jumpingsభారత రాష్ట్రపతి, గవర్నర్‌లు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రబ్బరు స్టాంపులే! అయితే అన్ని వేళల్లో కాదు. తమకు అవకాశం వచ్చినప్పుడు వారు ఉగ్రరూపం దాలిస్తే ఆ పరిణామాలు వేరుగా ఉంటాయి. ప్రజల బ్రతుకులతో, సమాజం భవిష్యత్‌తో ఆడుకునే రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పట్టించగల శక్తులు కేవలం రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి మాత్రమే ఉంటాయి. కనీసం వాళ్ళు అప్పుడప్పుడన్నా ఆ శక్తులను ఉప యోగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో చోటుచేసుకునే దారుణాలలో కొన్నింటి నన్నా అరికట్టవచ్చు.

చంద్రబాబు త్వరలో మంత్రివర్గ విస్త రణ చేపట్టాలనుకుంటున్న దృష్ట్యా రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ పాత్ర చాలా కీల కంగా మారింది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమైనప్పుడు గవర్నర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తెలంగాణ ఉద్యమం సమయంలోనూ గవర్నర్‌గా నరసింహన్‌ చాలా సమర్ధవంతంగా విధులు నిర్వ ర్తించారు. ఇప్పుడు మరోసారి ఆయనకు తన సచ్ఛీలతను, రాజ్యాంగ స్ఫూర్తిని చాటుకునే సమయం వచ్చింది. చంద్ర బాబు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం పెట్టబోతున్నాడు. బహుశా ఉగాదే శుభ ముహూర్తం కావచ్చు కూడా! తన పుత్ర రత్నం లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసు కోవడం ఖాయం. అలాగే ఉన్నవారిలో ఓ నలుగురైదుగురిని పీకి వారి స్థానంలో సీనియర్లను తీసుకోవాలనుకుంటున్నారు. ఇంతవరకు ఎటువంటి అభ్యంతరాలు

ఉండవు. వీరితో పాటు వైకాపా నుండి వచ్చిన ఎమ్మెల్యేలలో కూడా ఓ ముగ్గురు లేదా నలుగురికి మంత్రి పదవులు ఇవ్వా లనుకుంటున్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే వీళ్ళు తెలుగు దేశంలో చేరారు. ఆ కోటాలో భూమా అఖిలప్రియ, ఆకే అమర్‌నాథ్‌రెడ్డి, సుజయ్‌ రంగారావు, జ్యోతుల నెహ్రూ పేర్లు విని పిస్తున్నాయి. అయితే జంపింగ్‌ ఎమ్మెల్యే లను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి గవర్నర్‌ నరసింహన్‌ మోకాలడ్డుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలోకి తీసుకోవా లనుకుంటున్న జంపింగ్‌ ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయాలి. ఆమోదించుకోవాలి. ఆ తర్వాత మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, తెలుగు దేశం అభ్యర్థులుగా గెలుపొందాలి. ఇదే జంపింగ్‌ జిలానీలకు గవర్నర్‌ ఇస్తున్న ఝలక్‌!

తెలంగాణలో జరిగిన అనుభవం తోనే గవర్నర్‌ నరసింహన్‌ ఈ నిర్ణయంపై గట్టిగా ఉన్నాడని తెలుస్తోంది. అక్కడ తెలుగుదేశం నుండి టీఆర్‌ఎస్‌లో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్‌ను మంత్రివర్గం లోకి తీసుకున్నారు. దీనిపై తెలంగాణ తెలుగుదేశం నాయకులు తీవ్ర రాద్ధాంతం చేసారు. మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే చేత మంత్రిగా ఎలా ప్రమాణస్వీకారం చేయిస్తారంటూ గవర్నర్‌పైనే ఆరోపణలు ఎక్కుపెట్టారు. ఆ తర్వాత అక్కడ తలసాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం జరిగింది. తలసానిని మంత్రివర్గంలోకి తీసుకోవడంపై తెలంగాణ తమ్ముళ్ళు హైకోర్టుకు కూడా వెళ్లారు.

తెలంగాణ వ్యవహారమే ఇప్పుడు చంద్రబాబుకు చిక్కుముడిగా మారింది. తలసాని విషయంలో చేసిన రాద్ధాంతమే ఇప్పుడు ఆయనకు ఇబ్బందిగా మారింది. తలసాని విషయంలో విలువలను ప్రశ్నిం చిన మీరు ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యేలను ఎలా మంత్రివర్గంలోకి తీసుకుంటారని గవర్నర్‌ ప్రశ్నిస్తే చంద్రబాబు వద్ద సమా ధానం ఉండదు. ఈ విషయంలో గవర్నర్‌ తన వైఖరికే కట్టుబడితే జంపింగ్‌లకు మంత్రి పదవులు దక్కడం అనుమానమే!

ఒకవేళ చంద్రబాబు విలువలకు కట్టుబడి జంపింగ్‌ ఎమ్మెల్యేల చేత రాజీ నామాలే చేయించాడనుకుందాం... ఉప ఎన్నికల్లో తిరిగి వీళ్లు గెలవగలరా? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఉప ఎన్నికలకు పోవడమంటే మురికిగుంటను వెదుక్కుని మరీ దూకడమే అవుతుంది.

vala pakఎరక్కపోయి వచ్చాము ఇరుక్కుపోయాము అన్నట్లుగా వుంది వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ నుండి తెలుగుదేశంలో దూరిన ఎమ్మెల్యేల పరిస్థితి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారని, నియోజకవర్గాలలో వారి హవా నడుస్తుందని, అక్కడకు పోతే మనం కూడా దర్జాగా ఉండొచ్చని భావించి 21మంది దాకా వైసిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరారు. వీరిలో కొందరు చంద్రబాబు తాయిలాలకు ఆకర్షితులు కాగా, బలమైన నాయకులకు మాత్రం మంత్రి పదవులను ఎరగా వేశారు. వీళ్లంతా కూడా పార్టీ నుండి వచ్చేటప్పుడు జగన్‌కు మంచి మర్యాద తెలియదని, సీనియర్లంటే గౌరవం లేదని, తెలుగు దేశంలోకి రావడం పుట్టింటికి వచ్చినట్లుగా వుందని రకరకాల ప్రకటనలు చేశారు. తెలుగుదేశంలో చేరాక తామే కింగ్‌లమనుకున్నారు.

కాని, ఇప్పుడు అక్కడ పరిస్థితి చూసి కొందరు ఎమ్మెల్యేలు మేం పెనం మీద నుండి పొయ్యిలో పడ్డామని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలైతే మనసు చంపుకుని తెలుగుదేశంలో చేరారు. కాని ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితులు వీరికి ఏ మాత్రం మింగుడు పడడం లేదు. తమ నియోజకవర్గాలలో అంతకుముందే వున్న తెలుగుదేశం నాయకులు వీరిని ఏ మాత్రం లెక్కచేయడం లేదు. వీరిలో కొందరికి చంద్రబాబు మంత్రిపదవుల హామీ ఇచ్చి వున్నాడు. ఆ పదవులన్నా వస్తే తమ పరపతి పెరుగుతుందని, అనుచరులను కాపాడుకోగలమని వీరి బాధ. చంద్రబాబు మాత్రం మంత్రివర్గ విస్తరణ జోలికి పోవడం లేదు. పార్టీలో ఆయన సమస్యలు ఆయనకున్నాయి. కాని ఇప్పటికే మూడేళ్లు కావస్తుంది. ఇక మంత్రి పదవి వచ్చినా గట్టిగా వెలగబెట్టేది ఒకటి, ఒకటిన్నర సంవత్సరమే! ఇప్పుడు కూడా మంత్రి పదవులు ఇవ్వకపోతే తర్వాత ఇచ్చినా దండగే అన్న నిర్లిప్తధోరణి జంపింగ్‌ ఎమ్మెల్యేలలో వ్యక్తమవుతోంది. 'దూరపు కొండలు నునుపు' అన్న సామెతను పెద్దలు వూరకే చెప్పారా?

outఅవసరమున్న పని చేస్తే విజ్ఞత అవుతుంది. అనవసరమైన పనిచేస్తే అజ్ఞానమవుతుంది. ఒక్కోసారి మేధావులు కూడా అజ్ఞానాంధకారంలో పడి, తాము జ్ఞానసాగరంలో పయనిస్తున్నామన్న భ్రమలో ఉంటారు. రాష్ట్ర రాజకీయాలలో నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ మేధావి చంద్రబాబునాయుడు కూడా ఇలాంటి భ్రమల్లోనే ఉన్నాడా... అనిపిస్తోంది.

రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని ప్రజలు పట్టించుకోకుంటే ప్రభుత్వం బలపడుతుంది. అధికారంలో వున్న పార్టీయే మళ్ళీ మళ్ళీ అధికా రంలోకి వస్తుంది. కాని ప్రతిపక్షాన్ని బలహీనపర్చాలనే అధికార పార్టీ ప్రయత్నం చేసే కొద్దీ అది ఇంకొంచెం బలపడుతుంది.

ప్రతిపక్ష వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న తలంపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన ఎమ్మెల్యే ఫిరాయింపు సంస్కృతి ఆయనకే నష్టం కలిగించబోతుందా? ఇది ప్రతిపక్ష వైకాపాకే ప్రయోజనంగా మారబోతుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వచ్చాయి. చంద్రబాబు ఆకర్షణ ఆఫర్లకు ప్రభావితులై 20మంది ఎమ్మెల్యేలు వైకాపా నుండి తెలుగుదేశంలో చేరడం చూసాం. భూమా నాగిరెడ్డితో మొదలు పెట్టిన వలసలు పలమనేరు ఎమ్మెల్యే ఆకే అమరనాథరెడ్డి దాకా వచ్చాయి. మొత్తం 20అసెంబ్లీలు. కడప, కర్నూలు, కృష్ణా, విజయనగరం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం... అన్ని జిల్లాల నుండి వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వెళ్లారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఇటీవల ఓ సంస్థ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా వుంటాయన్న దానిపై సర్వేను నిర్వహించినట్లు సమాచారం. ఈ సర్వే ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకే చంద్రబాబు సీట్లిస్తే ఒక్క పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి తప్పితే మిగతా వాళ్లంతా భారీ మెజార్టీలతో ఓడిపోవడం ఖాయమని తేలిందని భోగట్ట! పలమనేరులో ఇంకా వైసిపికి గట్టి నాయకత్వం లేదు. అక్కడ కూడా మంచి అభ్యర్థి దొరికితే ఫలితం తారుమారు కావొచ్చని సమాచారం.

రెండేళ్ల తర్వాత ఏ ప్రభుత్వం మీదైనా కొంత వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మీద అది తీవ్రస్థాయిలోనే వుంది. ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలోకి జంప్‌ చేసిన ఎమ్మెల్యేలపై అది మరింత తీవ్రంగా వుంటుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రజలు ఆగ్రహంతోనే ఉంటారు. ఏ పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా ఫిరాయించినా ప్రజలు వారిని ఒకే గాటన జమకడతారు.

2009 ఎన్నికలు కాగానే తెలుగుదేశం అధికారంలోకి రాకపోవడంతో అప్పుడు కోవూరు తెలుగుదేశం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడం తెలిసిందే! వై.యస్‌. మరణం తర్వాత ఆయన జగన్‌ స్థాపించిన వైసిపిలో చేరాడు. జగన్‌ విలువలకు కట్టుబడి ప్రసన్న చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాడు. 2012లో కోవూరుకు ఉపఎన్నికలు జరిగితే అంత వై.యస్‌. సానుభూతి గాలిలోనూ ఈయన కొచ్చిన మెజార్టీ 23వేలే! ఆ గాలిలో 50వేలు మెజార్టీ ఖాయమనుకున్నారు. అదే లోక్‌సభ ఎన్నికలలో వైకాపా ఎంపీగా పోటీ చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డికి మాత్రం ఒక్క కోవూరు అసెంబ్లీ పరిధిలోనే 50వేల మెజార్టీ వచ్చింది. కేవలం గెలిచి గెలవగానే పార్టీ ఫిరాయించాడని ప్రసన్నపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత వల్లే ఆయన మెజార్టీ పడిపోయింది.

ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రజలు ఎంత హీనంగా చూస్తారన్న దానికి గత కోవూరు ఉపఎన్నికలే ఒక ఉదాహరణ. ఈ 20మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు చేర్చుకోకపోయి వుంటే పరిస్థితి ఇంకో విధంగా వుండేది. 2019 నాటికి ఈ 20మంది ఎమ్మెల్యేలలో సగం మందిపైనైనా వ్యతిరేకత వచ్చేది. ఇది తెలుగుదేశంకు లాభించేది. కనీసం ఈ 20లో సగం సీట్లు తెలుగుదేశంకు గ్యారంటీ ఉండేవి. వీళ్లను తెచ్చి నెత్తిన పెట్టుకున్నందు వల్ల చంద్రబాబు ఇంకొంచెం గబ్బు పట్టడమే కాని, పార్టీకి అదనంగా వచ్చిన ప్రయోజనమేదీ లేదు. కొత్త వారిని నలుగురిని తెచ్చుకుంటే ఇప్పటికే ఉన్నోళ్లు నలభైమంది దూరమవుతున్నారనే విషయాన్ని చంద్రబాబు విస్మరిస్తున్నాడు.

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter