jaganకడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వై.యస్‌.జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్రకు విశేషస్పందన లభించింది. ఇది పెద్ద విషయమేమీ కాదు. ఈ జిల్లాల్లో కొన్ని వైకాపాకు కంచుకోటలు కాగా, ఇంకో రెండు జిల్లాల్లోనూ బలంగానే వుంది. కాని, అసలు విషయం ఈ జిల్లాలను మించి కృష్ణ జిల్లాలో వస్తున్న స్పందన. ఈ జిల్లాలో జగన్‌ పాదయాత్రకు వస్తున్న జనాన్ని చూసి టీడీపీ నాయకులే నివ్వెరపోతున్నారు.

తెలుగుదేశంపార్టీకి కంచుకోటగా చెప్పుకునే జిల్లాల్లో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో వుంటుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు సొంత జిల్లా ఇది. దానికి తోడు తెలుగుదేశంకు బలమైన పునాదిగా వున్న కమ్మ సామాజికవర్గం బలంగా వుండే జిల్లా కూడా ఇదే! 2014 ఎన్నికల్లోనూ తెలుగుదేశంకు అత్యధిక సీట్లు ఇచ్చిన జిల్లా ఇది.

అలాంటి జిల్లాలో ఇప్పుడు జగన్‌ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఆయన పాదయాత్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పెనమలూరు, కైకలూరు, మచిలీపట్నం, నూజివీడు, గన్నవరం, హనుమాన్‌జంక్షన్‌, గుడివాడ, అవనిగడ్డ... ఎక్కడ చూసినా ఏ సభ చూసినా జనం ప్రభంజనమే. వైసిపి అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతానన్న జగన్‌ ప్రకటన కూడా జిల్లా ప్రజల్లో సానుకూల స్పందనను తెచ్చింది. టీడీపీ బలంగా వుండే కృష్ణా జిల్లాలోనే జగన్‌కు ఇంత ప్రజాదరణ వుంటే మిగతా జిల్లాల పరిస్థితేంటని తెలుగుదేశం నాయకులు బెంబేలెత్తుతున్నారు.

jaganస్వర్గీయ నందమూరి తారక రామారావు... తెలుగు తెరపై, తెలుగు నేలపై... తెలుగు రాజకీయాలపై పెను సంచలనం. 300కు పైగా విభిన్న చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో రాముడిగా, కృష్ణుడిగా ఎలాంటి ముద్ర వేసుకున్నాడో, తెలుగు రాజకీయాలలోనూ 2రూపాయల కిలో బియ్యం వంటి పథకాలతో తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవమయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను మట్టి కరిపించిన నాయకుడు. పంచాయితీ వార్డు మెంబర్లుగా గెలవలేని వారిని ఎమ్మెల్యేలను, మంత్రులను చేసిన ఛరిష్మాగల నాయకుడు.

రాష్ట్ర రాజకీయాలలో పెనుఉప్పెనలా వచ్చిన ఎన్టీఆర్‌ను రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ ఏమీ చేయలేకపోయారు. 1984లో కాంగ్రెస్‌ మద్దతుతో నాదెండ్ల భాస్కర్‌రావు వెన్నుపోటు పొడిచినా వెంటనే తేరుకుని, కోలుకుని నిలబడ్డాడు. కాని, 1995 ఆగస్టులో సొంత అల్లుడు చంద్ర బాబు, కుటుంబసభ్యులు కలిసికొట్టిన దెబ్బకు ఎన్టీఆర్‌ కోలుకోలేకపోయాడు. లేవలేకపోయాడు. కొన్ని నెలలు తిరక్క ముందే స్వర్గస్తుడయ్యాడు. 1995లో ఎన్టీ ఆర్‌ను నిర్ధాక్షిణ్యంగా తెలుగుదేశం పార్టీ నుండి గెంటేసారు. ఆయన స్థాపించిన పార్టీలో ఆయనకు చోటులేకుండా చేసారు. పార్టీ సభ్యత్వ పుస్తకం మీదే కాదు, చాలా కాలం పార్టీ కరపత్రాలలో, పార్టీ బ్యానర్‌ లలో ఆయన పేరు, ఆయన బొమ్మ లేకుండా చేసారు.

అయితే ఎన్టీఆర్‌ మరణం తర్వాత క్రమం తప్పకుండా ప్రతి ఎన్నికలలోనూ తెలుగుదేశం వాళ్ళు ఎన్టీఆర్‌ బొమ్మను వాడుకుంటున్నారు. ఆయన బ్రతికున్నప్పుడు ఆయనను వాడుకున్నారు. ఆయన మర ణించాక ఆయన బొమ్మను వాడుకుంటు న్నారేగాని ఆయన స్మృతిగా ప్రజల మన సుల్లో గుర్తుండిపోయేలా ఒక్క పనీ చేయ లేకపోయారు. 1995 నుండి 2004 దాకా చంద్రబాబే ఏపికి సీఎం, మళ్ళీ గత నాలుగేళ్ళుగా ఆయనే సీఎం. ఎన్టీఆర్‌ పుట్టి పెరిగిన కృష్ణాజిల్లాకు ఆయన పేరును పెట్టాలన్న ఆలోచన చంద్రబాబుకు రాలేదు. అదే కాంగ్రెస్‌లో వాళ్ళు దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణించాక ఆయన పేరును కడప జిల్లాకు పెట్టారు. కాంగ్రెస్‌ నాయకులకు వున్న విజ్ఞత, చిత్త శుద్ధి చంద్రబాబుకు లేకుండా పోయింది.

ఇప్పటివరకు చంద్రబాబు చేయలేని పనిని తాను చేస్తానంటూ ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్‌ వదిలిన అస్త్రంతో తెలుగు దేశం నాయకులు షాకయ్యారు. కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్న జగన్‌ ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించినప్పుడు వైసిపి అధికారంలోకి రాగానే కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతా మని ప్రకటించాడు. జగన్‌ నోట ఈ మాట రావడంతో తెలుగుదేశం శ్రేణులు ఉలిక్కి పడ్డాయి. జగన్‌ నుండి ఇంతటి సానుకూల ప్రకటన వస్తుందని ఎవరూ వూహించరు. జగన్‌ ప్రకటన ఎన్టీఆర్‌ అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది.

జగన్‌ ప్రకటన తర్వాత చంద్రబాబు ఇప్పుడు నాలుక్కరుచుకుని తన హయాం లోనే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టే చర్యలకు ఉపక్రమించవచ్చు. చంద్రబాబు ఇప్పుడు హడావిడిగా కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టినా క్రెడిట్‌ మాత్రం జగన్‌కే

వెళుతుంది.

jaganనాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు పెడుతున్నాడు.

వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబు చేత రోజుకో మాట మాట్లాడిస్తున్నాడు. వారానికో వేషం వేసేలా చేయిస్తున్నాడు. ఇన్నేళ్ళ తన రాజకీయ జీవితంలో చంద్రబాబు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, వై.యస్‌.రాజశేఖరరెడ్డి, కె.రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి ప్రతిపక్ష ప్రత్యర్థులను చూసాడు. కాని, జగన్‌ లాంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఎదురుకాలేదు. చంద్రబాబును అసమర్ధ నేతగా అవినీతిపరుడిగా, రోజుకో మాట మార్చే రాజకీయ ఊసరవెల్లిగా, మాట మీద నిలబడని వ్యక్తిగా, పచ్చి అవకాశవాదిగా ప్రజల ముందు నిరూపించడంలో జగన్‌ చాలావరకు సక్సెస్‌ అయ్యాడు.

చంద్రబాబుకున్నంత రాజకీయ అనుభవం లేకున్నా, కుట్రలు, వ్యూహాలు పన్నే తెలివితేటలు లేకున్నా... కేవలం ఒకే మాటకు కట్టుబడి ఒకే మార్గాన్ని ఎంచుకుని ఈరోజు ప్రజాక్షేత్రంలో వై.యస్‌.జగన్‌ హీరో అయ్యాడు. 2019 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అన్నది పక్కనపెడదాం. ప్రస్తుతం ఏపిలో సెగలు రేపుతున్న అంశం ప్రత్యేకహోదా ఉద్యమం. ఈ సబ్జెక్ట్‌లో జగన్‌ ఏరోజూ మాట తప్పలేదు. నాలుగేళ్ళుగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నది జగనే! ఈ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టింది జగనే! కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని ఒకటికి నాలుగుసార్లు చెప్పినా పట్టు విడవకుండా హోదా కోసం పోరాట బాట పట్టింది వైకాపానే! తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఎప్పుడూ పట్టనంతగా గబ్బు పట్టింది ఈ ప్రత్యేకహోదా విషయంలోనే! గతంలో అవినీతి ఆరోపణలు, అక్రమాల సంఘటనలున్నా అవి బయటకు కనిపించేవి కావు. కాని హోదా విషయంలో ఆయన నిజస్వరూపం ప్రజల కళ్ళకు కట్టి నట్లయ్యింది. కేంద్రం ప్రత్యేకహోదా లేదు, ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు సంతోషంగా స్వాగతించింది ఆయనే! ప్రత్యేకప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పిందీ ఆయనే! ప్రత్యేకహోదాపై ఉద్యమాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టించింది ఆయనే! నిండు సభలో ప్రత్యేకహోదా వస్తే ఏమొస్తాయయ్యా... హిమాచల్‌ ఏమయ్యింది... నార్త్‌ ఈస్ట్‌ రాష్ట్రాలలో ఏమొచ్చాయి, అక్కడ డెవలప్‌మెంట్‌ ఎక్కడుంది అని గద్దించింది ఆయనే! ఇన్ని అన్న ఆయనే ఈరోజు ప్రత్యేకహోదా కావాలంటున్నా, ప్రత్యేకహోదా కోసం సైకిల్‌యాత్రలు, బస్సు యాత్రలు, విమానం యాత్రలు చేయాలంటున్నా దానికి కారణం జగనే! ప్రత్యేకహోదా ఉద్యమం ఇప్పుడొక ఒలింపిక్‌ రేస్‌ మాదిరిగా మారింది. మొదటినుండి ఈ పోరాటం జెండా పట్టుకుని నడుస్తున్నది జగనే. తన లోక్‌సభసభ్యుల చేత రాజీనామాలు చేయించి దీక్షకు కూర్చో బెట్టాడు. ఏపి ప్రజలు జగన్‌ పోరాటాన్నే నమ్ముతున్నారు. చంద్రబాబు జగన్‌ను కాపీ కొడుతున్నాడనే ప్రచారం వచ్చేసింది. జగన్‌ అవిశ్వాస తీర్మానం పెడితే ఈయన కూడా అవిశ్వాస తీర్మానం అన్నాడు. జగన్‌ నిరాహారదీక్షలు పెడితే ఈయన సైకిల్‌యాత్రలు పెట్టాడు. వైసిపి ఎంపీలు అక్కడ రాజీనామా చేస్తే, తన ఎంపీల చేత ప్రధాని ఇంటి వద్ద డ్రామాలేయించాడు. ఇదంతా చూస్తుంటే ప్రత్యేకహోదా పోరాటంలో జగన్‌ పాత్ర ఒరిజినల్‌ గాను, చంద్రబాబు పాత్ర డూప్‌గాను కనిపిస్తోంది. జగన్‌ పిల్లకాకి... నా అనుభవం ముందు బచ్చా అని భ్రమపడ్డ చంద్రబాబుకి ఈరోజు ఆ ఒక్కడే... చుక్కలు చూపిస్తున్నాడు.

Page 1 of 28

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter