భారత రాష్ట్రపతి, గవర్నర్లు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రబ్బరు స్టాంపులే! అయితే అన్ని వేళల్లో కాదు. తమకు అవకాశం వచ్చినప్పుడు వారు ఉగ్రరూపం దాలిస్తే ఆ పరిణామాలు వేరుగా ఉంటాయి. ప్రజల బ్రతుకులతో, సమాజం భవిష్యత్‌తో ఆడుకునే రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పట్టించగల శక్తులు కేవలం రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి మాత్రమే ఉంటాయి. కనీసం వాళ్ళు అప్పుడప్పుడన్నా ఆ శక్తులను ఉప యోగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో చోటుచేసుకునే దారుణాలలో కొన్నింటి నన్నా అరికట్టవచ్చు.
చంద్రబాబు త్వరలో మంత్రివర్గ విస్త రణ చేపట్టాలనుకుంటున్న దృష్ట్యా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పాత్ర చాలా కీల కంగా మారింది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమైనప్పుడు గవర్నర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తెలంగాణ ఉద్యమం సమయంలోనూ గవర్నర్‌గా నరసింహన్ చాలా సమర్ధవంతంగా విధులు నిర్వ ర్తించారు. ఇప్పుడు మరోసారి ఆయనకు తన సచ్ఛీలతను, రాజ్యాంగ స్ఫూర్తిని చాటుకునే సమయం వచ్చింది. చంద్ర బాబు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం పెట్టబోతున్నాడు. బహుశా ఉగాదే శుభ ముహూర్తం కావచ్చు కూడా! తన పుత్ర రత్నం లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసు కోవడం ఖాయం. అలాగే ఉన్నవారిలో ఓ నలుగురైదుగురిని పీకి వారి స్థానంలో సీనియర్లను తీసుకోవాలనుకుంటున్నారు. ఇంతవరకు ఎటువంటి అభ్యంతరాలు
ఉండవు. వీరితో పాటు వైకాపా నుండి వచ్చిన ఎమ్మెల్యేలలో కూడా ఓ ముగ్గురు లేదా నలుగురికి మంత్రి పదవులు ఇవ్వా లనుకుంటున్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే వీళ్ళు తెలుగు దేశంలో చేరారు. ఆ కోటాలో భూమా అఖిలప్రియ, ఆకే అమర్నాథ్రెడ్డి, సుజయ్ రంగారావు, జ్యోతుల నెహ్రూ పేర్లు విని పిస్తున్నాయి. అయితే జంపింగ్ ఎమ్మెల్యే లను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి గవర్నర్ నరసింహన్ మోకాలడ్డుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలోకి తీసుకోవా లనుకుంటున్న జంపింగ్ ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయాలి. ఆమోదించుకోవాలి. ఆ తర్వాత మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, తెలుగు దేశం అభ్యర్థులుగా గెలుపొందాలి. ఇదే జంపింగ్ జిలానీలకు గవర్నర్ ఇస్తున్న ఝలక్!
తెలంగాణలో జరిగిన అనుభవం తోనే గవర్నర్ నరసింహన్ ఈ నిర్ణయంపై గట్టిగా ఉన్నాడని తెలుస్తోంది. అక్కడ తెలుగుదేశం నుండి టీఆర్ఎస్లో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్‌ను మంత్రివర్గం లోకి తీసుకున్నారు. దీనిపై తెలంగాణ తెలుగుదేశం నాయకులు తీవ్ర రాద్ధాంతం చేసారు. మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే చేత మంత్రిగా ఎలా ప్రమాణస్వీకారం చేయిస్తారంటూ గవర్నర్‌పైనే ఆరోపణలు ఎక్కుపెట్టారు. ఆ తర్వాత అక్కడ తలసాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం జరిగింది. తలసానిని మంత్రివర్గంలోకి తీసుకోవడంపై తెలంగాణ తమ్ముళ్ళు హైకోర్టుకు కూడా వెళ్లారు.
తెలంగాణ వ్యవహారమే ఇప్పుడు చంద్రబాబుకు చిక్కుముడిగా మారింది. తలసాని విషయంలో చేసిన రాద్ధాంతమే ఇప్పుడు ఆయనకు ఇబ్బందిగా మారింది. తలసాని విషయంలో విలువలను ప్రశ్నిం చిన మీరు ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యేలను ఎలా మంత్రివర్గంలోకి తీసుకుంటారని గవర్నర్ ప్రశ్నిస్తే చంద్రబాబు వద్ద సమా ధానం ఉండదు. ఈ విషయంలో గవర్నర్ తన వైఖరికే కట్టుబడితే జంపింగ్‌లకు మంత్రి పదవులు దక్కడం అనుమానమే!
ఒకవేళ చంద్రబాబు విలువలకు కట్టుబడి జంపింగ్ ఎమ్మెల్యేల చేత రాజీ నామాలే చేయించాడనుకుందాం... ఉప ఎన్నికల్లో తిరిగి వీళ్లు గెలవగలరా? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఉప ఎన్నికలకు పోవడమంటే మురికిగుంటను వెదుక్కుని మరీ దూకడమే అవుతుంది.
ఎరక్కపోయి వచ్చాము ఇరుక్కుపోయాము అన్నట్లుగా వుంది వైయస్సార్‌కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశంలో దూరిన ఎమ్మెల్యేల పరిస్థితి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారని, నియోజకవర్గాలలో వారి హవా నడుస్తుందని, అక్కడకు పోతే మనం కూడా దర్జాగా ఉండొచ్చని భావించి 21మంది దాకా వైసిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరారు. వీరిలో కొందరు చంద్రబాబు తాయిలాలకు ఆకర్షితులు కాగా, బలమైన నాయకులకు మాత్రం మంత్రి పదవులను ఎరగా వేశారు. వీళ్లంతా కూడా పార్టీ నుండి వచ్చేటప్పుడు జగన్‌కు మంచి మర్యాద తెలియదని, సీనియర్లంటే గౌరవం లేదని, తెలుగు దేశంలోకి రావడం పుట్టింటికి వచ్చినట్లుగా వుందని రకరకాల ప్రకటనలు చేశారు. తెలుగుదేశంలో చేరాక తామే కింగ్లమనుకున్నారు.
కాని, ఇప్పుడు అక్కడ పరిస్థితి చూసి కొందరు ఎమ్మెల్యేలు మేం పెనం మీద నుండి పొయ్యిలో పడ్డామని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలైతే మనసు చంపుకుని తెలుగుదేశంలో చేరారు. కాని ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితులు వీరికి ఏ మాత్రం మింగుడు పడడం లేదు. తమ నియోజకవర్గాలలో అంతకుముందే వున్న తెలుగుదేశం నాయకులు వీరిని ఏ మాత్రం లెక్కచేయడం లేదు. వీరిలో కొందరికి చంద్రబాబు మంత్రిపదవుల హామీ ఇచ్చి వున్నాడు. ఆ పదవులన్నా వస్తే తమ పరపతి పెరుగుతుందని, అనుచరులను కాపాడుకోగలమని వీరి బాధ. చంద్రబాబు మాత్రం మంత్రివర్గ విస్తరణ జోలికి పోవడం లేదు. పార్టీలో ఆయన సమస్యలు ఆయనకున్నాయి. కాని ఇప్పటికే మూడేళ్లు కావస్తుంది. ఇక మంత్రి పదవి వచ్చినా గట్టిగా వెలగబెట్టేది ఒకటి, ఒకటిన్నర సంవత్సరమే! ఇప్పుడు కూడా మంత్రి పదవులు ఇవ్వకపోతే తర్వాత ఇచ్చినా దండగే అన్న నిర్లిప్తధోరణి జంపింగ్ ఎమ్మెల్యేలలో వ్యక్తమవుతోంది. 'దూరపు కొండలు నునుపు' అన్న సామెతను పెద్దలు వూరకే చెప్పారా?