jaganస్వర్గీయ నందమూరి తారక రామారావు... తెలుగు తెరపై, తెలుగు నేలపై... తెలుగు రాజకీయాలపై పెను సంచలనం. 300కు పైగా విభిన్న చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో రాముడిగా, కృష్ణుడిగా ఎలాంటి ముద్ర వేసుకున్నాడో, తెలుగు రాజకీయాలలోనూ 2రూపాయల కిలో బియ్యం వంటి పథకాలతో తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవమయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను మట్టి కరిపించిన నాయకుడు. పంచాయితీ వార్డు మెంబర్లుగా గెలవలేని వారిని ఎమ్మెల్యేలను, మంత్రులను చేసిన ఛరిష్మాగల నాయకుడు.

రాష్ట్ర రాజకీయాలలో పెనుఉప్పెనలా వచ్చిన ఎన్టీఆర్‌ను రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ ఏమీ చేయలేకపోయారు. 1984లో కాంగ్రెస్‌ మద్దతుతో నాదెండ్ల భాస్కర్‌రావు వెన్నుపోటు పొడిచినా వెంటనే తేరుకుని, కోలుకుని నిలబడ్డాడు. కాని, 1995 ఆగస్టులో సొంత అల్లుడు చంద్ర బాబు, కుటుంబసభ్యులు కలిసికొట్టిన దెబ్బకు ఎన్టీఆర్‌ కోలుకోలేకపోయాడు. లేవలేకపోయాడు. కొన్ని నెలలు తిరక్క ముందే స్వర్గస్తుడయ్యాడు. 1995లో ఎన్టీ ఆర్‌ను నిర్ధాక్షిణ్యంగా తెలుగుదేశం పార్టీ నుండి గెంటేసారు. ఆయన స్థాపించిన పార్టీలో ఆయనకు చోటులేకుండా చేసారు. పార్టీ సభ్యత్వ పుస్తకం మీదే కాదు, చాలా కాలం పార్టీ కరపత్రాలలో, పార్టీ బ్యానర్‌ లలో ఆయన పేరు, ఆయన బొమ్మ లేకుండా చేసారు.

అయితే ఎన్టీఆర్‌ మరణం తర్వాత క్రమం తప్పకుండా ప్రతి ఎన్నికలలోనూ తెలుగుదేశం వాళ్ళు ఎన్టీఆర్‌ బొమ్మను వాడుకుంటున్నారు. ఆయన బ్రతికున్నప్పుడు ఆయనను వాడుకున్నారు. ఆయన మర ణించాక ఆయన బొమ్మను వాడుకుంటు న్నారేగాని ఆయన స్మృతిగా ప్రజల మన సుల్లో గుర్తుండిపోయేలా ఒక్క పనీ చేయ లేకపోయారు. 1995 నుండి 2004 దాకా చంద్రబాబే ఏపికి సీఎం, మళ్ళీ గత నాలుగేళ్ళుగా ఆయనే సీఎం. ఎన్టీఆర్‌ పుట్టి పెరిగిన కృష్ణాజిల్లాకు ఆయన పేరును పెట్టాలన్న ఆలోచన చంద్రబాబుకు రాలేదు. అదే కాంగ్రెస్‌లో వాళ్ళు దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణించాక ఆయన పేరును కడప జిల్లాకు పెట్టారు. కాంగ్రెస్‌ నాయకులకు వున్న విజ్ఞత, చిత్త శుద్ధి చంద్రబాబుకు లేకుండా పోయింది.

ఇప్పటివరకు చంద్రబాబు చేయలేని పనిని తాను చేస్తానంటూ ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్‌ వదిలిన అస్త్రంతో తెలుగు దేశం నాయకులు షాకయ్యారు. కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్న జగన్‌ ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించినప్పుడు వైసిపి అధికారంలోకి రాగానే కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతా మని ప్రకటించాడు. జగన్‌ నోట ఈ మాట రావడంతో తెలుగుదేశం శ్రేణులు ఉలిక్కి పడ్డాయి. జగన్‌ నుండి ఇంతటి సానుకూల ప్రకటన వస్తుందని ఎవరూ వూహించరు. జగన్‌ ప్రకటన ఎన్టీఆర్‌ అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది.

జగన్‌ ప్రకటన తర్వాత చంద్రబాబు ఇప్పుడు నాలుక్కరుచుకుని తన హయాం లోనే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టే చర్యలకు ఉపక్రమించవచ్చు. చంద్రబాబు ఇప్పుడు హడావిడిగా కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టినా క్రెడిట్‌ మాత్రం జగన్‌కే

వెళుతుంది.

jaganవిభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 13జిల్లాలే మిగిలాయి. కోస్తాలో 9, రాయలసీమలో 4 జిల్లాలున్నాయి. మెజార్టీ జిల్లాల్లో ఏ పార్టీకైతే రాజకీ యంగా బలమైన పునాదులు ఉన్నాయో ఆ పార్టీకే విజయావకాశాలు మెరుగ్గా వుంటాయి. కోస్తా, రాయలసీమ అన్నవి పక్కన పెడితే కృష్ణానదికి ఇవతల 7 జిల్లాలు, అవతల ఆరు జిల్లాలున్నాయి. కృష్ణా నదికి అవతలి వైపు వున్న జిల్లాల్లోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అగ్ని పరీక్ష ఎదురవుతోంది.

కృష్ణానదికి ఇవతల జిల్లాలైన కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో వైసిపి బలంగానే వుంది. ఒక్క అనంతపురం జిల్లాలో బలం పుంజుకోవాల్సి వుంది. 2014 ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి వచ్చిన సీట్లలో సింహభాగం ఇక్కడివే! ఈ జిల్లాల్లో వున్నంత బలంగా కృష్ణానదికి అవతల వైపు వున్న కృష్ణ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో లేకుండా పోయింది. విశాఖపట్నం లోక్‌సభలో వై.యస్‌. సతీమణి, జగన్‌ అమ్మగారైన వై.యస్‌.విజయమ్మే ఓడిపోయారు. కృష్ణానదికి ఇవతల వైపు రాజకీయ వాతావరణం వేరు, అవతలి వైపు వాతావరణం వేరు. ఈ ఆరు జిల్లాల్లోనూ కుల సమీకరణలు బాగా పని చేస్తాయి. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాల్లో బలమైన కమ్మ, కాపు, క్షత్రియ సామాజిక వర్గాలన్నీ ఒక్కటయ్యాయి. పవన్‌ కళ్యాణ్‌ మద్దతు తెలపడం వల్ల తెలుగుదేశంకు కాపుల ఓట్లు బాగానే కలిసొచ్చాయి. సాంప్రదాయ బద్ధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా జిల్లాల్లో 1983 నుండి కూడా తెలుగుదేశం బలంగానే వుంది. 2014లో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఈ ఆరు జిల్లాలే!

ఈ ఆరు జిల్లాల్లో పార్టీని పటిష్ట పరిస్తేనే అధికారంపై ఆశలు నిలబడతాయి. దివంగత నేత వై.యస్‌. వున్నప్పుడు ఈ ఆరు జిల్లాల్లో తన సొంతంగా బలమైన కేడర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మరణించాక ఆయన ఏర్పాటు చేసిన కేడర్‌ చెల్లాచెదురైంది. ఈ ఆరు జిల్లాల్లో కుల సమీకరణలు, నాయకుల సమీకరణపై జగన్‌ దృష్టి సారించాల్సి వుంది. గతంలో వై.యస్‌. వెన్నంటి నడిచిన వాళ్లను, ప్రస్తుతం కాంగ్రెస్‌లో వున్న సీనియర్లను తన పార్టీ వైపు తీసుకురావాలి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఋణమాఫీ కూడా ఈ జిల్లాల్లోనే బలంగా పని చేసింది. ఋణమాఫీ వైఫల్యాలను కూడా జగన్‌ ఇక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ ఆరు జిల్లాల్లో తెలుగుదేశం సాంప్రదాయ ఓటు బ్యాంకుకు గండి కొట్ట గలిగితేనే వైకాపాకు అవకాశాలుంటాయి.

jaganగెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ యోధుడు, ప్రజా నాయకుడు.

నంద్యాల అసెంబ్లీ, కాకినాడ కార్పొరేషన్‌లలో ఓడిపోగానే వైకాపా పనైపోయిందని, జగన్‌ ఇక పార్టీని క్లోజ్‌ చేసుకోవచ్చన్నట్లుగా తెలుగుదేశం వర్గాలు, తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం హోరెత్తిస్తోంది. ఒక్క ఓటమితోనే ఒక పార్టీ భవిష్యత్‌కు తెరపడే టట్లయితే ఈరోజు దేశ రాజకీయ చిత్రపటంపై కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీలతో సహా చాలా పార్టీలు కనిపించవు. 1977లో కాంగ్రెస్‌ మట్టి కరిచింది. ఏడాది కల్లా సునామీలా లేచి నిలబడింది. 1984లో బీజేపీకి వచ్చింది రెండే రెండు సీట్లు. ఈరోజు తిరుగులేని ఆధిక్యతతో అధికారంలో వుంది. 1989లో ఏపిలో తెలుగుదేశం తుక్కుతుక్క యింది. 1994కల్లా ప్రభంజనమై లేచింది. కాబట్టి రాజకీయాల్లో గెలుపు శాశ్వతం కాదు, ఓటమీ శాశ్వతం కాదు. నిరంతర పోరాటం మాత్రమే శాశ్వతం.

కాకపోతే నంద్యాల, కాకినాడ ఓటముల నుండి ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే వున్నాయి. ఈ రెండు చోట్ల గెలవడానికి చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎంతగా అధికార దుర్వినియోగం చేసాడో, ఎన్ని విధాలుగా ప్రలో భాలకు గురి చేసాడో అన్నది వేరే విషయం. 2019 ఎన్నికల్లో కూడా వీటన్నింటిని ప్రయోగించగల శక్తి చంద్రబాబుకు వుంది. వాటిని ఎదుర్కొనే మార్గమే ఇప్పుడు జగన్‌కు కావాలి. 2012లో ఏపిలో 17 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు 15చోట్ల భారీ మెజార్టీలతో గెలుపొందారు. ఈ గెలుపే 2014లో జగన్‌ కొంప ముంచింది. ఈ గెలుపు ఆత్మవిశ్వాసాన్ని బదులు అతివిశ్వాసాన్ని పెంచింది. ఎన్నికలు జరగడమే తరువాయి, గెలవడమే మిగిలిం దన్నంత ధీమాను పెంచింది. అందుకే వస్తామన్న సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులను పార్టీలోకి తీసుకోలేదు. వీళ్లంతా తెలుగుదేశంలోకి వెళ్లి వైకాపాకు చేయాల్సిన నష్టం చేశారు. అదేవిధంగా జగన్‌ రాజకీయ అనుభవ రాహిత్యం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోలేక పోవడం కూడా పార్టీ పరాభవానికి కారణమైంది.

2014 ఎన్నికల్లో ఓటమిగాని, నిన్నటి నంద్యాల, కాకినాడ పరాజయాలు కాని ఒక్క విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇంకా ఒక వర్గం ప్రజలకు జగన్‌ దగ్గర కాలేక పోతున్నాడని. ఇక్కడ ఒక వర్గం అంటే ఒక కులం అనో, మతం అనో కాదు. ఎన్నికల సమయంలో పార్టీ అధి నేతల వ్యవహారశైలి, నాయకత్వ లక్షణాలు, వారి భవిష్యత్‌ కార్యాచరణను పరిశీలించి ఎవరికి ఓటు వేయాలని నిర్ణయం తీసుకునే తటస్థులని. రాష్ట్రంలో ఇలాంటి వారి శాతం తక్కువే కావచ్చు. కాని ఎన్నికలలో గెలుపోటములను నిర్దేశించే ఓట్లు ఇవేనని గుర్తుంచుకోవాలి. 2014 ఎన్నికల్లో తెలుగు దేశం అధికారంలోకి రావడానికి ఈ ఓట్లే కీలకమయ్యాయి. ఆ ఎన్నికల్లో తటస్థులు చంద్రబాబు వైపే మొగ్గు చూపారు. రాష్ట్రం విడిపోయి, అప్పుల ఊబిలో వుంది,

ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ స్థితిలో చంద్రబాబు అయితేనే ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలడని, ఆయనకు ఆ అనుభవం ఉందని, జగన్‌కు అంతటి పరిపాలనానుభవం లేదని చెప్పి తెలుగు దేశంకు ఓట్లేసారు. ఇలా ఓట్లేసిన వాళ్లలో చంద్రబాబును అప్పటిదాకా ద్వేషించిన ఉద్యోగులు కూడా ఉండడం గమనార్హం. ఈ వర్గం వాళ్ళు మొగ్గుచూపబట్టే కేవలం 5లక్షల ఓట్ల తేడాతో అధికారం చంద్ర బాబు చేతుల్లోకి వెళ్లిపోయింది.

నిన్న నంద్యాల, కాకినాడలలో వైకా పాకు తక్కువ ఓట్లేమీ రాలేదు. చంద్ర బాబు అంతగా ప్రలోభాలు పెట్టినా వైకా పాకు 70వేల ఓట్లు వచ్చాయి. నంద్యాల ఫలితం వెల్లడయ్యాక కాకినాడ ఎన్నికలు పెట్టినా, తెలుగుదేశంకు వైకాపాకు మధ్య వచ్చిన ఓట్ల తేడా 20వేలు మాత్రమే. వైకాపాకైనా, తెలుగుదేశంకైనా పార్టీ ఓట్లు నికరంగా వుంటాయి. జగన్‌ ఏం మాట్లా డినా, చంద్రబాబు ఎలా వున్నా ఆ ఓట్లు పక్కకు పోవు. ప్రతి వందఓట్లలో 40ఓట్లు తెలుగుదేశంకు, 40ఓట్లు వైకాపాకు, ఓ 10 ఓట్లు మిగతా పార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు వున్నాయనుకుందాం. మిగి లిన పదిమంది ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటారు. నాయకులనుబట్టి, నాయకులు ఇచ్చే వాగ్ధానాలను బట్టి, నాయకత్వ సమర్ధతను బట్టి ఎవరికి ఓటే యాలన్నది ఇలాంటి వాళ్లు నిర్ణయించు కుంటారు. డబ్బులతో కొనే ఓట్లనేవి ఇరు పార్టీలకు వుంటాయి కాబట్టి ఆ ఓట్లను తటస్థులతో కలపలేం. విజ్ఞులు, మేధా వులు, అభ్యర్థిని, పార్టీ రాష్ట్ర నాయకులను, వారి వ్యవహార శైలిని బట్టి తటస్థులు మారుతుంటారు. ఎన్నికల్లో గెలుపుకు వీరి ఓట్లు చాలా కీలకం. కాబట్టి వారి మనసు లకు దగ్గరయ్యేలా జగన్‌ ఇప్పటి నుండే భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించు కోవాల్సివుంది.

Page 1 of 4

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter