jagan innerనాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి!

నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కనీవిని ఎరుగని రీతిలో విజయవంత మైంది. జనవరి 23వ తేదీన పెళ్ళకూరు మండలం పెనబాక వద్ద మొదలైన జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర ఈ నెల 16వ తేదీన కొండాపురం మండలం వద్ద ముగిసి, ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలో దాదాపు 20రోజుల పాటు ఆయన పాదయాత్ర(శుక్రవారాలు, బంద్‌ రోజు తీసేస్తే) సాగింది. సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్‌, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ సాగిన ఈ యాత్రలో ప్రతి నియోజకవర్గానికీ ఒక చోట బహిరంగసభ నిర్వహించారు. జనం బహిరంగసభలకు గాని, పాదయాత్రలకు గాని పోటెత్తినట్లు వచ్చారు. జగన్‌ తిరిగిన చోటల్లా ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. మహిళలు, వృద్ధులు, యువత ఎక్కువుగా ఆయన పాదయాత్రలో కని పించారు. జగన్‌ పాదయాత్రకు తరలిం చిన జనం కంటే తరలి వచ్చిన జనమే ఎక్కువుగా వుండడం ఆయన పట్ల వున్న ప్రజాభిమానానికి నిదర్శనం.

ఇక రాజకీయ కోణంలో ఆలోచిస్తే జిల్లాలో వైసిపి లీడర్లకు గాని, వైసిపి కేడర్‌కు గాని జగన్‌ పాదయాత్ర ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. వచ్చే ఎన్నికలకు కార్యో న్ముఖులను చేసింది. గట్టిగా పోరాడితే విజయం మనదేనన్న ధీమాను కల్పించింది. వరుస వలసలు, ఎల్లో మీడియా దుష్ప్ర చారంతో కొంచెం అటు ఇటుగా వున్న కేడర్‌లో కూడా జగన్‌ పాదయాత్ర ఒక నమ్మకాన్ని కలిగించింది. అధికార పార్టీ వైపు చూస్తున్న కొందరు నాయకుల మనసు మార్చుకునేలా చేసింది. జగన్‌ పాద యాత్రతో జిల్లా వైసిపికి ఎంతో ఊపు వచ్చిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

jaganఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలపై పార్లమెంటులో ఎవరి నాటకాలు వాళ్లాడుతున్నారు. ప్రత్యేకహోదాపై ఎవరి పిల్లిమొగ్గలు వాళ్లేస్తున్నారు. ఒక పార్టీ వాళ్ళు పార్లమెంటు బయట పగటి వేషాలేస్తుంటే.. పార్టీ పెట్టి కూడా ఎన్నికల్లో పోటీ చేయని నటనాయకుడొకరు జేఏసీ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇలాంటి పగటి వేషాలకు, ఇట్లాంటి జేఏసీ యాక్షన్‌లకు కేంద్రం తలవంచుతుందా? ప్రధాని నరేంద్ర మోడీ తల దించుతాడా...?

టీడీపీ, పవన్‌కళ్యాణ్‌ రాజకీయ డ్రామాలకు చెక్‌పెడుతూ ప్రత్యేకహోదాపై ప్రతిపక్ష నేత వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి సంధించిన రాజీనామాస్త్రం ఇప్పుడు అధికారపక్షంలో గుబులు రేపుతోంది. పిల్లిమొగ్గలు, పగటి వేషాలతో కాకుండా ఆయన ప్రత్యేకహోదా కోసం నేరుగా కేంద్రంతో కయ్యానికే సిద్ధమైయ్యారు. పార్లమెంటు వేదికగానే ప్రత్యేకపోరుకు శ్రీకారం చుట్టాడు. ఏపికి ప్రత్యేకహోదా కోసం అవసరమైతే తమ ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని జగన్‌ గతంలోనే ప్రకటించి వున్నాడు. చివరి బడ్జెట్‌లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏపికి ప్రత్యేకహోదా కాదు కదా సరైన న్యాయం కూడా చేయలేని పరిస్థితులలో 'ప్యాకేజీ వద్దు - ప్రత్యేకహోదానే ముద్దు' అంటూ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కలిగిరిలో జరిగిన సభలో ప్రత్యేకపోరుకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకహోదాపై పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను ఆయన అశేష ప్రజానీకం సమక్షంలోనే ప్రకటించారు. మార్చి

1వ తేదీ నుండి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా ఉద్యమాలు జరుగుతాయి. మార్చి 1న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్‌ కార్యాలయాల ఎదుట వైసిపి ఆధ్వర్యంలో ధర్నా, కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాలు జరుగుతాయి. మార్చి 5వ తేదీన వైసిపి ఎంపీలు, సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ప్రత్యేకహోదా కోసం ధర్నా నిర్వ హిస్తారు. 3వతేదీన జగనే తాను పాద యాత్ర చేస్తున్న చోటు నుండి జెండా ఊపి వీరిని ఢిల్లీకి సాగనంపుతారు. మార్చి 5వ తేదీ నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో వైసిపి ఎంపీలు పాల్గొని సభలో ఏపికి ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తారు. ఏప్రిల్‌ 6వ తేదీ దాకా జరిగే సమావేశాలలో ప్రత్యేకహోదాపై కేంద్రం నుండి ఎటువంటి హామీ రాక పోతే, దానికి నిరసనగా వైసిపి ఎంపీలు సమావేశాల చివరిరోజున తమ రాజీ నామాలను స్పీకర్‌కు ఇచ్చేసి రాష్ట్రానికి వచ్చేస్తారు. ఆ తర్వాత నుండి కూడా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా ఉద్యమాన్ని కొనసాగించేలా జగన్‌ వ్యూహరచన చేసారు.

ప్రత్యేకహోదా కోసం ఎంపీల చేత రాజీనామా చేయించాలని జగన్‌ చేసిన ప్రయోగం తిరుగులేని అస్త్రం. ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని చెప్పి జగన్‌ బంతిని ప్రత్యర్థుల కోర్టులోకి కొట్టాడు. ఇప్పుడు ప్రత్యర్థులది కక్క, మింగలేని పరిస్థితి.

రాష్ట్ర భవిష్యత్‌ కోసం, రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేకహోదానే మేలైన మార్గమని భావిస్తూ జగన్‌ ఆఖరి పోరాటానికి సిద్ధపడ్డాడు. ప్రతిపక్ష నాయకుడే ఏపికి ప్రత్యేకహోదా కోసం ఇంతకు తెగించి పోరాడుతుంటే, ఇక ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించి అధికారం అనుభవిస్తున్న చంద్రబాబు ఇంకెంత పోరాటం చేయాలి. కాని, చంద్రబాబు ప్రత్యేకహోదా పోరాటాన్ని ఎప్పుడో వదిలేసాడు. ప్రత్యేకప్యాకేజీయే చాలనుకున్నాడు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా సంజీవని కాదని సలహా కూడా ఇచ్చాడు. ప్రత్యేకహోదా అనే అంశాన్ని ఆయన తన ఆలోచనలలో నుండి ఎప్పుడో తీసేసాడు. ఇప్పుడు బడ్జెట్‌లో ఏపికి నిధులివ్వలేదని ఏడుస్తున్నాడేగాని ప్రత్యేకహోదా గురించి మాట్లాడడం లేదు.

ఇంకో పక్క చంద్రబాబు సైగలతో పనిచేసే పవన్‌కళ్యాణ్‌ జేఏసీ అంటూ వాళ్ళు వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. ఆయనది ప్రత్యేకహోదా పోరాటమో, ఇంకెవరి కోసమన్నా ఆరాటమో అర్ధం కావడం లేదు. ఆయన భవిష్యత్‌ కార్యా చరణ ప్రణాళిక ఏంటో కూడా తెలియదు. ఒకవేళ ఆయనకన్నా తెలుసోలేదో? వామపక్షాల వాళ్ళు మాత్రం మొదటినుండి ఏపికి ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధితో వున్నారు. ఇప్పుడు వైకాపా నాయకత్వంలో వాళ్ళు కూడా ప్రత్యేకహోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేసే అవకాశముంది.

మొత్తానికి జగన్‌ కొట్టిన దెబ్బకు చంద్రబాబుకు మైండ్‌ బ్లాక్‌ అయ్యుండాలి. ఆయన అటు తెగించి కేంద్రంతో పోరాడ లేడు... ఇటు చేతులు కట్టుకుని జనం మధ్య పలుచన కాలేడు. ప్రత్యేకహోదా కోసం నోరు తెరవలేని పరిస్థితి. జగన్‌ మాత్రం ప్రత్యేకహోదా కోసమే ప్రత్యేకంగా పట్టుబట్టి ఉద్యమానికి పిలుపునివ్వడంతో రాష్ట్ర ప్రజలలో సైతం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రత్యేకహోదాపై ఇక రాజీ లేని పోరు సాగిస్తే... జగన్‌కు చెల గాటం... బాబుకు సంకటమే! హోదాపై అసలైన గేమ్‌ ఇప్పుడే మొదలైంది...!

vpr jaganజిల్లాలో జైత్రయాత్రగా సాగుతున్న వై.యస్‌.జగన్‌ పాదయాత్రలో ప్రముఖ సేవాతత్పరుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడుగులు కలిపాడు. జగన్‌తో కలిసి నడిచాడు. జిల్లాలో వైకాపాకు మరింత బలాన్ని జోడించాడు.

గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా వుంటున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తిరిగి రాజకీయ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. తన ఆలోచనలు, ఆశయాల ఆచరణకు వైకాపానే వేదికగా ఎంచుకున్నాడు. అందుకే తానుంటున్న పార్టీ సేవకే అంకితం కావాలనుకున్నాడు. పార్టీలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలను కున్నాడు. ఇందులో భాగంగానే జనవరి 28వ తేదీ ఉదయం 6.30గంటలకే ఆయన ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. దాదాపు 150కార్లతో వందలాదిమంది అభిమానులు విపిఆర్‌కు తోడుగా జగన్మోహన్‌రెడ్డితో కలసి నడవడానికి బయలు దేరారు. సుమారు 8.30గంటల ప్రాంతంలో గూడూరు నియోజకవర్గంలోని తిమ్మసముద్రం గ్రామంలో రాత్రి బసచేసిన వసతి ప్రాంగణానికి చేరుకున్నారు. వందలాది మంది అభిమానుల సమక్షంలో జగన్‌ చిరునవ్వుతో ప్రభాకర్‌రెడ్డిని సాదరంగా ఆహ్వానించి ఆలింగనం చేసుకున్నారు. అక్కడ నుంచి దాదాపు 4గంటలసేపు మధ్యాహ్నం భోజన విరామం వరకు విపిఆర్‌ తన వెంట వచ్చిన అభిమానుల తోడుగా జగన్‌తో కలసి నడిచారు.

2014 ఎన్నికలకు ముందే విపిఆర్‌ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం తెలిసిందే! అయితే ఎన్నికల తర్వాత ఆయన కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా వున్నాడు. వైకాపా కార్యక్రమాలకు కూడా వెళ్ళేవాడు కాదు. ఈ దశలో ఆయనను తమ పార్టీలోకి తీసుకోవాలని తెలుగుదేశం అధిష్టానం చేయని ప్రయత్న మంటూ లేదు. కాని ఎవరి ప్రయత్నాలు ఎలా వున్నా ఆయన మనస్సాక్షి మాత్రం వైకాపా వైపే నిలిచింది. వైకాపాలో ఆయన తిరిగి

ఉత్సాహంగా పని చేస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది.

Page 1 of 26

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter