Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

rasi 19

1Ariesమేషం

శుభకార్య ప్రయత్నాలు నెరవేరే అవకాశం కలదు. తొందరపడి హామీలివ్వడం, చెల్లింపులు జరపవద్దు. విద్యార్థులు బాగా కష్టపడి చదువవలెను. పెట్టుబడి, వ్యాపార విస్తరణకు అవకాశాలుంటాయి. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. ఖర్చులకు తగిన ఆదాయం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడగలవు.

 

2Taurusవృషభం

స్థిరాస్తుల వ్యవహారాలను వాయిదా వేసికొనడం మంచిది. ఉద్యోగులకు సామర్ధ్యం కారణంగా గుర్తింపు గౌరవాలుంటాయి. విద్యార్థులకు మంచి విద్యా ప్రగతి కలదు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా వుంటాయి. వృత్తి వ్యాపార జీవనము కలవారికి ఆర్ధికస్థితి బాగుంటుంది. కొత్త వ్యాపారాలకు అవకాశాలుంటాయి.

 

3Geminiమిధునం

కళా క్రీడా ఉపాధి రంగాల వారికి అవకాశాలు బాగుంటాయి. దూరప్రయాణాల అవసరం ఉంటుంది. విమర్శలు, అభియోగాలున్నా పట్టించుకోవద్దు. ఉద్యో గులకు విధి నిర్వహణ సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది. అనుకోని స్వల్ప ఆదా యము, వస్తు లాభముంటుంది. ఆర్ధిక ప్రగతి బాగుండి వృత్తి వ్యాపారాలు పెరుగుతాయి.

 

4Cancerకర్కాటకం

అనుకోని ప్రయాణాలుంటాయి. కళా క్రీడా శాస్త్ర సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేరవచ్చును. ఆరోగ్యం బాగుంటుంది. బంధుముఖ్యులను పెద్దలను కలుసు కుంటారు. ఆర్ధిక పరిస్థితి బాగున్నా ఆదాయం సామా న్యంగా ఉంటుంది. అవసరాలకు ఋణం చేయవలసి వస్తుంది. కొత్త పెట్టుబడులకు అవకాశాలుంటాయి.

 

5Leoసింహం

శుభకార్య ప్రయత్నాలు నిర్ణయం కాగలవు. చర్చలు సమావేశాలకై దూరప్రయాణాలుంటాయి. ఉద్యోగుల శ్రమకు గుర్తింపు, గౌరవాలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, వ్యాపారవర్గాలకు పెట్టుబడి అవకా శాలుంటాయి. ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం బాగుం టుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది.

 

6Virgoకన్య

కొన్ని అదనపు ఖర్చులుండినను ఇబ్బంది రాదు. ఉద్యోగ వర్గాలకు పనులు అదనంగా ఉంటాయి. స్థిరా స్తుల క్రయవిక్రయాలకు అవకాశాలు లభించగలవు. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. విలువైన వస్తువులు కొనడం, మంచి ఆరోగ్యముంటుంది. కుటుంబ ఆర్ధిక పరిస్థితులు క్రమంగా బాగుపడతాయి. ఆదాయం పెరుగు తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.

 

7Libraతుల

శుభకార్య ప్రయత్నాలు అనుకూలం. కుటుంబంలో చిన్నవిషయంపై విభేదాలు రావచ్చును. విద్యా ప్రగతికి గట్టి కృషి అవసరం. అవసరాలకు చెల్లింపులకు కొద్ది ఋణం చేయడం గాని, వాయిదా వేసికొనడం గాని జరుగుతుంది. వృత్తి పరంగా మంచి అవకాశాలుండినా వ్యాపారవృద్ధి అవకాశాలు చేవరవచ్చు. ప్రభుత్వ అను మతులకు ఆలస్యం జరగవచ్చును.

 

8Scorpioవృశ్చికం

గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి. విలువైన వస్తు వులు, పత్రాలను జాగ్రత్త పరచుకోవాలి. అనుకోని ప్రయాణాలుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూ లత, కుటుంబసౌఖ్యం బాగుంటుంది. పనులు నిదానంగా జరగడం గాని, ఆటంకాలు రావడం వల్ల గాని నిలిచి పోవడం జరుగుతుంది. ఆర్ధికంగా బాగుండి వృత్తి వ్యాపా రాలలో అభివృద్ధి, రాబడి బాగుంటుంది.

 

9Sagittariusధనుస్సు

కొత్త పెట్టుబడులకు అవకాశాలు దొరుకుతాయి. విలువైన వస్తువులు యంత్ర పరికరాలు కొంటారు. పెండింగ్‌ సమస్యలు పరిష్కారానికి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అనుకున్న పనులను పట్టుదలతో చేస్తారు. సభలు సమావేశాలలో మీ పలుకు బడి బాగుంటుంది. ప్రభుత్వ అనుమతులు బ్యాంకు ఋణాలు లభించగలవు.

 

10Capricornమకరం

వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఆదాయం తృప్తికరంగా ఉంటుంది. శ్రమతో అనుకున్న పనులను జరుపుకొం టారు. కొందరి విమర్శలుంటాయి. పట్టించుకొనవద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. బిడ్డల ఉద్యోగ, శుభకార్య నిర్ణయాలు జరుగుతాయి. విద్యా ప్రగతి బాగుంటుంది. బంధువర్గంతోను, సహచరులతో జాగ్రత్తగా ఉండండి.

 

11Aquariusకుంభం

ప్రభుత్వ అనుమతులు ఆలస్యం కాగలవు. అందుచే టెన్షన్‌గా ఉంటుంది. కుటుంబంలో అనుకూలత తక్కువ. ఖర్చులు అదనంగా పెరుగుతాయి. ఆర్ధికాభి వృద్ధికై ప్రయత్నాలు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. వృత్తి పరంగా ఆదాయం తృప్తికరం. వ్యాపారవృద్ధి అవకాశాలు చేజారి సామాన్య ఆదాయముంటుంది. ఇతరుల నుండి విమర్శనలు ఎదుర్కొనక తప్పదు.

 

12Piscesమీనం

ఇంటికి కొత్త విలువైన వస్తువులు పరికరాలు కొంటారు. బాకీల చెల్లింపులు సకాలంలో జరుగుతాయి. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, ఉద్యోగార్ధులకు అవకాశాలు లభించడం, విద్యార్థులకు మంచి ప్రగతి ఉంటుంది. ముఖ్య వస్తువులు, పత్రాలు జాగ్రత్త పరచు కొనండి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆదాయం బాగుంటుంది. ఉద్యోగులకు స్థానమార్పు ఉంటుంది.

galpikaజరిగిన కథ - హైటెక్‌రత్న చంద్రబాబు తన టీమ్‌తో అమెరికా పర్యటనకు వెళ్లాడు. వాషింగ్టన్‌ ఎయిర్‌పోర్టులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దంపతులతో పాటు మాజీ అధ్యక్షులు ఒబామా, బిల్‌క్లింటన్‌ దంపతులు, బిల్‌గేట్స్‌, సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌లు ఆయనకు స్వాగతం పలికారు. సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌, బిల్‌గేట్స్‌లు చంద్రబాబు దయవల్లే తాము ఈ స్థాయిలో వున్నామని ట్రంప్‌కు చెబుతారు. అసలు తాను అమెరికా అధ్యక్షుడనయ్యిందే చంద్రబాబు వల్లనని చెప్పి వారికే ట్రంప్‌ షాకిస్తాడు. తర్వాత చంద్ర బాబుకు లిబర్టీ ఆఫ్‌ స్టాచ్యూ, నయాగారా ఫాల్స్‌, డబ్ల్యుటిసి భవనాలు కూల్చిన ప్రాంతాన్ని చూపించి తమ దేశపు గొప్పతనాన్ని ప్రదర్శించాలని చూసిన ట్రంప్‌కు, చంద్రబాబు ధీటుగా కౌంటర్‌ఎటాక్‌ ఇస్తాడు. చంద్రబాబు నోటి వెంట ఎలాగైనా అమెరికా గ్రేట్‌ అనిపించాలని అనుకుంటూ ట్రంప్‌ అతనిని వైట్‌హౌస్‌కు తీసుకెళతాడు.

ఆ తర్వాత...

చంద్రబాబుకు ట్రంప్‌ వైట్‌హౌస్‌ను చూపిస్తూ... ఇదే ప్రపంచాన్నే దడదడలాడించే అధ్యక్షుడి శ్వేతసౌధం. ఎలాగుంది ఈ ఇంద్ర భవనం అని అడిగాడు. అంతా చూసి చంద్రబాబు... ఇది అమెరికా అధ్యక్షుడి భవనమా... నేను ఇంకా అధ్యక్షుడి బాత్‌రూమ్‌ అను కున్నాను... ఇంకో రెండేళ్ల తర్వాత మా అమరావతికి రండి... ఇలాంటి భవనాలు వందలకొద్ది మీకు సులభ్‌కాంప్లెక్స్‌లు మాదిరిగా కనపడుతుంటాయి. మా అసెంబ్లీ, సచివాలయ ఉద్యోగులకు మీ వైట్‌హౌస్‌ టైప్‌లోనే బాత్‌రూమ్‌లు కట్టించాలనుకుంటున్నాను, మీరు దీనిని వైట్‌హౌస్‌ అంటున్నారు, మొన్నటి దాకా మా రోశయ్య గవర్నర్‌గా వున్న చెన్నైలోని 'రాజభవన్‌' దీనికంటే బాగుంటుంది. ఇలాంటివి మా దేశంలో రాష్ట్రానికొకటి లెక్కన ఉంటాయని చెప్పాడు. చంద్రబాబు మాటలతో ట్రంప్‌ ముఖం గాలితీసిన బెలూన్‌లా అయ్యింది. ఇతనితో ఎక్కువసేపు మాట్లాడి పరువు పోగొట్టుకోవడం ఎందుకని బ్రేక్‌ఫాస్ట్‌ చేద్దాం రండి అని డైనింగ్‌ టేబుల్‌ వద్దకు తీసుకుపోయాడు. ఎయిర్‌పోర్టు నుండి అప్పటి దాకా ట్రంప్‌ పక్కనే వున్న యువతిని చూసి చంద్రబాబు... మీ అమ్మాయికి పెళ్లీడు వచ్చినట్లుంది, మీరు లేటు చేస్తే మీకు చెప్పకుండానే పెళ్లి చేసుకుని వచ్చేటట్లుంది, మంచి సంబంధం చూసి పెళ్లి చేయకూడదూ అని సలహా ఇచ్చాడు. షిట్‌... ఆమె నా కూతురు కాదు, నా భార్య మెలానియా అని పరిచయం చేసాడు ట్రంప్‌. చంద్రబాబు నాలి క్కరుచుకుని మనసులో ఈ వయసులో నీకు ఇంత పడుచుపెళ్లాం అవసరమా అనుకుని... సారీ, పొరపడ్డానండి, ఆమె వయసును బట్టి చూసి మీ కూతురై ఉంటుందనుకున్నాను, అయినా మీరు అదృష్టవంతులు, మా దేశంలో ఇలాంటి అవకాశాలు తక్కువ, మా మామ ఎన్టీఆర్‌ కూడా మిమ్మల్ని ఫాలో అయ్యాడు కాబట్టే సీఎం కుర్చీ నాకు దక్కిందనుకున్నాడు. అప్పుడే సర్వర్‌లు వచ్చి అందరికీ ప్లేట్లలో టిఫిన్‌ వడ్డించసాగారు. చంద్రబాబు మాత్రం వాళ్ళు వడ్డించబోతున్న వంటకాలను వద్దని తన సూట్‌కేసు తెరిచాడు. అందులో నుండి టిఫిన్‌ బాక్సును బయటకు తీసాడు. మూత తీసాడు. అందులో రెండు పుల్కా, కీర, బొప్పాయికాయ ముక్కలు, బాదం, జీడిపప్పులు ఉన్నాయి. ఏంటిది అని ట్రంప్‌ అడిగాడు. నా బ్రేక్‌ఫాస్ట్‌... నేనెక్కడికి వెళుతున్నా మా ఆవిడే నాకు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ బాక్సులు పెడుతుంది. ఆమె పెడుతున్న ఆహారం తింటుండబట్టే నేను ఇంత చలాకీగా వున్నాను. ఆమె పెడుతున్న తిండి కాకుండా బయట అడ్డమైన గడ్డి తినబట్టే మావాడు లోకేష్‌కు జయంతులు, వర్ధంతులకు తేడా తెలియకుండా పోయిందన్నాడు. అక్కడ బ్రేక్‌ఫాస్ట్‌ ముగిసింది. కరెక్ట్‌గా అక్కడ వీళ్లు బ్రేక్‌ఫాస్ట్‌ చేసే సమయంలో...

ఏపిలో ఏబిసిడి ఛానెల్‌లో బ్రేకింగ్‌ న్యూస్‌ ఇలా వుంది... అమెరికాలో హల్‌చల్‌ చేస్తున్న చంద్రబాబు... అమెరికాలో దిగీ దిగగానే పెట్టుబడుల వేట... అమరావతిలో పెట్టుబడులు పెట్టేం దుకు 'క్యూ' కట్టిన అమెరికా కంపెనీలు... వెల్లువెత్తిన పెట్టుబడులను నియంత్రించేందుకు స్క్రీనింగ్‌ కమిటీ వేసిన చంద్రబాబు... అమెరికాలో చంద్రబాబు పర్యటన విశేషాలపై మా ప్రతినిధి గోకుల కృష్ణ అడిగిన ప్రశ్నకు ఐటి మంత్రి లోకేష్‌బాబు వివరణ చూడండి... స్క్రీన్‌ మీద లోకేష్‌ ప్రత్యక్షమయ్యాడు. నాన్నగారి అమెరికా పర్యటన విజయవంతంగా జరుగుతుంది. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఆసక్తిగా వున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చెప్పారు. ఇక నాన్నగారి స్ఫూర్తి తోనే బిల్‌గేట్స్‌ ఎదిగారు. కాబట్టి ఆయన కూడా మైక్రోసాఫ్ట్‌ కంపెనీని అమరావతిలో పెట్టడానికి సిద్ధంగా వున్నారు అని చెబుతుండగా మధ్యలో గోకులకృష్ణ కల్పించుకుని... అమరావతికి 'ఆపిల్‌' కంపెనీ కూడా వస్తుందని తెలిసింది, నిజమేనా? అని ప్రశ్నించాడు. ఒక్క ఆపిల్‌ ఏంటి, పైనాపిల్‌, బొప్పాయి, దానిమ్మ, సపోట, ద్రాక్ష... అని రకాల ఫ్రూట్స్‌ కంపెనీలు కూడా అమరావతికి వస్తాయని అమరావతిలో ఉండేవారికి పండ్లరసాలకు ఇబ్బంది లేకుండా చేస్తానని లోకేష్‌ చెప్పాడు. ఆ సమాధానానికి గోకులకృష్ణ చేత్తో జుట్టును బలంగా పీక్కున్నాడు.

వైట్‌హౌస్‌లో టీవీ ఛానల్స్‌లో దీనిని చూసిన ట్రంప్‌, మిగతా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ట్రంప్‌ వుండి.... మీరు దిగి ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌ కూడా పూర్తి చేసుకోలేదు, కాని మీ మీడియా ఏంటి, మీ అమెరికా పర్యటన విజయవంతమైనట్లు, మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా కంపెనీలన్నీ పరుగులు తీస్తున్నట్లు చెబుతున్నాయని అడిగాడు. అందుకు చంద్రబాబు... ఇక్కడ జరిగేదానితో మా మీడియాకు అనవసరం, నేనిక్కడ బెడ్‌రూంలో పడుకుని నిద్రపోతున్నా, నిద్రా హారాలు మాని చంద్రబాబు పెట్టుబడుల కోసం తిరుగుతున్నాడంటూ మా వాళ్ళు వార్తలు ఇస్తారు. ఆ విధంగా నేను సెట్‌ చేసుకున్నా, ఇక్కడ జరిగేది వాళ్లకు వార్త కాదు, వాళ్లకు ఏది తోస్తే అదే వార్త అని చెప్పాడు. తర్వాత అందరూ కలిసి 'డల్లాస్‌' వెళ్లారు. అక్కడ ప్రవా సాంధ్రుల సదస్సు జరుగుతుంది. అక్కడ మాట్లాడిన ప్రవాసాంధ్రులు చంద్రబాబును వీరుడు, శూరుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ... మీరంతా ఇక్కడకు వచ్చి కోట్లు సంపాదించారంటే అది నా పుణ్యమే... బాబొస్తే జాబు గ్యారంటీ అన్నాను... ఆ మాట నిలబెట్టుకున్నాను అని చెప్పాడు. వెంటనే ట్రంప్‌... బాబొస్తే జాబు అన్నారు సరే... కాని, మీ రాష్ట్రంలో ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు కదా అని అడిగాడు. బాబొస్తే జాబు అన్నాను... అంతేగాని ఆ జాబు ఆంధ్రాలోనే అన్నానా? నేను ఏపిని ఎడారిగా మార్చబట్టే కదా వీళ్లందరూ అమెరికా వచ్చి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని అన్నాడు. ఆ మాటకు ట్రంప్‌కు అరికాల్లో మండింది. మీ రాజకీయ వాగ్ధానాలను మాతో తీర్చుకుంటారా... అని మనసులో అనుకుంటూ... 'బాబు వస్తే జాబు' అని మీరన్నారు, 'ట్రంప్‌ వస్తే ఇండియన్స్‌ ఉద్యోగా లన్నీ జంప్‌' అని నేనన్నాను. నీలాగే నేనూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవద్దా అంటూ అప్పుడే హెచ్‌1బి వీసా బిల్లుపై సంతకం చేసాడు. ఆ దెబ్బకు ప్రవాసాంధ్రులంతా బాబు వస్తే జాబు రావడం కాదు, పోవడం గ్యారంటీ అనుకుంటూ కూలబడ్డారు.

(అయిపోయింది)

beedaతెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మూడోసారి కూడా బీద రవిచంద్రనే ఎన్ని కయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నుండి ప్రకటన రావడమే మిగిలివుంది. పార్టీ అధ్యక్షుడిగా బీద రవిచంద్రను పక్కన పెట్టాల్సిన పరిస్థితి గాని, కొత్తవాళ్లకు అధ్యక్ష స్థానం అప్పగించాల్సిన అవసరం గాని లేకపోవడంతో మరోసారి బీదకు జిల్లా దేశం బాధ్యతలు తప్పకపోవచ్చు. ఒకవేళ బీద రవిచంద్ర నాకు వద్దని మొండికేస్తే మాత్రం కొత్తవారికి ఛాన్సుంటుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అధ్యక్ష పదవిని ఆయన ఎందుకు వదులుకుంటాడు.

జిల్లాలో చంద్రబాబు కులసమీకరణలను బాగానే పాటించాడు. ఓట్ల పరంగా మెజార్టీ సంఖ్యాకులైన కాపుల నుండి మంత్రిగా నారాయణ వున్నాడు. అయితే ఇది రాజకీయంగా రెడ్ల ప్రాబల్యం వున్న జిల్లా! మొదట మంత్రివర్గంలో ఈ జిల్లా నుండి రెడ్లకు స్థానం దక్కలేదు. దీంతో పార్టీలో రెడ్లను అణగదొక్కుతున్నారనే ఒక ప్రచారం హల్‌చల్‌ చేసింది. అయితే చంద్రబాబు రాజకీయ మేధావి. ఏ టైంలో ఏం చేయాలో ఆయనకు తెలుసు. కరెక్ట్‌ సమయంలో జిల్లా నుండి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా రెడ్లకు ప్రాధాన్యతనివ్వడం లేదన్న ప్రచారానికి తెరదించారు. సోమిరెడ్డికి మంత్రి పదవిచ్చి పార్టీలోని రెడ్లలో వున్న అసంతృప్తిని తొలగించారు. అదే సమయంలో పార్టీలో బీసీలూ కీలకమే! ఈ వర్గానికి చెందిన బీద రవిచంద్రకు మంత్రిపదవి కాలింగ్‌ బెల్‌ కొట్టి, ఆయన లేచి వచ్చే లోపే సోమిరెడ్డి ఇంట్లో దూరినట్లయ్యింది. మంత్రి పదవి ఆశ ఆయనకు బాగానే అంటించి తీరా నీరు గార్చారు. ఇక మంత్రి స్థాయి పదవి జిల్లాలో ఇంకేముంటుంది. జిల్లా పార్టీ పెత్తనం ఇవ్వడమే బీసీలను గౌరవించడమవుతుంది. కాబట్టి అధ్యక్ష పోస్ట్‌లో రవిచంద్రనే కొనసాగిస్తారనడంలో సందేహం లేదు.

Page 1 of 831

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
    నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
    దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…

Newsletter