Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

rasi 20

1Ariesమేషం

రావలసిన బాకీలు కొంతమేరకు అందుతాయి. ఉద్యోగులకు కార్యసామర్ధ్యంతో పాటు, పనిభారం అదనంగా ఉంటుంది. ప్రయాణాలుంటాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. విద్యావృద్ధి కలదు. వృత్తి వ్యాపారా లలో ప్రోత్సాహం బాగుండి ఆదాయం పెరుగుతుంది. త్రోసిపుచ్చలేని అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులుండవు. మానసికంగా స్థిమితపడతారు.

 

2Taurusవృషభం

ఉద్యోగులు అధికారులతోను పబ్లిక్‌తోను జాగ్రత్త పడండి. గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి. కొన్ని ముఖ్య మైన నిర్ణయాలు తీసుకొనలేని పరిస్థితులుండవచ్చును. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. అనవసర విషయాల జోలికి పోకూడదు. విద్యార్థులు మరింత కష్టపడాలి. ఆర్ధిక సమస్యలతో పాటు బయట వ్యవహార వత్తిడి ఆందోళన కలిగిస్తుంది.

 

3Geminiమిధునం

స్థిరాస్తుల విలువల లావాదేవీలు వాయిదా వేసి కొనాలి. ఆరోగ్యం ఫరవాలేదు. అధికారులకు స్థానమార్పు, ఉద్యోగులకు ఇతర బాధ్యతలు చేయవలసి రావడం జరుగుతుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. వ్యవహార, ఆహార విషయాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగార్ధులకు కొంత మేలు జరుగుతుంది. ఇంట్లో వారితో భేదాభి ప్రాయాలు, సమస్యలు రాకుండా చూచుకొనాలి.

 

4Cancerకర్కాటకం

అధికారులకు పెరిగిన బాధ్యతల వల్ల శ్రమ, ఉద్యోగులకు కార్యసామర్ధ్యం బాగుంటుంది. మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చవద్దు. వైద్య సాంకేతిక రంగాల వారికి గౌరవ గుర్తింపులుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగి ఆదాయం పెరుగుతుంది.

 

5Leoసింహం

కొత్త వస్తు వస్త్రాలు సమకూరుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకొంటారు. ఉద్యోగులు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభించగలవు. ప్రయాణాల వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం ఫరవాలేదు. ఆలోచనలు కార్యరూపం దాల్చక పోవచ్చును. అనుకున్న పనులు నిదానంగా జరుగు తాయి. దుబారా ఖర్చులు తప్పనిసరి కాగలవు.

 

6Virgoకన్య

ఉపాధి, మార్కెటింగ్‌ రంగాల వారికి అభివృద్ధి బాగుంటుంది. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. పెళ్ళి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అను కూలము. కొత్త పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పనిభారం బాగుంటుంది. వృత్తి వ్యాపారా లలో అవకాశాలు పెరిగి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రావలసిన బాకీలు కొంత లభిస్తాయి.

 

7Libraతుల

సమస్యలు పెండింగ్‌లోనున్నవి పరిష్కారం కాగలవు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. అనుకోని ధన, వస్తు లాభం ఉండవచ్చును. బంధు మిత్రు లతో ఉత్సాహంగా గడుపుతారు. విలువైన వస్తువులు సమకూర్చుకొంటారు. విద్యాప్రగతి బాగుంటుంది. మంచి ఆర్ధికావకాశాలు, ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఆదాయం తృప్తికరము.

 

8Scorpioవృశ్చికం

వాహనములు నడిపేవారు యంత్రాలతో పనులు చేసేవారు జాగ్రత్తగా మెలగాలి. చిన్నచిన్న పొరపాట్ల వల్ల మాటలు పడవలసిరావచ్చును. శుభకార్య ప్రయ త్నాలు ఫలించకపోవచ్చును. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలి. సభలు, సేవా కార్యాలలో పాల్గొంటారు. ఆదాయ వ్యయాలు సరిపోతుంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి.

 

9Sagittariusధనుస్సు

బంధువర్గంతో ఏదో ఒక రూపంలో విభేదాలు రావచ్చును. విద్యా కృషి బాగుంటుంది. గృహ వస్తు వాహన రిపేర్లపైన, ఆరోగ్యముకై ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలుంటాయి. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత ఉంది. కోర్టు కేసులు వాయిదా పడతాయి. ఉద్యోగుల సమర్ధతకు సరైన గుర్తింపు లభించదు. విద్యా ప్రగతి బాగుంటుంది.

 

10Capricornమకరం

పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు ప్రస్తుతానికి విరమిం చండి. ఉద్యోగుల విధి నిర్వహణ సాఫీగా సాగుతుంది. అనుకోని ప్రయాణాలు బంధుమిత్రులను కలుసుకొనడం జరుగుతుంది. ఆరోగ్యం ఫరవాలేదు. విద్యా ప్రగతి బాగుంటుంది. ఆదాయ వ్యయాలు సరిపోతుంటాయి. కొన్ని అనవసర ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. వ్యవ హారాలు, పనుల వల్ల తీరిక ఉండదు.

 

11Aquariusకుంభం

ప్రభుత్వ పర్మిషన్లు, బ్యాంకులోన్లు పొందుతారు. అనవసర విషయాలలో జోక్యం చేసికొనవద్దు. పెట్టు బడులకు అనుకూలం. ఉద్యోగులకు పనిభారం పెరిగినా అధికారుల ఆదరణ బాగుంటుంది. విద్యార్థుల కృషి బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. ఆర్ధికంగా బలపడతారు. వృత్తి వ్యాపారాలు బాగుండి, ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి.

 

12Piscesమీనం

ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉన్నది. ఉద్యోగులకు అధికారుల సహకారం బాగుంటుంది. బంధుమిత్రులను కలుసుకొంటారు. కుటుంబసౌఖ్యం బాగున్నది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలలో ఇతరుల సహకారం ఉంటుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. పెట్టు బడులకు పొదుపు పథకాలకు ప్రయత్నాలు చేస్తారు. ఆదాయానికి లోపం రాదు.

galpikaపట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీమార్నింగ్‌ ఎయిట్‌ థర్టీకల్లా నిద్రలేచాడు. కాలకృత్యాలు ముగించుకుని మురళీకృష్ణ హోటల్‌ కొచ్చాడు. రెండు ఇడ్లీల్లో రెండు బకెట్ల సాంబార్‌ కలుపుకుని తిని కూరగాయల మార్కెట్‌ వద్ద రోడ్డు పై నిలబడ్డాడు. వెంటనే అతని ముందు పది ఆటోలు రాకెట్‌వేగంతో దూసుకొచ్చి ఆగాయి. ఒకరు చేయి, ఒకరు కాలు పట్టుకుని లాగుతూ ఆటోవాలాలు తమ ఆటోలో ఎక్కించుకునే ప్రయత్నం చేసారు. విక్రమార్కుడు వారి నుండి బలవంతంగా బయటపడి చివరకు ఒక ఆటోలో కూలబడ్డాడు. ఆయన ఆ వెంపర్లాట నుండి హమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకునేలోపే పెద్దాసుపత్రి గేటు ముందు ఆటో ఆగింది. విక్రమార్కుడు మనసులో... నెల్లూరు ఆటోవాలాలు ఇంతకుముందు విమానాలు తోలేవాళ్ళ లాగున్నారు. ఆటోలను విమానాలు లాగే తోలుతున్నారను కుంటూ ఆటోవాలాకు 10రూపాయలిచ్చి పెద్దాసుపత్రిలోకి పోయాడు. మార్చురీ లోపలకు వెళ్ళి అప్పుడే రోడ్డు ప్రమా దంలో మరణించిన ఫ్రెష్‌ బాడీని భుజాన వేసుకుని జిఎన్‌టి రోడ్డు పైకి వచ్చి నడవసాగాడు. యం.జి మాల్‌ వద్దకొచ్చే సరికి కాస్తున్న ఎండ దెబ్బకు విక్రమార్కుడికి చెమటలు కారసాగాయి. ఇంత దూరం వచ్చినా ఈ భేతాళుడిలో

ఉలుకుపలుకు లేదేంటబ్బా అనుకుంటూ... భేతాళ, భేతాళ అంటూ బాడీని తట్టాడు. అప్పుడు బాడీలోని భేతాళుడు... ఆ... విక్రమార్క, చెప్పు ఈ ఎండదెబ్బకు నాకు కళ్ళు తిరిగి పడిపోయాను. నువ్వు తట్టడంతో స్పృహ వచ్చింది. అయినా మనుషులు రోడ్లమీద తిరగడానికి భయపడుతున్న ఈ ఎండల్లో నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నాకు జాలే స్తుంది. నీకు శ్రమ తెలియకుండా వుండేందుకు 'అక్క కల నెరవేర్చిన తమ్ముడు' స్టోరీని చెబుతాను. అలా మినర్వా బ్లూ ఫాక్స్‌ బార్‌లోకి వెళ్ళి బీర్‌ కొడుతూ మాట్లాడుకుందాం పద అని బార్‌లోకి తీసుకెళ్లాడు. బీర్లు ఆర్డర్‌ చేసి అవి వచ్చాక తాగుతూ... భేతాళుడు స్టోరీ మొదలుపెట్టాడు. కేంద్రంలో పదేళ్ళ మన్మోహన్‌సింగ్‌ పాలనపై వ్యతిరేకతతో 2014లో దేశ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టారు. ఎన్డీఏను అధికారంలో కూర్చోబెట్టారు. నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేసారు. అభివృద్ధిలో గుజరాత్‌ను నెంబర్‌వన్‌గా నిలిపిన మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుం దని ఆశించారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలు వస్తాయి, జాతీయ రహదారులు అభివృద్ధి చెందుతాయి, నదుల అనుసంధానం జరుగుతుంది, కుంభకోణాలు ఆగుతాయి, ఉగ్రవాదం ఆగిపోతుంది, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి అంతమవుతుంది, ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశా లొస్తాయని ప్రజలు ఆశపడ్డారు. నిజాయితీపరుడైన నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం వెలిగిపోతుందని భావించారు. కాని ప్రజలు ఆశించింది వేరు... మోడీ ప్రధాని అయ్యాక జరుగుతున్నది వేరు. ప్రధాని అయ్యాక ఆయన స్వదేశంలో కంటే విదేశాలలో వున్నది ఎక్కువ. ఒక్క శాశ్వతమైన అభివృద్ధి ప్రాజెక్ట్‌ను కూడా చేపట్టలేదు. అంతేకాదు, నోట్ల రద్దు, జిఎస్టీ వంటివి తెచ్చి తన మీద తన ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నాడు. ప్రజలను వివిధ రకాల పన్నుల రూపంలో భయపెడుతున్నాడు. ఈ బీజేపీని ఎందుకు గెలిపించాంరా బాబు అనే పరిస్థితి కల్పిస్తున్నాడు. మోడీ తలచుకుంటే దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయవచ్చు. ప్రజలు సంతోషించేలా అనేక కార్యక్రమాలు చేయవచ్చు. దేశంలో తన పాలన మీద అసంతృప్తి పెరుగుతుందని తెలిసి కూడా నరేంద్ర మోడీ ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలు ఎందుకు తీసుకుంటున్నట్లు... దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో నారా లోకేష్‌కు తెలుగు పాఠాలు చెప్పే మాస్టార్‌వై పత్రికలకెక్కుతావని హెచ్చరించాడు.

దానికి విక్రమార్కుడు... దీనికి సమాధానం చెప్పను, చూపిస్తాను అంటూ తన ఐ ఫోన్‌ తీసి ఒక వీడియో ఆన్‌ చేసాడు. అది ప్రధానమంత్రి కార్యాలయం. మోడీ కొత్తగా ప్రధాని అయ్యున్నాడు. కొత్త ప్రధాని మోడీకి శుభాకాంక్షలు చెప్పడానికి సోనియాగాంధీ వచ్చింది. ఖర్మకాలి అదేరోజు రక్షాబంధన్‌ కూడా! ఆమె మోడీ చేతికి పూలబొకే ఇచ్చి, ఆ వెంటనే తన చేతిలో వున్న రాఖీని మోడీ చేతికి కట్టింది. దాంతో మోడీ ఆమెతో ఆప్యాయంగా... నువ్వు ఇండియాలో జన్మించకపోయినా ఇటలీలో పుట్టినా నాకు అక్కలాంటి దానివే... సొంత తమ్ముడిలా భావించి రాఖీ కట్టావు. శత్రురాజు భార్య వచ్చి చేతికి రాఖీ కడితే ప్రాణభిక్ష ప్రసాధించిన పురుషోత్తముడి వారసుడిని, నీకేం కావాలో కోరుకో అక్కా... అని అడిగాడు. అప్పుడు సోనియా, నా బొందిలో ప్రాణముండగానే నా బిడ్డ రాహుల్‌ను ప్రధానిగా చూడాలని వుంది. మీరు సక్రమంగా పరిపాలన సాగించి ప్రజల ఆదరాభిమానాలు పొందితే నా బిడ్డ ఈ జన్మకు ఈ దేశ ప్రధాని కాలేడు. నా బిడ్డ ప్రధాని కావా లన్న కోరిక తీరుస్తావో, లేక ఈ అక్కకు ఇచ్చిన హామీని మరు స్తావో నీ ఇష్టం అంటూ సోనియా పమిట చెంగు నోట్లో కుక్కుకుని ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఐ ఫోన్‌లో వీడియో అక్కడితో ఆగి పోయింది. తర్వాత విక్రమా ర్కుడే... ఈ సీన్‌ చూసాక నీకు అర్ధమై వుంటుంది. తాను సక్రమంగా పరిపాలిస్తే తర్వాత కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుందని, సోనియా హయాంలో రాహుల్‌ ప్రధాని కావడం కష్టమని భావించిన మోడీ ఇలా అడ్డదిడ్డంగా పరిపాలిస్తూ... వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ను ప్రధానిని చేయడానికి పరోక్ష సహకార మందిస్తున్నాడని చెప్పాడు. ఆ జవాబుతో సంతృప్తి చెందిన భేతాళుడు... మరో రెండు బీరు బాటిళ్ళు చేత పట్టుకుని బాడీని అక్కడే వదిలేసి సమీపాన వున్న సెల్‌టవర్‌ ఎక్కేసాడు.

parthiv gangకరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా గురించి వింటుంటేనే 'దండుపాళ్యెం' సినిమా గుర్తుకువస్తుంది. ఈ ముఠాలను కష్టపడి మన పోలీసులు పట్టుకుంటూనే వుంటారు. కాని, మన చట్టాలు, లాయర్లు బయటకు తీసుకొచ్చి జనం మీదకు వదులుతుంటారు.

వింటేనే ఎంతో భయం కలిగించే ఇలాంటి ముఠా ఒకటి నెల్లూరుజిల్లాలోకి ప్రవేశించే అవకాశం వుందన్న సమాచా రంతో జిల్లావాసులు భయాందోళనలకు లోనవుతున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాత్రి గస్తీలు ముమ్మరం చేసారు. రాత్రివేళ విధులు నిర్వహించే పోలీసులను సులభంగా వాడే ఆయు ధాలతో తిరగాలని ఎస్పీ ఆదేశించారు. హైవేపైన, టోల్‌గేట్ల వద్ద, రైల్వేస్టేషన్‌లు, బస్టాండ్‌లు, పెట్రోల్‌ బంకులు, శివారు ప్రాంతాల వద్ద నిఘా పెట్టారు.

అత్యంత కిరాతకులు పార్ధివ్‌ గ్యాంగ్‌...

మధ్యప్రదేశ్‌లోని భూపాల్‌కు చెందిన పార్ధివ్‌ గ్యాంగ్‌ తమిళనాడు రాష్ట్రం, చిత్తూరుజిల్లా సరిహద్దుల్లో సంచరిస్తుం దనే సమాచారం పోలీసులకు అందింది. ఈ గ్యాంగ్‌లో 10నుండి 20మంది వరకు సభ్యులుంటారు. వీళ్లందరూ ఆదివాసీ తెగవారే! నాగరికత తెలియని మూర్ఖులు. దోపిడీయే వీరి వృత్తి. ఈ గ్యాంగ్‌లో మహిళలు చురుకుగా వుంటారు. పగలు వీళ్ళు బజార్లలో ప్లాస్టిక్‌ వస్తువులు అమ్ము కుంటూ, చెత్తకాగితాలు ఏరుకుంటూ రెక్కీ నిర్వహిస్తారు. తాళం వేసిన ఇళ్ళను, లేదా దుకాణాలను గుర్తిస్తారు. రాత్రి స్పాట్‌ పెడతారు. నగర, పట్టణ శివారు ప్రాంతా లలో విలాసవంతమైన భవనాలు వుంటే వాటికే మొదటి ప్రాధాన్యతనిస్తారు. తమ దోపిడీ క్రమంలో అడ్డొచ్చిన వాళ్ళను అడ్డంగా చంపేస్తారు. అర్ధరాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్ళే వాళ్ళను కూడా వీళ్ళు దోచుకుంటారు. గుళ్ళలోనూ దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈ ముఠా కదలికలపై పోలీసులు నిఘాపెట్టారు. ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండడం మంచిది.

Page 1 of 1029

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నారాయణను వదలని అనిల్‌
  మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
 • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
  వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • వైసిపి వైపు నేతల చూపు
  నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter