ఈ నెల 19, 20 తేదీలలో నెల్లూరు, కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో వికలాంగులకు ఉచిత వైద్య శిబి రాన్ని నిర్వహిస్తున్నారు. 19వ తేదీ రాజ్య సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జన్మ దినోత్సవం సందర్భంగా వికలాంగులకు ఆయన జన్మదిన కానుకగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. 19వ తేదీ ఉదయం 9గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్ర మానికి ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగాను, నెల్లూరు గ్రామీణ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ పిహెచ్డి రామకృష్ణ విశిష్ఠ అతిథులుగాను విచ్చేయనున్నారు. వికలాంగులు, కాళ్ళు లేని వారిని నిపుణులచే పరీక్షించి వారికి ఉచితంగా జైపూర్ ఫుట్స్‌ను అమరుస్తారు. శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయ సమితి హైదరాబాద్ వారి సహకా రంతో విపిఆర్ ఫౌండేషన్ ఈ కార్యక్ర మాన్ని నిర్వహిస్తుంది. వికలాంగులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జెరాక్స్ కాపీలతో పాటు రెండు పాస్‌పోర్టు సైజ్‌ఫోటోలు తీసుకుని శిబిరానికి హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. వివరాలకు 7680944389, 8885831414 నెంబర్లలో సంప్రదించవచ్చు.
రాజకీయ ప్రయాణంలో ఆయన తొలి అడుగు పడింది. ఆ అడుగు ఇంకెన్ని వేల అడుగులు వేస్తుందో... ఇంకెన్ని వేల కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుందో... ఆ అడుగు ఎన్ని రాజకీయ మార్పు లకు శ్రీకారం చుడుతుందో...
నెల్లూరీయుడు, వదాన్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఈ నెల 5వ తేదీ
ఉదయం ప్రమాణస్వీకారం చేసారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మెన్ మరియు నెల్లూరీ యులైన యం.వెంకయ్యనాయుడు సాటి నెల్లూరీయుడైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ఆ క్షణం నుండి ప్రజాప్రతినిధిగా ఆయన ప్రయాణం మొదలైంది. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన సాటి తెలుగోడు, నెల్లూరీయుడు విపిఆర్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య అచ్చతెలుగులో శుభాకాంక్షలు తెలపడం విశేషం. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రమాణస్వీకారంతో రాజ్యసభలో వైకాపా సభ్యుల సంఖ్య రెండుకు చేరింది. వైకాపా తరపున ఢిల్లీ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న విజయసాయిరెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తోడయ్యాడు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.... నెల్లూరీయులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఆంధ్రా ప్రజలకు బాగా పరిచయం ఉన్న పేరు. రేపటి నుండి దేశ వ్యాప్తంగా కూడా పరిచయం కానున్న పేరు.
ఇప్పటివరకు రాజకీయ నాయకుడిగా కంటే సేవాతత్పరుడిగా ఆయన ప్రజలకు సుపరిచితుడు. రాజకీయాల లోకి రాకముందు నుండే సేవారంగంలో వున్నాడు. సామాజిక, ఆథ్యాత్మిక రంగాలలో ఎన్నో సేవలందించారు. ఎన్నో మానవతా కార్యక్రమాలు నిర్వహిస్తూ గొప్ప మానవతావాదిగా ముద్రపడ్డారు. రెండు దశాబ్దాల క్రితం నెల్లూరుజిల్లాలో మాగుంట కుటుంబానికి గొప్ప పేరుండేది. వాళ్ళ సాయం పొందని కుటుంబం వుండేది కాదు. ఈ దశాబ్దంలో అంతటి గొప్పపేరు తెచ్చుకున్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. పల్లెల గొంతు తడపడానికి మంచినీళ్ళిచ్చినా... పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించినా, భారీ ఎత్తున ఆథ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినా, ఎన్నో అనాధ, వృద్ధాశ్రమాలకు చేయూతనిచ్చినా... అవన్నీ కూడా ఆయనలోని మానవత్వానికి నిదర్శనాలే! ఒక వ్యక్తిగా ఇంతకాలం ఆయన ప్రజలకు ఎంతో సేవచేసాడు. ఒక మంచి వ్యక్తికి ఈరోజు అధికారం అనే శక్తి తోడైంది. ప్రజలకు ఇంకా మంచే జరుగుతుంది. మంచితనం మూర్తీభవించిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభలో అడుగుపెట్టిన శుభసందర్భంగా 'లాయర్' అభినందనలు.
నేను నేనుగా బ్రత కడం కాదు, నేను నలుగురి కోసం బ్రత కడం, నలుగురికి బ్రతుకు నివ్వడం, బ్రతికే మార్గాన్ని చూపించడం... భవిష్యత్ పై ఆశలు కల్పించడం, పది మందికి నేనున్నాననే భరోసా ఇవ్వడం... ఈ మార్గాన్ని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. కొందరికి గ్లోబల్ కాంట్రాక్టర్‌గా, ఇంకొందరికి ఆథ్యాత్మికవేత్తగా, మరికొందరికి పారిశ్రామికవేత్తగా పరిచయం. కాని నెల్లూరీయులందరికీ మాత్రం ఒక మానవతావాదిగా, సేవాభి లాషిగా సుపరిచయం.
ఇంతకాలం ఆయనకు ఏ రాజకీయ పదవులు లేవు, రాజ్యాంగ పదవులు లేవు. అయినా తన సొంత నిధులతోనే జిల్లా ప్రజలకు సేవాసువాసనలు చూపించాడు. జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని మండలాలలో మినరల్ వాటర్ ప్లాంట్లు నెలకొల్పడం, విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య సంస్థలను నెలకొల్పడం, ప్రగతి ఛారిటీస్‌కు ప్రతి ఏటా ఆర్ధిక సాయం, వృద్ధాశ్రమాలకు చేయూత నివ్వడం, ఇస్కాన్ సంస్థకు అందిస్తున్న సహకారం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఇస్తున్న విరాళాలు, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిఏటా పేద విద్యార్థులకు కిట్ల పంపిణీ, శ్రీవారి ఆలయానికి రూఫ్, శ్రీ కాళహస్తీశ్వరునికి స్వర్ణ వాహనాలు... ఇలా ఒకటేమిటి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు రాసు కుంటూ పోతే పేజీలు చాలవు. ఎటువంటి అధికారం లేకుండా, ఎలాంటి రాజకీయ పలుకుబడి లేకుండా కేవలం ఒక సామాన్య వ్యక్తిగా ఆయన ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మరిప్పుడు ఆయన రాజకీయ శక్తిగా కూడా రూపుదాల్చారు. ఈ నెల 15వ తేదీ గురువారం రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి జరిగిన నియామకాలలో వైసిపి నుండి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ నెల 23న ఎన్నికలు జరగవలసి వుండగా ఆ అవసరం లేకుండానే ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కాబడి మార్చి 15వ తేదీ ఉదయం ఎన్నికల అధికారి నుండి రాజ్యసభ సభ్యుడిగా ధృవీకరణ పత్రం అందుకున్నారు.
2014లోనే ఆయన వైసిపిలో చేరి రాజకీయ ఆరంగేట్రం చేసినా, రాజ్యసభసభ్యుడిగా ఎన్నిక కావడం ఆయన జీవితంలో పెద్ద మలుపు. రాజ్యసభకు వెళ్లాలన్న ఆయన ఆలోచన వెనుక అధికార యావ, పదవిని అడ్డం పెట్టుకుని సంపాదించాలన్న ఆశ లేదు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు అధికారం తోడైతే ఇంకా ఎక్కువ చేయొచ్చని, ఎక్కువమందికి తన సేవలను అందించవచ్చని ఆలోచన.
సంపాదించే అవకాశం దేవుడు చాలామందికి ఇస్తాడు. దానిని పదిమంది మంచి కోసం ఖర్చుపెట్టే గుణం కొందరికే ఇస్తాడు. ఆ కొందరిలో ఒక్కడే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.
వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ నుండి రాజ్యసభకు వెళుతున్న రెండో వ్యక్తి. ఇప్పటివరకు ఆయన ఒక వ్యక్తిగా ప్రజాసేవలో రాణించాడు. ప్రజల మనసుల్లో నిలిచాడు. ఇక రాజకీయ శక్తిగా, రాజ్యసభ సభ్యుడిగా కూడా నెల్లూరుజిల్లా ప్రజల సేవకు సదా సిద్ధం అంటూ వస్తున్నాడు. ఇన్నాళ్ళు ఆయన కేవలం వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కానీ ఈరోజు నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు.
ఇది కేవలం ఆయన ఒక్కడే ఆనందించే విషయం కాదు. ఆయన అభిమానించే నెల్లూరుజిల్లా ప్రజానిక మంతా పండుగ చేసుకునే రోజు. నిజాయితీకి, సేవానిరతికి నిలువెత్తు సాక్ష్యమైన స్వచ్ఛమైన మనసున్న మంచి మనిషి రాజ్యసభ సభ్యుడిగా తొలి రాజకీయ పదవిని అధిరోహించడం ఆయనకు కాదు జిల్లాకి సైతం శుభసూచకం.
లక్ష్యాన్ని చేధించి, అనుకున్నది సాధించి, తన చిరకాల కోరిక నెరవేర్చుకున్న ప్రభాకర్‌రెడ్డికి 'లాయర్' అభినందనలు.