pratapకావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును పరిశీలించారు. ఆ చెరువులో వున్న కొద్దిపాటి నీరు ప్రజల త్రాగునీటికి సరిపోవని, వెంటనే సోమశిల జలాలను చెరువుకు అందజేయాలని ఆయన అధికారులను కోరారు. పశువులకు కూడా తాగేందుకు సరిగా నీరందడం లేదని, వెంటనే సోమశిల జలాలు పంపిణీ చేసి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్న ఇనమడుగు శివరామిరెడ్డి మాట్లాడుతూ, కావలి ప్రాంతం పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని, కోవూరుకు రెండో పంటకు నీరిచ్చి కావలి నియోజకవర్గానికి తాగునీటికి కూడా నీరు వదలకపోవడం దారుణమన్నారు. అనంతరం ఎమ్మెల్యే చెరువుకట్ట సంగం వద్ద నివాసం వుంటున్న కుటుంబాలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ కనుమర్లపూడి వెంకటనారాయణ, సాయి, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, పి.కామరాజు, గంధం ప్రసన్నాంజనేయులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

water kavaliరాజకీయ నాయకులు, అధికారుల మాటలు మాత్రం ఘనంగా ఉంటాయని, కానీ వారు చేతలలో పని మాత్రం శూన్యమని కావలిలోని పెద్దపవని రోడ్లలో నివాసముంటున్న పేదప్రజలు ఆరోపిస్తున్నారు. వేసవికాలం కావడంతో నీటి కొరత పట్టణంలో తీవ్రమైంది. ముఖ్యంగా పెద్దపవనిరోడ్డులో వైకుంటపురంలో నివాసముంటున్న ప్రజలు వేసవి ఆరంభం నుండే నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. వీరి సమస్యపై పలు మార్లు ఆ ప్రాంత నాయకులకు, మున్సిపల్ అధికారులకు వివరించినా ప్టటించుకున్న నాథుడే లేడని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు మాటలు ఘనంగా చెప్పి వెళ్తుంటారు. నాయకులు వచ్చినప్పుడు అధికారులు ఈ ప్రాంతానికి అది చేశా, ఇది చేశాఁ, ఇంకేదైనా కావాలంటే చెప్పండి చేస్తామంటారు. వారు వెళ్లిపోయాక ఏది కావాలన్నా పట్టించుకోరని వారు మండిపడుతున్నారు. ఈ ప్రాంతానికి మున్సిపల్ పైపు లైను కూడా లేవు. వీరు అక్కడున్న చేతి పంపులను ఆశ్రయించాల్సిందే. అవి కూడా మరమ్మత్తులకు గురికావడం, నీరు అడుగంటి పోవడంతో గంటలు తరబడి నిలబడినా ఫలితంలేదని అంటున్నారు. గత వేసవిలో ఎన్నికల సమయంలో పోటీపడి ట్యాంకర్లతో నీరు అందించిన నాయకులు ఇప్పుడు ఎక్కడికి పోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు ఈ ప్రాంతానికి నీరు సరఫరా చేసి, చేతి పంపులకు మరమ్మత్తులను చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

udayagiriఇంకా మార్చి నెల పోలేదు. ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. కొండ క్రింద పల్లె జనాల గుండెల్లో దడ మొదలైంది. ఎందుకంటే సాగునీళ్లు ఎలాగూ వుండవు. తాగునీళ్లకు కూడా కటకటలాడే పరిస్థితి వస్తుంది.

నెల్లూరుజిల్లాలో కోస్తా, రాయలసీమ వాతావరణం కలగలిసి ఉంటుంది. తూర్పు ప్రాంతాలైన కావలి, అల్లూరు, విడవలూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, ముత్తుకూరు, టిపిగూడూరు, కోవూరు, బుచ్చి వంటి తూర్పు ప్రాంత మండలాలు కొంతవరకు కోస్తా వాతావరణాన్ని కలిగి ఉంటాయి. నేలలు సారవంతంగా ఉండడం, ఎంత కరువు కాలంలో కూడా నీళ్లు దొరికే పరిస్థితి ఉండడంతో ఇక్కడ పంటలకు ఇబ్బంది ఉండదు. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుని ఉంటారు. సోమశిల, కండ్లేరు రిజర్వాయర్ లు ఏర్పడి తెలుగుగంగ కాలువలు పూర్తయ్యాక జిల్లాలో మధ్యప్రాంతంలో ఉండే మండలాలు బాగుపడ్డాయి. జిల్లాలో అటు కావలి, కలిగిరి, కొండాపురం మండలాలలను మొదలుకొని దక్షిణాన వెంకటగిరి, సూళ్లూరుపేట, తడ మండలాల వరకు తెలుగుగంగ నీళ్లు పారుతున్నాయి. ఈ జిల్లాలో తెలుగుగంగ నీటికి నోచుకోని ఏకైక ప్రాంతం ఉదయగిరి. ఈ ప్రాంతంలో ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, సీతారాంపురం, మర్రిపాడు, వరికుంటపాడు మండలాలలకు సోమశిల నీళ్లు తాగే అదృష్టం లేకుండా పోయింది. పెన్న నుండి 200 కిలోమీటర్ల దూరంలో వున్న చెన్నైకి తెలుగుగంగ నీళ్లు పోతున్నాయి. పాతిక కిలోమీటర్ల దూరం కూడా లేని ఉదయగిరి ప్రాంతానికి గంగనీళ్లు లేవు. దీనికి ఆ ప్రాంతం చేసుకున్న దౌర్భాగ్యం జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎత్తులో ఉండడం, దీనివల్ల కాలువల ద్వారా నీటిని పారించే అవకాశం లేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా వున్న ఆనం రామనారాయణరెడ్డి ఉదయగిరికి సోమశిల నీళ్లు అందించాలన్న లక్ష్యంతో దాదాపు వెయ్యికోట్ల అంచనాలతో సోమశిల హైలెవల్ కెనాల్ ను మంజూరు చేయించారు. అయితే అనతికాలంలే కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం, తెలుగుదేశం రావడంతో ఆ ప్రాజెక్ట్ మరుగున పడిపోయింది. ఇక ఉదయగిరి ప్రాంతంవాళ్లు సోమశిల హైలెవల్ కెనాల్ ను మరచిపోవాల్సిందే.

ఈ ప్రాంతంలో నీళ్లకు బావులు, బోర్లు, చెరువులే దిక్కు, గత ఏడాది వర్షపాతం చాలాతక్కువుగా నమోదైంది. ఇప్పటికే చాలావరకు చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. బావులు, బోర్లలో నీటి మట్టాలు అడుగంటాయి. ఇక్కడ వరిపైరు తక్కువ, పెద్దగా నీటి వాడకం లేని వాణిజ్య పంటలనే వేస్తుంటారు. వాటికి కూడా అరకొర నీళ్లు పెట్టాలి. ఇప్పుడు ఆ నీళ్లు కూడా లేకుండా పోయాయి. ఇక ఉదయగిరి, సీతారాంపురం, దుత్తలూరు, వింజమూరు మండలాలలో తాగునీటి సమస్య తీవ్రంగా వుంది. తాగునీటి బోర్లు ఎండిపోయాయి. కొత్తగా బోర్లు వేస్తున్నా నీళ్లు పడడం లేదు. రక్షిత మంచినీటి పథకాల ద్వారా ఒక పూట నీళ్లు ఇవ్వడం కూడా కష్టసాధ్యంగా ఉంటుంది. మార్చిలోనే తాగునీళ్లకు ఇన్ని కష్టాలుంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఈ మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter