ramireddyతిరుపతిలోని ఎస్వీ యూని వర్శిటీలో రసాయన శాస్త్రం అధ్యాపకులుగా పనిచేస్తున్నయల్లాల వెంకటరామిరెడ్డి(వై.వి.రెడ్డి)ని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని పశుసంవర్ధక శాఖ కమిటి (కమిటి ఫర్‌ ది పర్పస్‌ ఆఫ్‌ కంట్రోల్‌ అండ్‌ సూపర్‌విజన్‌ ఆఫ్‌ ఎక్స్‌ పరిమెంట్స్‌ ఆన్‌ యానిమల్స్‌)లో సభ్యునిగా నియమించారు. ఈమేరకు కేంద్రప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ డాక్టర్‌ గౌరీశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

నెల్లూరుజిల్లా వింజమూరుకు చెందిన వై.వి.రామిరెడ్డి విద్యార్థి దశ నుండి ఏబివిపి నాయకుడిగా రాణించారు. ఎస్వీ యూని వర్శిటీలోనూ ఏబివిపి నాయకుడిగా పనిచేశారు. ఆరెస్సెస్‌ భావాలు కలిగిన వ్యక్తి. తాను చదివిన యూనివర్శిటీలోనే ఆచార్యునిగా సేవలందిస్తున్నారు. గత కొన్నేళ్ళుగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులుగా కూడా ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఆయన సభ్యుడిగా వేసిన కమిటీ ఆధ్వర్యంలోనే విద్యాలయాలు, ఎరువుల కర్మాగారాలు, పశువులు, జంతువులపై పరిశోధనలు జరగాలి. ఈ కమిటీయే వాటిని పర్యవేక్షిస్తుంది.

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనిచేసే కమిటీలో స్థానం పొందిన వై.వి.రామిరెడ్డికి 'లాయర్‌' అభినందనలు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter