయొచ్చని, ఎక్కువమందికి తన సేవలను అందించవచ్చని ఆలోచన.

సంపాదించే అవకాశం దేవుడు చాలామందికి ఇస్తాడు. దానిని పదిమంది మంచి కోసం ఖర్చుపెట్టే గుణం కొందరికే ఇస్తాడు. ఆ కొందరిలో ఒక్కడే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.

వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నుండి రాజ్యసభకు వెళుతున్న రెండో వ్యక్తి. ఇప్పటివరకు ఆయన ఒక వ్యక్తిగా ప్రజాసేవలో రాణించాడు. ప్రజల మనసుల్లో నిలిచాడు. ఇక రాజకీయ శక్తిగా, రాజ్యసభ సభ్యుడిగా కూడా నెల్లూరుజిల్లా ప్రజల సేవకు సదా సిద్ధం అంటూ వస్తున్నాడు. ఇన్నాళ్ళు ఆయన కేవలం వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కానీ ఈరోజు నుండి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి రాజ్యసభ సభ్యుడు.

ఇది కేవలం ఆయన ఒక్కడే ఆనందించే విషయం కాదు. ఆయన అభిమానించే నెల్లూరుజిల్లా ప్రజానిక మంతా పండుగ చేసుకునే రోజు. నిజాయితీకి, సేవానిరతికి నిలువెత్తు సాక్ష్యమైన స్వచ్ఛమైన మనసున్న మంచి మనిషి రాజ్యసభ సభ్యుడిగా తొలి రాజకీయ పదవిని అధిరోహించడం ఆయనకు కాదు జిల్లాకి సైతం శుభసూచకం.

లక్ష్యాన్ని చేధించి, అనుకున్నది సాధించి, తన చిరకాల కోరిక నెరవేర్చుకున్న ప్రభాకర్‌రెడ్డికి 'లాయర్‌' అభినందనలు.

vprఇప్పటికే నెల్లూరు కేంద్రంగా నెల్లూరుజిల్లాలోనే కాక రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆథ్యాత్మిక, మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన సుల్లో సేవాస్వాప్నికుడిగా ముద్రపడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి... తన జీవితంలో మరో సేవా ప్రయాణానికి తొలి సంతకం చేసారు. ఇంతదాకా వ్యక్తిగా, సేవాశక్తిగా సమాజానికి తనవంతు సేవలందిస్తూ వచ్చిన ఆయన ఇక నుండి రాజకీయ కోణంలోనూ సేవలందించనున్నారు.

ఈ నెల 26వ తేదీన రాష్ట్రంలోని 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీకి దక్కే అవకాశం వుండగా, ఒక స్థానం వైకాపాకు దక్కబోతోంది. తమకు దక్కే ఒక్క స్థానానికి వైసిపి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని పార్టీ అధ్యక్షుడు వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ఖరారు చేయడం జరిగింది. ఈమేరకు ఆయన ఈ నెల 7వ తేదీన వైకాపా రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలతో కలిసి వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సత్యనారాయణకు 3 సెట్ల నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం ఇక లాంఛనమే! ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నుకోవడానికి వైసిపికి తగిన ఎమ్మెల్యేల సంఖ్యా బలం వుంది. టీడీపీకి ఇద్దరు రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే బలం ఉంది. కాబట్టి తెలుగుదేశం ఇద్దరు అభ్యర్థులను మాత్రమే ప్రకటిస్తే ఎలాంటి పోటీ లేకుండా ముగ్గురి ఎన్నిక సాఫీగా జరిగిపోతోంది. చంద్రబాబు దురుద్దేశ్యంతో, తగిన ఎమ్మెల్యేల బలం లేకున్నా మూడో అభ్యర్థిని రంగంలోకి దించితే కొంత టెన్షన్‌ వుంటుంది కాని... ఈ పరిస్థితులలో వైకాపాను వదలి చంద్రబాబును నమ్మి వెళ్ళే వాళ్లెవరూ ఉండరు. కాబట్టి మూడో అభ్యర్థిని పెట్టకపోతే ఏ ఆటంకం లేకుండా, పెడితే కొద్ది ఆటంకంతోనైనా వేమిరెడ్డి రాజ్యసభలో అడుగుపెట్టడం ఖాయం.

vprవైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నెల్లూరుజిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సేవాభిలాషి, దానగుణ సంపన్నుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అధికారికంగా ఖరారు చేసేసారు. పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న వి.విజయసాయిరెడ్డి పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని వైసిపి ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు.

2014 ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చివుంటే అప్పుడే ఆయన రాజ్యసభ సభ్యుడయ్యుండేవాడు. అధికారం లోకి రాక, తగినంత ఎమ్మెల్యేల సంఖ్య లేక ఇంతకాలం వేచి చూడాల్సి వచ్చింది. మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. మన రాష్ట్రం నుండి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాల్సి వుండగా, ఎమ్మెల్యే సంఖ్యా బలాన్ని బట్టి తెలుగుదేశంకు రెండు, వైసిపికి ఒక స్థానం దక్కనున్నాయి. టీడీపీ నుండి చంద్రబాబు ఇద్దరు అభ్యర్థులను మాత్రమే రంగంలోకి దించితే ఎలక్షన్‌తో పని లేకుండా వైసిపి నుండి కూడా విపిఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చు. కాని చంద్ర బాబు కుయుక్తులు పన్ని 'ఓటు-నోటు' సీన్‌ను రిపీట్‌ చేస్తే ఎలక్షన్‌, కొంత టెన్షన్‌ తప్పదు. అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసిపి నుండి ఇక ఎమ్మెల్యేలెవరూ జారుకునే వాతావరణం లేదు. గట్టిగా ఇంకో ఏడాదిలో ఎన్నికలున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత, జగన్‌ పట్ల ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. అదీగాక చంద్రబాబు ఆశించినట్లు రాష్ట్రంలో సీట్లు పెరగలేదు. ఇప్పటికే వైసిపి నుండి తెలుగుదేశంలో చేరిన చాలామందికి టిక్కెట్లు సందేహంగానే వున్నాయి. కాబట్టి ఎవరూ ఇక పార్టీ మారే పరిస్థితి రాదు, కాబట్టి రాజ్యసభ సభ్యుడిగా విపిఆర్‌ విజయానికి తిరుగుండకపోవచ్చు.

ఇక తెలుగుదేశంకు దక్కే రెండు రాజ్యసభ స్థానాలకుగాను నెల్లూరుజిల్లా నుండి బీద మస్తాన్‌రావు పేరు కూడా వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో కావలి నుండి ఓడిపోయిన మస్తాన్‌రావు కావలి ఇన్‌ఛార్జ్‌గాను, రాజధాని కమిటి సభ్యులుగానూ ఉన్నారు. 2004-2014ల మధ్య పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు పార్టీ కోసం ఆర్ధికంగా ఎంతో పని చేసాడు. పార్టీ పట్ల, చంద్రబాబు నాయకత్వం పట్ల విధేయత చూపాడు. గత ఏడాదికాలంగా ఆయన పేరు టీటీడీ ఛైర్మెన్‌గా కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆయన మాత్రం చాలారోజుల నుండి రాజ్యసభ పైనే ఆశలు పెట్టుకుని వున్నాడు. బీసీల కోటాలో బీఎంఆర్‌కే రాజ్యసభ అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.

Page 1 of 5

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • పేటలో పోటీకెవరు?
  జిల్లాలో తెలుగుదేశంపార్టీకి గట్టి నియోజకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఇది ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అయినప్పటికి ఇంతకాలంగా వేనాటి సోదరులే ఇక్కడ పార్టీని నడుపుతూ వచ్చారు. అభ్యర్థులను నిర్ణయిస్తూ, గెలిపిస్తూ వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 8సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 5సార్లు…
 • ఈ నరకం ఇంకెన్నాళ్ళు
  ''ఈ నగరానికి ఏమైంది... ఓ పక్క మసి... మరోపక్క పొగ... నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం''... థియేటర్లలో గాని, టీవీలలో గాని సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే ప్రకటన ఇది. ఇప్పుడు నెల్లూరు పరిస్థితి కూడా అలాగే వుంది. ఓ…
 • జగన్‌ జోరు.. బాబు బేజారు
  'మన్మధుడు' సినిమాలో సీన్‌ ఇది... బ్రహ్మానందం ఇంటికి నాగార్జున, సోనాలిబింద్రే వస్తారు. అక్కడ బ్రహ్మానందం భార్యగా ఒక నల్లజాతి మహిళ ఉండడాన్ని చూసి మీది లవ్‌ మ్యారేజీనా అని నాగార్జున అడుగుతాడు. దానికి బ్రహ్మానందం... ముందు ఆమె నన్ను ప్రేమించింది... తర్వాత…
 • రాజకీయ ప్రయాణంలో... ఇది తొలి సంతకం
  ఇప్పటికే నెల్లూరు కేంద్రంగా నెల్లూరుజిల్లాలోనే కాక రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆథ్యాత్మిక, మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన సుల్లో సేవాస్వాప్నికుడిగా ముద్రపడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి... తన జీవితంలో మరో సేవా ప్రయాణానికి తొలి సంతకం చేసారు. ఇంతదాకా…
 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…

Newsletter