beedaరాజ్యసభ రేసులో చివరివరకు పోరాడిన మాజీఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు చివరి క్షణంలో వెనుకబడిపోయాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సున్నితంగా ఆయనను పక్కకు తప్పించాడు. దీంతో ఈసారి రాజ్యసభ పై గంపెడాశలు పెట్టుకున్న బిఎంఆర్‌కు చివరకు నిరాశే మిగిలింది.

2014 ఎన్నికల్లో కావలి నుండి ఓటమి చెందిన మస్తాన్‌ రావును చంద్రబాబు రాజధానికమిటిలో సభ్యులుగా నియమిం చారు. అలాగే ఆయన కావలి ఇన్‌ఛార్జ్‌గా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల కంటే రాజ్యసభకు వెళ్ళడమే మేలనుకున్న మస్తాన్‌రావు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. గతంలో ఒకసారి రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు గట్టిగానే ప్రయత్నించాడు కాని సఫలం కాలేదు. ఆ తర్వాత టీటీడీ బోర్డు ఛైర్మెన్‌గా కూడా ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. అది కూడా సక్సెస్‌ కాలేదు.

ఇప్పుడు రాష్ట్రంలో మూడు రాజ్యసభ పదవులకు ఎన్నికలొ చ్చాయి. ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి టీడీపీకి రెండు, వైసిపికి ఒకటి దక్కాయి. తెలుగుదేశంకు దక్కే రెండు పదవుల్లో ఒకదాని కోసం బీద మస్తాన్‌రావు గట్టిగా ప్రయత్నిం చాడు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో పాటు జిల్లా పార్టీ నాయకులు కూడా బీఎంఆర్‌కు ఈ విషయంలో మద్దతుగా నిలిచారు. చివరి వరకు కూడా బీఎంఆర్‌కు రాజ్యసభ గ్యారంటీ అనే ప్రచారం సాగింది. అయితే చివరి క్షణంలో చంద్రబాబు మొండిచేయి చూపారు. బీదకు రాజ్యసభను ఇవ్వకపోవడానికి చంద్రబాబు చెప్పిన కారణం మీరు రాజ్యసభకు వెళితే కావలిలో ఇక అభ్యర్థి లేడని! ఇది నిజమే. ఇంకో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. కావలి తెలుగుదేశంపార్టీకి బీద సోదరులే నాయకులు. బీద రవిచంద్ర ఎమ్మెల్సీగా వున్నాడు. ఆయనకు ఇంకా పదవీ కాలం వుంది. బీద మస్తాన్‌రావు కావలి ఇన్‌ఛార్జ్‌గా వుంటున్నాడు. కావలి అసెంబ్లీకి గట్టి అభ్యర్థి బీద మస్తాన్‌రావే! ఆయన రాజ్యసభకు వెళితే కావలికి కొత్త అభ్యర్థిని వెదుక్కోవాల్సిన పరిస్థితి. ఎలక్షన్‌ చేయగల సత్తా వున్నోళ్ళంతా రాజ్యసభకు, శాసనమండలికి వెళితే రేపు ఎలక్షన్‌లలో పోటీ చేసేదెవరు? ఈ కోవలోనే బీఎంఆర్‌ ఆశలు గల్లంతయ్యాయని తెలుస్తోంది.

no helmetఎందుకనో గాని నెల్లూరుజిల్లాలో ద్విచక్రవాహనదారులకు హెల్మెట్‌ ప్రయోగం విఫలమవుతూనే వుంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలన్న నిబంధనను గతంలో ఎన్నోసార్లు అమలు చేసారు. దీని కోసం మోటార్‌ వాహనాల షోరూమ్‌లలో హెల్మెట్‌ల అమ్మకాలు కూడా పెట్టారు. బండితో పాటు హెల్మెట్‌ కొనాలనే నిబంధన తెచ్చారు. హెల్మెట్‌ లేని వాహనదారులకు పోలీసులు జరిమానాలు కూడా విధించారు. అయితే దానిని నిరంతరాయంగా అమలు చేయలేకపోయారు. కొద్దిరోజులు మాత్రమే ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌లు పెట్టుకున్నారు. తర్వాత యధాపరిస్థితే!

కాగా, రవాణాశాఖాధికారులు మరోసారి హెల్మెట్‌ సబ్జెక్ట్‌ను తెరమీదకు తెచ్చారు. ఈ నెల 20వ తేదీ నుండి పెట్రోల్‌ బంకుల వద్ద హెల్మెట్‌ లేని ద్విచక్రవాహనదారులకు పెట్రోల్‌ పోయరంట. 'నో హెల్మెట్‌ - నో పెట్రోల్‌' నినాదాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తామని, ప్రజల్లో దీనిపై అవగాహన కల్పిస్తామని రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ శివరాంప్రసాద్‌ చెబుతున్నారు. ఈ మేరకు ఆయన పెట్రోల్‌ బంకు ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులతో కూడా మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్మెట్‌ వాడకం మంచిదే! ప్రజలు, ద్విచక్రవాహనదారులు కూడా దీనికి సహకరిస్తే బాగుంటుంది.

parasaజిల్లాలో తెలుగుదేశంపార్టీకి గట్టి నియోజకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఇది ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అయినప్పటికి ఇంతకాలంగా వేనాటి సోదరులే ఇక్కడ పార్టీని నడుపుతూ వచ్చారు. అభ్యర్థులను నిర్ణయిస్తూ, గెలిపిస్తూ వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 8సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 5సార్లు తెలుగుదేశం అభ్యర్థులే గెలిచారు. 1989, 2004లలో మాత్రం కాంగ్రెస్‌, 2014 ఎన్నికల్లో మాత్రం వైయస్సార్‌కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించింది. 1994 ఎన్నికల నుండి కూడా ప్రతి ఎన్నికల్లో పరసా రత్నమే ఇక్కడ పార్టీ అభ్యర్థిగా వుంటున్నాడు. వేనాటి సోదరులే అతనిని పార్టీలోకి తీసుకొచ్చి ఆయన తరపున పని చేస్తున్నారు.

సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఒక లెఖ్ఖ! ఇక జరగబోయే ఎన్నికలు ఒక లెఖ్ఖ! 2014 ఎన్నికల వరకు కూడా ఈ నియోజకవర్గంలో పార్టీ పెత్తనమంతా కూడా వేనాటి కుటుంబం చేతిలో వుంటూ వచ్చింది. కాని ఈ నాలుగేళ్లలో ఇక్కడ రాజకీయంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీలో వ్యాపారవేత్త గంగా ప్రసాద్‌కు ప్రాధాన్యత పెరిగింది. వేనాటికి విరోధిగా వున్న ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు. వేనాటి ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేసారు. పార్టీ పెట్టాక గత 3దశాబ్దాలలో ఎప్పుడూ చవిచూడని చేదు అనుభవాలను వేనాటి కుటుంబం ఈ మూడేళ్ళ లోనే చూసారు. ఇంకోపక్క పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వున్న పరసా రత్నం అంటే కూడా వేనాటికి ఇష్టం లేదు. ఇదే సమయంలో సూళ్ళూరు పేట ఎమ్మెల్యేగా వున్న కిలివేటి సంజీవయ్యకు ప్రజల్లో మంచి పేరొచ్చింది. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికి ప్రజల్లో బాగానే తిరుగుతున్నాడు. ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటున్నాడు. నియోజకవర్గంలోనూ సంజీవయ్య స్ట్రాంగ్‌క్యాండిడేట్‌ అనే ప్రచారం వచ్చింది. ఈ నేపథ్యంలో అతనికి పోటీకి పరసా రత్నం పనికిరా డని, కొత్త అభ్యర్థిని తెరమీదకు తేవొచ్చనే వూహాగానాలున్నాయి. వేనాటి కొత్త అభ్యర్థి వైపే మొగ్గు చూపొచ్చని తెలుస్తోంది.

Page 1 of 27

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…
 • ఆదాయం వచ్చే పనులపై ఉన్న శ్రద్ధ ఆస్థి పన్నులపై ఏదీ?
  నెల్లూరుజిల్లాలోని మునిసిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌ పన్నుల వసూళ్ళలో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 కార్పొరేషన్లు ఉండగా పన్నుల వసూళ్ళలో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ 11వ స్థానంలో వుంది. నెల్లూరు నగరపాలక సంస్థలో మొత్తం 1,17,456 అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఇందులో రెసిడెన్షియల్‌…
 • అన్ని సీట్లూ ఇక తమ్ముళ్ళకే!
  ఎన్డీఏ కూటమి నుండి తెలుగుదేశం వైదొలిగింది. దీనిపై నెల్లూరుజిల్లా తెలుగు తమ్ముళ్ళు రెండు విధాలుగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మతోన్మాద పార్టీ అని, అందుకే దూరంగా వచ్చేసామని ముస్లింలు, క్రిస్టియన్‌ల దగ్గరకుపోయి ఓట్లు అడగొచ్చు. నోట్ల రద్దు, జిఎస్టీ వంటి…
 • వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, యం.పి., రాజ్యసభ
  నేను నేనుగా బ్రత కడం కాదు, నేను నలుగురి కోసం బ్రత కడం, నలుగురికి బ్రతుకు నివ్వడం, బ్రతికే మార్గాన్ని చూపించడం... భవిష్యత్‌ పై ఆశలు కల్పించడం, పది మందికి నేనున్నాననే భరోసా ఇవ్వడం... ఈ మార్గాన్ని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తే…
 • పవన్‌కు తోడైన 'సింహపురి పవర్‌'
  పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో హీరో అత్త పాత్రధారి నదియాతో... ''నీ వెనుక తెలియని అదృశ్యశక్తి ఏదో ఉందమ్మా, అది వున్నంత వరకు నిన్నెవరూ ఏమీ చేయలేరు''అని పోసాని కృష్ణమురళి అంటాడు. ఆ తరహాలోనే ఇప్పుడు పవర్‌ స్టార్‌…

Newsletter