yanamalaబాబుగారి బడ్జెట్‌ అంతా బడాయి బడ్జెట్‌గానే వుంది. కాకిలెక్కలతో.. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ బడ్జెట్‌ ఎంత గొప్పగావుందో అన్నట్లుగా అత్యద్భుతంగా రూపొందిం చారు. ఒకవైపు రాష్ట్రం అప్పుల నిప్పుల్లో కాగిపోతోందంటూనే, బడ్జెట్‌ వచ్చేసరికి భారీగా కేటాయింపులు చేసేయడం ఎలా కుదురుతోందో మరి!రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన నవ్యాంధ్ర తొలి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చూసి ఎవరైనాసరే ఆశ్చర్యపోవాల్సిందే. అయితే, ఆచరణ కొచ్చేసరికి ఖర్చుపెట్టేది అంతంతమాత్ర మేనన్నది వేరే విషయం. ఆ అరకొరా కూడా అసలైన లబ్దిదారులకు చేరుతు న్నాయా అంటే అదీ లేదు. అంతా ఆర్భా టమే తప్ప, అభివృద్ధి మాత్రం వుండదు. చంద్రబాబు హైటెక్‌ బడ్జెట్‌ ఇలాగే వుం టుంది. ప్రాధాన్యతారంగాలకు బడ్జెట్‌లో సముచిత ప్రాధాన్యత లేదు. వ్యవసాయం, నీటి పారుదల, విద్య, వైద్యం, స్త్రీ శిశుసంక్షేమం..వంటి రంగాలు ఇంకా నిధుల లేమితో విలవిలలాడుతూనే వున్నాయి. భారీ కేటాయింపులుంటే తప్ప ఈ రంగాల పరిస్థితి ఒక కొలిక్కి రాదు. అయినా, బడ్జెట్‌లో అంత కేటాయింపులు అసలే లేవు. ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు, బిసి సంక్షేమం వంటివి నేతిబీరలో నేయిలాగానే వుంటు న్నాయి. వాటికి అవసరమైన నిధులు ఎప్పుడో అడుగంటిపోయాయి. నిధుల కోసం అడుగుతూనే వున్నా..'కాకి అరు స్తూనే వుంటుంది.. కరవాడ ఎండుతూనే వుంటుంది'..అన్న సామెతగా ఎన్నో కీలక రంగాలు మూలనబడి కుయ్యోమొర్రో అంటున్నాయి. బడ్జెట్‌ వస్తుంది.. కేటా యింపు వుంటుంది..కానీ అవసరమైన నిధులు మాత్రం వుండవు..ఒకవేళ వున్నా అవి అసలైన లబ్దిదారులకు అందవు. ఇదీ మన దుస్థితి. ఎన్ని బడ్జెట్‌లు వస్తున్నా ఇలాంటి తీరు మారడంలేదన్నదే సామాన్య ప్రజల ఆవేదన. కొత్తబడ్జెట్‌ కూడా ఇం దుకు భిన్నమేమీ కాదు. మరీ యువతకైతే ఈసారి చుక్కలలోకం చూపించారు. నిరుద్యోగులకు ఆశపెట్టి, వారికి భృతి కల్పిస్తామని ఊరించి..ఎన్నికలప్పుడు భారీ ప్రచారాలు చేసుకున్న చంద్రబాబే ఇప్పుడు నిరుద్యోగుల విషయం పట్టించుకోవడం లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, అప్పటి దాకా రెండు వేల రూపాయల వంతున నిరుద్యోగభృతి కల్పిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ మళ్ళీ నీటిమూటలే అయ్యాయి. నిరుద్యోగ భృతి కల్పించాలంటే రాష్ట్రంలో నెలకు కనీసం 3,500 కోట్లన్నా కావాలి. అయితే, అంత డబ్బెక్కడిదీ?.. లేదు కనుకనే నిరుద్యోగభృతి కింద ఓ 5వందల కోట్లిస్తామని ప్రకటించారు. కేటాయింపులైతే చేశారు కానీ, ఇవైనా సక్రమంగా ఆచరణకు వస్తాయన్న నమ్మకం లేదు. కేటాయించిన నిధులు లబ్దిదారు లకు చేరుతున్నాయో...ఇతరుల జేబులు నింపుతున్నాయో అనే విషయం పట్టించు కునే నాధుడే కన్పించడం లేదు. అన్ని పథకాల పరిస్థితిని పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే పరిస్థితి వుండడం లేదు. కాలం గడిచిపోతున్నా ఆ హామీలు ఇప్పట్లో నెరవేరేలా లేదంటూ అటు యువత లోనూ, ఇటు ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సకాలంలో జీతాలందితే చాలు..అదే పదివేలు అన్నట్లుంది ఉద్యో గుల పరిస్థితి. ఇకపోతే, అటు రైతులకు గానీ, ఇటు మహిళాలోకానికి గానీ ఆశిం చిన అభివృద్ధి అసలే లేదు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వర్షాభావం వల్ల కరు వుతో అల్లాడుతున్నా పట్టించుకునేవారే కరువు. బడ్జెట్‌లో అంతా ఊకదంపుడే తప్ప రైతులకు ఒరిగిందేమీలేదు. వేల కోట్ల రుణాల్లో 'రుణమాఫీ' అవుతోంది కూడా చాలా స్పల్పమే. వేలకోట్లలో వడ్డీని ఇంకా అన్నదాతలు అవస్తలు పడుతూ చెల్లించు కుంటూనే వున్నారు. రైతులకు పంట రుణాలు అసలే అందడం లేదు. నీటి పారుదల వసతులు మునుపటికన్నా ఘనంగా ఏమీ అభివృద్ధి చెందలేదు.

ఉపాధి లేక రైతుకూలీలకు అవస్తలు తప్పడం లేదు. ప్రజలు పనుల్లేక ఊరిడిచి పెట్టి వలసపోతున్నారంటే, 'పనుల్లేక కాదు.. ఎక్కువ డబ్బు కోసం అలా వెళ్ళడం వారికి అలవాటేనని, మనవాళ్ళంతా కమర్షియల్‌గా వుంటారని' ముఖ్యమంత్రి అనడాన్ని ఏమని అర్ధం చేసుకోవాలో?!.. గత ఏడాది బడ్జెట్‌లో బిసిల సంక్షేమం కోసమని 4430 కోట్లు కేటాయించారు కానీ, బిసిల స్థితిగతుల్లో మాత్రం ఎలాంటి మార్పూ వుండడం లేదు. అదే రకంగా అన్ని రంగాల్లోనూ వుంది. బడ్జెట్‌లో చెప్పే దొకటి..ఆచరణకొచ్చేదొకటి. మేడిపండు బడ్జెట్‌ అంటే ఇదిగో ఇదే.. అన్నట్లుగా వుంది. పేదలకు ఇళ్ళు నిర్మిస్తామని ఆశ పెడతారే తప్ప.. ఆ పథకమంతా అస్త వ్యస్తమే. గత ఏడాది బడ్జెట్‌లో కేటాయిం చిన మొత్తాన్నే ఇంకా ఖర్చుపెట్ట లేదు. ఇళ్ళ నిర్మాణాలు నత్తనడక నడుస్తున్నా పట్టించుకునేవారు లేరు. డ్వాక్రామహిళలకు రుణాలమాఫీ మాట కూడా ఉత్తుత్తిదే. 'చెప్పేవి గొప్పలు.. పెట్టేవి తిప్పలు' అన్న ట్లుగా వుంటోంది చంద్రబాబు బడ్జెట్‌ తీరు. రుణాల మాఫీ అంటారు.. వడ్డీలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. ఇదన్నమాట అభివృద్ధి అంటే. ఇక మహి ళాభ్యుదయం..మహిళా సాధికారత వంటి అంశాలన్నీ ఉపన్యాసాలకే పరిమితాలన్నది బహిరంగ రహస్యమే. ఇలా 'లోపాల కారి'గా వుండడం వల్లనే బడ్జెట్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. బడ్జెట్‌ అనగానే అది తమకు సంబంధించిన అంశం కాద న్నట్లుగా వుండే ధోరణి ప్రజల్లో ప్రబల డానికి పాలకులు అనుసరిస్తున్న ఇలాంటి విధానాలే కారణం. అందులోనూ మన చంద్రబాబు మాటలకైతే అసలు హద్దులే వుండవు. మాటలు కోటలకోట్లు దాటు తుంటాయే తప్ప, అడుగు మాత్రం అంగుళం కూడా ముందుకు పడదు. ప్రజాధనం సద్వినియోగం చేయాలన్న ధ్యాసే వుండకపోవడం, చిత్తం వచ్చిన రీతిలో కేటాయింపులు చేసేసుకోవడం, నిధుల కేటాయింపులు-వ్యయం పట్ల ఖచ్చితమైన పరిశీలన-పర్యవేక్షణ యం త్రాంగం లేకపోవడం, చివరికి ప్రజల కిచ్చిన హామీలకు గానీ, ప్రజల మాటకు గానీ అసలు విలువలేకపోవడం వంటివన్నీ ఇందుకు ప్రధాన కారణాలు. 'రాష్ట్ర ప్రగతి.. ప్రజల అభ్యున్నతి'.. మాటల్లోనే తప్ప చేతల్లో చూపలేని నాయకులున్నంత కాలం ఇలాంటి బడాయి బడ్జెట్‌లు ఎన్నొచ్చినా ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నది సర్వత్రా జనాభిప్రాయం.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
  • జిల్లాలో వైకాపా... బలముంది... బలమైన నాయకత్వమే కావాల్సివుంది
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. కడప, కర్నూలు తర్వాత నెల్లూరుజిల్లానే వైసిపికి కంచుకోట! ఇంకోరకంగా చెప్పాలంటే ఆ రెండు జిల్లాల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్‌ అయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే…

Newsletter