kambhamఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశాన్ని వదిలి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం మనం త్వరలో చూడబోయే పెద్ద పొలిటికల్‌ సీన్‌! ఆనం వెళ్ళిపోతే ఆ నష్టమేంటో తెలుగుదేశం అధిష్టానంకు తెలి యాలి... ఆయన వైసిపిలో చేరితే వచ్చే లాభమేంటో ఈ పార్టీ అధిష్టానం గుర్తించాలి. ఇందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

టీడీపీని వదిలిపోయేది ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కడే కాదు, వైసిపిలో చేరేది ఆయనొక్కడే కాదు... ఆయన వెంట బలమైన మందీ మార్భలం కూడా! ఇదీ రేపటి సీన్‌! జిల్లావ్యాప్తంగా ఆనం కుటుంబానికి అనుచరులు, సన్నిహితులు పెద్దఎత్తునే వున్నారు. అన్ని నియోజక వర్గాలలోని ముఖ్య నాయకులతో ఆనం చర్చలు, సంప్రదింపులు అయిపోయాయి. చాలామంది ఆయనతో పాటు వైసిపిలో చేరనున్నారు కూడా!

ఉదయగిరి మాజీఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డిని ఆనంతో పాటు వైసిపిలో చేరమని ఆయన అనుచరులు ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తోంది. కంభంకు ఆనంతో మంచి సంబంధాలే వున్నాయి. 2012లో ఆనం రామనారాయణరెడ్డి ప్రోద్భలంతోనే కంభం విజయరామిరెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఉదయగిరి ఉపఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసాడు. 2014ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ శిథిలావస్థకు చేరడంతో ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నాడు. ప్రస్తుతం కంభంకు తెలుగు దేశంలో వచ్చిన ఇబ్బందేమీ లేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో ఆయనకు సత్సంబంధా లున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి టీడీపీ టిక్కెట్‌ను కంభం ఆశిస్తున్నాడు. ఒకవేళ తనకివ్వకుండా బొల్లినేని రామారావుకే ఇచ్చినా తన మద్దతు నిస్తాడు. ఉదయగిరి టీడీపీలో ఆయన విలువ తగ్గలేదు. పార్టీ నాయకత్వం ఆయన ప్రాధాన్యత ఆయనకిస్తుంది.

అదే ఆయన వైసిపిలోకి వస్తే ఆ విలువ రాదు. ఇక్కడ ఆనం రామనారాయణరెడ్డి పోటీ చేసే పనైతే కంభం అలాగే సపోర్ట్‌ చేస్తాడు. కాని ఇక్కడ మేకపాటోళ్ళు పోటీలోకి దిగే అవకాశాలే ఎక్కువ. కంభంకు వాళ్ళతో అస్సలు పడదు. సమన్వయం కుదరడం కష్టం. మేకపాటిని కాదని కంభంకు సీటిచ్చే పరిస్థితి కూడా లేదు. ఆనం రామనారాయణరెడ్డి పట్ల సానుకూల అభిప్రాయమున్నా స్థానిక పరిస్థితుల దృష్ట్యానే కంభం వైసిపి ఆహ్వానాన్ని నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

america abbaiమనుక్రాంత్‌రెడ్డి... పుట్టింది పెరిగింది చదివింది అంతా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే. ఆ తరువాత

ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్ళి అక్కడ తానే స్వంతంగా ఓ కంపెనీని ఏర్పాటు చేసుకుని ఆ తరువాత కాలంలో హైదరాబాదులోనూ మరో సంస్థను స్థాపించి ఎంతోకొంత మందికి జీవనోపాధి కల్పిస్తూ సంతృప్తి పొందుతున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.

అయితే ఇప్పుడు మనుకి ఓ ఆలోచన పుట్టింది. మనకి జన్మనిచ్చిన భూమికి మనమేం చేస్తున్నామన్న తపన ఆ అబ్బా యిలో మొదలయ్యింది. అంతే అనుకున్న వెంటనే హైదరాబాద్‌లో వున్న తన మాష్‌కామ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థని నెల్లూరుకు తరలించేశాడు. మొత్తం కంపెనీ చిరునామాని హైదరాబాద్‌ నుండి నెల్లూరుకు బదిలీ చేసేశాడు. అక్కడితో ఆగలేదు, తన ఊరికి తాను ఏదో ఒకటి చేయాలని బలంగా సంకల్పించాడు.

గురువారం మీడియా ముందు కొచ్చాడు. తాను మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి బిడ్డగా, మంచి సోదరుడి గానే కాకుండా మంచి పౌరుడిగా ఎదగా లనుకుంటున్నానని, అనాధగా వున్న నవ్యాంధ్ర ప్రగతికి తానూ భాగస్వామిని కావాలనే ఉద్దేశ్యంతో తన స్వంత గడ్డ నెల్లూరుని వేదికగా ఎంచుకున్నానని ప్రకటించాడు.

తెలంగాణ నుండి తన సంస్థను తర లించడమే కాకుండా, ఇంకా ఇతర సంస్థలకు కూడా ప్రోద్భలాన్ని ఇస్తానని, తన విజయంతో వారికి స్ఫూర్తి కలిగించి వారి సంస్థలను కూడా నెల్లూరుకు తర లింపజేస్తానని ప్రతిజ్ఞపూనాడు. తనకున్న బంధాలు సంబంధాలతో నెల్లూరును కూడా ఓ సాఫ్ట్‌వేర్‌ హబ్‌గా చేయడానికి ప్రయత్నిస్తానని వాగ్ధానం చేశాడు. ఇక్కడితో ఆ అబ్బాయి ఆగలేదండోయ్‌... ''మన మను ఆర్గనైజేషన్‌'' అంటూ ఓ సేవాసంస్థని ప్రారంభించాడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలకు కూడా తాను శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించాడు.

శుభం... మంచి ఆలోచన.

మనుక్రాంత్‌ నాన్న చెన్నారెడ్డి సుబ్బారెడ్డి, అమ్మ పెనుమల్లి మస్తానమ్మ ఇద్దరూ జిల్లా న్యాయమూర్తులుగా పనిచేసి పదవీ విరమణ పొందినవారే. వీరిద్దరి పెంపకంలో జన్మభూమి పట్ల మమకా రాన్ని, సొంత ఊరి పట్ల అనురాగాన్ని పెంచుకుని జై జన్మభూమి అంటున్న మనుక్రాంత్‌కి ఆల్‌ ది బెస్ట్‌!

spsrనెల్లూరుజిల్లాకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పదేళ్ళయ్యింది. దివంగత నేత డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలోని ఆర్యవైశ్యుల కోరికమేరకు నెల్లూరుజిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టి అసెంబ్లీలో ఆమోదింప జేశారు. ప్రస్తుతం ఏపిలో వ్యక్తుల పేర్లు మీద మూడే మూడు జిల్లాలున్నాయి. ఒకటి ప్రకాశం, రెండోది వై.యస్‌.ఆర్‌.జిల్లా(కడప), మూడోది పొట్టి శ్రీరా ములు నెల్లూరుజిల్లా. అయితే రాష్ట్రంలో ప్రకాశం జిల్లా పాపులర్‌ అయినంతగా మిగతా రెండు జిల్లాలు పాపులర్‌ కాలేదు. ప్రకాశం అనే పేరు పలకడానికి సులభంగా వుంటుంది. వై.యస్‌.ఆర్‌.జిల్లా కూడా ఇప్పుడిప్పుడే వాడుకలో పడుతుంది. కాని నెల్లూరుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పదేళ్ళయినా కూడా ప్రభుత్వ రికార్డులు, ప్రభుత్వ అధికార పత్రాలలో కనపడినంతగా పబ్లిక్‌లో పాపులర్‌ కాలేదు. దీనికి పేరు కొంచెం పొడుగ్గా వుండడమే కారణం కావచ్చు. ఏదిఏమైనా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని కనీసం ఆయన పేరు పెట్టిన జిల్లాను ఉచ్ఛరించడం వల్లనైనా గౌరవిద్దాం.

Page 1 of 32

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…

Newsletter