జిల్లా కేంద్ర కారాగారం.. పోలీస్ శిక్షణా కళాశాల... చంద్రబాబునగర్, వై.యస్.ఆర్.నగర్, శ్రామికనగర్, వల్లూరమ్మ కాలనీ, కుమ్మరిగుంట, బుజబుజనెల్లూరు... వేల సంఖ్యలో కుటుంబాలు... వీటన్నింటితో ముడిపడి వుంది ఒకే ఒక రోడ్డు... అదే పొదలకూరురోడ్డు నుండి బుజబుజనెల్లూరు వద్ద హైవేకి కలిసే రోడ్డు.
ఈ రోడ్డు చాలా దారుణంగా వుంది. గుంటలమయమై వాహనదారులకు నరకం చూపిస్తోంది. ప్రతిరోజూ ఖైదీలను తీసుకుని వెళ్ళే పోలీసు వాహనాలు, పోలీసు కాలేజీకి వెళ్ళే వాహనాలు ఈ రోడ్డు మీదే వెళ్ళాలి. ఇక పై కాలనీలలో గత కొన్నేళ్ళ నుండి వేలాది కుటుంబాలవాళ్ళు నివసిస్తున్నారు. ఇప్పుడు వై.యస్.ఆర్.నగర్లో వేలాదిమంది కొత్తగా ఇళ్ళు నిర్మించుకుంటున్నారు. ఈ కాలనీలకు రోడ్డు వసతి, మంచినీటి వసతి సక్రమంగా లేదు. ప్రధానరహదారితో పాటు కాలనీలోని రహదారు లను అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి.