Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

rasi 22

1Ariesమేషం

బిడ్డలకు ఉన్నత విద్యావకాశాలు, కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. స్వల్పకాలిక ప్రయాణాలుంటాయి. ఉద్యోగ వర్గాలకు అధికారుల సహకారం, మేలు లభి స్తుంది. విలువైన వస్తువులు సమకూరుతాయి. ఆరోగ్యం ఫరవాలేదు. ఆత్మీయులను కలుసుకొంటారు. చేయ దలచుకున్న పనులు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. పెండింగ్‌లో పనులు మరలా ప్రారంభంకాగలవు.

 

2Taurusవృషభం

అధికారులకు అదనపు బాధ్యతలు, స్థాన మార్పు లుండగలవు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. కొత్త కాంట్రాక్టులు ఏజన్సీలు లభించగలవు. పెట్టుబడులకు అవకాశాలు దొరుకుతాయి. ఒకటి రెండు వ్యవహారాలలో మిమ్మల్ని విమర్శించే వారు కూడా ఉం టారు. ఆరోగ్యం ఫరవాలేదు. వృత్తి వ్యాపారాలు లాభా లను సమకూరుస్తాయి.

 

3Geminiమిధునం

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా వేయండి. కార్యనిర్వహణ సమర్ధత బాగుంటుంది. ఇతరుల విమర్శలను లెక్క చేయకండి. ఉన్నత విద్యావకాశాలు బాగుంటాయి. ఉద్యోగులకు పని భారం ఉంటుంది. ప్రయాణాలుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధికపరంగా చిక్కులుంటాయి. అయితే డబ్బుకు అంతగా ఇబ్బంది ఉండదు.

 

4Cancerకర్కాటకం

అనుకున్న పనులు జరుగుతున్నా టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. నూతన పరిచయాలు, ఆహ్వానాలు అందు కొంటారు. కొన్ని అనవసరపు ఖర్చులు తప్పవు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. ఉద్యో గార్ధులకు అవకాశాలుండవచ్చును. తొందరపాటు ఎక్కువుగా ఉంటుంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణ యాలు తీసికొనండి. స్థిరాస్తులపై ఆదాయముంటుంది.

 

5Leoసింహం

రావలసిన బాకీలు నిలబడిపోవచ్చును. సకాలంలో పన్నుల చెల్లింపులుంటాయి. ఉద్యోగులకు గుర్తింపు గౌరవాలు బాగుంటాయి. అనుకోని ప్రయాణాలుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి అవకాశాలు బాగుండి, ఆదాయం సంతృప్తికరం. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. మాట హామీలు, ఋణాలు ఇవ్వవద్దు.

 

6Virgoకన్య

ఉద్యోగావకాశాలు బాగుంటాయి. అనవసర విష యాలలో జోక్యం వద్దు. ఉద్యోగులకు పని వత్తిడి, అధి కారులకు స్థానమార్పు కలదు. కుటుంబ సౌఖ్యం బాగుం టుంది. ఆరోగ్యం ఫరవాలేదు. ఇంటికి నూతన వస్తువులు సమకూరుతాయి. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ముఖ్య మైన పత్రాలు, రావలసిన బాకీలు అందుతాయి.

 

7Libraతుల

స్థిరాస్తులపై కొంత రాబడి ఉంటుంది. ఉద్యోగులకు పని భారం వత్తిడి బాగుంటుంది. ఉద్యోగార్ధులు దీక్షతో ప్రయత్నాలు చేయండి. శుభకార్య ప్రయత్నాలలో అను కూలత బాగుండి బంధువర్గంలో అనారోగ్య వార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం, పిల్లలకు ఉన్నత విద్యావకా శాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక వ్యవ హారాలలో చిన్న ఇబ్బందులుంటాయి.

 

8Scorpioవృశ్చికం

గృహ రిపేర్లు, వస్తు, వాహన రిపేర్ల ఖర్చులుం టాయి. ప్రముఖులను, ఆత్మీయులను కలుసుకొంటారు. ఉద్యోగులకు మంచి స్థితి మరియు నిర్వహణ సామర్ధ్య ముంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఏదో ఒక రూపంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి జీవన సంపాదన బాగుంటుంది. వ్యాపారవర్గాలు అభివృద్ధికై శ్రమ పడాలి.

 

9Sagittariusధనుస్సు

కొత్త కాంట్రాక్టులు పొందడం, నిర్మాణాలు జరపడం జరుగుతుంది. చేపట్టిన పనులకు మధ్య ఆటంకాలుం టాయి. ఉన్నత విద్యావకాశాలు బాగున్నాయి. ఉద్యో గులకు గుర్తింపు గౌరవాలు సమర్ధత బాగుంటుంది. చిన్న వృత్తులు వ్యాపారాలు జరుపుకొనేవారికి ఆదాయం బాగుంటుంది. ఇతరులను బాధపెట్టే మాటలు, పనులకు పూనుకోవద్దు. ఆదాయానికి తగిన ఖర్చులుంటాయి.

 

10Capricornమకరం

కుటుంబంలో ముఖ్యంగా స్త్రీలకు అనారోగ్య బాధ లుంటాయి. ఉద్యోగులు అధికారులతో సఖ్యతగా ఉంటారు. స్థిరాస్తుల లావాదేవీలకు అవకాశాలుంటాయి. ఉద్యోగార్ధులకు అవకాశాలు లభించగలవు. ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులకు సహాయ పడతారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రవర్తన, మాటలలో దుడుకు తనం తగ్గించుకొనాలి.

 

11Aquariusకుంభం

పారిశ్రామిక, కాంట్రాక్ట్‌ రంగాల వారికి ప్రోత్సాహ, అవకాశాలు బాగుంటాయి. విదేశీ ప్రయాణ అనుమ తులు పొందడం, కుటుంబసౌఖ్యం, షేర్లలో లాభాలుం టాయి. ముఖ్య నోటీసులు, రశీదులు అందుకొంటారు. ఉద్యోగులు అధికారులతో, పబ్లిక్‌తో తెలివిగా ప్రవర్తిం చండి. ఆరోగ్యం ఫరవాలేదు. విద్యాప్రగతి బాగుంది. లౌకిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించండి.

 

12Piscesమీనం

ప్రభుత్వ కార్యాలయాలందు పనులు అనుకూల మగును. విద్యార్థులకు మంచి విద్యావకాశాలు దొరకుట, కుటుంబసౌఖ్యం బాగుండును. వృత్తి వ్యాపారములందు ఆదాయం బాగుంటుంది. ఉద్యోగార్ధులకు విధి నిర్వహణ సామర్ధ్యముంటుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న పనులు వేగవంతంగా సాగుతాయి.

ramnarayaతనను, తన అన్నను మోసం చేసిన తెలుగుదేశంకు గుడ్‌బై చెప్పాలని మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిర్ణయించుకోవడం తెలిసిందే! అయితే ఆయన ఏకపక్షంగా పార్టీ మారాలన్న నిర్ణయం తీసుకోలేడుగా! ఇంతకాలం తనతో కలసివచ్చిన అనుచరులతోనూ సంప్రదింపులు జరిపాకే నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. ఆనం అనుచరులు కేవలం ఆత్మకూరులోనో, నెల్లూరులోనో మాత్రమే లేరు. ఉదయగిరి నుండి సూళ్ళూరుపేట దాకా అన్ని నియోజవర్గాలలోనూ వున్నారు. కాబట్టే ఆయన గత కొన్నిరోజులుగా జిల్లా వ్యాప్తంగా వున్న తన అనుచరులను పిలిపించుకుని మాట్లాడుతున్నాడు. తెలుగుదేశంలో తమకెదురైన పరిస్థితులను వివరిస్తున్నాడు. కాని ఆయనకంటే ముందే ఆయన అనుచరులు జై జగన్‌ అంటున్నారు. తెలుగుదేశం వీడడానికి, వైసిపిలో చేరడానికి సంసిద్ధమంటున్నారు. ఆనం అనుచరులలో చాలా తక్కువమంది మాత్రమే టీడీపీని వీడాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గంలో మెజార్టీ అనుచరుల అభిప్రాయం వైసిపిలో చేరాలనే! అనుచరుల అభిప్రాయ సేకరణ అనే మర్యాదపూర్వక ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీకి రాజీనామా లేఖ టైప్‌ చేయడం మిగిలింది. అన్నీ కుదిరితే వై.యస్‌. జయంతి రోజైన జూలై 8వ తేదీ ఆయన వైసిపిలో చేరొచ్చని తెలుస్తోంది!

galpikaపట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీమార్నింగ్‌ ఎయిట్‌ థర్టీకల్లా నిద్ర లేచాడు. అంతకుముందురోజే సెల్‌ ఫోన్‌లో ప్రధాని మోడీ యోగ విన్యాసాలు చూసి వుండడంతో నిద్రలేవగానే వాటిని ఫాలో అయ్యాడు. ఈ పరంపరలో శీర్షా సనం వేయగా కాళ్ళ సందులో తలకాయ ఇరుక్కుపోయింది. ఆ ఆసనాన్ని ఎలా విప్పాలో తెలియలేదు. ఈలోపు ఎక్కడి కక్కడ బిగించినట్లుండడంతో భయంతో కేకలు పెట్టాడు. ఆ కేకలకు హోటల్‌ సిబ్బంది పరుగునవచ్చి ఆయన కాళ్ళు, చేతుల నుండి తలను విడిపించారు. బుద్ధుంటే వీడియోలు చూసి యోగాస నాలు వేయకూడదనుకున్నాడు. తర్వాత కాలకృత్యాలు ముగించుకుని, మూలాపేట సెంటర్‌లో మటన్‌ బిర్యాని తిని, మద్రాసు బస్టాండు వద్దకొచ్చి ఆటో ఎక్కి పెద్దాసు పత్రి వద్ద దిగాడు. ఆసుపత్రిలోని మార్చురీ గదిలోకి వెళ్ళి స్మెల్‌ లేని శవాన్ని భుజాన వేసుకుని బోడిగాడుతోటలోని రోటరీ క్లబ్‌ శ్మశాన వాటిక వైపు నడవ సాగాడు. విక్రమార్కుడు పెద్దాసుపత్రి మెయిన్‌గోటు దాటేలోపలే బాడీలోని భేతాళుడు.. హౌ ఆర్‌ యు విక్రమ్‌ అంటూ పలుకరించాడు. ఆ పలక రింపుకు విక్రమార్కుడు ఆశ్చర్యపోయాడు. అదేంటి భేతాళా ఈరోజు నన్ను ఎక్కువ దూరం నడిపించకుండానే సీన్‌లోకి వచ్చావ్‌. రోజూ నన్ను మూడు కిలోమీ టర్లయినా నడిపించి చెమటలు కక్కించ నిదే నీ శాడిజం తగ్గదుకదా... ఈరోజేం, దయతలచావ్‌ అని అడిగాడు. అందుకు భేతాళుడు... రాత్రి సాకర్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు చూస్తూ అలాగే మేలుకుని వుండిపోయాను. ఇక ఎలాగూ ఇప్పుడు నువ్వొస్తావుకదా అని ఎదురుచూస్తు న్నాను. చంద్రబాబు లాంటి ప్రజాసంక్షేమ పాలకుడు రాజ్యాన్ని ఏలుతున్న కాలంలో కూడా నువ్వు పడుతున్న కష్టాన్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. నీకు శ్రమ తెలియ కుండా ఉండేందుకు ఇంటర్నేషనల్‌ స్టోరీ ఒకటి చూపిస్తాను, అలా ఆర్‌ అండ్‌ బి బంగ్లాలోకి పద అని చెప్పాడు. ఇద్దరూ ఆర్‌ అండ్‌ బి బంగ్లాలోకి వెళ్ళి సోఫాలో కూలబడ్డారు. భేతాళుడు ల్యాప్‌టాప్‌ తీసి ట్రంప్‌, కిమ్‌ మీట్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసాడు. స్క్రీన్‌ మీద సీన్‌లు మొదలయ్యాయి.

----

అమెరికాలోని శ్వేతసౌధం. అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ముందు పెద్ద స్క్రీన్‌ వుంది. దానిపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ వున్నాడు. ట్రంప్‌ అతని వైపు సీరియస్‌గా చూస్తూ...'' కిమ్‌ నీ పిచ్చి వేషాలు ఇక చాలించు... ఈ ప్రపంచానికి నేనే పెద్దతోపు... నీ అణుపరీక్షలు ఇక ఆపు'' అని హెచ్చరించాడు. అవతలవైపు నుండి కిమ్‌... ''ఫ్లూటు జింక ముందు ఊదు... ఈ సింహం ముందు కాదు'' అని వ్యంగ్యంగా అన్నాడు. అది విని ట్రంప్‌ ఆవేశంతో... నాకు తిక్కుంది, దానికో లెక్కుంది అని చెప్పాడు. వెంటనే కిమ్‌.. నీ తిక్కకు లెక్కన్నా వుంది... నాకు లెక్కలేనంత తిక్కుంది. దాంతో పెట్టు కుంటే నీకే చిక్కు అని అన్నాడు. వెంటనే ట్రంప్‌.. నేను గట్టిగా తొడ చరిచానంటే ఆ సౌండ్‌కే గుండాగి చస్తావు అని అరిచాడు. అందుకు కిమ్‌... ఈ తొడలు చరిచే అలవాటు ఎక్కడ నేర్చుకున్నావ్‌... హీరో బాలకృష్ణను చూసి నేర్చుకున్నావా అని గేళి చేస్తున్నట్లు అన్నాడు. దానికి ట్రంప్‌కు కోపం మోకాల్లోకి వచ్చి... చూడు నన్ను ఒకవైపే చూడు... రెండో వైపు చూడాలనుకోవద్దు తట్టుకోలేవ్‌... అంటూ అరిచాడు. అందుకు కిమ్‌... కత్తులతో కాదు... కంటి చూపుతో నిన్ను, నీ దేశాన్ని నాశనం చేస్తా అని సవాల్‌ విసిరాడు. దానికి ట్రంప్‌ చూసుకుం దామా... సై చౌడక్కా అని తొడ కొట్టాడు. కిమ్‌ కూడా సైరా సమరవీరా అంటూ బొటన వేలు చూపాడు. ట్రంప్‌... కిమ్‌లు వీరావేశంలో వున్న ఫోటోల మీద 'ఇంటర్వెల్‌' అని అక్షరాలు పడ్డాయి.

భేతాళుడు పార్ట్‌ సెకండ్‌ ఫైల్‌ ఓపెన్‌ చేయడంతో మళ్ళీ స్క్రీన్‌ పై సీన్‌లు మొదలయ్యాయి.

----

అది సింగపూర్‌లోని ఓ హోటల్‌. ట్రంప్‌ పూలబొకే చేతిలో పట్టుకుని గేటు బయట నిలుచుని వున్నాడు. అప్పుడే కొన్ని కార్లు వచ్చి ఆగాయి. అందులో నుండి కిమ్‌ దిగాడు. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్‌... ''ఎన్నాళ్ళో వేచిన ఉదయం... ఈనాడే ఎదురవుతుంటే... ఇంకా తెల వారదేమీ... ఈ చీకటి విడిపోదేమీ'' అనే పాట రాసాగింది. కారు దిగిన వెంటనే కిమ్‌ పరుగున వెళ్ళి ట్రంప్‌ను కౌగి లించుకున్నాడు. ట్రంప్‌ తన చేతిలో బొకేను కిమ్‌ చేతిలో పెట్టి అలవాటు ప్రకారం బాగా బలిసావు అంటూ పిర్ర మీద కొట్టాడు. తర్వాత లోపలకు వెళ్ళారు. ఇరువురూ శాంతి చర్చలు జరిపారు. మనం మహాత్మాగాంధీ, గౌతమ బుద్ధుడు, జీసెస్‌ ఆశయాల బాటలో పయనిద్దాం. ఒక చెంపన కొడితే రెండో చెంపను చూపిద్దాం... అని తీర్మానించారు. ప్రపంచ శాంతి కోసం నేను అణ్వస్త్రాలు విసర్జిస్తానని కిమ్‌ ప్రమాణం చేశాడు. ప్రపంచ శాంతి కోసం నువ్వు చేస్తున్న త్యాగానికి ప్రతి ఫలంగా మీ దేశ రక్షణను నేను బాధ్యతగా తీసుకుంటానని ట్రంప్‌ హామీ ఇచ్చాడు.

ఇక్కడితో సీన్‌లు అయిపోయాయి. భేతాళుడు లాప్‌ట్యాప్‌ మూసేసి... రాజా ఇప్పుడు చెప్పు... మొదటి పార్ట్‌లో పర స్పరం ఒకర్నొకరు నరుక్కునేంత కసితో వ్యవహరించిన ట్రంప్‌, కిమ్‌లు సెకండ్‌ పార్ట్‌లో అంత శాంతికాముకులుగా ఎలా మారిపోయారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయావో పిఆర్‌సి మంజూరైనా చేతికి డబ్బులు రాని ఏపి ఉద్యోగిలా మానసిక క్షోభకు గురవుతావని హెచ్చ రించాడు. దానికి విక్రమార్కుడు... వాళ్ళిద్దరి భేటీ వెనుక ఒక అదృశ్య శక్తి వుంది. ఆ శక్తి పేరే హైటెక్‌రత్న చంద్ర బాబు. ట్రంప్‌, కిమ్‌ల రెచ్చగొట్టే ప్రకట నలతో ప్రపంచం ప్రమాదంలో పడుతోం దని ఆయన గ్రహించాడు. వాళ్ళిద్దరినీ దారిలో పెట్టాలనుకున్నాడు. అందుకే ఒక వార్నింగ్‌ పంపాడు. మీరిద్దరూ ఒకరి మీద ఒకరు అణుబాంబులు వేసుకో వడం కాదు... మీరు దారికొచ్చి శాంతి ఒప్పందం చేసుకోకపోతే మీ రెండు దేశాల మీదకు మా ఐఆర్‌ 20-420 నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలను పంపిస్తా... బ్రతికి నంత కాలం ఛస్తూ బ్రతుకుతుంటారు అని హెచ్చరించాడు. ఆ దెబ్బకు భయపడే వాళ్ళిద్దరూ భేటీ అయ్యారు అని చెప్పాడు. ఆ సమాధానానికి సంతృప్తి చెందిన భేతాళుడు బాడీని అక్కడే వదిలేసి 'బార్‌'కు దూసుకుపోయాడు.

Page 1 of 1064

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter