jaganగతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి.

ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు జరిగేవి. అయితే అక్కడ దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి సమాధి ఉండడం తప్ప ఆ ప్రాం తంలో ఇంకెటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. కాని, ఈసారి ప్లీనరీకి గుంటూరును ఎంచుకుని రాజకీయ వ్యూహాత్మకంగా ముందడుగు వేసాడు వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి. కొంతకాలం క్రితమే విశాఖ కేంద్రంగా తెలుగుదేశంపార్టీ వాళ్లు నిర్వహించిన మహానాడుకు, నిన్న జరిగిన వైసిపి ప్లీనరీకి తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది. మహా నాడులో అధికార ఆర్భాటం స్పష్టంగా కనిపిస్తే, వైసిపి ప్లీనరీలో మాత్రం పార్టీపై అభిమానం, ప్రభుత్వం పట్ల వున్న వ్యతిరేకత స్పష్టమైంది.

గుంటూరు ప్లీనరీని ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి చక్కని రాజకీయ వేదికగా మలచుకున్నాడు. భవిష్యత్‌ కార్యా చరణ ప్రణాళికను స్పష్టంగానే ప్రకటించ గలిగాడు. రాష్ట్రంలో మూడేళ్ల చంద్ర బాబు పాలనను ఎండగట్టడం లోనే కాదు, తాము అధికా రంలోకి వస్తే ఏం చేస్తామన్నది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ప్లీనరీలో తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలకే గురిపెట్టి జగన్‌ కొత్త పథకాలను ప్రకటించాడు. ఎన్నికలు ఇంకా దాదాపు రెండేళ్ల దూరంలో వున్నాయి. ఇప్పుడే ఆయన వరాలు, పథకాలు ప్రకటించాల్సిన అవసరం లేదు. కాని, రేపు జరగబోయే నంద్యాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జగన్‌ వీటిని ప్రకటించాడనిపిస్తుంది. ముఖ్యంగా రైతులను లక్ష్యంగా చేసుకున్నాడు. 5ఎకరాల లోపున్న రైతులకు సంవత్సరానికి 50వేల సాయం ప్రకటించడం రాజకీయంగా పార్టీకి ఎంతో ప్రయోజనం కలిగించేదే! తెలుగుదేశం ప్రభుత్వంలో రైతాంగం పూర్తి నిరాశకు లోనైంది. చంద్రబాబు ఋణమాఫీ వాగ్ధానం అరకొరగానే అమలైంది. పాత ఋణాలు పూర్తి స్థాయిలో మాఫీ కాకపోగా, రైతులకు బ్యాంకులు కొత్తగా అప్పులివ్వడం లేదు. సాగునీళ్ళ సమస్య... గిట్టుబాటు ధరల సమస్య... విత్తనాలు, ఎరువుల సమస్య... ఇలా నిత్యం సమస్యలతో పోరాడుతున్న రైతులకు జగన్‌ రైతు భరోసా పథకం కొత్త ఆశలు కల్పించేదే!

ఇక మూడు దశలలో మద్య నిషేధాన్ని అమలు చేస్తానన్న జగన్‌ ప్రకటన మహిళా లోకాన్ని విశేషంగా ఆకర్షించేదే! రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే! 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు విడతల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పాడు. కాని, అధికారంలోకి వచ్చాక దశలవారీగా మద్యాన్ని విస్తరింపజేశాడు. ఈరోజు 30వేల జనాభా వున్న గ్రామాల్లో కూడా బార్లు పెట్టిస్తానంటున్నాడు. మద్యం విషయంలో చంద్రబాబు ప్రభుత్వంపై మహిళల్లో బలంగానే వ్యతిరేకత వుంది. ఈ అంశాలపై జగన్‌ గురిపెట్టి కొట్టాడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, అమ్మబడి, పింఛన్‌లు వంటివి వై.యస్‌. హయాంలో మొదలుపెట్టి అమలు చేస్తున్నవే!

అయితే ఇక్కడ నాయకుల విశ్వసనీయత ముఖ్యం. చంద్రబాబు ఆడిన మాటమీద నిలబడడన్నది జనానికి అర్ధమైపోయింది. ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత లేదు. కాని విశ్వసనీయతకు బ్రాండ్‌ వై.యస్‌. కుటుంబం. 2004 ఎన్నికల్లో ప్రజలకు చెప్పిన వాగ్ధానాలన్నింటిని నెరవేర్చి చూపించాడు వై.యస్‌. ఆయన కొడుకుగా జగన్‌ పట్ల కూడా ప్రజల్లో అదే విశ్వసనీయత వుంది.

ప్లీనరీ వేదికగా జగన్‌ తీసుకున్న సాహసోపేత నిర్ణయం 3వేల కిలోమీటర్ల పాదయాత్ర. అక్టోబర్‌ 27న ఇడుపులపాయలో మొదలుపెట్టి ఇచ్ఛాపురం దాకా 13జిల్లాల్లో 6 నెలల పాటు పాదయాత్ర చేయాలని సంకల్పించడం జగన్‌ పట్టుదలకు నిదర్శనం. జనంలో నిలిచేవాడు, జనంతో నడిచేవాడే నాయకుడు. 2002లో మండుటెండల్లో చేవెళ్ల నుండి ఇచ్ఛాపురం దాకా 1,472 కిలోమీటర్లు దివంగత నేత వై.యస్‌.రాజ శేఖర్‌రెడ్డి నిర్వహించిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆ పాదయాత్రలో ప్రత్యక్షంగా ప్రజల కష్టాలను, కన్నీళ్లను చూడబట్టే సీఎంగా బాధ్యతను చేపట్టిన వై.యస్‌. ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. నాటి తండ్రి పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకునే జగన్‌ 3వేల కిలోమీటర్ల పాదయాత్రకు నడుం కట్టాడు.

మొత్తానికి గుంటూరు ప్లీనరీ వైకాపా శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. భవిష్యత్‌పై బలమైన ఆశలకు పునాది వేసింది. వచ్చే ఎన్నికల్లో గట్టిగా పోరాడడానికి పార్టీ కేడర్‌కు సరికొత్త శక్తినిచ్చింది.

kadapaపేర్లు పెట్టడం, పేర్లు మార్చడం... చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న అతిపెద్ద పని ఇదే. ఈ ఏడాది పాలనలో ఇంతకుమించి చేసింది ఏమీ లేదు. రాజధానికి అమరావతి అని పేరుపెట్టారు. దివంగత నేత వై.యస్.రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాల పేర్లు మార్చారు. కొత్తగా పెట్టిన పథకాలకు పేర్లు పెట్టడంలో అర్థముంది. పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టడమే చంద్రబాబు చేసిన ఘనకార్యం.

ఈ పరంపరంలోనే ఇంకో అడుగు వేయబోతున్నాడు. వైయస్ఆర్ జిల్లాగా వున్న కడప జిల్లాకు తిరిగి పాతపేరునే పెట్టాలని పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. పూర్వం కడప దేవుని గడపగా ప్రసిద్ధి గాంచింది. ఈ పట్టణానికి కడప అనే పేరు కూడా దేవుని గడప మూలంగానే వచ్చింది. 2009లో వై.యస్. మరణానంతరం ఆయన సొంతజిల్లా కడపకు ఆయన పేరు పెట్టాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కడప జిల్లాకు వైయస్ ఆర్ జిల్లా అని పేరు మార్చారు. కడప పట్టణానికి మాత్రం పేరు అలాగే వుంది. కడప జిల్లా ప్రజలకు వైయస్ దేవుడి క్రిందే లెఖ్ఖ. తరతరాలుగా కడప జిల్లా ఎంతో వెనుకబడిపోయి వుండింది. వైయస్ ముఖ్యమంత్రి అయ్యాకే ఆ జిల్లా రూపురేఖలు మారాయి. కడప జిల్లాను ఆయన పూర్తిగా అభివృద్ధి బాట పట్టించాడు. ఫ్యాక్షనిజంతో నలిగిపోయిన జిల్లాకు ప్రగతి సొగసులు దిద్దాడు. ఈ జిల్లాకు వై.యస్ చేసినంత ఉపకారం ఇంతవరకూ ఎవరూ చేసి ఉండరు. కడపజిల్లాకు వై.యస్. పేరు పెట్టడాన్ని ఆక్షేపించాల్సిన పనే లేదు.

చంద్రబాబు సీఎం అయ్యింది మొదలు చూపంతా వైయస్ ఆర్ జిల్లా పేరు మీదే పడింది. ఆ జిల్లాకు వైయస్ ఆర్ పేరు తొలగిస్తేనే గాని ఆయన కడుపు మంట తగ్గేటట్లు లేదు. మహానాడు తర్వాత దేవుని గడప అనే పాత సెంటిమెంట్ ను తెరమీదకు తెచ్చి వైయస్సార్ జిల్లా పేరును తొలగించబోతున్నారు. రాష్ర్ట విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేత ఈ ప్రతిపాదన పెట్టించబోతున్నారు. మహానాడు తర్వాత కొద్ది రోజుల్లోనే వైయస్ఆర్ జిల్లాను తిరిగి కడపజిల్లాగా మారుస్తూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పార్టీలతో పనిలేకుండా వైయస్ ను అభిమానించే ప్రతి ఒక్కరూ ఆవేదన చెందడం ఖాయం.

kvpఆయన ఎప్పుడూ మౌనంగా వుంటాడు. చాలా తక్కువగా మాట్లాడతాడు. తాను చాలా అమాయకుడిననే బిల్డప్ ఇస్తాడు. కానీ ఆయన అసాధ్యుడు. తన మౌనం వెనుక కోట్ల కుంభకోణాలకు స్కెచ్ ని రచించగలిగిన మాడరన్ మాంత్రికుడు. ఎవరికి చెక్ ఇవ్వాలో ఎవరికి చక్ పెట్టాలో బాగా తెలిసిన నేటితరం రాజకీయ చాణుక్యుడు. ఆయనే కెవిపి రామచంద్రరావు.

దివంగత మహానేత వై.యస్. రాజశేఖరరెడ్డికి తోడుగా ఆయన వెన్నంటి నడిచే నీడగా డా. వై.యస్.పాలనలో కర్రపెత్తనం చేసిన కెవిపి ఆయన ఆకస్మిక మరణం అనంతరం వై.యస్. కుటుంబానికి దూరమైపోయాడు. వై.యస్. హత్యను పరోక్షంగా ప్రోత్సహించిన కాంగ్రెస్కు దగ్గరయ్యాడు. వారి అండతో మళ్ళీ రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఇదంతా ఆయన తెలియక చేసింది కాదు. అమాయకత్వంతో వేసిన అడుగులు కావు. అంతా పథకం ప్రకారమే. వై.యస్. కుటుంబంపై కక్షగట్టిన కాంగ్రెస్ అతిష్టానం తననెక్కడ ఇరికిస్తుందోనన్న భయంతో వారి పంచన చేరి పంచె సర్దుకున్నాడు.

చావైనా రేవైనా వైయస్ కుటుంబంతోనే అని చెప్పాల్సిన మొట్టమొదటి వ్యక్తిగా కెవిపిని అందరూ భావించారు. కాని నమ్మకద్రోహానికి నిలువెత్తు సాక్షిగా మిత్రద్రోహానికి నిజమైన నిదర్శనంగా, రాజకీయ స్వార్థానికి నిఖార్సైన ప్రతిరూపంగా కెవిపి అనబడే ఈ క్యాప్ స్టన్ తనను తాను రుజువుచేసుకున్నాడు. అన్ని
కేసుల నుండీ తాను తప్పించుకున్నానని చంకలు గుద్దుకున్నాడు. కానీ టైటానియం రూపంలో ఇప్పుడు ఆయన పాపం పండింది.

రాష్ర్టస్థాయి నుండి దేశస్థాయి వరకు వై.యస్.జగన్మోహన్రెడ్డి అనేక అక్రమ సంపాదనలకు పాల్పడ్డాడనే నెపంతో ఆయనను జైలుపాలు చేసిన పార్టీకి గులాంగా మారిన పాపానికి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అతిపెద్ద కుంభకోణంలో కెవిపి ఇరుక్కున్నాడు.

కాంగ్రెస్ అండతో తాను చేసిన అనేక అక్రమాల నుండి ఆయన దేశ స్థాయిలో తప్పించుకున్నా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఏకంగా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా చేతిలో చిక్కి పీకల్లోతు కూరుకుపోయాడు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్(ఎఫ్బిఐ) అమెరికాలో చాలా శక్తివంతమైన ప్రభుత్వ వ్యవస్థ. ఎఫ్ బిఐ చేపట్టే ఏ దర్యాప్తునూ ఆషామాషీగా తీసుకోడానికి లేదు. వస్తున్న సమాచారంకి అనుగుణంగా టైటానియం కుంభకోణంలో కెవిపిని అరెస్టు చేయడం జరిగితే ఇక ఇప్పట్లో ఆయన బయటకు రావడం కల్లే.

చేసుకున్న వారికి చేసుకున్నంత గణనాథా... అన్నట్లు కనీసం యం.పి.టి.సి స్థాయిలో కూడా గెలవలేని వ్యక్తిని కేవలం స్నేహితుడన్న ఒకే ఒక కారణంతో తన సామ్రాజ్యంలో తిరుగులేని వ్యక్తిగా వై.యస్. తీర్చిదిద్దితే నేడు ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా ఢిల్లీ బెల్లీలతో చేతులు కలిపినందుకు ఆ వై.యస్. ఆత్మే ఈ ప్రేతాత్మకు తగిన బుద్ధి చెబుతోందని వై.యస్. కుటుంబ అభిమానులు గుసగుసలు... కాదు... కాదు, బహిరంగంగానే అనుకుంటున్నారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • యువతకు ఒప్పుకునేనా?
  తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
 • కొండమీద కొత్త రూటు...
  ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
 • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
  ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…
 • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
  కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
 • ఇప్పుడన్నా ఇస్తారా?
  తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…

Newsletter