kaka prataకుక్కను చంపాలంటే దాని మీద పిచ్చికుక్క అనే ముద్ర వేయాలి. ఈ సూత్రాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ పార్టీ అనుకూల మీడియా బాగానే పాటిస్తోంది. వైకాపాలో ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేయడం, వాళ్ళు పార్టీ మారుతున్నా రనే ప్రచారాన్ని మీడియా ద్వారా కల్పించడం, వారిలో కూడా పార్టీ మారాలనే ఆశ కలిగించడం... ఇదీ ఒక రొటీన్‌ పద్ధతి.

రాష్ట్రంలో ఇంత వరకు ముగ్గురు ఎంపీలు, 22మంది ఎమ్మెల్యేలు వైయ స్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో నుండి తెలుగు దేశంలోకి ఫిరాయించారు. వీళ్ళందరిలో ఒక్కొక్కరిది ఒక్కో నేపధ్యం. కొందరు అధికారం కోసం... కొందరు మంత్రి పదవుల కోసం... కొందరు అధికార పార్టీ వేధింపులు, అక్రమ కేసులకు తట్టుకోలేక... కొందరు డబ్బుకు అమ్ముడుపోయి... ఇవీ వీళ్ళందరు కూడా పార్టీ మారడానికి ప్రధాన కారణాలు. అయినా పార్టీ మారే టప్పుడు అందరూ చెప్పిన కంబైన్డ్‌ పచ్చి అబద్ధమేంటంటే అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెప్పడం.

తెలుగుదేశం వాళ్ళు తమ నెక్ట్స్‌ టార్గెట్‌ నెల్లూరుజిల్లాను పెట్టుకున్నారు. జగన్‌ పట్ల నెల్లూరుజిల్లా ఎమ్మెల్యేలు చాలా విశ్వాసం చూపించారనుకోవచ్చు. సొంత జిల్లా కడప నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్‌ అయ్యారు. కర్నూలు జిల్లాలో అయితే ఇంకా ఎక్కువ. కాని, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే ఒక్క ఎమ్మెల్యే పార్టీ మారాడు. అతను కూడా ఒకప్పుడు తెలుగుదేశం మనిషే! కాబట్టి అతనిని లెక్కలో తీసుకో వాల్సిన అవసరం కూడా లేదు. మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం జగన్‌కు గట్టిగా నిలబడివున్నారు. ఇది నెల్లూరుజిల్లా టీడీపీ నాయకులకు చాలా ప్రిస్టేజ్‌గా మారింది. కనీసం ఇంకో ఇద్దరు ఎమ్మెల్యే లనన్నా పార్టీలోకి తీసుకొచ్చి చంద్రబాబు వద్ద తమ టాలెంట్‌ చూపించుకోవాలని తెగ ఉబలాటపడుతున్నారు. మిగతా ఆరు గురు ఎమ్మెల్యేలెవరు కూడా డబ్బులకు లొంగే వాళ్ళు కాదు. అలాగని మంత్రి పదవులు ఇవ్వలేరు. కాబట్టి వారి బలహీ నతల మీదే కొట్టాలనుకున్నారు. ఈ క్రమం లోనే సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డిలను లక్ష్యంగా ఎంచుకున్నారు. 2014 ఎన్నికలకు సంబంధించి ఇద్దరి మీదా నకిలీ మద్యం కేసులు నమోదై వున్నాయి. అలాగే రామిరెడ్డి ప్రతాప్‌కు అమరావతి రాజధాని ప్రాంతంలో కొంత భూమి సమస్య వుంది. వీటిని ఆధారంగా చేసుకుని వీరిద్దరిపై ఒత్తిడి పెంచి తెలుగు దేశంలో చేర్పించాలని చూసారు. దాదాపు రెండేళ్లుగా ఈ ప్రయత్నం, ఈ ప్రచారం జరుగుతూనే వుంది. తమ మీద ఇలాంటి అపోహలు వచ్చినప్పుడల్లా కాకాణి, ప్రతాప్‌లు ఖండిస్తూనే వున్నారు. ఇప్పుడు కూడా మరోసారి తమపై అలాంటి ప్రచారం వచ్చిన నేపధ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా విలేకరుల సమావేశం పెట్టి తాము జగన్‌తోనే ఉంటామని తేల్చి చెప్పి అనవసరంగా జరుగుతున్న ప్రచా రానికి తెరదించారు.

ramakrishnaఅధికారులు మూడు రకాలుగా వుంటారు. ఒకరు అధికారపార్టీ అడుగు లకు మడుగులొత్తుతుంటారు. వీళ్ళనే బూట్లు నాకేవాళ్ళు అని కూడా అంటుం టారు. ఇంకోరకం... అధికార పార్టీవాళ్లనే ఉచ్చపోయించే వాళ్ళు. వీళ్ళు మహా ముదుర్లు. ఇకపోతే మూడోరకం... చట్ట ప్రకారం, నిబంధన ప్రకారం పని చేసు కుంటూ పోయేవాళ్ళు. తమ బూట్లు నాకే వాళ్ళతో అధికారపార్టీ వాళ్ళకు ఇబ్బంది ఉండదు. లేదా తమకు పూర్తి వ్యతిరేకంగా పనిచేసే అధికారులతోనూ ఇబ్బంది ఉం డదు. ఎందుకంటే అలాంటివాళ్లను ముందుగానే గుర్తించి లూప్‌లైన్లలో తోస్తుం టారు. అధికారపార్టీ వాళ్ళకు అసలు సమస్యల్లా చట్ట ప్రకారం ముక్కుసూటిగా పనిచేసుకుపోయే వాళ్ళతోనే! ఇలాంటి వాళ్ళు ఎవరి మాటా వినరు. అధికారపార్టీ నాయకుల పనులన్నీ కూడా కొంతవరకు చట్ట విరుద్ధంగానే వుంటాయి. ఓవర్‌ లోడ్‌తో వెళుతున్న ఇసుకట్రాక్టర్‌ను పోలీ సులు పట్టుకుంటారు. ట్రాక్టర్‌ ఓనర్‌ వెళ్ళి... అధికారపార్టీ నాయకులకు... ట్రాక్టర్‌ నా జీవనాధారమని, దానిని విడి పించమని మొరపెట్టుకుంటాడు. ఇక్కడ అధికార పార్టీ నాయకుడికి అగ్ని పరీక్షే. నిబంధనలను అతిక్రమించిన ట్రాక్టర్‌ను వదలమని ఎస్పీకి చెప్పాలంటే భయం. అలాగని ట్రాక్టర్‌ను వదిలించకుంటే... నువ్వేమీ నాయకుడివని జనం నవ్విపోతా రని ఇంకో భయం.

ప్రస్తుతం ఇలాంటి స్థితిలోనే నెల్లూరు జిల్లా తెలుగుదేశం నాయకులున్నారు. జిల్లా ఎస్పీ రామకృష్ణ వారికి మింగుడుపడని జడపదార్ధంగా మారాడు. రామకృష్ణ వచ్చి నప్పటి నుండి బెట్టింగ్‌, ఎర్రచందనం, మైనింగ్‌ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాడు. మైనింగ్‌పై పూర్తిగా నిఘా పెట్టి అక్రమ రవాణాను అడ్డుకుంటుండడంతో అధికారపార్టీ నాయకులకు ఊపిరాడడం లేదు. ఈమధ్య ఇసుక ట్రాక్టర్లను పట్టు కోవడం ఎక్కువైంది. అలాగే నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతున్న ఆటోలను కూడా పెద్దసంఖ్యలో సీజ్‌ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇన్‌ ఛార్జ్‌లు, నాయకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. వీళ్ళు ఎస్‌ఐలకు, సిఐలకు ఫోన్‌లు చేస్తున్నారు. వాళ్ళేమో మా చేతుల్లో ఏమీ లేదు, ఎస్పీకి చెప్పమంటున్నారు. ఎస్పీకి ఇలాంటి పనుల కోసం ఫోన్‌లు చేయలేకపోతున్నారు. వీటి కోసం ఫోన్‌ చేస్తే ఆయన నుండి ఎలాంటి సమాధానం వస్తుందో వీరికి తెలుసు. అందుకే క్రింది స్థాయిలో పనులు కాక, పైస్థాయి అధికారికి చెప్పే ధైర్యం లేక, అసలు ఎస్పీనే మారిస్తే పోలా అనే పరిస్థితికి వచ్చారు.

ఇటీవల నెల్లూరులో జరిగిన తెలుగు దేశం పార్టీ సమన్వయ కమిటి సమా వేశంలో ఎస్పీ అంశాన్నే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. జిల్లా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారా యణ, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డిల సమక్షంలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పోలంరెడ్డి శ్రీని వాసులురెడ్డి, పాశం సునీల్‌కుమార్‌లు ఎస్పీ వ్యవహారశైలిపై గట్టిగా మాట్లాడారు. ఆయనను ఎస్పీగా కొనసాగిస్తే నియో జకవర్గాలలో తమకు ఓట్లు పడవన్న ట్లుగా వాపోయారు. ఎస్పీ అయినా మారాలని, లేదంటే ఎస్పీనైనా మార్చాలని, మంత్రులు ఆ పని చేయకుంటే ముఖ్య మంత్రి వద్దే దీనిపై పంచాయితీ పెడతా మని వార్నింగ్‌ ఇచ్చారు.

'విక్రమార్కుడు' సినిమాలో హీరో రవితేజ డైలాగ్‌... పోలీసోడు ట్రాన్స్‌ఫర్‌ అయితే పోలీసేస్టేషన్‌కే పోతాడు, రైల్వే స్టేషన్‌కు కాదు... ఇప్పుడు రామకృష్ణను బదిలీ చేసి ఇంకో జిల్లాలో వేసినా అక్కడ అధికార పార్టీ నాయకులదీ ఇదే పరిస్థితి. తమ మాట వినలేదని ట్రాన్స్‌ఫర్లు చేసు కుంటూ పోతే ప్రజల కోసం పనిచేసే అధికారులే మిగలరు. అధికార పార్టీ నాయకులు వారివైపు నుండి ఆలోచించడం మాని కొంచెం చట్టం వైపు నుండి కూడా ఆలోచించడం నేర్చుకోవాలి.

kakaniరాజకీయ నాయకులకు సొంత ఆలోచన, సమస్యలపై సొంతంగా అవ గాహన ఉండాలి. రాజకీయాలలో వున్న ప్పుడు ఇతరులు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అవెంతవరకు సాధ్యమో ఆలోచించుకోవాలి. రాజకీయాలలో వున్నప్పుడు ఎదుటివారు చెప్పేది వినాలి. వారు చెప్పిన విషయాలపై మనం సొం తంగా పరిశీలన చేసుకుని అడుగేయాలి. అంతేగాని ఎవరెవరో చెప్పింది విని అడు గులు వేస్తే అవి తప్పటడుగులే అవు తాయి. అలా తప్పటడుగులు వేసే సర్వే పల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. అసలే ఎన్నికల నాటి నకిలీ మద్యం కేసుతో సతమతమవుతున్న ఆయన మెడకు తాజాగా నకిలీ డాక్యు మెంట్ల కేసు తగులుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో నకిలీ డాక్యుమెంట్లు చూపించి మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేసినందుకుగాను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఛార్జిషీటు దాఖ లైంది. ఈ కేసులో ఆయనను ఏ-1 ముద్దా యిగా, ఏ-2గా పసుపులేటి చిరంజీవి, ఏ-3గా పి.వెంకటకృష్ణ, ఏ-4గా జె.హరి హరన్‌లను చేర్చి నెల్లూరు మొదటి తరగతి నాలుగో అదనపు జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు.

అప్పట్లో సోమిరెడ్డి ఫిర్యాదు ఆధా రంగా నెల్లూరురూరల్‌ పోలీసులు రంగం లోకి దిగి విచారణ మొదలుపెడితే అసలు కథంతా బయపడింది. అప్పుడే పసుపు లేటి చిరంజీవి అనే మోసగాడు సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లుగా ఇవి తేలాయి. ఈ ఏడాది జనవరిలోనే పోలీసులు చిరం జీవిని, మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. కాగా, కాకాణి చూపించిన డాక్యుమెంట్లు ఫోర్జరీ అని తాజాగా ఫోరెన్సిక్‌ లేబొరేటరీ నిర్ధా రించింది. అలాగే కాకాణి చెప్పిన తేదీలలో సోమిరెడ్డి మలేషియాకు వెళ్ళలేదని ఇమి గ్రేషన్‌ అధికారులు నిర్ధారించారు. దీంతో సోమిరెడ్డిపై కాకాణి చేసినవి తప్పుడు ఆరోపణలేనని తెలిపోవడంతో కాకాణికి చిక్కులు ఇంకొంచెం పెరిగినట్లయ్యింది.

Page 1 of 21

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • యువతకు ఒప్పుకునేనా?
  తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
 • కొండమీద కొత్త రూటు...
  ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
 • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
  ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…
 • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
  కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
 • ఇప్పుడన్నా ఇస్తారా?
  తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…

Newsletter