america abbaiమనుక్రాంత్‌రెడ్డి... పుట్టింది పెరిగింది చదివింది అంతా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే. ఆ తరువాత

ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్ళి అక్కడ తానే స్వంతంగా ఓ కంపెనీని ఏర్పాటు చేసుకుని ఆ తరువాత కాలంలో హైదరాబాదులోనూ మరో సంస్థను స్థాపించి ఎంతోకొంత మందికి జీవనోపాధి కల్పిస్తూ సంతృప్తి పొందుతున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.

అయితే ఇప్పుడు మనుకి ఓ ఆలోచన పుట్టింది. మనకి జన్మనిచ్చిన భూమికి మనమేం చేస్తున్నామన్న తపన ఆ అబ్బా యిలో మొదలయ్యింది. అంతే అనుకున్న వెంటనే హైదరాబాద్‌లో వున్న తన మాష్‌కామ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థని నెల్లూరుకు తరలించేశాడు. మొత్తం కంపెనీ చిరునామాని హైదరాబాద్‌ నుండి నెల్లూరుకు బదిలీ చేసేశాడు. అక్కడితో ఆగలేదు, తన ఊరికి తాను ఏదో ఒకటి చేయాలని బలంగా సంకల్పించాడు.

గురువారం మీడియా ముందు కొచ్చాడు. తాను మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి బిడ్డగా, మంచి సోదరుడి గానే కాకుండా మంచి పౌరుడిగా ఎదగా లనుకుంటున్నానని, అనాధగా వున్న నవ్యాంధ్ర ప్రగతికి తానూ భాగస్వామిని కావాలనే ఉద్దేశ్యంతో తన స్వంత గడ్డ నెల్లూరుని వేదికగా ఎంచుకున్నానని ప్రకటించాడు.

తెలంగాణ నుండి తన సంస్థను తర లించడమే కాకుండా, ఇంకా ఇతర సంస్థలకు కూడా ప్రోద్భలాన్ని ఇస్తానని, తన విజయంతో వారికి స్ఫూర్తి కలిగించి వారి సంస్థలను కూడా నెల్లూరుకు తర లింపజేస్తానని ప్రతిజ్ఞపూనాడు. తనకున్న బంధాలు సంబంధాలతో నెల్లూరును కూడా ఓ సాఫ్ట్‌వేర్‌ హబ్‌గా చేయడానికి ప్రయత్నిస్తానని వాగ్ధానం చేశాడు. ఇక్కడితో ఆ అబ్బాయి ఆగలేదండోయ్‌... ''మన మను ఆర్గనైజేషన్‌'' అంటూ ఓ సేవాసంస్థని ప్రారంభించాడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలకు కూడా తాను శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించాడు.

శుభం... మంచి ఆలోచన.

మనుక్రాంత్‌ నాన్న చెన్నారెడ్డి సుబ్బారెడ్డి, అమ్మ పెనుమల్లి మస్తానమ్మ ఇద్దరూ జిల్లా న్యాయమూర్తులుగా పనిచేసి పదవీ విరమణ పొందినవారే. వీరిద్దరి పెంపకంలో జన్మభూమి పట్ల మమకా రాన్ని, సొంత ఊరి పట్ల అనురాగాన్ని పెంచుకుని జై జన్మభూమి అంటున్న మనుక్రాంత్‌కి ఆల్‌ ది బెస్ట్‌!

spsrనెల్లూరుజిల్లాకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పదేళ్ళయ్యింది. దివంగత నేత డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలోని ఆర్యవైశ్యుల కోరికమేరకు నెల్లూరుజిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టి అసెంబ్లీలో ఆమోదింప జేశారు. ప్రస్తుతం ఏపిలో వ్యక్తుల పేర్లు మీద మూడే మూడు జిల్లాలున్నాయి. ఒకటి ప్రకాశం, రెండోది వై.యస్‌.ఆర్‌.జిల్లా(కడప), మూడోది పొట్టి శ్రీరా ములు నెల్లూరుజిల్లా. అయితే రాష్ట్రంలో ప్రకాశం జిల్లా పాపులర్‌ అయినంతగా మిగతా రెండు జిల్లాలు పాపులర్‌ కాలేదు. ప్రకాశం అనే పేరు పలకడానికి సులభంగా వుంటుంది. వై.యస్‌.ఆర్‌.జిల్లా కూడా ఇప్పుడిప్పుడే వాడుకలో పడుతుంది. కాని నెల్లూరుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పదేళ్ళయినా కూడా ప్రభుత్వ రికార్డులు, ప్రభుత్వ అధికార పత్రాలలో కనపడినంతగా పబ్లిక్‌లో పాపులర్‌ కాలేదు. దీనికి పేరు కొంచెం పొడుగ్గా వుండడమే కారణం కావచ్చు. ఏదిఏమైనా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని కనీసం ఆయన పేరు పెట్టిన జిల్లాను ఉచ్ఛరించడం వల్లనైనా గౌరవిద్దాం.

anam''ఈ గట్టునుంటావా... నాగన్న ఆ గట్టునుంటావా'' అన్న పాటలో మాదిరిగా నిన్నటి వరకు తన రాజకీయ పయనం ఎటువైపు అన్నది తేల్చుకోకుండా వున్న ఆనం రామనారాయణరెడ్డి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశంపార్టీని వీడడం ఖాయమని విశ్వసనీయ సమాచారం.

విజయవాడలో జరిగిన మహానాడుకు కూడా ఆయన హాజరు కాకపోవడం, ఆత్మకూరు నియోజకవర్గంలో అభ్యర్థిత్వంపై తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సర్వేలో ఆయన పేరు లేకపోవడంతో ఇక ఆయన టీడీపీలో కొనసాగడం కష్టమేనని తేలి పోయింది. ఇటీవల ఆత్మకూరు, నెల్లూరురూరల్‌ నియోజకవర్గాల మినీమహానాడులలో పాల్గొని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీద, తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాల మీద ఘాటైన విమర్శలు సంధించిన ఆయన ఆ వేదికల మీదే తన ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెప్పాడు.

ఆనం సోదరులు తెలుగుదేశంలో చేరి మూడేళ్ళయ్యింది. చంద్రబాబు తమకిచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని ఆనం సోదరులు అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీ కావాలన్న కల నెరవేరకుండానే మాజీఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కన్నుమూసారు. ఆయన మరణానికి ముందే చంద్రబాబును నమ్మి తెలుగుదేశంలో వుండొద్దు, బహిరంగ క్షమాపణలు చెప్పైనా వైసిపిలో చేరండని తన తమ్ముడు ఆనం రామనారాయణరెడ్డికి సూచించినట్లు సమాచారం. వివేకా మృతికి ముందే ఆనం పార్టీ మారడంపై వూహా గానాలొచ్చాయి. జరిగిన పరిణామాలు కూడా అలాగే వున్నాయి. అయితే వివేకా అంతిమయాత్ర రోజు చంద్రబాబు రావడం, ఆనం కుటుంబసభ్యులతో సమావేశం కావడం, ఆనం రామనారాయణరెడ్డిని పక్కనే పెట్టుకుని మీడియాతో మాట్లాడడం వంటి పరిణామాలతో పాటు వైసిపిలో చేరితే ఏ సీటిస్తారన్నదానిపై ఆనంకు క్లారిటీ ఇవ్వకపోవడం వంటి కారణంతో ఆనం పార్టీ మారే కార్యక్రమానికి బ్రేక్‌ పడింది. ఆనం ఇక తెలుగుదేశంలోనే ఉంటాడు అనుకున్న తరుణంలోనే మళ్ళీ జిల్లా రాజకీయాల్లో వూహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వంపై చేసిన విమర్శలు, మహానాడుకు వెళ్ళకపోవడం వంటి అంశాలు ఆయన పార్టీ మారుతాడనే దానికి బలమైన సంకేతాలు. వైసిపి నుండి కూడా ఆయనకు సానుకూల సంకేతాలు అందబట్టే చంద్రబాబు ప్రభుత్వంపై బలంగా విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీలో చేరితే ఏ సీటు ఇవ్వాలన్నదానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఆత్మకూరు సీటునే ఆయనకు ఖరారు చేసే అవకాశాలున్నాయి. వైసిపిలో వున్న సీనియర్‌ నేత, ఆనంకు సన్నిహితుడైన బొత్స సత్యనారాయణ, వైసిపిలో కీలకభూమిక పోషిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డిల చొరవతోనే ఆనంకు వైసిపిలో రూటు క్లియర్‌ అయినట్లుగా సమాచారం.

Page 1 of 31

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter