baviమానవాళికి ప్రాణాధారమైన జలాలు నానాటికీ అడుగంటిపోతున్నాయి. గుక్క తడుపుకోవడానికి గుక్కెడు నీరు దొరక్క అనేక ప్రాంతాల్లో జనం అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితి ఈనాటిదేమీ కాదు. ఏళ్ళ తరబడి వెంటాడుతూ ఉన్నదే. అయినా, ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ ఈ దుస్థితిని మార్చలేకపోతున్నారు. ప్రతినీటి చుక్కను కాపాడుకుందామనే బరువైన నినాదాలు ఇస్తుంటారే తప్ప ప్రజల దాహార్తి తీర్చే అమృతం లాంటి జలాలను శాశ్వత ప్రాతిపదికపైన పరిరక్షించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో, జలం పాటికి జలం కాలక్రమేణా అడుగంటిపోతూనే ఉంది. జనం పాటికి జనం యధారీతిగా దాహమో! రామచంద్రా అంటూ విలవిల్లాడిపోతూనే ఉన్నారు.

ఒక్క మానవులకే కాదు, పశుపక్ష్యాదులకు, చెట్టు చేమలకు అన్నిటికీ నీరే జీవనాధారం..ప్రాణాధారం. నీరు లేకుండా ప్రాణం నిలబడదు. గుక్క తడుపుకోకుండా దేహం బతకదు. అందరికీ ప్రాణాలు నిలబట్టే ఆ నీటిని మాత్రం మానవుడు తన అవసరాలకు తగ్గట్టుగా సద్వినియోగం చేసుకుని, భవిష్యత్తరాలకు నీటి కొరత లేకుండా చూడాల్సిన పవిత్రమైన కర్త వ్యాన్ని మాత్రం విస్మరిస్తున్నాడు. అటు సాగునీటి జలాలు, ఇటు తాగునీరు అందరికీ ఎంతో అవసర మైనప్పటికీ, దేశంలో ఇంకా అనేక ప్రాంతాల్లో నిత్యం నీటికి కటకటలు పడుతూనే ఉన్నారు. మనదేశంలో కనీసం 84 కోట్ల మందికి పైగానే ప్రజలు తాగేందుకు చుక్క నీరు దొరక్క దుర్భర పరిస్థితుల్లో ఉన్నారంటూ గణాంకాలు చెప్తున్నాయి. రానురాను ఈ నీటికరువు మరింతగా కోరలు చాస్తుందని, దేశంలో సగభాగానికి పైగానే ప్రజలకు జలగండం తప్పదని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అయినా, ప్రభుత్వాల్లో కదలిక ఉండడం లేదు. వేసవి వస్తే చాలు..అనేక ప్రాంతాల్లో ప్రజలకు నీటి బాధలు మరింత వెక్కిళ్ళు పెట్టిస్తుం టాయి. కుండలు బిందెలు చేతపట్టుకుని ఎంతో మంది తల్లులు, గృహిణులు ఇంటిపనులు వదిలిపెట్టుకుని, మైళ్ళ దూరంలో ఉన్న ఏ పంటపొలాల్లోనో

ఉన్న వ్యవసాయబావుల వద్దకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఆ తెచ్చుకునే బిందెడు నీరు వంటకే చాలదు..ఇక తాగేందుకు మళ్ళీ కుండ చేత పట్టుకుని బావుల వద్దకు వెళ్ళాలి. అవి కూడా దొరక్క ఎక్కడెక్కడ నీటి వనరులున్నాయో వెదుక్కంటూ ఏ గుంటల్లోనో, నీటి చెలమల్లోనూ నీళ్ళు తోడుకుని వచ్చి, ఆ మురికినీటినే వడకట్టుకుని తాగి ప్రాణం నిలబెట్టుకునే ప్రజలు కోట్లాదిగానే ఉంటారంటే అతిశయోక్తి కాదు. ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించాల్సిన పాలకులు ప్రజల దాహార్తి తీర్చేందుకు, గ్రామాల్లో ఉన్న నీటి సమస్యలను పరిష్కరించేందుకు ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు పాలకులు మారినా ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడమే బాధాకరం. అందువల్లనే నేటికీ దేశంలోని ఎన్నో ప్రాంతాల్లోని జనం తమ పంటలు ఎండిపోతున్నాయంటూ అన్నదాతలు, గొంతులు తడారిపోతున్నాయంటూ ప్రజలు తల్లడిల్లిపోతూనే ఉన్నారు. బోర్లెండిపోతూనే ఉంటాయి.. నోర్లెండి పోతూనే ఉంటాయి. కాకి అరుస్తూనే ఉంటుంది..కరవాడ ఎండుతూనే ఉంటుంది.. అయినా, పట్టించుకునే నాధులెవరు?.. జనానికి ఈ మండే ఎండల్లో ఉండే బాధలు చాలవన్నట్లు వేసవిలో నీటి కష్టాలు చెప్పుకుంటూ పోతే కడివెడు కన్నీటి కథలే అవుతాయి. అందులోనూ, నీటిలో కలుషిత నీరు వేరయా అన్నట్లు.. అంతటా కాలుష్యం ప్రబలిపోతున్న ఈ రోజుల్లో నీరు కూడా కాలుష్యపు కాటుకు గురువుతూనే ఉంది. నదులు, కాలువలు, చెరువులు, దొరువులన్నీ రకరకాల వ్యర్థాలతో భరించలేనంత కాలుష్యానికి గురై, ఆ నీరు తాగిన ప్రజలు నానా రకాల వ్యాధులతో అవస్తలు పడుతూనే ఉన్నారు. నీటి వనరులను పరిరక్షించు కోవడానికి, కాలుష్యభూతాన్ని తరిమికొట్టడానికి ప్రభుత్వాలు తగు శ్రద్ధ తీసుకోవడం లేదు. దేశంలో సుమారు 450కి పైగానే నదీనదాలున్నా, ఇటీవలి కాలంలో కాలుష్యానికి గురైన నదుల సంఖ్య 275కి పైగానే పెరిగిందని కేంద్ర కాలుష్య నివారణ మండలి చెప్తున్నా పాలకులకు అది శ్రవణపేయంగానే

ఉంటోందే తప్ప, ఆ కఠోర వాస్తవాల్ని జీర్ణించుకునే స్థితిలో ఉండడం లేదు. దీంతో, దేశంలోని అనేక ప్రాంతాలు కలుషిత నీటితో కుళ్ళిపోతున్నాయి. ఈ నీటిని తాగి ఏటా ప్రాణాలు పోగొట్టుకునేవారి సంఖ్య గణనీయంగానే ఉంది. ఈ ఇక్కట్లు చాలవన్నట్లు, మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లుగా, నీటిలో ఫ్లోరైడ్‌ శాతం కలవడం ద్వారా ఆ నీరు అనేకమంది ప్రజలనకు మరింతగా బాధిస్తోంది. విధిలేని పరిస్థితుల్లో మరో ప్రత్యామ్నాయం లేక ఫ్లోరైడ్‌ శాతం కలగలసిన నీటిని తాగాల్సి రావడంవల్ల దేశంలోని అనేక ప్రాంతా ల్లోని ప్రజలు అనేకానేక వ్యాధులకు బాధలకు గురై శాపగ్రస్తుల్లా, జీవితాంతం జీవచ్ఛవాల్లా బతుకు తున్నారు. వారిని కదిలిస్తే చాలు.. కన్నీళ్ళే జలజలా రాలుతాయి. అయినా, వారి ఆర్తిని.. దాహార్తిని తీర్చే వారెవరూ?.. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఫ్లోరైడ్‌ రక్కసి ఇంకా ఇంకా విరుచుకుపడుతూనే ఉందని నిపుణులు ఎన్నిసార్లు ఎంత స్పష్టంగా హెచ్చరిస్తున్నా పాలకుల చెవికెక్కకపోవడం ఎంతైనా విచారకరం. మనకు లభించే నీటి వనరులు కాలుష్యంతో ఉంటున్నాయి. భూగర్భంలో ఉండే స్వచ్ఛమైన జల

వనరులు అడుగంటిపోతున్నాయి. ఈ పరిస్థితిని అందరూ వెంటనే గ్రహించాలి.

ప్రభుత్వాలు, పాలకులు, మేథావులు అందరూ కలసి ఇకనైనా నీటిని సంరక్షించుకునేందుకు బృహత్తర ప్రయత్నాలు చేయాలి. వాననీటిని పొదుపుగా వాడుకోవాలి. వాననీటిని భూమిలోకి ఇంకిపోయేలా చేయడం ద్వారా భూగర్భజల వనరుల్ని రక్షించుకోవాలి. అడవులు, చెట్టుచేమలు పెంచడం ద్వారా వర్షపాత సాంద్రతను పెంచుకోవాలి. వానలు.. వరదల ద్వారా సముద్రాలకు వృధాగా వెళ్లిపోతున్న అపార జలరాశిని కాపాడుకోవాలి. ఈ బాధ్యతలు విస్మరిస్తే జీవితాలు చివరికి ఎండిన మోడులే అవుతాయి. జలం

ఉంటేనే జాతికి బలం. ఆ జలమే అందరికీ శ్రీరామరక్ష!.. కనుక ఆ జీవజలాన్ని కాపాడుకోవాలి. పచ్చదనాన్ని, పర్యావరణాన్నీ పరిరక్షించుకోవాలి. అదే మనందరి తక్షణ కర్తవ్యం!....

water problనెల్లూరులో తాగునీటి సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. గత ఏడాది వర్షాలు లేకపోవడం మూలంగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. బావులు, బోర్లు ఎండిపోయాయి. ఆయా కాలనీవాసులతో పాటు అపార్ట్‌మెంట్లలో వుండేవాళ్లు సైతం కార్పొరేషన్‌ నీళ్ల మీదే ఆధారపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పైప్‌లైన్‌లు బ్లాకై నీళ్ళు రాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. హోటల్స్‌, హాస్పిటల్స్‌ వంటి వ్యాపార సంస్థలతో పాటు అపార్ట్‌మెంట్లలో వుండే వాళ్లు కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్ళను కొనుగోలు చేస్తున్నారు. కార్పొరేషన్‌ ఇచ్చే నీళ్ళు తాగడానికే సరిపోకపోతుండగా, కొందరు నీటిని ఇంటి వరండాలు తడపడానికి, ఇళ్లల్లో కార్లు కడగడానికి వృధా చేస్తున్నారు. కొన్ని కొళాయిల వద్ద వాల్వ్‌లు, టాప్‌లు పోయి నీటి వృధా ఎక్కువుగా ఉంటోంది. నీటివృధాపై కూడా కార్పొరేషన్‌ అధికారులు దృష్టి పెట్టాల్సివుంది.

water kavaliరాజకీయ నాయకులు, అధికారుల మాటలు మాత్రం ఘనంగా ఉంటాయని, కానీ వారు చేతలలో పని మాత్రం శూన్యమని కావలిలోని పెద్దపవని రోడ్లలో నివాసముంటున్న పేదప్రజలు ఆరోపిస్తున్నారు. వేసవికాలం కావడంతో నీటి కొరత పట్టణంలో తీవ్రమైంది. ముఖ్యంగా పెద్దపవనిరోడ్డులో వైకుంటపురంలో నివాసముంటున్న ప్రజలు వేసవి ఆరంభం నుండే నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. వీరి సమస్యపై పలు మార్లు ఆ ప్రాంత నాయకులకు, మున్సిపల్ అధికారులకు వివరించినా ప్టటించుకున్న నాథుడే లేడని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు మాటలు ఘనంగా చెప్పి వెళ్తుంటారు. నాయకులు వచ్చినప్పుడు అధికారులు ఈ ప్రాంతానికి అది చేశా, ఇది చేశాఁ, ఇంకేదైనా కావాలంటే చెప్పండి చేస్తామంటారు. వారు వెళ్లిపోయాక ఏది కావాలన్నా పట్టించుకోరని వారు మండిపడుతున్నారు. ఈ ప్రాంతానికి మున్సిపల్ పైపు లైను కూడా లేవు. వీరు అక్కడున్న చేతి పంపులను ఆశ్రయించాల్సిందే. అవి కూడా మరమ్మత్తులకు గురికావడం, నీరు అడుగంటి పోవడంతో గంటలు తరబడి నిలబడినా ఫలితంలేదని అంటున్నారు. గత వేసవిలో ఎన్నికల సమయంలో పోటీపడి ట్యాంకర్లతో నీరు అందించిన నాయకులు ఇప్పుడు ఎక్కడికి పోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు ఈ ప్రాంతానికి నీరు సరఫరా చేసి, చేతి పంపులకు మరమ్మత్తులను చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter