jaganమొరిగే కుక్కలు ఎంతైనా మొరగనీ... అరిచే కుక్కలు ఎంతైనా అరవనీ... నీతి తప్పిన చేతులు ఏమైనా రాసుకోనీ... గతి తప్పిన ఛానెళ్ళు ఎంతైనా వాగనీ... నా సంకల్పం చెక్కు చెదరదు... నా ఆత్మస్థైర్యం అణువంత కూడా తగ్గదు... మీరు నేలకు కొట్టాలనుకునే కొద్ది బంతిలా ఇంకా పైకి ఎగురుతూనే వుంటాను... మడమ తిప్పని, మాట తప్పని వై.యస్‌.రాజశేఖర రెడ్డి బిడ్డను నేను... నాలో ప్రవహించేది ఆయన రక్తమే... ప్రజలకిచ్చిన మాట కోసం ఢిల్లీనే ఎదురించాను... ఎన్ని కష్టాలుపెట్టినా ఎదురొడ్డి నిలిచాను... ఈ బాబులు, ఔరంగ జేబులు నాకొక లెక్కా... ఈ జనం కోసం నేను నడుస్తాను... నా చావైనా, బ్రతుకైనా ఈ జనం కోసమేనంటూ అతను ముందడుగు వేసాడు. ఆ అడుగే ప్రజా ప్రభంజనమై, ప్రత్యర్థుల గుండెల్లో ప్రకంపనమై మారుమోగుతోంది.

తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి, అక్రమాల పాలనపై సమర శంఖం పూరిస్తూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి దండయాత్ర ప్రారంభించాడు. ఈ నెల 6వ తేదీన వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి సమాధి చెంత ప్రణమిల్లి, ఆయనకు నివాళులర్పించిన జగన్‌ అక్కడనుండి ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టాడు. విభజనతో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తేవాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని, ప్రతి పేదబిడ్డకు ఉన్నత చదువులు అందాలని, అన్నదాతలకు వ్యవసాయం పండుగ కావాలని, ప్రతి చేనుకు నీరు రావాలని, ప్రతి పైరుకు కరెంట్‌ ఉచితంగా అందాలని, మద్యం తొలగిపోయి మహిళల్లో ఆనందం నిండాలని, రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాలని, కార్మి కులు సంతోషంగా వుండాలని, పేద, దళిత, బలహీన, మైనార్టీ ప్రజల సమస్యలు తొలగిపోవాలని, రైతన్నల ఆత్మహత్యలు ఆగి పోవాలని, నేత కార్మికుల బ్రతుకులు బాగు పడాలని, అక్కచెళ్ళెళ్ళపై వేధింపులు రూపుమాపాలని, నిరా శ్రయులైన వృద్ధులను ఆదు కోవాలని, ప్రతి ఒక్కరికీ ఇళ్ళుండాలని, ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందాలని, ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం వెల్లివెరి యాలని, ప్రతి జిల్లాలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో జగన్‌ ముందడుగు వేసాడు. 13జిల్లాలు... 3వేల కిలోమీటర్లు... 6 నెలలు... ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర... ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వంపై సాగిస్తున్న దండయాత్ర.

జగన్‌ పాదయాత్రను అడ్డుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం చేయని కుట్రలు లేవు. పాదయాత్రకు అనుమతులు లేవంటూ అడ్డుపుల్ల వేయాలని చూసారు. వై.యస్‌., చంద్రబాబులతో సహా రాష్ట్రంలో రాజకీయ పాదయాత్రలు చేసిన వాళ్లెవరు కూడా అనుమతులు తీసుకోని విషయాన్ని పోలీసులే విడమర్చి చెప్పేసరికి తోక ముడిచారు.

మూడున్నరేళ్ళలో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అటకెక్కిం చారు. అమరావతి రాజధాని నిర్మాణం 'మొగలిరేకులు' సీరియల్‌ లాగా తయారైంది. 35వేల ఎకరాల మాగాణి భూములు లాక్కుని అటు భూములను, ఇటు రైతులను నాశనం చేశారు. రాజధాని పేరు చెప్పుకుని విదేశాలకు తిరిగిందే తిరుగుతున్నారు. ఈ ప్రభుత్వంలో రాజధాని పెద్ద అట్టర్‌ఫ్లాప్‌షో! నూరు శాతం ఋణమాఫీ వాగ్దానం నీరుగారిపోయింది. ఋణమాఫీపై చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన మాటకు, ఎన్నికల తర్వాత చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయింది. లక్షల ఉద్యో గాలు కనుచూపు మేరలో కనపడడం లేదు. వేలకోట్ల పెట్టుబడుల ఒప్పందాలన్నీ ఉత్తుత్తివిగానే మిగిలిపోతున్నాయి. నిరుద్యోగుల భృతి మరుగున పడిపోయింది. ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా... అడుగడుగునా అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, అధికారులపై వేధింపులతో... రాష్ట్రంలో గూండారాజ్‌ రాజ్య మేలుతోంది.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వేదిక అసెంబ్లీ. అయితే అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షం గొంతు నొక్కే పాత్రను ప్రతిసారీ విజయవంతంగానే నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షం సమస్యలను, ప్రభుత్వ వాగ్ధానాల వైఫల్యాలను ప్రస్తావించి నప్పుడల్లా అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్ష నేతపై అనవసరపు మాటలతో ఎదురుదాడికి దిగుతూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారు. సభా సంప్రదాయాలను మంటగలుపుతూ సభను ఒక కప్పల చెరువుగా మారుస్తున్నారు.

ఈ దశలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి, ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి జగన్‌ ప్రజల ముందుకే వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఇక వారితో కలిసే పయనించడానికి పాదయాత్రకు బయలుదేరాడు.

ఒక నాయకుడు పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసు కోబట్టే... ఒక ఆరోగ్యశ్రీ పుట్టింది. పేద విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వచ్చింది. పేదలకు, రైతులకు ఉచిత కరెంట్‌ను తెచ్చింది. ఆపదలో వున్న వారింటికి 108 అంబులెన్స్‌ పరుగులు పెట్టింది. ఏ దిక్కూ లేని అవ్వలు, తాతలకు పింఛన్‌ ఇచ్చింది. భారీగా పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి వచ్చేలా చేసింది. ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందేలా చేసి రైతన్న కంటిలో నీరు రాకుండా చేసింది. 2002 సంవత్సరం... మండుటెండల్లో దివంగత నేత వై.యస్‌.రాజ శేఖరరెడ్డి ప్రతిపక్షనేతగా సాగించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఫలితాలివి. ఆనాడు చేవెళ్ల నుండి ఇచ్ఛాపురం దాకా 1474 కిలోమీటర్లు చేసిన పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజల కష్టాలను, కన్నీళ్ళను దగ్గరగా చూసాడు. కాబట్టే 2004లో సీఎం కాగానే వారి కష్టాలు తొలగించడానికి,

కన్నీళ్ళు తుడవడానికి చరిత్రలో నిలిచిపోయే బృహత్తర కార్య క్రమాలను చేపట్టాడు. తండ్రి ఆశయాల బాటలో నడుస్తూ, ఆయన రాజకీయ వారసుడిగా, ఆయన ఇచ్చిన ఈ ప్రజా కుటుంబానికి సేవకుడిగా జగన్‌ మరో ప్రస్థానానికి నాంది పలికాడు. ప్రజల్లో నడిచిన వాడు, ప్రజల్లో నిలిచిన వాడు, ప్రజలతో కలిసిన వాడు, ప్రజల కోసం పనిచేసిన వాడే ప్రజానాయకుడని వై.యస్‌. నిరూ పించాడు. ఆ స్ఫూర్తితోనే ఆ ప్రజల దీవెనల కోసం బయలుదేరిన జగన్‌ పాదయాత్ర రేపటి జైత్రయాత్రగా మారాలని అభిమానులు కోరుకుంటున్నారు.

jaganప్రజలతో కలవడం, ప్రజలతో కలిసి నడవడం, ప్రజలతో మాట్లాడడం, ప్రజలు చెప్పింది వినడం, ఆ ప్రజల కష్టాలను తీర్చడానికి పని చేయడం... ఉత్తమ ప్రజానాయ కులకు ఉండాల్సిన లక్షణాలు. పుట్టగానే లేదా ఒంటిమీద ఖద్దరు చొక్కా పడగానే ఎవరూ ప్రజానాయకులైపోరు. ప్రజల మనసులు గెలిచినవాళ్లే ప్రజా నాయకులవుతారు. తాతలు, తండ్రుల రాజకీయ వారసత్వం తాత్కాలికమే. కానీ, వ్యక్తిగతంగా ప్రజలలో తెచ్చుకున్న పరపతే శాశ్వతం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డికి 2014 ఎన్నికల్లో ఓ మంచి అవకాశమిచ్చారు. అదే ప్రతిపక్షనేత బాధ్యత. సాధారణంగా ఇతర నాయకులకైతే రాజకీయ ఆరంగేట్రం చేసాక ఏ పాతికేళ్లకోగాని ఇలాంటి అవకాశం రాదు. జగన్‌కు రాజకీయాల్లోకి వచ్చిన ఐదేళ్ళకే ప్రధాన బాధ్యత వచ్చింది.

2014 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చుంటే అది వై.యస్‌.రాజశేఖరరెడ్డి సానుభూతి ప్రభావమే అయ్యుండేది. కాని, ప్రతిపక్షంలో ఉండడం వల్ల ఈ మూడున్నరేళ్ల కాలంలో జగన్‌ బాగా రాటుదేలాడు. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన తెచ్చుకోగలిగాడు. అసెంబ్లీ చర్చల్లో సైతం పూర్తిస్థాయి సమాచారంతో ప్రశ్నలు సంధించి అధికారపక్షాన్ని ఇరుకున పెట్టిన సందర్భాలెన్నో. వై.యస్‌.రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన పాతికేళ్ళ తర్వాతగాని ముఖ్యమంత్రి కాలేదు. సీఎం కావడానికి ముందే రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పాత్రను సమర్ధవంతంగా నిర్వహించాడు. 2002 సంవత్సరంలో చేవెళ్ల నుండి ఇచ్ఛాపురం వరకు 1470 కిలోమీటర్ల దూరం ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. 2004లో ఆయన సీఎం అయ్యాక పాదయాత్రలో చూసిన సమస్యలు, ప్రజల కష్టాలు గ్రహించబట్టే ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలిగాడు.

తండ్రి వై.యస్‌.రాజశేఖరరెడ్డి వారసునిగా రాజకీయాలలోకి అడుగుపెట్టిన వై.యస్‌.జగన్‌ కూడా ఆయన బాటలోనే నడుస్తూ ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం తెలిసిందే! తొలుత ఈ నెల 27వ తేదీన పాదయాత్రను మొదలుపెట్టాలనుకున్నప్పటికి ఆరోజు మంచిరోజు కాదని పెద్దలు సలహా ఇవ్వడంతో తేదీని మార్చుకున్నారు. ఈలోపు జగన్‌ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి వుండడంతో ఆరు నెలల పాటు దాని నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే కోర్టు అందుకు అంగీకరించలేదు. దీంతో నవంబర్‌ 6వ తేదీ నుండి పాదయాత్ర మొదలుపెట్టాలని నిర్ణయించారు. 4వ తేదీ తిరుమలకు అలిపిరి నుండి కాలినడకన వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటారు. పక్కరోజు కడప పెద్దదర్గానూ, చర్చిలో ప్రార్ధనలు నిర్వహించి 6వ తేదీన పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి వుండడంతో వారానికి నాలుగు లేదా ఐదు రోజులు మాత్రమే జగన్‌ పాదయాత్ర నిర్వహించే అవకాశముంది.

2002లో వై.యస్‌.రాజశేఖరరెడ్డి నిర్వహించిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి పల్లె, ప్రతి పట్టణ ప్రజలు ఆయనకు తమ సమస్యలు చెప్పుకున్నారు. వై.యస్‌. పాదయాత్ర తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మట్టికరిచింది. ఇప్పుడు జగన్‌ పాదయాత్ర... పైకి ఎంత గంభీరంగా ప్రకటనలు చేస్తున్నా తెలుగుదేశం నేతల్లో భయం వుంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఇంకా వ్యతిరేకత పెరుగుతుందేమోననే ఆందోళన వుంది. హిస్టరీ రిపీట్‌ అవుతుందేమోనన్న అనుమానమూ వుంది.

ys jaganదేశంలోని పలు రాష్ట్రాలలో కుల రాజకీయాలు రాజ్యమేలుతున్నా నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌ ఆ వాతావరణానికి దూరంగా వుండింది. ఇక్కడ పార్టీల గెలు పోటములపై కుల ప్రభావం చాలా తక్కువుగా వుండేది. కాని, రాష్ట్ర విభజన పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలోనూ కుల మంటలు రేగాయి. 2014 ఎన్నికల నుండే రాష్ట్రంలో కుల రాజకీయాలు మొదలయ్యాయి. ఒక్కో పార్టీది ఒక్కో కులం అన్నట్లు వాతావరణం ఏర్పడింది. కులాలే కాదు, మతాల వారీగా కూడా ఓటర్లు విడిపోయారు.

కులాలు, మతాల విభజన వల్లే 2014 ఎన్నికల్లో కొన్ని వర్గాలు వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి దూరమయ్యాయి. దీనివల్లే ఆ పార్టీ అధికారానికి కొంచెం దూరంలో ఆగిపోయింది. ముఖ్యంగా జగన్‌పై టీడీపీ అనుకూల మీడియా క్రైస్తవ ముద్రను వేసింది. అదే పనిగా ప్రచారం చేసి హిందువులలో బ్రాహ్మణ, వైశ్య వర్గాలను వైకాపాకు దూరం చేసాయి. వైకాపా అధికారంలోకి వస్తే క్రిస్టియానిటీ పెరిగిపోతుందని చేసిన ప్రచారం గత ఎన్నికల్లో బాగానే పని చేసింది. గత ఎన్నికల్లో పచ్చ మీడియా చేసిన ప్రచారం వల్ల వైకాపాకు క్షత్రియ కులస్థులు కూడా దూరమయ్యారు. ఇక చంద్రబాబు ఇచ్చిన ఋణ మాఫీ వాగ్ధానంతో రైతులు, మహిళలు కూడా వైకాపాకు ఓట్లు వేయలేదు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మూలంగా ఈ రాష్ట్రంలో మెజార్టీ ఓటర్లయిన కాపు కులస్థులు కూడా వైకాపాకు మద్దతివ్వలేదు. వీళ్ల ఓట్లు కూడా చంద్రబాబుకే పడ్డాయి. గత ఎన్నికల్లో తనకు దూరమైన ఈ వర్గాలను దగ్గరకు చేర్చుకోవడం పైనే జగన్‌ రాజకీయ భవిష్యత్‌ ఆధారపడి వుంది. ఋణ మాఫీ అమలులో చంద్రబాబు విఫలమయ్యాడు. రైతులు, మహిళలు తెలుగుదేశం ప్రభుత్వంపై వ్యతిరేకతతో వున్నారు. రైతుల కోసం నవరత్నాలు పథకం ప్రకటించిన జగన్‌, మహిళల నమ్మకాన్ని పెంపొందించుకునే దిశగా వారికి ప్రత్యేక వరాల హామీలు ఇవ్వనున్నాడు. ఇక కాపు రిజర్వేషన్ల సెగతో చాలావరకు కాపులు చంద్రబాబుకు వ్యతిరేకంగానే వున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మెజార్టీ కాపులు తెలుగుదేశంను వ్యతిరేకించే అవకాశాలున్నాయి. జగన్‌ కాపు సామాజిక వర్గం నేతలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, వారి మద్దతు కోసం కృషి చేస్తున్నాడు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ద్వారా జగన్‌ వారి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేసాడు. అలాగే హైందవ సాంప్రదాయాలను గౌరవిస్తూ, ఆచారాలను పాటిస్తూ, హిందూ మతాధిపతులు, పీఠాధిపతుల ఆశీస్సులు తీసుకుంటూ బ్రాహ్మణులకు తనపై వున్న అభిప్రాయాన్ని మార్చుకునేలా చేస్తున్నాడు. తాను ఒక కులం వాడినో, ఒక మతం వాడినో కాదని అందరివాడినని, అందరినీ కలుపుకుపోయే వాడినని, అందరి కోసం పనిచేసే వాడినని తననుతాను మలచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందరు కూడా జగన్‌ మా వాడు అని భావిస్తే వచ్చే ఎన్నికల చిత్రపటం మరో విధంగా చూడొచ్చు.

Page 1 of 11

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter